ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం (Paytm) ప్రస్తుతం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న తరుణంలో.. దాని ప్రత్యర్థులు గణనీయమైన వృద్ధి పొందుతున్నాయి. దీంతో పేటీఎం యూజర్లు చాలామంది గూగుల్ పే, ఫోన్‌పే, BHIM యాప్‌ల వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించకూడదని పేటీఎంకు కొన్ని షరతులు విధించింది. దీంతో కంపెనీ షేర్లు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం పేటీఎం యూజర్ల సంఖ్య కూడా బాగా తగ్గింది.
ఫిబ్రవరి 3 వరకు ఫోన్‌పే 2.79 లక్షల ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లను పొందిందని యాప్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఒక నివేదికలో వెల్లడించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లు 24.1 శాతం పెరిగి 10.4 లక్షలకు చేరుకుంది.
యూజర్లను ఆకర్శించడానికి ఫోన్‌పే కావలసిన ప్రయత్నాలను చేస్తోంది. దీని ఫలితంగా భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఫ్రీ యాప్ విభాగంలో కంపెనీ అగ్రస్థానానికి చేరుకుంది. యాప్ ర్యాంకింగ్‌లలో కూడా ఈ యాప్ గణనీయమైన పురోగతిని సాధించింది. ఎక్కువ మంది యూజర్లు విరివిగా ఫోన్‌పే డౌన్‌లోడ్ చేసుకుంటున్న కారణంగా గూగుల్ ప్లేలో 188వ స్థానంలో ఉన్న కంపెనీ ఫిబ్రవరి 5 నాటికి 33వ స్థానానికి, యాప్ స్టోర్లలో 227వ స్థానం నుంచి 72వ స్థానానికి చేరింది.
భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్ కూడా ఫిబ్రవరి 3న 1.35 లక్షల ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లను సాధించి, 21.5 శాతం వృద్ధి కైవసం చేసుకుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల్లో.. 50 శాతం పెరిగి 5.93 లక్షల డౌన్‌లోడ్స్ పొందింది. దీంతో 356వ స్థానంలో ఉన్న ఈ యాప్ గూగుల్ ప్లేలో 7వ స్థానానికి, యాప్ స్టోర్లలో 171 స్థానం నుంచి 40వ స్థానానికి చేరింది.
ఇదీ చదవండి: భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు - కారణం ఇదే..
గూగుల్ పే విషయానికి వస్తే.. ఈ యాప్ డౌన్‌లోడ్‌ల విషయంలో స్వల్ప వృద్ధిని సాధించింది. ఇది ఫిబ్రవరి 3న 1.09 లక్షల డౌన్‌లోడ్‌లను సాధించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్స్ 8.4 శాతం పెరిగి 3.95 లక్షలకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment