పుణేలో శిక్షణ పొందిన ఉద్యాన అధికారులు
ఆధునిక టెక్నాలజీతో ఉద్యాన పంటల సాగుకు సన్నాహాలు
పంటల సాగుకు ప్రభుత్వం పెద్దపీట
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో గ్రీన్‌హౌస్ వ్యవసాయానికి కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ల్లో పంటల సాగుకు ప్రాధాన్యం ఇస్తుంది. ఆధునిక సాంకేతిక పరి/ా్ఞనంతో గ్రీన్‌హౌస్‌లను ఏర్పాటు చేసి వాటిలో ఉద్యాన పంటలను పండించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 5 జిల్లాలో గ్రీన్ హౌస్‌ల వ్యవసాయాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంతో పాటు పొరుగున ఉన్న బెంగళూరు, చెన్నై తదితర మహానగరాలు, పెద్ద నగరాలు, పట్టణాలకు కూరగాయలు, పూలు తదితర ఉద్యాన పంటలను సరఫరా చేరుుంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పద్ధతిలో రైతులు ఆధిక ఆదాయూన్ని గడించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ గ్రీన్‌హౌస్ సాగు విధానానికి ప్రాధాన్యం ఇస్తుంది.
ఒక్కో గ్రీన్ హౌస్‌కు రూ.11 నుంచి రూ. 15 లక్షల వెచ్చించి నిర్మింపజేయూలని ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. మొదటి విడతగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. రెండో విడత ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈ సాగు విధానాన్ని చేపట్టాలని రాష్ట్ర ఉద్యాన శాఖ నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గ్రీన్‌హౌస్ వ్యవసాయాన్ని రాష్ట్రంలో రైతులతో చేయించాలని ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న వర్షాభావ పరిస్థితులు, నీటి వనరులు, ఏటేటా పడిపోతున్న భూగర్భజలాలు తదితర కారణాలతో రైతులను ఆధునిక వ్యవసాయం వైపునకు మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉన్న వనరులను వినియోగించుకుంటూ మార్కెట్‌లో అవసరాలను దృష్టిలో పెట్టుకొని పంటలను సాగు చేస్తూ డిమాండ్ తగిన ధరలకు రైతులు అమ్ముకునే విధంగా సాగు పద్ధతులు తీసుకురావాలని ప్రభుత్వం గ్రీన్‌హౌస్ విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది.
ఈ వ్యవసాయంపై తొలుత ఉద్యాన అధికారులకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 జిల్లాలకు చెందిన 45 మంది ఉద్యాన అధికారులకు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోర్త్ హార్వెస్ట్ టెక్నాలజీస్ సంస్థ, మహాబలేశ్వరంలో శిక్షణ ఇప్పించారు. జిల్లా నుంచి ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు కె.సూర్యనారాయణ, కస్తూరి వెంకటేశ్వర్లు, ఉద్యాన అధికారులు ఉదయ్‌కుమార్(అశ్వారావుపేట), బి.వి.రమణ(కల్లూరు), భారతి(సత్తుపల్లి), సందీప్‌కుమార్ (ఇల్లెందు) శిక్షణ పొందారు. శిక్షణ గురించి ఉద్యాన అధికారి కె.సూర్యనారాయణ ‘సాక్షి’కి వివరించారు.
ఇక ‘గ్రీన్స్‌హౌస్’ సాగు
Published Wed, Feb 18 2015 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
Advertisement
Advertisement