సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్‌లావాదేవాలకు ఊతమిచ్చే ఉద్దేశ్యంలో కేంద‍్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే టికెట్లను భీమ్, యూపీఐ యాప్ ల ద్వారా బుక్ చేసుకునేలా చర్యలు తీసుకుంది. తద్వారామ లక్షలాది రైల్వే ప్రయాణీకులకు ఊరట నిచ్చింది. దేశంలోని అన్ని టికెట్ రిజర్వేషన్ కౌంటర్లలో శుక్రవారం నుంచి యుపిఐ (యూనిఫైడ్ చెల్లింపు ఇంటర్ఫేస్) చెల్లింపు వ్యవస్థను అమలు చేస్తున్నామని భారతీయ రైల్వేలు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
దేశవ్యాప్తంగా అన్ని రిజర్వేషన్ కౌంటర్లలో యుపిఐ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అమలు చేయబోతున్నామని రైల్వే బోర్డు సభ్యుడు (ట్రాఫిక్) మొహమ్మద్ జంషెడ్ చెప్పారు. ఇప్పుడిక ప్రయాణీకుడు తన క్రెడిట్ / డెబిట్ కార్డును కలిగి ఉండవలసిన అవసరం లేదు, ఎందుకంటే వారు మొబైల్ ఫోన్ లోని భీమ్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోగలుగుతారని జంషెడ్ చెప్పారు. బుకింగ్ టిక్కెట్ల కోసం భారత్ క్యూఆర్ కోడ్ ఎంపికను అభివృద్ధి చేయడానికి రైల్వేలు కృషి చేస్తున్నాయన్నారు. ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీ వసూలుచేయడంలేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 14వేల కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు మొహమ్మద్ జంషెడ్ ప్రకటించారు.
రోజువారీ 97 శాతం బుకింగ్‌లు పాసెంజర్ రిజర్వేషన్ సిస్టం(పీఆర్‌ఎస్) నగదు ద్వారా, రెండు, మూడు శాతం లావాదేవీలు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రైల్వే అధికారుల ప్రకారం, రోజుకు సుమారు 7.5 లక్షల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. ఐదు లక్షల టిక్కెట్లు పీఆర్‌ఎస్ కౌంటర్లలో బుకింగ్‌లు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment