five countries
-
ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధిలో మనమే టాప్!
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల (అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్) వృద్ధి స్పీడ్‌లో భారత తొలి దేశంగా ఉంటుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఉద్ఘాటించారు. భారత్ పురోగతిలో ప్రవాస భారతీయులను ఒక ఉ్రత్పేరకం వలె పని చేయాలని, భారతదేశాన్ని అతిపెద్ద అవకాశంగా మార్చడంలో ప్రభుత్వ ప్రయత్నాలకు అనుబంధంగా ఉండాలని కోరారు. రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ నివేదిక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 3.4 ట్రిలియన్ డాలర్ల 2031 నాటికి రెట్టింపై 6.7 ట్రిలియన్ల డాలర్లకు రెట్టింపు అవుతుందని పేర్కొన్న ఇటీవలి నివేదికను సోమనాథన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జనాభా ప్రకారం ఇది అతిపెద్ద దేశం. ఏ ప్రాతిపదికన చూసినా, భారతదేశ వృద్ధి రేటు మొదటి నాలుగు దేశాల కంటే చాలా వేగంగా ఉంది. ఈ నాలుగు దేశాలూ భారతదేశం కంటే తక్కువ వృద్ధి రేటునే కలిగి ఉంటాయని మనం బల్లగుద్దిమరీ చెప్పగలం’’ అని ఆయన ఒక ప్రసంగంలో పేర్కొన్నారు. అవకాశాల పరిమాణం పరంగా చూస్తే, భారతదేశం భవిష్యత్తులో అతిపెద్ద అభివృద్ధి అవకాశంగా నిస్సందేహంగా కొనసాగుతుందని చెప్పవచ్చని ఇండియాస్పోరా జీ20 ఫోరమ్‌లో సోమనాథన్ అన్నారు. 2022–23లో 7.2 శాతంగా ఉన్న భారత్ వృద్ధి రేటు 2023–24 మధ్య 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉందని వివిధ సంస్థలు అంచనావేస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో దాతృత్వం కంటే పెట్టుబడి చాలా ముఖ్యమైనది కావచ్చు. పెట్టుబడి కంటే సాంకేతికత బదిలీ కీలకం కావచ్చు. డబ్బు కంటే మీ జ్ఞానం ముఖ్యమైనది కావచ్చు. – ఇండియాస్పోరా జీ20 ఫోరమ్‌లో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ -
అయిదు దేశాల్లో ఫోన్‌పే సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అయిదు దేశాల్లో యూపీఐ ఇంటర్నేషనల్ సేవలను ప్రారంభించింది. యూఏఈ, నేపాల్, సింగపూర్, మారిషస్, భూటాన్ వీటిలో ఉన్నాయి. ఈ దేశాల్లో వర్తకులకు ఫోన్‌పే కస్టమర్లు యూపీఐ ఆధారంగా క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. సాధారణంగా భారతీయ కస్టమర్లు విదేశీ కరెన్సీ, అంతర్జాతీయ క్రెడిట్/డెబిట్ కార్డు, ఫారెక్స్ కార్డును ఉపయోగించి అక్కడి వర్తకులకు చెల్లించాల్సి ఉంటుంది. యూపీఐ ఇంటర్నేషనల్ సౌకర్యంతో భారతీయ బ్యాంకు నుంచే విదేశీ కరెన్సీ రూపంలో ఈ లావాదేవీ పూర్తి అవుతుందని ఫోన్‌పే ప్రకటించింది. ఇటువంటి సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి భారతీయ ఫిన్‌టెక్ కంపెనీ తామేనని తెలిపింది. ఈ సౌకర్యం గేమ్ చేంజర్ అవుతుందని వివరించింది. ఫోన్‌పే యూజర్ల సంఖ్య 43.5 కోట్లు. -
అమెరికా తర్వాత కువైట్ కూడా...
ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ అమెరికా తీసుకున్న వివాదాస్పద నిర్ణయ బాటలోనే కువైట్ కూడా నడుస్తోంది. ఐదు దేశాలకు చెందిన ప్రయాణికులకు వీసాలు జారీచేయడం నిలిపివేస్తున్నట్టు కువైట్ ప్రకటించింది. అమెరికా మాదిరి కువైట్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంలో సిరియా, ఇరాక్, ఆఫ్గనిస్తాన్, ఇరాన్‌తో పాటు పాకిస్తాన్ కూడా ఉంది. ఈ ఐదు దేశాలకు టూరిజం, ట్రేడ్, విజిటర్ వీసాలను కఠినతరం చేస్తున్నట్టు స్పుత్నిక్ న్యూస్ రిపోర్టు చేసింది. నిషేధం విధించిన ఈ ఐదు దేశాలకు చెందిన వలసవాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ వీసాల కొరకు దరఖాస్తు చేసుకోవద్దని ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. కువైట్ సిటీ రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదుల ముప్పుతో తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ దేశాలపై నిషేధం విధించినట్టు ప్రభుత్వం తెలిపింది. 2015లో మిలిటెంట్ల గ్రూప్ షియా మసీదుపై బాంబు దాడి జరిపింది. ఈ దాడిలో 27 మంది కువైట్ ప్రజలు చనిపోయారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ కు ఓ వైపు విమర్శల గళం వినిపిస్తుండగానే.. ఆయన కార్యనిర్వాహక ఆదేశాలకు ప్రాముఖ్యం కల్పిస్తూ సిరియన్ ప్రజలను తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తూ కువైట్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. 2011లో కూడా కువైట్ నగరం సిరియన్లందరికీ వీసాలను ఇవ్వడం నిలిపివేసింది.