ఉద్యాన పంటలకు విరివిగా రాయితీలు
- ఉద్యాన రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు
- రాయదుర్గం ఉద్యానశాఖ అధికారి నెట్టికంఠయ్య
గుమ్మఘట్ట: ఉద్యాన పంటల సాగు వైపు రైతులను మళ్లించేందుకు పలు రకాల రాయితీలను అందుబాటులోకి తెచ్చినట్లు రాయదుర్గం ఉద్యానశాఖ అధికారి నెట్టికంఠయ్య తెలిపారు. రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ సబ్సిడీ పథకాలను అర్హులైన ప్రతి రైతూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేలైన విత్తనంతో పెంచిన మొక్కలను కొనుగోలు చేసేలా రైతులను చైతన్య పరుస్తున్నామని ఆయన తెలిపారు. ఎదుగుదల ఉన్న మొక్కను నాటడం వల్ల అధిక దిగుబడి సాధించేందుకు రైతులకు వెసులుబాటు కలుగుతుందన్నారు. అదేవిధంగా చీడపీడల బాధ కూడా తక్కువగా ఉంటుందన్నారు. రాయదుర్గం పరిసర ప్రాంతాల ఐదు మండలాల్లో సపోట, మామిడి, అంజూర, దానిమ్మ, జామ పంటలకు నేలలు అనువైనవని చెప్పారు. రైతుకు ఇష్టమైన క్షేత్రంలో మొక్కలను కొనుగోలు చేస్తే పరిశీలించి సబ్సిడీలు మంజూరు చేస్తామన్నారు.
రైతులకు ప్రోత్సాహకం :
ఉద్యాన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు రకాల రాయతీలు అందిస్తోందని నెట్టికంఠయ్య పేర్కొన్నారు. వీటిని రైతుల సద్వినియోగం చేసుకుంటే రైతులు లాభాలు గడించొచ్చన్నారు. ముఖ్యంగా మేలైన విత్తనాలతో పెంచిన మొక్కలను మాత్రమే రైతులు కొనుగోలు చేసేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. వాటిని నాటుకొని సంరక్షించే క్రమంలో తెగుళ్ల నివారణకు రాయితీపై మందులు ఇస్తామన్నారు. సాగు వివరాలతో ముందుకొచ్చే రైతులకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు.
రాయితీల వివరాలు ఇలా.. : మామిడి మొక్కకు రూ.10, జీడి మామిడి మొక్కకు రూ. 8 రాయితీగా అందిస్తారు.
చీడపీడల నివారణ పథకం : పంటల్లో సమగ్ర చీడపీడల నివారణకు 30 శాతం సబ్సిడీ పై అవసరమైన పురుగు మందులు (హెక్టారుకు రూ. 5 వేలకు మించకుండా) ఇస్తారు.
పూల తోటలకు.. : హెక్టారుకు రూ. 16 వేలు మించకుండా 40 శాతం రాయితీ, ఒక రైతుకు రెండు హెక్టార్ల వరకు అందిస్తారు.
పందిళ్ల పై సాగు.. : పందిళ్లు ఏర్పాటు చేసి కూరగాయాలు సాగుచేస్తే 50 శాతం రాయితీ. హెక్టారుకు గరిష్టంగా రూ. 2.50 లక్షలు. పందిళ్లు సాగు వల్ల నాణ్యమైన సరుకుతో పాటు దిగుబడులు 25 నుంచి 30 శాతం పెరుగుతాయి. సోర, కాకర, బీర, దొండ, పొట్ల కూరగాయాలను పందిళ్ల పై సాగు చేయవచ్చు.
ఆయిల్ పామ్‌సాగుకు : మొక్కలపై 80 శాతం రాయితీ. హెక్టారుకు రూ. 12 వేలు గరిష్ట సబ్సిడీ. సాగు ఖర్చుల నిమిత్తం ఏటా రూ.ఐదు వేలు. నాలుగేళ్ల వరకు సాగు ఖర్చులు అందిస్తారు. నాలుగేళ్ల వరకు ఆయిల్ పామ్‌లో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. దీని కోసం హెక్టారుకు రూ. 5 వేలకు మించకుండా 50 శాతం రాయితీ.
2017–18 ఏడాదికి సంబంధించిన పథకాలు :
పండ్ల తోటల విస్తీర్ణ పథకం : బొప్పాయి (30 హెక్టార్లు) ఒక హెక్టారుకు రూ.18,739 సబ్సిడీ ఉంటుంది. అరటి హెక్టారుకు రూ.30,734, దానిమ్మ కైతే 50 హెక్టార్లు. హెక్టారుకు రూ.16004 తో అందుతుంది.
రక్షిత సేద్యం : మల్చింగ్ 60 హెక్టార్లు, ఒక్కో హెక్టారుకు రూ. 16వేల సబ్సిడీ.
నీటి కుంటలు 20్ఠ20్ఠ3 ఎమ్. 20 ఎన్‌ఓ. ఒక్కో యూనిట్‌కు రూ. 75 వేల సబ్సిడీ.
ప్యాక్ హౌస్‌లు : 20 నెంబర్. ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షలు.
పారిహౌజ్‌లలో కూరగాయాల పెంపకం కోసం : 2000 ఎస్‌క్యూ2 లాంటివి అందుబాటులో ఉన్నాయన్నారు.