మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడే ’భీమ్’ యాప్ డౌన్‌లోడ్స్ 1 కోటి మార్కును అధిగమించాయి. 20 రోజుల్లోనే ఏకంగా 1.1 కోట్ల మేర యాప్ డౌన్‌లోడ్స్ జరిగినట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. మరోవైపు ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు నాలుగు బ్యాంకులు ఇందులో పాలుపంచుకోనున్నట్లు మంత్రి చెప్పారు.