
తన పేరిట రూపొందించిన యాప్‌ను మంగళవారం నటి రకుల్‌ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. అనంతరం ఫొటోలకు ఇలా ఫోజులిచ్చారు.
జూబ్లీహిల్స్: కూల్ బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. అభిమానులతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు, సినీ విశేషాలు పంచుకునేందుకు తన పేరుతో రూపొందించిన యాప్‌ను ఆమె మంగళవారం ఆవిష్కరించారు. న్యూయార్క్‌కు చెందిన ఎస్కేపెక్స్ టెక్నాలజీస్ దీనిని రూపొందించింది. ఈ సందర్భంగా రకుల్ యాప్‌లో తన ఫొటోలను చూపుతూ కెమెరాకు పోజులిచ్చింది. కార్యక్రమంలో ఎస్కేపెక్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ షామిక్ తాలూక్‌దార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment