ముంబై: యూపీఐ ప్లాట్‌ఫాం ఆధారంగా సీమాంతర చెల్లింపులకు వెసులుబాటు కల్పించే దిశగా సింగపూర్‌కి చెందిన పేనౌతో జట్టు కట్టినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. భీమ్ ఎస్‌బీఐపే మొబైల్ యాప్ ద్వారా ఈ సదుపాయం పొందవచ్చని పేర్కొంది.
భారత్ నుంచి సింగపూర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ల ద్వారా, సింగపూర్ నుంచి భారత్‌కు యూపీఐ ఐడీ ద్వారా నగదు బదిలీ చేయొచ్చని వివరించింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ద్వైపాక్షిక రెమిటెన్సులు ఏటా దాదాపు 1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment