World Richest Woman Empress Wu: ఆధునిక కాలంలో ధనవంతులెవరు? అనగానే ప్రపంచ వ్యాప్తంగా ఎలాన్ మస్క్, మన దేశంలో ముఖేష్ అంబానీ గుర్తుకు వస్తారు. ఇక మహిళల్లో అయితే ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్, ఇండియాలో సావిత్రి జిందాల్ జ్ఞప్తికి వస్తారు. వీరందరి కంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళా ఎవరనేది బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.
చైనా మహారాణి..
ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన మహిళల్లో చైనాకి చెందిన మహారాణి 'ఎంప్రెస్ వు' (Empress Wu) అని తెలుస్తోంది. చైనీస్ చరిత్రలోనే టాంగ్ రాజవంశానికి చెందిన ఏకైన అందమైన మహిళా చక్రవర్తి. పదవి కోసం పిల్లలను చంపిన చరిత్ర ఈమెదని కొంతమంది చెబుతారు.
ఉన్నత విద్యావంతురాలు..
చరిత్రకారుల ప్రకారం.. ఎంప్రెస్ వు కేవలం అందమైన మహిళ మాత్రమే కాదు, ఉన్నత విద్యావంతురాలు. అలాగే చాలా మోసపూర్తితమైన, క్రూరమైన వ్యక్తిగా తెలుస్తోంది. ఈమె జీవితం ఆధారంగా గతంలో చాలా సినిమాలు కూడా తెరకెక్కాయి. తన రాజ్యాన్ని సుమారు 15 సంవత్సరాలు పరిపాలించి, మధ్య ఆసియాలో చైనా సామ్రాజ్యం విస్తరించడంలో గొప్ప పాత్ర పోషించింది. ఎంప్రెస్ వు హయాంలో టీ, సిల్క్ వ్యాపారంతో మంచి బిజినెస్ జరిగేదని చైనా ప్రాజెక్టు నివేదించింది.
ప్రస్తుతం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద 235 బిలియన్ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఒకప్పుడు చక్రవర్తిగా బతికిన ఎంప్రెస్ వు సంపద సుమారు 16 ట్రిలియన్ డాలర్లకి తెలుస్తోంది. అంటే ఈమె సంపద మస్క్ సంపాదకంటే ఎన్నో రెట్లు ఎక్కువని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment