రెంటోమోజో | Rentomojo furniture rental | Sakshi
Sakshi News home page

రెంటోమోజో

Published Mon, Mar 6 2017 12:12 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

రెంటోమోజో - Sakshi

రెంటోమోజో

యాప్‌కీ కహానీ...  
ఉద్యోగులకు బదిలీ అయితే లగేజ్‌తో సమస్యే. మనమైతే వెంటనే బస్సో, రైలో ఎక్కి వెళ్ళిపోతాం. లగేజ్‌ సంగతి వేరు. దాన్ని తీసుకెళ్లాలంటే ఎన్నో తిప్పలు. ఇంట్లోకి కావలసిన ఫర్నిచర్, ప్రొడక్టులను అద్దెకిచ్చే వారు దొరికితే.. లగేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ సమస్యలుండవు. ప్రస్తుతం ‘రెంటోమోజో ఫర్నిచర్‌ రెంటల్‌’ అనే యాప్‌ ఈ సేవలనే అందిస్తోంది. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు
నచ్చిన ప్రొడక్టులను నెలవారీ అద్దెకు తీసుకోవచ్చు.
ఉచిత డెలివరీ,
ఇన్‌స్టలేషన్, సెటప్‌.
ఫ్రీ–పికప్‌ సౌకర్యం.
నాణ్యతకు 100 శాతం గ్యారెంటీ.
బెడ్‌రూమ్, లివింగ్‌ రూమ్, కిచెన్, డైనింగ్‌ రూమ్, స్టడీ రూమ్‌ సంబంధిత ఫర్నిచర్‌.. టీవీలు, వాషింగ్‌ మెషీన్, రిఫ్రిజిరేటర్, మైక్రోఒవెన్‌ వంటి ప్రొడక్ట్స్‌.. ఆఫీస్‌ ఫర్నిచర్, వాహనాలను అద్దెకు తీసుకోవచ్చు.
నెలవారీ ఈఎంఐలను యాప్‌ ద్వారానే చెల్లించొచ్చు.

హైదరాబాద్‌ సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ యాప్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement