న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో యూపీఐ చెల్లింపులదే అగ్రస్థానం. ఇప్పటికే పలు యూపీఐ యాప్‌లు యూజర్లకు సేవలందిస్తున్నాయి. ఇప్పుడీ పోటీలోకి మరో యాప్ వచ్చింది. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పించేలా ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాం భారత్‌పే తాజాగా యూపీఐ టీపీఏపీని (థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) ఆవిష్కరించింది.
ఇందుకోసం యూనిటీ బ్యాంకుతో జట్టుకట్టినట్లు తెలిపింది. ఈ సేవల కోసం కస్టమర్లు భారత్‌పే యాప్‌లో @bpunity ఎక్స్‌టెన్షన్‌తో తమ యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకుని ఇటు వ్యక్తులకు అటు వ్యాపార వర్గాలకు చెల్లింపులు జరపవచ్చని పేర్కొంది. కంపెనీ ఇప్పటివరకు వ్యాపారవర్గాల మధ్య యూపీఐ చెల్లింపుల కోసం భారత్‌పే ఫర్ బిజినెస్ యాప్‌ను నిర్వహిస్తోంది.
తాజాగా తమ బై–నౌ–పే–లేటర్ యాప్ ’పోస్ట్‌పే’ పేరును ’భారత్‌పే’గా మార్చి వినియోగదారుల చెల్లింపుల సేవల కోసం మరో యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో యాపిల్ డివైజ్‌లకు సంబంధించిన యాప్‌స్టోర్‌లోనూ అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment