ఉన్నది చెబితే... ఉలుకెందుకప్పా...! | sagu water problems issue | Sakshi
Sakshi News home page

ఉన్నది చెబితే... ఉలుకెందుకప్పా...!

Published Tue, Jun 20 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM

sagu water problems issue

  • - ఇప్పటికీ పొలాలకు చేరని సాగునీరు
  • - రెండువారాలైనా సాగు ప్రశ్నార్థకమే
  •  - ‘సాక్షి’ గ్రౌండ్‌ విజిట్‌లో వెల్లడైన వాస్తవాలు
  • - ఈ నెల 17న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో ఉలిక్కిపడిన ఉప ముఖ్యమంత్రి రాజప్ప
  • - ఈ నెల 18న విలేకర్ల సమావేశంలో ‘సాగునీటికెక్కడా ఇబ్బందుల్లేవం’టూ వెల్లడి
  • - ఇప్పుడేమంటారంటూ రైతుల తరుఫున మరోసారి ‘సాక్షి’ నిలదీత.
  • - 18వ తేదీ 10వ పేజీలో చినరాజప్ప విలేకర్ల సమావేశం క్లిప్పింగ్‌లు వాడుకుందాం. 

    .
    చిన రాజప్ప... రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి... అంతకు మించి జిల్లాకు ప్రాతినిధ్యం వహించే ముఖ్య నేత. ఓ నియోజకవర్గానికి శాసన సభ్యుడు. అలాంటి వ్యక్తి జనం పక్షపాతిగా ఉండాలి. తన పార్టీని ...తన ప్రభుత్వాన్ని సమర్థించుకోడంలో తప్పులేదు. రోమ్‌ నగరం తగలబడుతుంటే పిడేలు వాయించుకునే ఆ రాజుతో పోల్చితే ఈయన మరింత ఘోరంగా ప్రవర్తిస్తున్నారని జిల్లా​ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా నీళ్లిస్తే డెల్టా భూముల్లో పంట పండించుకోవచ్చునని పోరాటం చేసి సాధించుకున్న హక్కును కాలరాస్తుండడంతో పలు ప్రాంతాల్లో రొడ్డెక్కి నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ రైతుల పక్షపాతిగా వరుస కథనాలను ప్రచురించడంతో వాస్తవాన్ని జీర్ణించుకోలేని రాజప్ప విలేకర్ల సమావేశంలోనే ‘అంతటికీ సాగు నీరు అందిస్తున్నట్టు’ అబద్దాలు చెబుతూ తప్పుడు రాతలు రాస్తున్నారని చిందులు తొక్కారు. అదంతా వాస్తవం కాదంటూ ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కారు. ఆయన మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోడానికి  ‘సాక్షి’ మళ్లీ మరిన్ని వివరాల సేకరణకు దిగింది. ఇదీ వాస్తవమంటూ స‘చిత్రా’లతో పాఠకుల ముందించింది. 
    .
    + చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలోని ఏలేరు, పీబీసీ కాలువల పరిధిలో ఆయకట్టుకు ఇప్పటికీ సాగునీరందడం లేదు. దీంతో వేలాది ఎకరాల ఆయకట్టుకు ఇప్పటికీ సాగునీరు చేరలేదు. చినరాజప్ప సొంత నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం వాడపర్రు పంటకాలువదీ ఇదే దుస్థితి. 
    +  పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి మండలాల పరిధిలో పిఠాపురం బ్రాంచి కెనాల్‌ పరిధిలో 47వేల ఎకరాల ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది.
    + ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండల కేశనకుర్రు– తిళ్లకుప్ప పంట కాలువ మధ్య సాగునీరందక  ఏడెనిమిది వేల ఎకరాల్లో సాగు నిలిచిపోయింది. 
    + ఐ.పోలవరం మండలం మురమళ్ల–గుత్తెనదీవి పంటకాలువకు కూడా సాగునీరు విడుదలకాలేదు. ఏడువేల ఎకరాలు సాగు ప్రశ్నార్థకంగా మారింది. 
    - పోలేకుర్రు నీటి సంఘం పరిధిలోని తాళ్లరేవు–గాడిమొగ పంట కాలువకు సోమవారం నాటికి కూడా సాగునీరు విడుదల చేయలేదు.  తాళ్లరేవుకు చెందిన ద్వితీయశ్రేణి టీడీపీ నాయకుడు వాల్‌ నిర్మాణం చేపట్టడంతో సాగునీరు ఆపేశారు. సఖినేటిపల్లి మండలంలో యలంకాయల కాలువకు ఇంకా సాగునీరు విడుదల కాలేదు.
    - పి. గన్నవరం ఆయకట్టుకు నేటికీ నీరు లేక సాగు ప్రశ్నార్థకంగా మారింది. వ్యవసాయ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
    -  కాట్రేనికోన మండలం లక్ష్మీవాడ–సన్నవిల్లి మధ్య రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణాలతో నీటి విడుదలకాక లక్ష్మీవాడ, సన్నవిల్లి, గొల్లవిల్లి, వాడపర్రు, అమ్మనఅగ్రహరం, కూనవరం వరకు సుమారు ఐదువేల ఎకరాల్లో ఆయకట్టులో సాగు నిలిచిపోయింది.      
    .
    సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు జిల్లాలో రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. వారి నిర్వాకంతో రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతుల కంట కన్నీళ్లు పెట్టే పరిస్థితిలోకి నెట్టేశారు. ప్రతి ఎకరాకు సాగునీరందించేశామని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఘనంగా ప్రకటిస్తున్నారు. అందుకే నియోజకవర్గాల్లో ఏరువాక కూడా మొదలు పెట్టామంటున్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పయితే మరో అడుగు ముందుకేసి గత ప్రభుత్వాలకు భిన్నంగా వారం రోజులు ముందుగానే సాగునీరు విడుదల చేసిన ఘనత తమదేనని ఢంకా బజాయించి మరీ చెబుతూ వస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే అంత నమ్మసక్యంగా కనిపించడం లేదు. పంట పొలాలకు నీరందక రైతులు ఎదుర్కొంటున్న సాగు కష్టాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప రైతులకు ఇబ్బంది లేకుండా వారం కిందటే సాగునీరు విడుదల చేసినా అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ‘సాక్షి’పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోనీ హోం మంత్రి చినరాజప్ప చెప్పినట్టే ప్రతి ఎకరాకు సాగునీరు అందిందా అంటే అదీ లేదు. 
    .
    జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రెండు లక్షల 36 వేల హెక్టార్లలో సాగు కోసం జిల్లా వ్యవసాయ శాఖ కార్యచరణ ప్రణాళికæ సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా రైతులు కూడా సాగుకు సన్నద్ధమయ్యారు. ఒకపక్క ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా రుణాలు రాక పెట్టుబడి కోసం రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పోనీ ఎక్కడో ఓ చోట ప్రైవేటుగానైనా పెట్టుబడులు తెచ్చుకుందామని సిద్ధమయ్యే రైతులకు నీరు అందక సాగుముందుకు సాగడం లేదు. సెంట్రల్, ఈస్ట్రన్‌ డెల్టాల పరిధిలోని పలు పంట కాలువల్లో క్లోజర్‌ పనుల కోసం ఇప్పటికీ సాగునీరు ఆపేశారు. దాదాపు ఆ పనులన్నీ అధికార పార్టీ నేతల బంధువులు లేదా, అనుచరులు చేస్తున్నవే. ఈ కారణంగానే సాగునీరును అర్థాంతరంగా అడ్డుకట్టలు వేసి మరీ దర్జాగా క్లోజర్‌ పనులు చేసుకుంటున్నారు. రైతులు ఎలాపోతే తమకేమిటి తమ పనులు పూర్తయ్యే వరకు వేచిచూడాల్సిందేనంటున్నారు. 
    .
    నీరిచ్చేశామని చెప్పిన మంత్రి మాటలపై
    సాక్షి సాక్ష్యాలతో...
    .
    పొలాలన్నింటికీ సాగునీరందించామని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెబుతున్న విషయంలో వాస్తవం ఎంత ఉందో తెలుసుకునేందుకు ‘సాక్షి’ బృందం సోమవారం కొన్ని ప్రాంతాల్లో పంట కాలువలను పరిశీలించింది. ఈ పరిశీలనలో చాలా పంట కాలువలకు ఇప్పటికీ సాగునీరందని విషయం వాస్తవమేనని తేలింది. 
    + చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గాన్నే తొలుత సందర్శించింది. ఈ నియోజకవర్గంలోని ఏలేరు, పీబీసీ కాలువల పరిధిలో ఆయకట్టుకు ఇప్పటికీ సాగునీరందని విషయం బయటపడింది. నవర, చంద్రంపాలెం గ్రామాల్లో వంతెనల నిర్మాణం కోసం కాలువకు అడ్డుకట్టలు వేసి నీరు నిలిపివేశారు. ఈ కారణంగా పెద్దాపురం, కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు ఇప్పటికీ సాగునీరు చేరలేదు. 
    + జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చిత్రాడలో వంతెన నిర్మాణం చేపడుతున్నారు. ఈ కారణంగా పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి మండలాల పరిధిలో పిఠాపురం బ్రాంచి కెనాల్‌ పరిధిలో 47వేల ఎకరాల ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది.
    + అటు కోనసీమలోని పలు పంటకాలువలకు ఇప్పటికీ సాగు నీరందని పరిస్థితే కనిపించింది. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండల కేశనకుర్రు– తిళ్లకుప్ప పంట కాలువ మధ్య సాగునీరందక  ఏడెనిమిది వేల ఎకరాల్లో సాగు నిలిచిపోయింది. 
    + ఐ.పోలవరం మండలం మురమళ్ల–గుత్తెనదీవి పంటకాలువకు కూడా సాగునీరు విడుదలకాలేదు. ఫలితంగా  గుత్తెనదీవి, జీ వేమవరం, జి మూలపొలం, ఎదుర్లంక గ్రామాల పరిధిలో మరో ఏడువేల ఎకరాలు సాగు ప్రశ్నార్థకంగా మారింది. 
    - పోలేకుర్రు నీటి సంఘం పరిధిలోని తాళ్లరేవు–గాడిమొగ పంట కాలువకు సోమవారం నాటికి కూడా సాగునీరు విడుదల చేయలేదు. పోలేకుర్రు డివైడింగ్‌ డ్యామ్‌ వద్ద రిటైనింగ్‌ వాల్‌ అవసరం ఉంది. కానీ అక్కడ నిర్మించకుండా బాబానగర్‌ రహదారిలో తాళ్లరేవుకు చెందిన ద్వితీయశ్రేణి టీడీపీ నాయకుడు వాల్‌ నిర్మాణం చేపట్టడంతో సాగునీరు ఆపేశారు. 
    - మల్లవరం, బాబానగర్, తాళ్లరేవు, గాడిమొగ తదితర ప్రాంతాల ఆయకట్టులో సాగు నిలిచిపోవడంతో రైతులు ఆదివారం ఎదురుతిరిగితే పనులు ఆపేశారు. రైతులు వెళ్ల్లగానే తిరిగి పనులు మొదలుపెట్టేశారు. రాజోలు దీవిలో కూడా పలు ప్రాంతాలకు సాగునీరంద లేదు. 
    - సఖినేటిపల్లి మండలంలో యలంకాయల కాలువకు ఇంకా సాగునీరు విడుదల కాలేదు. కాలువకు ఇరువైపులా రివిట్‌మెంట్‌ పనులు చేస్తున్నారు. 
    - పి. గన్నవరం పంట కాలువకు నీరిచ్చినా ఈ పంట కాలువకు నీరు నిలిపి వేశారు. ఫలితంగా ఈ కాలువపై ఆయకట్టుకు నేటికీ నీరు లేక సాగు ప్రశ్నార్థకంగా మారింది. శేషారాయుడు కాలువ, అప్పన రామునిలంక తదితర పంట కాలువలకు కూడా ఇంకా నీరు ఇవ్వ లేదు.వ్యవసాయ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
      - చినరాజప్ప సొంత నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం వాడపర్రు పంటకాలువకు కూడా ఇప్పటికీ సాగునీరు విడుదల చేయలేదు.
    -  కాట్రేనికోన మండలం లక్ష్మీవాడ–సన్నవిల్లి మధ్య రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణాలతో నీటి విడుదలకాక లక్ష్మీవాడ, సన్నవిల్లి, గొల్లవిల్లి, వాడపర్రు, అమ్మనఅగ్రహరం, కూనవరం వరకు సుమారు ఐదువేల ఎకరాల్లో ఆయకట్టులో సాగు నిలిచిపోయింది.  క్షేత్రస్థాయిలో సాగునీటి సరఫరా వాస్తవం ఇలా ఉండగా మంత్రి చినరాజప్ప, ఆ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం వారం ముందుగానే సాగునీరు ఇచ్చేశామని గొప్పలు చెప్పుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. నీటిపారుశాఖాధికారులు మంత్రుల మెప్పుకోసం వాస్తవాలను తొక్కిపెడుతున్నారా లేక, అన్నీ తెలిసినా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు అసత్యాలు పలుకుతున్నారా అనేది వారికే తెలియాలి.
    .
    నీరు లేక నారుమడులు వేయలేదు
    సాగు నీరు అందక నారుమడులు వేసుకోలేదు. అన్ని కాలువలకు నీరు అందించామని ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరం. కేశనకుర్రు–తిళ్లకుప్ప పంటకాలువకు నీరు నేటికి ఇవ్వలేదు. ఒకటో తేదీనే ఇచ్చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతులకు నీరందించడంలో చిత్తశుద్ధి లేదు. పంట కాలువ నీరు నిలుపుదల చేసి రెండు వారాలైనా ఇప్పటికీ నీరు ఇవ్వ లేదు. నాకు పదెకరాలు పంట భూమి ఉంది. నీరు వచ్చి ఉంటే  నారుమడులు వేసుకునే వాళ్లం. వారం రోజులపాటు నీరు వచ్చేలా కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు కార్యాలయాల్లో కూర్చుని మాట్లాడటం కాదు. పొలాలకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement