- అన్నవరం దేవస్థానం భూముల్లో మూడు బోర్లు ఏర్పాటు
- సబ్సిడీపై అందిస్తున్నట్రాన్స్‌కో
వ్యవసాయ బోర్లకు సోలార్ ఎనర్జీ
Published Fri, Oct 14 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
అన్నవరం :
‘సోలార్ ’ విద్యుత్ కేవలం వెలుగులకే కాదు, భూగర్భంలో నీటిని అందించేందుకూ ఉపయోగపడుతుంది. అన్నవరం దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్‌తో నడిచే మూడు బోర్లను ఏర్పాటు చేసి, ఆ నీటితో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. ఈ సోలార్ మోటార్లను అన్నవరంలోని ఈరంకి వారి స్థలంలోను, రైల్వేస్టేçÙన్ వెనుక గల స్థలంలో రెండు ఏర్పాటు చేశారు. మరో మూడు బోర్‌వెల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. ఐదు హెచ్‌పీ సామర్థ్యం గల ఒక బోర్‌వెల్ తవ్వి, మోటార్, పైపులు బిగించడానికి సుమారుగా రూ.రెండు లక్షలకు పైగానే ఖర్చు అవుతుంది. అయితే సోలార్ విద్యుత్ బోర్‌వెల్స్ ద్వారా రూ.55 వేలకే (మొత్తం రూ.3.5 లక్షలు, అందులో సబ్సిడీ రూ.2.95 లక్షలు) బోర్‌వెల్ (125 అడుగుల లోతు) తవ్వుతున్నారు.
బోర్‌వెల్ ఏర్పాటు ఇలా...
ఈ బోర్‌వెల్స్ ఏర్పాటు ఏపీఈపీడీసీఎల్ ద్వారానే జరుగుతుందని అన్నవరం ట్రాన్స్‌కో ఏఈ డీవీ రమణమూర్తి తెలిపారు. అయితే రైతులు తమ భూముల్లో సోలా ర్ విద్యుత్ బోర్‌వెల్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో శుక్రవారం ఆయన సాక్షికి వివరిం చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
బోర్‌వెల్ తవ్వే భూమిలో భూగర్భజలాలు 125 అడుగుల లోతులో ఉందని భూగర్భజల విభాగం (గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్) సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికెట్‌ను జత చేసి బోర్‌వెల్ తవ్వడానికి మండల తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దానికి ఆయన అనుమతివ్వాలి. తహసీల్దార్ ఇచ్చిన అనుమతుల సర్టిఫికెట్‌ను కాల్‌సెంటర్‌లో రూ.25 చెల్లించి రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ తరువాత ఆ వివరాలతో సంబంధిత విద్యుత్ సబ్‌స్టేçÙన్ ఏఈ వద్దకు వస్తుంది. ఏఈ దానిని పరిశీలించి ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేస్తారు. నెడ్‌క్యాప్ తరఫున నియమించిన ఏజెన్సీ ప్రతినిధులు ఆ స్థలాన్ని పరిశీలించి అనుమతులిస్తే ట్రాన్స్‌కో అధికారులే బోర్‌వెల్ తవ్వించి, సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి మోటార్ బిగిస్తారు. ఆ ప్యానల్స్ సోలార్ ఎనర్జీని చార్జ్ చేస్తాయి. దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను మోటార్‌కు కనెక్ట్ చేస్తారు. సోలార్ ప్యానెల్స్‌లో చార్జ్ అయ్యే విద్యుత్ ద్వారా రోజుకు కనీసం ఎనిమిది గంటలు మోటార్ తిరుగుతుంది.
రూ.55వేలు మాత్రమే..
సోలార్ బోర్‌వెల్ కోసం రైతు కేవలం రూ.55 వేలు మాత్రమే ఖర్చు చేస్తే సరిపోతుందని ట్రాన్స్‌కో ఏఈ డీవీ తెలిపారు. రూ.2.95లక్షలు సబ్సిడీగా ప్రభుత్వం భరింస్తుందని తెలిపారు. భూమిలోకి వెళ్లే పైపులు 25 సంవత్సరాలు, మోటార్ ఒక ఏడాది వారంటీ ఉంటుంది. ఆ తరువాత మరమ్మతులు వస్తే బాగుజేయడానికి నగ దు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అన్నవరం దేవస్థానం భూములతోపాటు అన్నవరం చుట్టుపక్కల గ్రామాల్లో మరో ఏడు సోలార్ ఎనర్జీ బోర్‌వెల్స్ ఏర్పాటు చే స్తున్నట్టు ఆయన తెలిపారు.
Advertisement
Advertisement