అమెరికా తర్వాత కువైట్ కూడా...
అమెరికా తర్వాత కువైట్ కూడా...
Published Thu, Feb 2 2017 2:07 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ అమెరికా తీసుకున్న వివాదాస్పద నిర్ణయ బాటలోనే కువైట్ కూడా నడుస్తోంది. ఐదు దేశాలకు చెందిన ప్రయాణికులకు వీసాలు జారీచేయడం నిలిపివేస్తున్నట్టు కువైట్ ప్రకటించింది. అమెరికా మాదిరి కువైట్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంలో సిరియా, ఇరాక్, ఆఫ్గనిస్తాన్, ఇరాన్తో పాటు పాకిస్తాన్ కూడా ఉంది. ఈ ఐదు దేశాలకు టూరిజం, ట్రేడ్, విజిటర్ వీసాలను కఠినతరం చేస్తున్నట్టు స్పుత్నిక్ న్యూస్ రిపోర్టు చేసింది. నిషేధం విధించిన ఈ ఐదు దేశాలకు చెందిన వలసవాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ వీసాల కొరకు దరఖాస్తు చేసుకోవద్దని ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది.
కువైట్ సిటీ రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదుల ముప్పుతో తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ దేశాలపై నిషేధం విధించినట్టు ప్రభుత్వం తెలిపింది. 2015లో మిలిటెంట్ల గ్రూప్ షియా మసీదుపై బాంబు దాడి జరిపింది. ఈ దాడిలో 27 మంది కువైట్ ప్రజలు చనిపోయారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ కు ఓ వైపు విమర్శల గళం వినిపిస్తుండగానే.. ఆయన కార్యనిర్వాహక ఆదేశాలకు ప్రాముఖ్యం కల్పిస్తూ సిరియన్ ప్రజలను తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తూ కువైట్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. 2011లో కూడా కువైట్ నగరం సిరియన్లందరికీ వీసాలను ఇవ్వడం నిలిపివేసింది.
Advertisement
Advertisement