
అన్నదాత అభ్యున్నతికి కట్టుబడ్డాం: ప్రత్తిపాటి
అనంతపురం: వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. హార్టికల్చర్ ద్వారా వ్యవసాయ కుటుంబాలను ఆదుకుంటామన్నారు. రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడివుందని స్పష్టం చేశారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వ్యవసాయంపై విధానపత్రం తయారు చేశామని చెప్పారు. అనంతపురం జిల్లా గరుడాపురంలో 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.