సాక్షి,ముంబై: దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందించే లక్క్ష్యంతో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. ఇప్పటికే ట్రూ-5జీ సేవలను పలు నగరాల్లో ప్రారంభించిన జియో తాజాగా మరో ఘనతను సాధించింది. భారతదేశంలో జియో 5 జీ సేవలను పూర్తిగా పొందిన తొలి రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. ఈ విషయంలో రిలయన్స్ జన్మభూమి కాబట్టి గుజరాత్ ప్రత్యేక స్థానంలో నిలిచింది. (ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు తీపికబురు!)
‘ట్రూ 5G ఫర్ ఆల్’ ఇనిషియేటివ్ కింద జిల్లా ప్రధాన కార్యాలయాలలో 100శాతం ట్రూ 5జీ సేవలను అందించనుంది. ‘జియో ట్రూ-5జీ వెల్‌కమ్ ఆఫర్’ నేటి (నవంబరు 25) నుంచి 33 జిల్లా కేంద్రాల్లో 5జీ సేవలు పొందుతారు. ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. (ఐకానిక్ అశోక్ హోటల్@ రూ.7,409 కోట్లు)
గుజరాత్‌లో ఈ శుభారంభం ఒక ముఖ్యమైన నిజమైన 5G-ఆధారిత చొరవతో జరుగుతోందని కంపెనీ ప్రకటించింది. రిలయన్స్ ఫౌండేషన్, జియో కలిసి ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కింద మొదట గుజరాత్‌లోని 100 పాఠశాలల్ని డిజిటలైజ్ చేసి, దీనితో పాఠశాలల్ని అనుసంధానం చేస్తుందని జియో ప్రకటించింది.
⇒ JioTrue5G కనెక్టివిటీ
⇒ అధునాతన కంటెంట్ ప్లాట్‌ఫారమ్
⇒ ఉపాధ్యాయ & విద్యార్థి సహకార వేదిక
⇒ స్కూల్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్
ఈ సాంకేతికత ద్వారా, దేశవ్యాప్తంగా మిలియన్ల మంది విద్యార్థులు లబ్ది పొందుతారు. డిజిటల్ ప్రయాణంలోనాణ్యమైన విద్య , తద్వారా సాధికారత ఈజీ అవుతుందని కంపెనీ తెలిపింది. 100 శాతం జిల్లా ప్రధాన కార్యాలయాలు 5జీకి అనుసంధానమైన తొలిరాష్ట్రంగా గుజరాత్ నిలవడం సంతోషంగానూ, గర్వంగానూ ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. రాబోయే పది, పదిహేనే ళ్లలో 300-400 మిలియన్ల నైపుణ్యం కలిగిన భారతీయులు వర్క్‌ఫోర్స్‌లో చేరనున్నారు. ప్రతి భారతీయుడికి మెరుగైన జీవన ప్రమాణాన్ని మాత్రమే అందించడంతోపాటు,2047 నాటికి అభివృద్ధి చెందిన మన దేశ ఆర్థిక వ్యవస్థగా మారాల ప్రధానమంత్రి లక్క్ష్య సాధనతో తోడ్పడుతుందన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో 1.3 బిలియన్ల యూజర్లతో డిజిటల్ రంగంలో ఇండియాను గ్లోబల్ లీడర్‌గా నిలిపిందని పేర్కొంది. (Bisleri Success Story 1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?)
Comments
Please login to add a commentAdd a comment