sagu
-
ఎర్ర బంగారం ఇక ఎంతైనా ఎగుమతి!
ఎర్ర చందనం.. ప్రపంచంలో కేవలం మన దేశంలో మాత్రమే ఉన్న అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన జాతి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో విస్తరించిన తూర్పు కనుమల్లోని అడవుల్లో సహజ సిద్ధంగా ఎర్ర చందనం అనాదిగా పెరుగుతోంది. దీనితోపాటు, కొందరు రైతులు వర్షాధార భూముల్లో ఎర్రచందనం తోటలను చాలా ఏళ్లుగా సాగు చేస్తున్నారు. అంతరించిపోయే ప్రమాదం అంచుల్లో ఉన్న అరుదైన జాతి కావటంతో ఎర్రచందనం కలప ఎగుమతిపై 19 ఏళ్లుగా అంతర్జాతీయంగా పరిమితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల కృషి మేరకు ఎర్రచందనం ఎగుమతులపై పరిమితులు ఇటీవలే తొలగిపోయాయి. ఇక ఎంతయినా రైతులు ఎగుమతి చేయొచ్చు. మంచి ధర వచ్చే వరకు నిల్వ చేసుకొని మరీ ఎగుమతి చేసుకోవచ్చు. మెట్ట ప్రాంతాల్లో ఎర్రచందనం సాగు పుంజుకునేందుకు దోహదపడనున్న ఈ తాజా పరిణామంపై ప్రత్యేక కథనం. అంతర్జాతీయంగా ఆర్థికంగా ముఖ్యమైన చెట్ల జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఎర్రచందనం చేవ కర్రకు ఔషధ గుణాలు ఉన్నాయి. మన దేశంలోని తూర్పు కనుమలు విస్తరించిన దక్షిణ ప్రాంతంలో సహజ అడువుల్లో విస్తారంగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. రైతులు కూడా తమ భూముల్లో సాగు చేస్తున్నారు. సుదీర్ఘకాలం పెంచాల్సి రావటం, చెట్లు నరకడానికి, అమ్మకానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉండటం వంటి పరిమితులు ఉన్నప్పటికీ.. అంతర్జాతీయంగా గిరాకీ, అధిక ధర, మార్కెట్ డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవటం వల్ల ఎర్రచందనం సాగుకు కొంత మంది రైతులు ఆసక్తి చూపుతూ వచ్చారు. ఎగుమతిపై పరిమితులు ఇటీవల రద్దయిన నేపథ్యంలో ఎర్రచందనం సాగు మరింత పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నది నిపుణుల మాట. ఎర్రచందనం చెట్టు కాండం మధ్యలో పెరిగే ఎర్రటి చేవ కర్రను వస్త్రాలు, ఆహారం, ఔషధాల్లో సేంద్రియ రంగు కోసం వాడుతున్నారు. ఖరీదైన ఫర్నీచర్, బొమ్మలు, సంగీత వాయిద్యాల తయారీకి వాడుతున్నారు. షుగర్, చర్మవ్యాధులకు ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నది. జపాన్, చైనా, ఐరోపా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. అడవుల్లోని ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు గతంలో విచక్షణారహితంగా నరికివేసిన కారణంగా ఈ వృక్ష జాతి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొనే దశకు చేరింది. అందువల్ల ఎర్రచందనం జాతిని అంతరించిపోకుండా పరిరక్షించడానికి ప్రత్యేక చర్యలు అవసరమయ్యాయి. 2004 నుంచి ఎగుమతిపై పరిమితులు జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ చట్టబద్ధ సంస్థ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్డేంజర్డ్ స్పెసీస్ (సిఐటిఇఎస్ – ‘సైట్స్’)లో 1976 నుంచి భారత్ సభ్యదేశంగా కొనసాగుతోంది. ఎర్రచందనం దుంగల ఎగుమతిపై 2004లో ‘సైట్స్’ పూర్తిగా నిషేధించలేదు గానీ, పటిష్టమైన సంరక్షణ చర్యల్లో భాగంగా పరిమితిని విధించింది. ఏటేటా ఈ జాతి చెట్ల స్థితిగతులను పరిశీలించి ఎగుమతి పరిమాణాన్ని సైట్స్ స్థాయీ సంఘం నిర్దేశిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఈ చెట్ల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టింది. మరోవైపు అటవీ భూముల్లో ఎర్రచందనం మొక్కలు నాటడం కూడా జరిగింది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు గుజరాత్లో కూడా కొందరు రైతులు బంజరు భూముల్లో ఎర్రచందనాన్ని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. అటవీ భూముల్లోని ఎర్రచందనం చెట్లను పరిరక్షించటంతో పాటు రైతుల భూముల్లోనూ సాగు చేస్తుండటంతో ఈ జాతి అంతరించే ముప్పు నుంచి బయటపడింది. 19 ఏళ్ల తర్వాత.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నివేదికల ఆధారంగా తాజా పరిస్థితిని నవంబర్ 6–10 తేదీల్లో జెనీవాలో జరిగిన ‘సైట్స్’ 77వ స్థాయీ సంఘం సమావేశం సమీక్షించి సంతృప్తిని వ్యక్తం చేసింది. మన దేశం నుంచి సైట్స్ మేనేజ్మెంట్ అథారిటీ–ఇండియా తరఫున అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎస్.పి. యాదవ్ సారథ్యంలోని ఉన్నతాధికార బృందం ఈ సమావేశంలో పాల్గొని పరిస్థితిని వివరించింది. దీంతో, భారత్ నుంచి ఎర్రచందనం ఎగుమతులపై 19 ఏళ్లుగా అమల్లో ఉన్న పరిమితిని తొలగిస్తూ ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది. దీంతో, జెనీవాలోని సైట్స్ స్థాయీ సంఘానికి బదులు.. ఇక మీదట ఎర్రచందనం ఎగుమతుల వ్యవహారాలపై న్యూఢిల్లీలోని సైట్స్ మేనేజ్మెంట్ అథారిటీ–ఇండియా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలిగింది. రైతులకు గొప్ప ప్రోత్సాహం ఎర్రచందనం ఎగుమతిపై పరిమితిని రద్దు చేస్తూ సైట్స్ స్థాయీ సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు. మన దేశం గత 19 ఏళ్లుగా సైట్స్ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించటమే కాకుండా ఎర్రచందనం వృక్ష జాతి పరిరక్షణ చర్యలు సమర్థవంతంగా పాటించినందున సైట్స్ సానుకూల నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ‘ఈ పరిణామం ఎర్రచందనం తోటలు సాగు చేసే రైతులకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంద’ని ఆయన అన్నారు. ఎర్రచందనం సాగు పద్ధతులు ఎగుమతిపై పరిమితి తొలగిన నేపథ్యంలో ఎర్రచందనం సాగు పద్ధతులపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ దూలపల్లిలోని అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్బి) ఎర్రచందనం సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తోంది. గత ఏడాది కరదీపికను వెలువరించింది. ఆ వివరాలు...ఎర్రచందనం ప్రకృతిసిద్ధంగా తక్కువ నీటి వనరులున్న కొండ ప్రాంతాల్లో పెరుగుతుంది. అంతగా సారవంతం కాని గ్నీస్, క్వార్ట్జైట్, లాటరైట్ లోమ్ నేలలు బాగా అనుకూలం. సారవంతమైన నేలలు, నీటి సదుపాయం ఉన్న నేలలు ఎర్రచందనం సాగుకు అనువైనవి కావు. ఈ నేలల్లో సాగు చేస్తే చెట్లు బాగా ఎత్తుగా, లావుగా పెరుగుతాయి. అయితే, కాండం లోపల చేవదేలడానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది. చేవను బట్టే ఎర్రచందనం నాణ్యత, ధర ఆధారపడి ఉంటాయి. పాక్షిక శుష్క ఉష్ణమండలంలోని ఆకురాల్చే అడవులు పెరిగే ప్రాంతం దీనికి అనుకూలం. 700 నుంచి 1200 ఎం.ఎం. మేరకు వార్షిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. కనీసం 700 ఎం.ఎం. వర్షం అవసరం. ఏడాదిలో అప్పుడప్పుడూ వర్షాలు పడుతూ ఉండే ప్రాంతాలు ఎర్రచందనం సాగుకు అనుకూలం. అధిక వర్షపాత ప్రాంతాలు అనుకూలం కాదు. పొడి వాతావరణంతో పాటు 26–28 డిగ్రీల సెల్షియస్ (గరిష్టంగా 48 డిగ్రీల సెల్షియస్) ఉష్ణోగ్రతలు ఉండాలి. నర్సరీ బెడ్లపై పెంచిన 1–2 ఏళ్ల నారు మొక్కల్ని నాటుకోవాలి. ఎర్రచందనం గింజలు చాలా తక్కువ శాతం మొలకెత్తుతాయి. అందువల్ల వీటికి బదులు కొందరు ప్రైవేటు నర్సరీ వాళ్లు రైతులకు ఏగిశ మొక్కల్ని ఎర్రచందనం మొక్కలని నమ్మబలికి అంటగడుతూ ఉంటారని, రైతులు అప్రమత్తతంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏగిశ మొక్కలు కొన్ని సంవత్సరాల వరకు ఎర్రచందనం మాదిరిగానే కనిపిస్తాయట. కాండం కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. కాబట్టి మొక్కలను కొనుగోలు చేసేటప్పుడే రైతులు జాగ్రత్తవహించాలి. అటవీ శాఖ ద్వారా మొక్కల్ని కొనుగోలు చేయటం ఉత్తమం అని ఐఎఫ్బి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 30 ఏళ్లలో చెట్టుకు 59 కిలోల చేవ అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్బి) సమాచారం ప్రకారం.. ఎర్రచందనం మొక్కల్ని 3“3 మీటర్ల దూరంలో (హెక్టారుకు 1,111 మొక్కలు) నాటుకోవచ్చు. ఎర్రచందనం చెట్టు కోతకు రావటానికి 30 ఏళ్లు పడుతుందని ఐఎఫ్బి నిపుణులు తెలిపారు. నాటిన 20 ఏళ్లకు కాండం లోపలి భాగం (హార్డ్ వుడ్) చేవదేలటం ప్రారంభమవుతుంది. కాండంపై బెరడు కింద తెల్ల చెక్క ఉంటుంది. దాని లోపల ఎర్రగా చేవదేలి ఉంటుంది. ఆ ఎర్రని చేవ గల కర్రే విలువైనది. 30 ఏళ్ల వయసున్న చెట్టు నుంచి 59 కిలోల చేవగల ఎర్రచందనం దుంగ వెలువడుతుంది. పోయిన చెట్లు పోగా 30 ఏళ్లకు హెక్టారుకు కనీసం 275 చెట్లు మిగులుతాయి. ఈ లెక్కన హెక్టారుకు 16.2 మెట్రిక్ టన్నుల బరువైన ఎర్రచందనం లభిస్తుంది. 40 ఏళ్లకు 38 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని ఐఎఫ్బి అంచనా. 2017లో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వేలంలో మెట్రిక్ టన్ను ఎర్రచందనం దుంగలు రూ. 27.8 లక్షలకు అమ్ముడయ్యాయి. రాళ్ల భూముల్లో పెరుగుతుంది! ఎర్రచందనం ఎగుమతిపై పరిమితులు రద్దవటం వల్ల రైతులకు ఇబ్బందులు తొలగిపోతాయి. మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతులు నేరుగా ఎగుమతిదారులను సంప్రదించడానికి వీలవుతుంది. ఎర్రచందనం తోటల సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఇతరత్రా పంటలు సాగుకు అనువుకాని రాళ్లు రప్పలతో కూడిన మెట్ట భూములు, గుట్టల్లో ఎర్రచందనం చెట్లు పెరుగుతాయి. ఒక సంవత్సరం మొక్కల్ని నీరు పోసి రక్షిస్తే చాలు. తర్వాత వాటికవే పెరుగుతాయి. ఎరువులు అవసరం లేదు. 30 ఏళ్లలో కోతకు వస్తాయి. ఐఎఫ్బిలో ఎర్రచందనం మీద చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నాం. వన విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రతి ఏటా రైతులు, అటవీ సిబ్బంది, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ఎర్రచందనం పెంపకం మాన్యువల్, ఎర్రచందనం–ఏగిశ (బిజసాల్) మధ్య వ్యత్యాసాలు, ఎర్రచందనాన్ని ఆశించే చీడపీడలు, నియంత్రణ చర్యలపై కరపత్రాలను విడుదల చేశాం. – వెంకట్‌రెడ్డి, సంచాలకులు, అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్బి), దూలపల్లి, హైదరాబాద్ director_ifb@icfre.org ఎర్రచందనం రైతులకు ప్రయోజనకరం అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న జీవజాతుల పరిరక్షణ చర్యలను జెనీవాలోని ‘సైట్స్’ అనే అంతర్జాతీయ సంస్థ నియంత్రిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎర్రచందనం దుంగలను ఈ సంస్థ నిర్ణయించే పరిమితి మేరకే ఏటా ఎగుమతి జరుగుతోంది. దీంతో ఆ కోటా కన్నా ఎక్కువ ఎర్రచందనం మన రైతుల దగ్గర ఉన్నా ఎగుమతి చేసే వీలుండేది కాదు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల కృషి మేరకు ఎగుమతిపై ఉన్న పరిమాణాత్మక పరిమితిని ‘సైట్స్’ ఇటీవల రద్దు చేసింది. దీంతో ఎర్రచందనం ఎగుమతుల నియంత్రణ అంశం మన దేశంలోని ‘సైట్స్’ ఇండియా అథారిటీ పరిధిలోకి వచ్చింది. ఎర్రచందనం ఎగుమతిదారులు ఇక మీదట సైట్స్ ఇండియా అనుమతి తీసుకుంటే సరిపోతుంది. ఎర్రచందనం సాగు చేసే రైతులకు ఇది ప్రోత్సాహకర పరిణామం. సాగు చేసిన ఎర్రచందనం దుంగలను అప్పటికప్పుడు అమ్మెయ్యాల్సిన అవసరం లేదు. నిల్వ చేసి అయినా మంచి ధరకు రైతులు అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది. ఎర్రచందనం సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. – వై. మధుసూదన్ రెడ్డి, అటవీ దళాల అధిపతి (పిసిసిఎఫ్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ (చదవండి: పేదరికం తగ్గిన ఆహార వినియోగం పెరగలేదు!) -
ఉన్నది చెబితే... ఉలుకెందుకప్పా...!
- ఇప్పటికీ పొలాలకు చేరని సాగునీరు - రెండువారాలైనా సాగు ప్రశ్నార్థకమే - ‘సాక్షి’ గ్రౌండ్ విజిట్‌లో వెల్లడైన వాస్తవాలు - ఈ నెల 17న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో ఉలిక్కిపడిన ఉప ముఖ్యమంత్రి రాజప్ప - ఈ నెల 18న విలేకర్ల సమావేశంలో ‘సాగునీటికెక్కడా ఇబ్బందుల్లేవం’టూ వెల్లడి - ఇప్పుడేమంటారంటూ రైతుల తరుఫున మరోసారి ‘సాక్షి’ నిలదీత. - 18వ తేదీ 10వ పేజీలో చినరాజప్ప విలేకర్ల సమావేశం క్లిప్పింగ్‌లు వాడుకుందాం. . చిన రాజప్ప... రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి... అంతకు మించి జిల్లాకు ప్రాతినిధ్యం వహించే ముఖ్య నేత. ఓ నియోజకవర్గానికి శాసన సభ్యుడు. అలాంటి వ్యక్తి జనం పక్షపాతిగా ఉండాలి. తన పార్టీని ...తన ప్రభుత్వాన్ని సమర్థించుకోడంలో తప్పులేదు. రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వాయించుకునే ఆ రాజుతో పోల్చితే ఈయన మరింత ఘోరంగా ప్రవర్తిస్తున్నారని జిల్లాప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా నీళ్లిస్తే డెల్టా భూముల్లో పంట పండించుకోవచ్చునని పోరాటం చేసి సాధించుకున్న హక్కును కాలరాస్తుండడంతో పలు ప్రాంతాల్లో రొడ్డెక్కి నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ రైతుల పక్షపాతిగా వరుస కథనాలను ప్రచురించడంతో వాస్తవాన్ని జీర్ణించుకోలేని రాజప్ప విలేకర్ల సమావేశంలోనే ‘అంతటికీ సాగు నీరు అందిస్తున్నట్టు’ అబద్దాలు చెబుతూ తప్పుడు రాతలు రాస్తున్నారని చిందులు తొక్కారు. అదంతా వాస్తవం కాదంటూ ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కారు. ఆయన మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోడానికి ‘సాక్షి’ మళ్లీ మరిన్ని వివరాల సేకరణకు దిగింది. ఇదీ వాస్తవమంటూ స‘చిత్రా’లతో పాఠకుల ముందించింది. . + చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలోని ఏలేరు, పీబీసీ కాలువల పరిధిలో ఆయకట్టుకు ఇప్పటికీ సాగునీరందడం లేదు. దీంతో వేలాది ఎకరాల ఆయకట్టుకు ఇప్పటికీ సాగునీరు చేరలేదు. చినరాజప్ప సొంత నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం వాడపర్రు పంటకాలువదీ ఇదే దుస్థితి. + పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి మండలాల పరిధిలో పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధిలో 47వేల ఎకరాల ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది. + ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండల కేశనకుర్రు– తిళ్లకుప్ప పంట కాలువ మధ్య సాగునీరందక ఏడెనిమిది వేల ఎకరాల్లో సాగు నిలిచిపోయింది. + ఐ.పోలవరం మండలం మురమళ్ల–గుత్తెనదీవి పంటకాలువకు కూడా సాగునీరు విడుదలకాలేదు. ఏడువేల ఎకరాలు సాగు ప్రశ్నార్థకంగా మారింది. - పోలేకుర్రు నీటి సంఘం పరిధిలోని తాళ్లరేవు–గాడిమొగ పంట కాలువకు సోమవారం నాటికి కూడా సాగునీరు విడుదల చేయలేదు. తాళ్లరేవుకు చెందిన ద్వితీయశ్రేణి టీడీపీ నాయకుడు వాల్ నిర్మాణం చేపట్టడంతో సాగునీరు ఆపేశారు. సఖినేటిపల్లి మండలంలో యలంకాయల కాలువకు ఇంకా సాగునీరు విడుదల కాలేదు. - పి. గన్నవరం ఆయకట్టుకు నేటికీ నీరు లేక సాగు ప్రశ్నార్థకంగా మారింది. వ్యవసాయ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. - కాట్రేనికోన మండలం లక్ష్మీవాడ–సన్నవిల్లి మధ్య రిటైనింగ్ వాల్స్ నిర్మాణాలతో నీటి విడుదలకాక లక్ష్మీవాడ, సన్నవిల్లి, గొల్లవిల్లి, వాడపర్రు, అమ్మనఅగ్రహరం, కూనవరం వరకు సుమారు ఐదువేల ఎకరాల్లో ఆయకట్టులో సాగు నిలిచిపోయింది. . సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు జిల్లాలో రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. వారి నిర్వాకంతో రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతుల కంట కన్నీళ్లు పెట్టే పరిస్థితిలోకి నెట్టేశారు. ప్రతి ఎకరాకు సాగునీరందించేశామని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఘనంగా ప్రకటిస్తున్నారు. అందుకే నియోజకవర్గాల్లో ఏరువాక కూడా మొదలు పెట్టామంటున్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పయితే మరో అడుగు ముందుకేసి గత ప్రభుత్వాలకు భిన్నంగా వారం రోజులు ముందుగానే సాగునీరు విడుదల చేసిన ఘనత తమదేనని ఢంకా బజాయించి మరీ చెబుతూ వస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే అంత నమ్మసక్యంగా కనిపించడం లేదు. పంట పొలాలకు నీరందక రైతులు ఎదుర్కొంటున్న సాగు కష్టాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప రైతులకు ఇబ్బంది లేకుండా వారం కిందటే సాగునీరు విడుదల చేసినా అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ‘సాక్షి’పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోనీ హోం మంత్రి చినరాజప్ప చెప్పినట్టే ప్రతి ఎకరాకు సాగునీరు అందిందా అంటే అదీ లేదు. . జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో రెండు లక్షల 36 వేల హెక్టార్లలో సాగు కోసం జిల్లా వ్యవసాయ శాఖ కార్యచరణ ప్రణాళికæ సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా రైతులు కూడా సాగుకు సన్నద్ధమయ్యారు. ఒకపక్క ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రుణాలు రాక పెట్టుబడి కోసం రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పోనీ ఎక్కడో ఓ చోట ప్రైవేటుగానైనా పెట్టుబడులు తెచ్చుకుందామని సిద్ధమయ్యే రైతులకు నీరు అందక సాగుముందుకు సాగడం లేదు. సెంట్రల్, ఈస్ట్రన్ డెల్టాల పరిధిలోని పలు పంట కాలువల్లో క్లోజర్ పనుల కోసం ఇప్పటికీ సాగునీరు ఆపేశారు. దాదాపు ఆ పనులన్నీ అధికార పార్టీ నేతల బంధువులు లేదా, అనుచరులు చేస్తున్నవే. ఈ కారణంగానే సాగునీరును అర్థాంతరంగా అడ్డుకట్టలు వేసి మరీ దర్జాగా క్లోజర్ పనులు చేసుకుంటున్నారు. రైతులు ఎలాపోతే తమకేమిటి తమ పనులు పూర్తయ్యే వరకు వేచిచూడాల్సిందేనంటున్నారు. . నీరిచ్చేశామని చెప్పిన మంత్రి మాటలపై సాక్షి సాక్ష్యాలతో... . పొలాలన్నింటికీ సాగునీరందించామని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెబుతున్న విషయంలో వాస్తవం ఎంత ఉందో తెలుసుకునేందుకు ‘సాక్షి’ బృందం సోమవారం కొన్ని ప్రాంతాల్లో పంట కాలువలను పరిశీలించింది. ఈ పరిశీలనలో చాలా పంట కాలువలకు ఇప్పటికీ సాగునీరందని విషయం వాస్తవమేనని తేలింది. + చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గాన్నే తొలుత సందర్శించింది. ఈ నియోజకవర్గంలోని ఏలేరు, పీబీసీ కాలువల పరిధిలో ఆయకట్టుకు ఇప్పటికీ సాగునీరందని విషయం బయటపడింది. నవర, చంద్రంపాలెం గ్రామాల్లో వంతెనల నిర్మాణం కోసం కాలువకు అడ్డుకట్టలు వేసి నీరు నిలిపివేశారు. ఈ కారణంగా పెద్దాపురం, కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు ఇప్పటికీ సాగునీరు చేరలేదు. + జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చిత్రాడలో వంతెన నిర్మాణం చేపడుతున్నారు. ఈ కారణంగా పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి మండలాల పరిధిలో పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధిలో 47వేల ఎకరాల ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది. + అటు కోనసీమలోని పలు పంటకాలువలకు ఇప్పటికీ సాగు నీరందని పరిస్థితే కనిపించింది. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండల కేశనకుర్రు– తిళ్లకుప్ప పంట కాలువ మధ్య సాగునీరందక ఏడెనిమిది వేల ఎకరాల్లో సాగు నిలిచిపోయింది. + ఐ.పోలవరం మండలం మురమళ్ల–గుత్తెనదీవి పంటకాలువకు కూడా సాగునీరు విడుదలకాలేదు. ఫలితంగా గుత్తెనదీవి, జీ వేమవరం, జి మూలపొలం, ఎదుర్లంక గ్రామాల పరిధిలో మరో ఏడువేల ఎకరాలు సాగు ప్రశ్నార్థకంగా మారింది. - పోలేకుర్రు నీటి సంఘం పరిధిలోని తాళ్లరేవు–గాడిమొగ పంట కాలువకు సోమవారం నాటికి కూడా సాగునీరు విడుదల చేయలేదు. పోలేకుర్రు డివైడింగ్ డ్యామ్ వద్ద రిటైనింగ్ వాల్ అవసరం ఉంది. కానీ అక్కడ నిర్మించకుండా బాబానగర్ రహదారిలో తాళ్లరేవుకు చెందిన ద్వితీయశ్రేణి టీడీపీ నాయకుడు వాల్ నిర్మాణం చేపట్టడంతో సాగునీరు ఆపేశారు. - మల్లవరం, బాబానగర్, తాళ్లరేవు, గాడిమొగ తదితర ప్రాంతాల ఆయకట్టులో సాగు నిలిచిపోవడంతో రైతులు ఆదివారం ఎదురుతిరిగితే పనులు ఆపేశారు. రైతులు వెళ్ల్లగానే తిరిగి పనులు మొదలుపెట్టేశారు. రాజోలు దీవిలో కూడా పలు ప్రాంతాలకు సాగునీరంద లేదు. - సఖినేటిపల్లి మండలంలో యలంకాయల కాలువకు ఇంకా సాగునీరు విడుదల కాలేదు. కాలువకు ఇరువైపులా రివిట్మెంట్ పనులు చేస్తున్నారు. - పి. గన్నవరం పంట కాలువకు నీరిచ్చినా ఈ పంట కాలువకు నీరు నిలిపి వేశారు. ఫలితంగా ఈ కాలువపై ఆయకట్టుకు నేటికీ నీరు లేక సాగు ప్రశ్నార్థకంగా మారింది. శేషారాయుడు కాలువ, అప్పన రామునిలంక తదితర పంట కాలువలకు కూడా ఇంకా నీరు ఇవ్వ లేదు.వ్యవసాయ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. - చినరాజప్ప సొంత నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం వాడపర్రు పంటకాలువకు కూడా ఇప్పటికీ సాగునీరు విడుదల చేయలేదు. - కాట్రేనికోన మండలం లక్ష్మీవాడ–సన్నవిల్లి మధ్య రిటైనింగ్ వాల్స్ నిర్మాణాలతో నీటి విడుదలకాక లక్ష్మీవాడ, సన్నవిల్లి, గొల్లవిల్లి, వాడపర్రు, అమ్మనఅగ్రహరం, కూనవరం వరకు సుమారు ఐదువేల ఎకరాల్లో ఆయకట్టులో సాగు నిలిచిపోయింది. క్షేత్రస్థాయిలో సాగునీటి సరఫరా వాస్తవం ఇలా ఉండగా మంత్రి చినరాజప్ప, ఆ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం వారం ముందుగానే సాగునీరు ఇచ్చేశామని గొప్పలు చెప్పుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. నీటిపారుశాఖాధికారులు మంత్రుల మెప్పుకోసం వాస్తవాలను తొక్కిపెడుతున్నారా లేక, అన్నీ తెలిసినా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు అసత్యాలు పలుకుతున్నారా అనేది వారికే తెలియాలి. . నీరు లేక నారుమడులు వేయలేదు సాగు నీరు అందక నారుమడులు వేసుకోలేదు. అన్ని కాలువలకు నీరు అందించామని ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరం. కేశనకుర్రు–తిళ్లకుప్ప పంటకాలువకు నీరు నేటికి ఇవ్వలేదు. ఒకటో తేదీనే ఇచ్చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతులకు నీరందించడంలో చిత్తశుద్ధి లేదు. పంట కాలువ నీరు నిలుపుదల చేసి రెండు వారాలైనా ఇప్పటికీ నీరు ఇవ్వ లేదు. నాకు పదెకరాలు పంట భూమి ఉంది. నీరు వచ్చి ఉంటే నారుమడులు వేసుకునే వాళ్లం. వారం రోజులపాటు నీరు వచ్చేలా కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు కార్యాలయాల్లో కూర్చుని మాట్లాడటం కాదు. పొలాలకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. -
సాగునీటికెక్కడా ఇబ్బందులు లేవు
క్లోజర్ పనుల దారి పనులదే అసత్యాలు రాస్తున్నారంటూ మండిపాటు ‘దుమ్మురేపిన హామీలు–దమ్ముకేవి నీళ్లు’ సాక్షి కథనంపై చినరాజప్ప చిందులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో పంట కాలువలకు ఒకటో తేదీనే సాగునీరు ఇచ్చేశాం.. ఖరీఫ్ సాగుకు రైతులు ఇబ్బంది పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడక్కడా కాలువ పనులు జరుగుతున్నా సాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేదు. అయినా కొన్ని పత్రికలు పనిగట్టుకుని అవాస్తవాలు రాస్తున్నాయని కాకినాడ ఆర్అండ్బి అతిథి గృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప పాత్రికేయులపై విరుచుకుపడ్డారు. చినరాజప్పకు కోపం రావడానికి ‘సాక్షి’లో శనివారం ‘దుమ్మురేపిన హామీలు–దమ్ముకేవి నీళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనమే కారణమైంది. కాలువలకు నీరు విడుదలచేసి రెండు వారాలు గడిచినా ఇప్పటి వరకు సాగునీరందని ఆయకట్టు పరిస్థితులపై ఫొటోలతో సహా ‘సాక్షి’లో ప్రచరితమవడంతో చినరాజప్పకు చిర్రెత్తుకు వచ్చింది. జిల్లా కేంద్రం కాకినాడలో ఎన్టీఆర్ ట్రస్టు పేరుతో పార్టీ జిల్లా కార్యాలయం కోసం అతి తక్కువ ధరకు సొంతం చేసుకున్న జెడ్పీ స్థలాన్ని మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప పరిశీలించారు. అనంతరం చినరాజప్ప విలేకర్లతో మాట్లాడుతుండగా సాగునీరు సరఫరా సక్రమంగా జరగక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పాత్రికేయులు పలు ప్రశ్నలు సంధించారు. అంతే హోంమంత్రి చినరాజప్పకు ఒక్కసారిగా కోపం కట్టలుతెంచుకుని మీరేమి మాట్లాడుతున్నారంటూ రుసరుసలాడారు. గతంలో ఎప్పుడూ లేనిది ఈ నెల ఒకటోతేదీ నాడే సాగునీరు విడుదల చేశాం ... అయినా ఇంకా సాగునీరందడం లేదని ఓ పత్రికలో (సాక్షి పేరు ఎత్తకుండా)ల్లో చూశానని, అవి అసత్యాలు రాస్తున్నాయని మండిపడ్డారు. క్లోజర్ పనులు జరుగుతుంటే పంట పొలాలకు సాగునీరు ఎలా సరఫరా అవుతుందనే ప్రశ్నకు పనులు దారి పనులవే, సాగునీరు దారి సాగునీరిదేనని చెప్పుకు వస్తూ అయినా మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటూ విలేకర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. పంట పొలాలకు నీరు ఇచ్చేసినా ఇవ్వలేదని ఎలా రాస్తారంటూ ఎదురు ప్రశ్నించారు. క్లోజర్ పనులు జరుగుతున్నా సాగునీరు పూర్తిగా సరఫరా అవుతోందని చెప్పుకొచ్చారు. ఇదే విషయమై వివాదాలు లేకుండా అమలాపురం పరిసర ప్రాంతాల్లో కమిటీలు కూడా వేశామని చినరాజప్ప చెప్పారు. -
క‘న్నీటి’ వ్యథ
డెల్టా శివార్లలో అన్నదాతల అగచాట్లు ముందస్తు సమాచారం లేకుండా వంతులవారీ విధానం మోటార్లతో తంటాలు పడుతున్న రైతులు తామే అపర భగీరథులమని.. వేల, లక్షల కోట్ల రూపాయలు తెచ్చి.. ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా.. ఒక్క ఎకరం కూడా ఎండకుండా నీరిచ్చేస్తామని పాలకులు చెబుతున్నారు. కానీ, చుక్కనీరందే దారి లేక.. కళ్లముందే పంటలు ఎండిపోతూంటే చూడలేక.. శివారు రైతు కంట కన్నీరు ఒలుకుతోంది. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు వంతులవారీ విధానం అమలు చేయడంతో గోదావరి డెల్టా రైతులు.. అదునుకు పదును అందక వాడిపోతున్న వరిపైరును చూసి ఏలేరు రైతులు ఆవేదనకు గురవుతున్నారు. అమలాపురం : గోదావరి డెల్టాలో రబీ శివారు ఆయకట్టుకు నీటి ఎద్దడి ఏర్పడుతోంది. సెంట్రల్ డెల్టాలో ఇప్పటికే సాగునీరందక అక్కడి రైతులు నానాపాట్లూ పడుతున్నారు. నాట్లు పడుతున్న సమయంలో ముందస్తు సమాచారం లేకుండా ఇరిగేష¯ŒS అధికారులు వంతులవారీ విధానం అమలులోకి తేవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీనికితోడు గోదావరిలో సహజ జలాల రాక పడిపోవడంతో ఆయకట్టు శివారు రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు. గోదావరి డెల్టాలో ఈ ఏడాది 4.80 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగుతోందని అధికారులు చెబుతూ వచ్చారు. అయితే వాస్తవ ఆయకట్టు 4 లక్షల ఎకరాలు మాత్రమే. ఇందుకు 80 టీఎంసీల వరకూ సాగునీరు అవసరం కాగా, గత ఏడాది 65 టీఎంసీలతోనే రబీ పండించారు. అయితే సుమారు 50 వేల ఎకరాల్లో దిగుబడి దెబ్బతింది. ఈ ఏడాది గోదావరి ఇ¯ŒSఫ్లో ఆశాజనకంగా ఉండడంతో నీటి ఎద్దడి ఉండదని అధికారులు భావించారు. కానీ వారం పది రోజులుగా నదిలో ఇ¯ŒSఫ్లో అనూహ్యంగా పడిపోయింది. పడిపోతున్న సహజ జలాలు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శుక్రవారం ఇ¯ŒSఫ్లో 7,460 క్యూసెక్కులుగా నమోదైంది. వచ్చిన నీటిని వచ్చినట్టు కాలువలకు వదిలేస్తున్నారు. తూర్పు డెల్టాకు 2,200, మధ్య డెల్టాకు 1,430, పశ్చిమ డెల్టాకు 3,830 క్యూసెక్కుల చొప్పున ఇస్తున్నారు. ఇ¯ŒSఫ్లోలో సీలేరు నుంచి వచ్చేది 4,199.79 క్యూసెక్కులు కాగా, 3,260.21 క్యూసెక్కులు మాత్రమే సహజ జలాలు. నిపుణుల అంచనా ప్రకారం ఫిబ్రవరి 15 నాటికి సహజ జలాల రాక 1,500 క్యూసెక్కులకు పడిపోతుంది. పైగా బ్యారేజ్ వద్ద 13.64 మీటర్లవద్ద ఉండాల్సిన పాండ్ లెవెల్ 13.35 మీటర్లకు పడిపోయింది. ఇటు ఇ¯ŒSఫ్లో, అటు పాండ్లెవెల్ తగ్గడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. శివారుకు అందని నీరు ఇ¯ŒSఫ్లో తగ్గడంతో మూడు రోజుల నుంచి డెల్టాలో వంతులవారీగా సాగునీరందిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఆయకట్టు రైతులకు చెప్పడంలో ఇరిగేష¯ŒS, వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహించారు. మధ్య డెల్టాలో ఇంకా 20 శాతం, తూర్పు డెల్టాలో 10 శాతం నాట్లు పడాల్సి ఉంది. చాలాచోట్ల సంక్రాంతి తరువాతే ఎక్కువగా నాట్లు పడ్డాయి. ఈ చేలకు నీరు చాలా అవసరం. నాట్లు వేసిన తరువాత చేలల్లో ఐదు సెంటీమీటర్ల చొప్పున నీరు పెడతారు. వంతులవారీ విధానం గురించి ముందుగా చెప్పి ఉంటే రైతులు కొంతవరకూ చేలల్లో నీరు నిల్వ పెట్టుకునేవారు. పైగా పంటబోదెలు అధ్వానంగా ఉండడంతో నీరు శివారుకు చేరడం లేదు. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు; అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు, గంగలకుర్రు; అమలాపురం మండలం బండారులంక, భట్లపాలెం; ఉప్పలగుప్తం మండలం రాఘవులుపేట, ఎస్.యానాం, కూనవరంతోపాటు మామిడికుదురు, పి.గన్నవరం, మలికిపురం, సఖినేటిపల్లి; తూర్పు డెల్టాలో తాళ్లరేవు, కరప, కాజులూరు, కె.గంగవరం మండలాల్లోని శివారు భూముల్లో సాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో చాలామంది రైతులు మోటార్లతో డ్రైన్ల నుంచి, భూగర్భం నుంచి నీరు తోడుకుంటున్నారు. -
వ్యవసాయ బోర్లకు సోలార్ ఎనర్జీ
అన్నవరం దేవస్థానం భూముల్లో మూడు బోర్లు ఏర్పాటు సబ్సిడీపై అందిస్తున్నట్రాన్స్కో అన్నవరం : ‘సోలార్ ’ విద్యుత్ కేవలం వెలుగులకే కాదు, భూగర్భంలో నీటిని అందించేందుకూ ఉపయోగపడుతుంది. అన్నవరం దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్‌తో నడిచే మూడు బోర్లను ఏర్పాటు చేసి, ఆ నీటితో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. ఈ సోలార్ మోటార్లను అన్నవరంలోని ఈరంకి వారి స్థలంలోను, రైల్వేస్టేçÙన్ వెనుక గల స్థలంలో రెండు ఏర్పాటు చేశారు. మరో మూడు బోర్‌వెల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. ఐదు హెచ్‌పీ సామర్థ్యం గల ఒక బోర్వెల్ తవ్వి, మోటార్, పైపులు బిగించడానికి సుమారుగా రూ.రెండు లక్షలకు పైగానే ఖర్చు అవుతుంది. అయితే సోలార్ విద్యుత్ బోర్‌వెల్స్ ద్వారా రూ.55 వేలకే (మొత్తం రూ.3.5 లక్షలు, అందులో సబ్సిడీ రూ.2.95 లక్షలు) బోర్వెల్ (125 అడుగుల లోతు) తవ్వుతున్నారు. బోర్వెల్ ఏర్పాటు ఇలా... ఈ బోర్‌వెల్స్ ఏర్పాటు ఏపీఈపీడీసీఎల్ ద్వారానే జరుగుతుందని అన్నవరం ట్రాన్స్‌కో ఏఈ డీవీ రమణమూర్తి తెలిపారు. అయితే రైతులు తమ భూముల్లో సోలా ర్ విద్యుత్ బోర్‌వెల్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో శుక్రవారం ఆయన సాక్షికి వివరిం చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. బోర్వెల్ తవ్వే భూమిలో భూగర్భజలాలు 125 అడుగుల లోతులో ఉందని భూగర్భజల విభాగం (గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్) సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికెట్‌ను జత చేసి బోర్వెల్ తవ్వడానికి మండల తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దానికి ఆయన అనుమతివ్వాలి. తహసీల్దార్ ఇచ్చిన అనుమతుల సర్టిఫికెట్‌ను కాల్సెంటర్లో రూ.25 చెల్లించి రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ తరువాత ఆ వివరాలతో సంబంధిత విద్యుత్ సబ్‌స్టేçÙన్ ఏఈ వద్దకు వస్తుంది. ఏఈ దానిని పరిశీలించి ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేస్తారు. నెడ్‌క్యాప్ తరఫున నియమించిన ఏజెన్సీ ప్రతినిధులు ఆ స్థలాన్ని పరిశీలించి అనుమతులిస్తే ట్రాన్స్‌కో అధికారులే బోర్వెల్ తవ్వించి, సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి మోటార్ బిగిస్తారు. ఆ ప్యానల్స్ సోలార్ ఎనర్జీని చార్జ్ చేస్తాయి. దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను మోటార్‌కు కనెక్ట్ చేస్తారు. సోలార్ ప్యానెల్స్‌లో చార్జ్ అయ్యే విద్యుత్ ద్వారా రోజుకు కనీసం ఎనిమిది గంటలు మోటార్ తిరుగుతుంది. రూ.55వేలు మాత్రమే.. సోలార్ బోర్వెల్ కోసం రైతు కేవలం రూ.55 వేలు మాత్రమే ఖర్చు చేస్తే సరిపోతుందని ట్రాన్స్‌కో ఏఈ డీవీ తెలిపారు. రూ.2.95లక్షలు సబ్సిడీగా ప్రభుత్వం భరింస్తుందని తెలిపారు. భూమిలోకి వెళ్లే పైపులు 25 సంవత్సరాలు, మోటార్ ఒక ఏడాది వారంటీ ఉంటుంది. ఆ తరువాత మరమ్మతులు వస్తే బాగుజేయడానికి నగ దు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అన్నవరం దేవస్థానం భూములతోపాటు అన్నవరం చుట్టుపక్కల గ్రామాల్లో మరో ఏడు సోలార్ ఎనర్జీ బోర్‌వెల్స్ ఏర్పాటు చే స్తున్నట్టు ఆయన తెలిపారు. -
అంతర పంటలతో అధిక ఆదాయం
అమలాపురం ఉద్యానశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ ఆత్రేయపురం : అంతర పంటల ద్వారా రైతులు అధిక ఆదాయాలు పొందవచ్చునని అమలాపురం ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన శుక్రవారం ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో అంతర పంటలను పరిశీలించారు. ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొబ్బరి తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నందున అందులో అంతర పంటగా కోకో, పసుపు, ఆరటి, పూలు, పండ్ల మొక్కలను వేసుకోవడం ద్వారా అధిక అదాయాలు పొందవచ్చున్నారు. కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం మండలాల్లో వేలాది ఎకరాల్లో కొబ్బరిలో కోకో పంట సాగు ద్వారా లాభాలు అర్జిస్తున్నట్టు తెలిపారు. పంటలో సాగు యాజమాన్యం, చీడపీడల నివారణ, ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం, కొమ్ము కత్తిరింపులు, కోత అనంతరం చర్యలు, గింజలు పులియబెట్టే పద్ధతులు, ఎండబెట్టే విధానం, కాయలపై మచ్చలు తెగులు, ఇతర వ్యాధులు వ్యాపించడం తదితర విషయాలపై ఆయన రైతులకు అవగాహన కల్పించారు. ఈ పంటలో ఉడతలు, ఎలుకలు, గొంగళిపురుగుల నివారణకు పురుగు మందులు ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి వేసుకోవాలన్నారు. యూరియా, సూపర్, పొటాష్ సమపాళ్లల్లో కలిపి ప్రతి మొక్కకు 200 నుంచి 300 గ్రాములు అందించాలని సూచించారు. లీటరు నీటిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు కలిపి మొక్కలకు పిచికారీ చేయాలి. అనంతరం ఆయన అంంకపాలెంలో రైతులకు ఎరువులు పురుగు మందులు, కట్టర్స్ ఉచితంగా పంపీణీ చేశారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి బబిత, సర్పంచ్ కరుటూరి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
92 మిశ్రమ, సుస్థిర వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటు
పోతవరం (పి.గన్నవరం) : జిల్లాలో 92 మిశ్రమ, సుస్థిర వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుతున్నట్టు ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.పద్మజ వెల్లడించారు. ఇప్పటికే 66 క్షేత్రాలు ప్రారంభం కాగా, మరో 26 యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వరి చేనులో చేపల పెంపకానికి సంబంధించిన మిశ్రమ వ్యవసాయ క్షేత్రాన్ని పోతవరంలో శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ప్రతి అంగుళం భూమినీ రైతులు సద్వినియోగం చేసుకుంటూ మిశ్రమ పంటలతో అదనపు ఆదాయం పొందాలని సూచించారు. ఇందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోందని వివరించారు. మిశ్రమ వ్యవసాయ విధానంలో.. ఎకరం చేను చుట్టూ మూడడుగుల లోతున కందకం తవ్వి, దానిలో చేపలు పెంచడం, చేను మధ్యలో వరి, గట్లపై కూరగాయలు పండిస్తారని చెప్పారు. ఇందుకుగానూ ఒక్కో క్షేత్రానికి రూ.25 వేల రాయితీ ఇస్తున్నారన్నారు. సుస్థిర వ్యవసాయ క్షేత్రంలో.. వరి చేనులో ఒకవైపు చిన్న చెరువు తవ్వడం, గట్లపై కూరగాయలు, అపరాలు పండించడం, పశువులను, కోళ్లను పెంచడం చేపట్టాలని పద్మజ వివరించారు. ఈవిధమైన వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకునే రైతులకు రూ.20 వేల రాయితీ ఇస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 46 మిశ్రమ వ్యవసాయ క్షేత్రాలు ప్రారంభం కాగా మరో 18 యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అలాగే, 20 సుస్థిర వ్యవసాయ క్షేత్రాలు ప్రారంభం కాగా, మరో 8 మంది రైతులకు వీటిని మంజూరు చేస్తామని చెప్పారు. తక్కువ నీటితో పంటలు పండించాలన్న లక్ష్యంతో రైతులకు అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద జిల్లాకు రూ.25 లక్షలు మంజూరైనట్టు ఆమె చెప్పారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ, పంటలు పండించడంపై అధ్యయనం చేసేందుకు జిల్లాలో రెండు విడతలుగా మొత్తం 70 మంది రైతులను మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు పంపుతున్నట్టు పద్మజ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ జె.ఎలియాజర్, ఏఓ సీహెచ్‌డీ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలస్యంగా ఖరీఫ్
-
మడిలో.. తడబడుతూ..
ముందుకు సాగని ఖరీఫ్ గోదావరిలో నీరున్నా డెల్టా, పుష్కరలో ముందుకు సాగని సాగు ఏలేరు, పంపాలో కానరాని జలకళ కీలక సమయంలో కానరాని వరుణుడి కరుణ జూన్‌లో రెట్టింపు.. జూలైలో సగమే వర్షపాతం చుక్క నీరు లేక ఏలేరు ప్రాజెక్టు ఆయకట్టులో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. భూపతిపాలెం రిజర్వాయర్‌లో నీరున్నా.. ఆగస్టు ఒకటిన కానీ విడుదల చేసే అవకాశం లేదు. గోదావరిలో వేలాది క్యూసెక్కుల నీరు వథా పోతున్నా మంత్రిగారు రావాలంటూ పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల చేయడంలేదు. ఈ కారణంగా మెట్ట, ఏజెన్సీల్లో సాగు ముందుకు సాగడం లేదు. మూడు నాలుగు రోజుల ముందు వరకూ ఈ నెలలో జిల్లాలో పెద్దగా వర్షాలు లేవు. అయినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలతో గోదావరిలో వరద పోటెత్తింది. అయితే, అదే గోదావరి డెల్టాలో మొత్తం 40 శాతం కూడా ఖరీఫ్ వరి నాట్లు పడలేదు. తూర్పు డెల్టాలో ఖరీఫ్ కొంత ఆశాజనకంగా ఉన్నా.. మధ్య డెల్టాలో మాత్రం ముంపు భయంతో సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు సాగుకు దూరమయ్యారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ముందే చెప్పింది. ఇది నిజమేనన్నట్టు కాస్త ఆలస్యంగా వచ్చినా నైరుతి ప్రభావంతో జూన్ నెలలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. కీలకమైన జూలై నెలలో వరుణుడు ముఖం చాటేయడంతో.. తొలకరి సాగుకు సమాయత్తమైన రైతులు.. సాగు ముందుకు సాగుతుందో లేదోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం : నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తన ద్రోణి పుణ్యమా అని జిల్లాలో జూన్ నెలలో భారీ వర్షాలు కురిశాయి. రైతులు తొలకరిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అనావృష్టితో రెండేళ్లపాటు అష్టకష్టాలు పడ్డ మెట్ట, ఏజెన్సీ రైతులు.. ఈ ఏడాది మంచి దిగుబడి సాధించాలని ఆశించారు. కానీ అవసరమైన సమయంలో కరుణ చూపని వరుణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు. జూన్‌లో రెట్టింపు కురిసి.. తొలకరిపై రైతుల్లో ఆశలు రేపిన వర్షం.. జూలైలో మాత్రం కురవాల్సినదానిలో సగం కూడా పడలేదు. జూలై ఒకటి నుంచి 23వ తేదీ (శనివారం) వరకూ సగటున 177.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ 103.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఏజెన్సీలోని చింతూరులో సాధారణంకంటే 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగా నమోదు కాగా.. మిగిలిన ఏజెన్సీ, మెట్ట మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షం లేదు. మెట్టలోని తొండంగి, గొల్లప్రోలు, శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, గోకవరం, రంగంపేట మండలాల్లో సగం వర్షం లోటే. ఈ నేపథ్యంలో జిల్లాలో సాగు ఒడుదొడుకులకు లోనవుతోంది. జిల్లాలో ప్రధాన పంటయిన వరి సాగు లక్ష్యం 5.69 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకూ 1.76 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. మరోపక్క ఖరీఫ్‌లో జిల్లా రైతులు సాగు చేసే చిరుధాన్యాలు, అపరాలు, పత్తి, చెరకు పంటల సాగు సైతం ఇంకా 30 శాతం కూడా మించలేదు. సాగులో జరుగుతున్న ఈ అసాధారణ జాప్యంవల్ల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో కురిసే వర్షాలకు నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి డెల్టా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుత పరిస్థితి : తూర్పు డెల్టాకు నీటి విడుదల : 4,100 క్యూసెక్కులు మధ్య డెల్టాకు : 2,000 క్యూసెక్కులు పశ్చిమ డెల్టాకు : 6,500 క్యూసెక్కులు సముద్రంలోకి : 1,57,711 క్యూసెక్కులు ఇన్ ఫ్లో : 1,69,848 క్యూసెక్కులు పాండ్ లెవెల్ : 13.81 మీటర్లు మొత్తం ఆయకట్టు : 10.16 లక్షల ఎకరాలు జిల్లాలో ఆయకట్టు : 5 లక్షలు ఎకరాలు తూర్పు డెల్టాలో నాట్లు జోరుగా పడుతున్నాయి. ఇక్కడ 70 శాతం నాట్లు పడ్డాయి. వెదజల్లు సాగు ఎక్కువగా జరుగుతోంది. రామచంద్రపురం, అనపర్తి, ఆలమూరు, రాజమహేంద్రవరం వ్యవసాయ సబ్ డివిజన్లలో సాగు జోరుగా సాగుతోంది. కాకినాడ, కరప సబ్ డివిజన్లలో కాస్త ఆలస్యమైంది. మధ్య డెల్టాలో సాగు పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ కొత్తపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం, అమలాపురం సబ్ డివిజన్లలో 20 శాతం కూడా నాట్లు పడలేదు. ముంపునకు భయపడి ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం, సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు మండలాల్లోని సుమారు 30 వేల ఎకరాల్లో సాగు జరిగే పరిస్థితి లేదు. మిగిలినచోట్ల కూడా సాగు ఆలస్యమయ్యే అవకాశముంది. ఆగస్టు 15 వరకూ నాట్లు పడనున్నాయి. పిఠాపురం బ్రాంచ్ కెనాల్(పీబీసీ)లో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గోదావరిలో వరద పోటు ఉన్నా పీబీసీ శివారుకు సాగునీరందడం లేదు. 41,700 ఆయకట్టు ఉండగా, ఇప్పటివరకూ 100 ఎకరాల్లో కూడా నాట్లు పడలేదు. కేవలం 25 వేల ఎకరాలకు సరిపడిన ఆకుమడి మాత్రమే వేశారు. ఏలేరు ప్రాజెక్టు ప్రాజెక్టు సామర్థ్యం : 24 టీఎంసీలు ప్రస్తుత నీటినిల్వ : 2.87 టీఎంసీలు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుత ఇన్‌ఫ్లో 350 క్యూసెక్కులు మాత్రమే. ఇలాగైతే జలాశయం నిండేదెప్పుడని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు పరిధిలో వాస్తవ ఆయకట్టు 53 వేల ఎకరాలు కాగా, సుమారు 67 వేల ఎకరాలు సాగవుతోందని అధికారుల అంచనా. ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలకు చెందిన రైతులు ఈ ఆయకట్టుపై ఆధారపడుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో కూడా సాగునీరు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. భూపతిపాలెం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం : 204 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం : 201.5 మీటర్లు ఈ ప్రాజెక్టు పరిధిలో వాస్తవ ఆయకట్టు 16 వేల ఎకరాలు. కానీ 11 వేల ఎకరాలకు మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. నీరు సమృద్ధిగా ఉన్నా ఆయకట్టుకు విడుదల చేయడం లేదు. 10 శాతం నారుమడులు పడగా, నాట్లు ఒక్క శాతం కూడా పడలేదు. తాండవ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం : 380 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 355 అడుగులు ఆయకట్టు : తూర్పు, విశాఖ జిల్లాల్లో కలిపి 51,234 ఎకరాలు జిల్లాలో ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టులో మాత్రమే ఖరీఫ్ సాగు ఆశాజనకంగా ఉంది. 90 శాతం నాట్లు పూర్తయ్యాయి. పంపా గరిష్ట నీటిమట్టం : 106 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 88 అడుగులు గత ఏడాది ఇదే సమయానికి : 92 అడుగులు ఆయకట్టు : 12,500 ఎకరాలు పంపా దిగువన ఇప్పటివరకూ 200 ఎకరాల్లో నారుమడులు వేశారు. అది కూడా బోర్లు ఉన్న రైతులు మాత్రమే వేశారు. కొన్ని ప్రాంతాల్లో ఆకుమడులు ఎండిపోయాయి కూడా. ఆగస్ట్‌లో పుష్కర ఎత్తిపోతల నుంచి పంపాకు నీరు వస్తే తప్ప ఖరీఫ్ సాగయ్యే పరిస్థితి లేదు. పుష్కర ఎత్తిపోతలు సామర్థ్యం : 1,400 క్యూసెక్కులు ప్రస్తుత తోడకం : లేదు. ఈ పథకంపై 1.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. రాజానగరం, జగ్గంపేట, ఏలేశ్వరం, తుని నియోజకవర్గాల పరిధిలో ఈ పథకం ద్వారా సాగు జరగాల్సి ఉంది. పంపా ఆయకట్టుకు కూడా దీనినుంచే సాగునీరు అందాలి. గోదావరికి వరదలు వచ్చి వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథా పోతున్నా ఆయకట్టుకు మాత్రం నీరు విడుదల చేయడం లేదు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వచ్చి మోటార్ స్విచ్ వేయాలని చెబుతూ అధికారులు ఇప్పటివరకూ సాగునీరు సరఫరా చేయకపోవడం విడ్డూరం. పంటలవారీగా సాగు వివరాలు (ఎకరాల్లో) పంట లక్ష్యం ఎంత సాగు శాతం వరి 5.69 లక్షలు 1.76 లక్షలు 31 చిరుధాన్యాలు 3,675 466 13 అపరాలు 9,781 3,276 33 నూనెగింజలు 793.6 1,683 200 పత్తి 53,701 16,978 32 చెరకు 31,959 6,133 19 -
అదును తప్పుతోంది!
వరుణుడు పలకరిస్తున్నా నిండని ‘ఏలేరు’ పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు ప్రస్తుత నీటినిల్వలు 2.87 టీఎంసీలే 53 వేల ఎకరాల్లో సాగుపై సందిగ్ధత నాట్లు వేసేందుకు దగ్గర పడుతున్న సమయం ఆందోళన చెందుతున్న రైతులు జగ్గంపేట : తొలకరి చినుకులు పలకరించడంతో ఏరువాక చేపట్టిన ‘ఏలేరు’ రైతన్న.. నాట్లు వేయాలో లేదో అర్థంకాని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. జలాశయంలో చాలినన్ని నీటినిల్వలు లేకపోవడమే ఇందుకు కారణం. ఖరీఫ్‌నాటికి జలకళతో కళకళలాడాల్సిన ఏలేరు జలాశయంలో ప్రస్తుతం 2.87 టీఎంసీల నీటినిల్వలు మాత్రమే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నా.. ఏలేరు క్యాచ్మెంట్ ఏరియాలో వరుణుడి కరుణ అంతగా కానరావడంలేదు. దీంతో రోజుకు సరాసరి 350 క్యూసెక్కుల వరకూ మాత్రమే ఇ¯Œæఫ్లో ఉంటోంది. మరోపక్క ఖరీఫ్‌కు అదును దాటుతూండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నారుమడులు వేసుకుని, నాట్లు వేసేందుకు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఏలేరు జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు. దీనికింద 67 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా వాస్తవానికి 53 వేల ఎకరాలే సాగవుతోంది. ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకర్గాల పరిధిలోని ఏడు మండలాల రైతులు ఏలేరు ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఖరీఫ్‌తో పాటు రబీ కూడా సాగు చేసే ఏలేరు రైతులు ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన చెందుతున్నారు. నెలాఖరులోగా నాట్లు వేస్తే దిగుబడి బాగుంటుందని, ఆలస్యమైతే దిగుబడి తగ్గి నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. దమ్ములు చేపట్టలేదు ఏలేరు ఆయకట్టు కింద ఖరీఫ్ దమ్ములు చేపట్టలేదు. నాట్లు ఆలస్యమవుతున్నాయి. అధికారులు స్పందించి వెంటనే నీరు విడుదల చేయాలి. కొటారి సూరిబాబు, రైతు, కిర్లంపూడి నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి ఏలేరును ఆధునికీకరించి ఉంటే ప్రాజెక్టులో నీరు ఉండేది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఏలేరుకు ఈ దుస్థితి ఏర్పడింది. వెంటే ఆధునికీకరించి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరివ్వాలి. చిక్కాల చిన్న, రైతు, కిర్లంపూడి నాట్లకు నీరివ్వాలి అదును తప్పుతున్నందున ఏలేరు కింద నాట్లు వేసుకునేందుకు వెంటనే నీరు విడుదల చేయాలి. నీరు ఆలస్యమైతే సాగుపై ప్రభాపం చూపి నష్టపోతాం. దోమాల వెంకన్న, రైతు, వేలంక