సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్‌లో ఒకసారికి ఒక యాప్‌ను మాత్రమే ఇన్‌స్టాల్ చేయొచ్చు లేదా అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు యాప్ మేనేజ్‌మెంట్ మరింత వృద్ధి చెందింది. కాబట్టి ఏకకాలంలో మూడు యాప్‌లు లేదా గేమ్‌లను ఇన్‌స్టాల్ లేదా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఈ కొత్త ఫీచర్ భారతదేశంతో సహా ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌లోని ఈ అప్డేట్ మునుపటి సిస్టమ్ కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఇది సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.
ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం: ఎందుకో తెలుసా?
గూగుల్ ఏప్రిల్‌లో మొదటిసారి రెండు యాప్‌లను ఏకకాలంలో ఇన్‌స్టాల్ లేదా అప్‌డేట్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఇప్పుడు ఆ సంఖ్య మూడుకు చేరింది. యూజర్ ఒకేసారి మూడు యాప్స్ ఇన్‌స్టాల్/అప్‌డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు 'అప్డేట్ ఆల్' అనే ఫీచర్ ఎంచుకోవాలి ఉంటుంది. ఇలా సెలక్ట్ చేసుకున్న తరువాత యాప్స్ అప్‌డేట్‌లు ప్రాసెస్ అవుతాయి. అయితే ఈ ఫీచర్ కొన్ని పరికరాల్లోనూ అందుబాటులో లేదు. కానీ రాబోయే రోజుల్లో అన్ని పరికరాల్లోనూ అందుబాటులో వస్తుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment