Green House
-
రానున్నది ఉష్ణ ప్రకోపమే!
వాతావరణం, శీతోష్ణస్థితి గురించి లెక్కలు తీసి రికార్డుగా దాచి ఉంచడం మొదలుపెట్టి 170 సంవత్సరాలకు పైనే అయింది. ఈ మొత్తం కాలంలోనూ 2023వ సంవత్సరం అన్నిటికన్నా వేడి అయినదిగా నమోదవుతుంది అని పరి శోధకులు అప్పుడే చెప్పేస్తున్నారు. ఇటీ వలి కాలం ఇంత వేడిగా ఉండడా నికి మనుషుల కారణంగా మారుతున్న శీతోష్ణస్థితి మాత్రమే అని ఎటువంటి అనుమానం లేకుండా తేల్చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ స్పేస్ ప్రోగ్రావ్‌ు వారి ‘కోపర్ని కస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ వారి లెక్కల ప్రకారం, ఇంతకు ముందు ఎప్పుడూ వేసంగి ఇంత వేడిగా ఉన్నది లేదు. గతంలో కంటే ఈసారి ఉష్ణోగ్రత 0.32 డిగ్రీ సెల్సియస్ సగటున ఎక్కువగా ఉన్నట్టు లెక్క తేలింది. ప్రపంచం మొత్తం మీద మునుపెన్నడూ లేని మూడు వేడి దినాలు నమోదైనట్లు కూడా తెలిసింది. ఇప్పటికే ఈ ఏడాది వేసవికాలం మునుపెన్నడూ లేనంత వేడిగా ఉందని లెక్కతేల్చి పెట్టారు. 2023వ సంవత్సరంలో నెలల ప్రకారం లెక్కలు చూచినా... ప్రపంచమంతటా ఆరు మాసాలు అంతకు ముందు ఎన్నడూ లేని వేడి కనబరిచినట్టు ఇప్పటికే లెక్కలు వచ్చాయి. అంటార్కిటికాలో మంచు కూడా అంతకు ముందు ఎన్నడూ లేనంతగా కరిగిపోయినట్టు కూడా గమనించారు. ప్రపంచంలో పారిశ్రామికీకరణ కన్నా ముందు కూడా వాతా వరణంలోని వేడి గురించిన రికార్డులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు సగటున ప్రపంచం మొత్తం మీద 1.46 డిగ్రీల సెల్సియస్ వేడి పారిశ్రామికీకరణకు ముందున్న వేడి కన్నా ఎక్కువగా ఉంది. పరిశ్రమల వల్ల వాతావరణం వేడెక్కుతున్న దన్న భావన చాలాకాలంగా ప్రపంచంలో ఉండటం తెలిసిందే. 2016లో వేడిమి ఎక్కువగా ఉన్నట్టు ఇప్పటి వరకు ఉన్న రికార్డులు తెలుపుతున్నాయి. అయితే ఈ సంవత్సరం వేడి 2016లో కన్నా ఎక్కువగా ఉన్నట్టు నమోదయింది. ఈ ప్రకారంగా ఇప్పటి వరకు రికార్డులో ఉన్న సంవత్సరాల అన్నింటిలోకీ 2023 అత్యంత వేడిగా ఉన్నట్టు లెక్క తేలింది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ‘సీ త్రీ ఎస్’ సంస్థ పరిశోధకురాలు సమంతా బుర్జెస్ ఒక ప్రకటనలో బయటపెట్టారు. శరత్ కాలం కూడా వేడిగా ఉండడానికి ‘ఎల్ నినో’ కారణం అని ఇప్పటికే మనకంతా తెలుసు. ఎల్ నినో వల్ల భూమధ్య రేఖ వద్ద సముద్రాలలో ఉపరితలం నీరు వేడెక్కుతుంది. దాని వల్ల ప్రపంచంలోని గాలులు వేడవుతాయి. 2023 జూన్‌లోనే ఈ ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏడాది కూడా ఈ వేడి కొనసాగుతుందని అంటున్నారు. గడచిన మూడు సంవత్సరాల పాటుఎల్ నినోకు వ్యతిరేకంగా ఉండే ‘లా నినా’ అనే పరిస్థితి కారణంగా వేడిమి కొంతవరకు అదుపులో ఉంది. ఈ ‘లా నినా’ప్రస్తుతం లేదు. కనుక వేడిమి హద్దు లేకుండా పెరుగుతున్నది. మరికొంతమంది నిపుణులు టోంగాలో సముద్రం లోపల 2022లో పేలిన అగ్నిపర్వతం కారణంగా వేడి నీటి ఆవిరులు వాతావరణంలో పెరిగాయనీ, ఈ సంవత్సరం వేడి పెరుగుదలకు అది కూడా కొంతవరకు కారణం కావచ్చుననీ అంటున్నారు. అయితే పరి శోధకులు మాత్రం ఈ విషయం గురించి అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమంతటా వాతావరణం వేడిగా మారడానికి ‘గ్లోబల్ వార్మింగ్’ అన్న ప్రక్రియ కారణం అని అందరికీ తెలుసు. గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతున్నదని కూడా తెలుసు. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచ వాతావరణంలో 25 బిలి యన్ల అణుబాంబుల శక్తికి సమానంగా ఉష్ణశక్తి చేరిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా గడిచిన 50 సంవ త్సరాల పాటు జరిగిన మార్పు. ఈ మార్పు ఒక పక్కన గాలిని వేడెక్కిస్తుండగా, మరొక పక్కన ఊహకు అందకుండా ఎల్ నినో వచ్చే పరిస్థితులకు దారితీస్తున్నది. రానురానూ పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నది. డిసెంబర్ 4న ‘కాప్’ 28 అనే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ జరిగింది. వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్నుపంపించడం ఈ సంవత్సరం అంతకు ముందు ఎన్నడూ లేని స్థాయికి చేరిందని అక్కడ ప్రకటించారు. పరిస్థితి ఇలాగుంటే, వాతావరణం నియంత్రణలో ఉంటుందని అనుకోవడానికి వీలే లేదు అన్నారు అక్కడ.గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు ప్రస్ఫుటంగా బయట పడు తున్నాయి. ప్రపంచమంతటా తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రపంచంలోని పెద్ద పెద్ద సరస్సులు, జలాశయాలు సగం కుదించుకుపోయాయి. సముద్ర అంతర్భాగంలో ఉండే గల్ఫ్ ప్రవాహం కూడా ప్రభావం కనపరు స్తున్నది. సముద్ర మట్టాలు ఎక్కడికక్కడ పెరుగుతున్నాయి. అయితే పరిశోధకులు, పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి అవ కాశాలు ఇంకా ఉన్నాయి అని ఆశాభావం కనబరుస్తున్నారు. వాతావరణంలో మార్పులను మనకు అనుకూలంగా మార్చే మార్గాలు లేకపోలేదు అంటున్నారు పెన్సిల్వేనియా విశ్వ విద్యా లయం పరిశోధకులు. కానీ ఆ అవకాశం కూడా రానురానూ తగ్గి పోతున్నది అన్నది వారి అభిప్రాయం. కె. బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత -
స్వచ్ఛ ప్రపంచం కోసం ఏటా కావాలో...రూ.2.24 కోట్ల కోట్లు!
కర్బన, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు. ప్రస్తుతం ప్రపంచ మానవాళికి పెను ప్రమాదంగా పరిణమించిన పెను సమస్యలు. పర్యావరణం పట్ల మనిషి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. వాటిని ఎలాగైనా తగ్గించాలన్న ప్రతినలు, లక్ష్యాలు కాగితాలకే పరిమితమ వుతున్నాయి. భావితరాల భద్రత పట్ల మన జవాబుదారీతనాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ప్రస్తుత లెక్కల్లో 2050 నాటికి ఉద్గారాలను పూర్తిగా (నెట్ జీరో స్థాయికి) తగ్గించాలంటే ప్రపంచ స్థాయిలో ఇప్పటి నుంచీ ఏటా కనీసం 2.24 కోట్ల కోట్ల రూపాయలు (2.7 లక్షల కోట్ల డాలర్లు) వెచి్చంచాల్సి ఉంటుందట! అలాగైతేనే ఈ శతాబ్దాంతానికల్లా అంతర్జాతీయ సగటు ఉష్ణోగ్రతలు కూడా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పరిమితిని దాటకుండా ఉంటాయట. కానీ ఉద్గారాలకు ప్రధాన కారణంగా ఉన్న చాలా దేశాలు తామే స్వయంగా నిర్దేశించుకున్న 2030 లక్ష్యాల సాధనకే అల్లంత దూరంలో ఉన్నాయనీ తాజా నివేదిక ఒకటి వాపోతోంది! ఈ పరిస్థితుల్లో వాటి నుంచి 2050 లక్ష్యాల పట్ల చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణను ఆశించడం అత్యాశేనని పర్యావరణవేత్త లు అంటున్నారు. మరోవైపు సముద్రాలకు ముప్పు కూడా నానాటికీ మరింతగా పెరిగిపోతోందని గ్రీన్ పీస్ నివేదిక హెచ్చరిస్తోంది. చేపల వేట విచ్చలవిడిగా సాగుతోందని, గత నాలుగేళ్లలో 8.5 శాతం దాకా పెరిగిందని అది పేర్కొంది! లక్ష్యాలు ఘనమే కానీ... ► కర్బన ఉద్గారాల కట్టడికి ప్రస్తుతం అన్ని దేశాలూ కలిపి ఏటా 1.9 లక్షల కోట్ల డాలర్లు వెచి్చంచాలన్నది లక్ష్యం. కానీ ఇదీ ఒక్క ఏడాది కూడా జరగడం లేదు. ► పలు కీలక సంపన్న దేశాలు ఈ విషయంలో చేస్తున్న గొప్ప ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ► అవి పాటిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. ► అవిలాగే దాటవేత ధోరణి కొనసాగిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 2050 కల్లా ఏకంగా 2.5 డిగ్రీలు పెరగడం, మానవాళి మనుగడ పెను ప్రమాదంలో పడటం ఖాయమని స్వయంగా ఐక్యరాజ్యసమితే తాజాగా హెచ్చరించింది. సముద్రాలకు ’మహా’ ముప్పు మహా సముద్రాలలో విచ్చలవిడిగా సాగుతున్న చేపల వేటపై అంతర్జాతీయ పర్యావరణ సంస్థ గ్రీన్ పీస్ తాజా నివేదిక తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది... ► 2018తో పోలిస్తే 2022 నాటికి సముద్రాల్లో చేపల వేట 8.5 శాతం పెరిగింది. ప్రత్యేక రక్షిత ప్రాంతాలైన సున్నిత సముద్ర జలాల్లోనైతే ఏకంగా 23.5 శాతం పెరిగింది. ► నిర్దిష్ట అంతర్జాతీయ సముద్ర జలా లను చేపల వేటను నిషేధించాలన్న ప్రతిపాదనలు ఏళ్ల తరబడి గ్రీన్ పీస్ చేసిన కృషి ఫలించి ఎట్టకేలకు గత మార్చిలో ఒప్పందంగా రూపుదాల్చాయి. జూన్‌లో ఐరాస కూడా దానికి ఆమోదముద్ర వేసింది. ► కానీ ఏ దేశమూ ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదని నివేదిక వాపోతోంది. ► విచ్చలవిడిగా వేట దెబ్బకు అరుదైన సముద్ర జీవరాశులు దాదాపుగా అంతరించిపోతున్నాయి. ► ఉదాహరణకు పసిఫిక్ బ్లూఫిన్ ట్యూనా చేప జాతి గత మూడు దశాబ్దాల్లోనే ఏకంగా 90 శాతానికి పైగా క్షీణించిపోయింది. ► ’30 బై 30’ లక్ష్య సాధనకు దేశాలన్నీ ఇప్పటికైనా నడుం బిగిస్తే మేలని గ్రీన్ పీస్ నివేదిక పేర్కొంది. ► ప్రపంచంలోని భూ, జలవనరులను 2030 కల్లా కనీసం 30 శాతమన్నా సంపూర్ణంగా సురక్షితంగా తీర్చిదిద్ద డమే ‘30 బై 30’ లక్ష్యం. నెట్ జీరో అంటే.. ► కర్బన ఉద్గారాలను దాదాపుగా సున్నా స్థాయికి తగ్గించడం. ► కాస్తో కూస్తో మిగిలే ఉద్గారాలను మహా సముద్రాలు, అడవుల వంటి ప్రాకృతిక వనరులు శోషించుకుంటాయన్నది సిద్ధాంతం. ► ఇందుకు ఉద్దేశించిన నిధుల్లో మూడొంతులు కీలకమైన ఇంధన, మౌలిక రంగాలపై వెచి్చంచాలన్నది లక్ష్యం. మిగతా లక్ష్యాలు ఏమిటంటే... ► రవాణా రంగాన్ని వీలైనంతగా విద్యుదీకరించడం. ► గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ‘1.5 డిగ్రీ ఉష్ణోగ్రత లక్ష్య సాధన అత్యంత పెను సవాలేనని చెప్పాలి. ఈ దశాబ్దంలో మిగిలి ఉన్న ఆరేళ్లలో ఆ దిశగా ఎంత చిత్తశుద్ధితో ప్రయతి్నస్తామన్న దానిపైనే ప్రపంచ భవిష్యత్తు చాలావరకు ఆధారపడి ఉంటుంది‘ – సైమన్ ఫ్లవర్స్ సీఈఓ, చీఫ్ స్ట్రాటజిస్ట్, వుడ్ మెకంజీ సంస్థ ‘లక్ష్యాల మాట ఎలా ఉన్నా చమురు, సహజ వాయువు పాత్ర అంతర్జాతీయ స్థాయి లో కనీసం మరి కొన్నేళ్ల పాటు కీలకంగానే ఉండనుంది‘ – ప్రకాశ్ శర్మ వైస్ ప్రెసిడెంట్, వుడ్ మెకంజీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
డేంజర్లో ఉన్నామా?.. సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్..
లండన్: శిలాజ ఇంధనాల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల, ప్రకృతి విపత్తులు.. వీటి గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రపంచ దేశాలు నష్టనివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ప్రమాదకరమైన గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం గరిష్ట స్థాయికి చేరినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా వెలువడుతున్న గ్రీన్‌హౌజ్ వాయువులు 54 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్తో సమానమని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా 50 మంది అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు భూ ఉష్ణోగ్రతలపై విస్తృత అధ్యయనం నిర్వహించి, ఉమ్మడిగా నివేదిక విడుదల చేశారు. మానవ చర్యలు, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం భూతాపం, వాతావరణ మార్పులకు కారణమవుతున్నట్టు పేర్కొన్నారు. జీవజాలానికి ఇన్నాళ్లూ ఆవాసయోగ్యంగా ఉంటూ వస్తున్న భూగోళం క్రమంగా అగ్నిగుండంగా మారిపోతోందని హెచ్చరించారు. సైంటిస్టులు తమ నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే.. ► 1800వ సంవత్సరంతో పోలిస్తే భూఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగాయి. ► ఉష్ణోగ్రత ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూతాపం మానవాళిని కబళించడం ఖాయం. ► గతంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని యథాతథంగా కొనసాగిస్తే భూ ఉపరితల ఉష్ణోగ్రత సమీప భవిష్యత్తులోనే 2 డిగ్రీలు పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ► పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు మించి పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని సాధించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలి. మునుపెన్నడూ లేనిస్థాయిలో తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ► భూతాపం ముప్పు నుంచి మానవళి బయటపడాలంటే 2035 నాటికి ప్రపంచదేశాలు తమ గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను 60 శాతానికి తగ్గించుకోవాలని సైంటిస్టు పియర్స్ ఫాస్టర్ చెప్పారు. -
‘బాక్స్ సాగు’ భలేభలే..!
వ్యవసాయంతో పరిచయమున్న వారెవరికైనా గ్రీన్హౌస్ అంటే తెలిసే ఉంటుంది. ఎండావానలు, చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవడానికి చేసుకొనే ఓ హైటెక్ ఏర్పాటు. ఒక ఎకరా విస్తీర్ణంలో ఆధునిక గ్రీన్‌హౌస్‌ను ఏర్పాటు చేసుకోవాలంటే... రూ. లక్షలకు లక్షలు ఖర్చు అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖేతీ అనే స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన కౌశిక్ కప్పగంతుల అత్యంత తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక గ్రీన్‌హౌస్‌ను అభివృద్ధి చేశారు. అంతేకాకుండా ప్రాంతం, వేసే పంటలను బట్టి దిగుబడులు పెంచుకొనేందుకు, అత్యవసర పరిస్థితుల్లో పంటలను కాపాడుకొనేందుకు ఏమేం చేయాలో కూడా రైతులకు నేరి్పంచడం మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవస్థ పేరే... ‘గ్రీన్హౌస్ ఇన్ ఎ బాక్స్’. ఈ వినూత్న ఆవిష్కరణకుగాను బ్రిటన్ యువరాజు చార్లెస్ స్థాపించిన ప్రతిష్టాత్మక ‘ద ఎర్త్ షాట్ ప్రైజ్–2022’ను కౌశిక్ పొందారు. – సాక్షి, హైదరాబాద్ కావాల్సిన వారికి కావాల్సినంత... ఖేతీ అభివృద్ధి చేసిన గ్రీన్‌హౌస్‌ను 240 చదరపు మీటర్లు లేదా ఎకరాలో పదహారో వంతు సైజులో ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఒక్కటొక్కటిగా చేర్చుకోనూవచ్చు. ఒక్క గ్రీన్హౌస్ ఏర్పాటుకు ప్రస్తుతం రూ. 60 వేల ఖర్చవుతోంది. సాధారణ గ్రీన్హౌస్తో పోలిస్తే ఇది 90 శాతం తక్కువ. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... రైతులు రోజుకు రెండు గంటలపాటు మాత్రమే పనిచేయడం ద్వారా ఏడాదిలోనే పెట్టుబడితోపాటు కనీసం రూ. 20 వేలు అదనంగా సంపాదించవచ్చు. 240 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పండే పంటకు ఏడు రెట్లు ఎక్కువగా పండటం ఒక కారణమైతే... నీటి వాడకం 95 శాతం వరకూ తక్కువ. అలాగే ఎరువులు, చీడపీడలకు పెట్టే ఖర్చులు కూడా తక్కువ కావడం వల్ల పెట్టిన పెట్టుబడికి మించిన రాబడి ఏడాదిలోనే వస్తుంది! (చదవండి: ‘చిరు’ధాన్యాల సాగుకు పెద్ద ప్రోత్సాహం) 15 రకాల పంటలు.. ఖేతీ గ్రీన్‌హౌస్‌ల అమ్మకాలు మాత్రమే చేయడం లేదు. ఏ పంట వేస్తే ఎక్కువ లాభాలుంటాయో నిత్యం తెలుసుకొనే ప్రయత్నాల్లో ఉంది. హైదరాబాద్ సమీపంలోని సొంత వ్యయసాయ క్షేత్రంలో ఇప్పటివరకూ 15 రకాల పంటలను విజయవంతంగా పండించింది కూడా. మరిన్ని పంటల సాగుపై పరిశోధనలు జరుగుతున్నాయి. 2017లో కేవలం 15 మంది రైతులతో తెలంగాణలో ఈ టెక్నాలజీ వాడకం మొదలుకాగా... మూడేళ్లలో 500 మంది రైతుల దగ్గరకు చేర్చారు. గతేడాది తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లలోనూ ‘గ్రీన్హౌస్ ఇన్ ఎ బాక్స్’వాడకం మొదలైంది. మొత్తమ్మీద ఇప్పుడు సుమారు 2,500 మంది చిన్న, సన్నకారు రైతులు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. 2027కల్లా 50 వేల మంది వాడేలా ప్రయత్నిస్తున్నాం... 2027 నాటికి దేశవ్యాప్తంగా కనీసం 50 వేల మంది రైతులు ‘గ్రీన్హౌస్ ఇన్ ఏ బాక్స్’ను వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వాలు చొరవ తీసుకొని రైతులకు వ్యవస్థీకృతమైన పద్ధతిలో రుణ సౌకర్యం కల్పిస్తే వారికి మరింత మేలు జరుగుతుంది. చిన్న, సన్నకారు రైతులు ఎంత ఎక్కువగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే.. అంత తక్కువ ధరలకు ఈ గ్రీన్‌హౌస్‌లు అందించవచ్చు. సెన్సర్ల వంటి హంగులను కూడా ఈ గ్రీన్హౌస్లో చేర్చేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నాం. – కౌశిక్ కప్పగంతుల, ఖేతీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో -
తెలంగాణ స్టార్టప్‌కు ఎకో ఆస్కార్
లండన్: పర్యావరణ ఆస్కార్గా పేరొందిన ప్రతిష్టాత్మక ఎర్త్‌షాట్ ప్రైజ్ తెలంగాణలో ఏర్పాటైన అంకుర సంస్థ ‘ఖేతి’కి దక్కింది. పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటూ సన్నకారు రైతుల సాగు ఖర్చును తగ్గించి, దిగుబడి, ఆదాయం పెంచుకునేందుకు ఈ సంస్థ సాయమందిస్తోంది. అందుకు గాను ‘ప్రొటెక్ట్, రీస్టోర్ నేచర్’ విభాగంగా ఈ అవార్డును అందుకుంది. పురస్కారంతో పాటు పది లక్షల పౌండ్ల బహుమతి సొంతం చేసుకుంది. ఖేతి అనుసరిస్తున్న ‘గ్రీన్‌హౌజ్ ఇన్ ఏ బాక్స్’ విధానానికి ఈ అవార్డ్‌ను ఇస్తున్నట్లు ఎర్త్‌షాట్ ప్రైజ్ వ్యవస్థాపకుడు, బ్రిటన్ యువరాజు విలియం వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో ఖేతి సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కప్పగంతుల కౌశిక్ పురస్కారం అందుకున్నారు. ‘‘మా పద్ధతిలో రసాయ నాల వాడకమూ అతి తక్కువగా ఉంటుంది. పంటకు నీటి అవసరం ఏకంగా 98% తగ్గుతుంది! దిగుబడి ఏకంగా ఏడు రెట్లు అధికంగా వస్తుంది. ‘గ్రీన్‌హౌజ్’ కంటే ఇందులో ఖర్చు 90 శాతం తక్కువ. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. మళ్లీ పంట సాగుకు, పిల్లల చదువు తదితరాలకు వాడుకోవచ్చు.’’ అని ఆయన వివరించారు. -
సంక్షోభాలు, విలయాలతో అంటురోగాలు.. ప్రాణాంతక ఆంత్రాక్స్ బయటపడిందిలా!
న్యూయార్క్: వరదలు, కరువు వంటి పర్యావరణ సంక్షోభాలు, విలయాలు కలిగించే నష్టం ఎంత అపారంగా ఉంటుందో మనమంతా చూస్తున్నదే. అయితే వీటివల్ల టైఫాయిడ్, జికా వంటి అంటురోగాల వ్యాప్తి కూడా పెరుగుతోందని ఓ సర్వే తేల్చింది! 2016 సంగతి. ఉత్తర సైబీరియాలో నివసించే ప్రజలు ఉన్నట్టుండి రోగాల బారిన పడసాగారు. వారితో పాటు జింకల వంటి జంతువులకు కూడా ఆంత్రాక్స్ సోకి కలకలం రేపింది. ఉష్ణోగ్రతల పెరుగుదలే దీనికి కారణమని తేలింది. 2016లో సైబీరియాలో ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరగనంతగా పెరిగాయి. దాంతో మంచు విపరీతంగా కరిగి దశాబ్దాల క్రితం ఆంత్రాక్స్‌తో చనిపోయిన ఓ జింక శవం బయట పడిందట. అందులోంచి ఆంత్రాక్స్ కారక బ్యాక్టీరియా తదితరాలు గాల్లో వ్యాపించి మరోసారి వ్యాధి తిరగబెట్టేందుకు కారణమయ్యాయని తేలింది! ఇదొక్కటనే కాదు. తుఫాన్లు, కరువులు, వరదలు తదితరాల వాతావరణ సంబంధిత విలయాలు ఆంత్రాక్స్ వంటి బ్యాక్టీరియా మొదలుకుని జికా వంటి వైరస్లు, మలేరియా వంటి పరాన్నభుక్కు సంబంధిత అంటువ్యాధుల వ్యాప్తిని 58 శాతం దాకా పెంచుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ హవాయి–మనోవాకు చెందిన కెమిలో మోరా అనే శాస్త్రవేత్త చేసిన అధ్యయనంలో తేలింది. ఇందుకోసం విలయాలు, వ్యాధుల మధ్య సంబంధంపై వచ్చిన వందలాది పరిశోధక పత్రాల నుంచి సమాచారాన్ని ఆయన బృందం సేకరించింది. దాన్ని లోతుగా విశ్లేషించిన మీదట ఈ మేరకు తేల్చింది. ఈ ఫలితాలను నేచర్ జర్నల్ పచురించింది. గ్రీన్హౌస్ ఉద్గారాలను ఆపాల్సిందే కొన్ని విలయాలకు అంటువ్యాధులతో సంబంధం నేరుగా కనిపిస్తుంది. వరదలొచ్చినప్పుడు కలుషిత నీటి వల్ల వ్యాపించే మెదడు వాపు వంటివాటివి ఇందుకు ఉదాహరణ. నీరు చాలాకాలం నిల్వ ఉండిపోతే డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వంటివీ ప్రబలుతాయి. విపరీతమైన వేడి గాలుల వంటి పర్యావరణ విపత్తులు కూడా పలు రకాల వైరస్లు ప్రబలేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. విపత్తుల కారణంగా 1,000కి పైగా మార్గాల్లో అంటురోగాలు ప్రబలినట్టు సర్వేలో తేలిందని మోరా చెప్పుకొచ్చారు. ‘‘వీటన్నింటికీ అడ్డుకట్ట వేయడం భారీ వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. బదులుగా మూలానికే మందు వేసే ప్రయత్నం చేయాలి. అంటే, పర్యావరణ విపత్తులకు మూలకారణంగా మారిన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు తక్షణం అడ్డుకట్ట వేయాలి’’ అని సూచించారు. -
కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!
పంచభూతాలపైన అందరికీ సమాన హక్కు, సమాన బాధ్యత ఉండాలి. మనిషి మనుగడకు కీలకమైన గాలి కలుషితమైనాక జీవి మనుగడ ప్రశ్నార్థకమే కదా. శీతాకాలంలో భారతీయ నగరాల్లో జీవించడం ప్రమాదకరం. ఇవాళ ఢిల్లీ వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఇది ఏ ఒక్క నగరానికో సంబంధించిన సమస్య కాదు. గ్లాస్గోలో జరిగిన కాప్ 26 శిఖరాగ్ర సమావేశ నేపథ్యంలో, విషపూరిత వాయు కాలుష్య స్థాయులను నియంత్రించడంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఉంది. చైనా, అమెరికా, ఐరోపా కూటమి తర్వాత భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద కార్బన్ డయాక్సైడ్ ఉద్గారకం. 2070 నాటికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను నికర సున్నాకి తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నికర సున్నా ఉద్గారాలు అంటే మానవ నిర్మిత గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలన్నీ వాతా వరణం నుండి తొలగించబడి, తద్వారా భూమి సహజ వాతావరణ సమతుల్యతను తిరిగిపొందడం. యూకే ఆధారిత నాన్–ప్రాఫిట్ క్లీన్ ఎయిర్ ఫండ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రకారం, వాయు కాలుష్యం భారతీయ వ్యాపారాలకు సాలీనా తొంభై ఐదు బిలియన్ డాలర్ల నష్టం చేకూరుస్తోంది. దేశ జీడీపీలో దాదాపు మూడు శాతం వాయు కాలుష్య పర్యవసానాల్ని ఎదుర్కోవడానికి ఖర్చవుతుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రూపొందాలనే భారతదేశ ఆకాంక్షను ఈ పరిణామాలు అడ్డుకునే ప్రమాదం లేకపోలేదు. (చదవండి: క్రిప్టో కరెన్సీ నియంత్రణకు సమయం ఇదే!) మానవుల శ్రేయస్సు, తద్వారా ఆర్థికవ్యవస్థపై వాయుకాలుష్య ప్రతికూల ప్రభావాల దృష్ట్యా, వాయు కాలుష్య నిర్వహణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎయిర్ క్వాలిటీ సూచిక రెండు వందల ఒకటి నుంచి మూడువందల పాయింట్ల మధ్య ఉంటే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ వ్యాధీలేని సాధారణ మానవులు సైతం అనారోగ్య సమస్యలుఎదుర్కొనే అవ కాశం ఉంటుంది. మూడువందల పాయింట్లు మించితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సుమారు ఐదు వందలు పాయింట్లు తాకడం గమనార్హం. ‘శీతాకాల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా ఢిల్లీలో ధూళి నియంత్రణ, పూసా బయో– డికంపోజర్‌ను ఉపయోగించడం, స్మోగ్ టవర్లను ఏర్పాటు చేయడం, గ్రీన్ వార్ రూమ్‌లను బలోపేతం చేయడం, వాహనాల ఉద్గారాలను తనిఖీ చేయడంపై దృష్టి సారించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు కొయ్యకాళ్ళు కాల్చడం వల్ల సమస్య మరింత జఠిల మైంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అక్టో బర్ 24 నుంచి నవంబర్ 8 వరకు ఢిల్లీ కాలుష్య కారకాల్లో సగం వాహనాలే ఉన్నాయని పేర్కొంది. (చదవండి: తీరప్రాంత రక్షణలో మన ఐఎన్ఎస్ విశాఖపట్టణం) ఈ సంవత్సరం కర్ణాటక, ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌ఘఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు దీపావళి బాణసంచా పేల్చడంపై ఆంక్షలు విధించాయి. దేశంలోని అన్ని నగరాలు నవంబర్ మాసంలో వాయు కాలుష్య కోరల్లో చిక్కుకొని నివాస యోగ్యం కాని ప్రాంతాలుగా మారుతున్నాయి. పర్యావరణ ప్రమాదాలకు గురయ్యే అవకాశం వున్న నగరాలు మొత్తం ఆసియాలోనే ఉండటం గమనార్హం. వరదలతో సతమతమవుతున్న జకార్తా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది. చెన్నై, ఆగ్రా, కాన్పూర్, జైపూర్, లక్నో, ముంబై వాయు కాలుష్య పరంగా అత్యంత కలుషితమైన నగరాలు. (చదవండి: చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం) పంటవ్యర్థాలతో వాయుకాలుష్యానికి ఆస్కారం లేకుండా ‘టకాచార్’ వంటి యంత్రాల ద్వారా ఉపయో గకరమైన ఇంధనంగా మలచవచ్చు. దీంతో వాయు నాణ్యత, రైతుల ఆదాయం పెరగటమేకాక నిరుద్యో గులకు ఉపాధి దొరకుతుంది. కాలుష్య నియంత్రణ ప్రణాళికకు తోడ్పడే వ్యవస్థీకృత జ్ఞానం అభివృద్ధి చెంద వల్సి వుంది. నాన్–బయోడీగ్రేడబుల్ వ్యర్థాల రీసైక్లింగ్, అప్ సైక్లింగ్‌ను ప్రోత్సహించాలి. బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను బయోగ్యాస్‌గా మార్చడానికి బలమైన కార్యాచరణ కావాలి. కాప్ 26లో ఉద్ఘాటించిన విధంగా 2030 నాటికి భారతదేశం తన శక్తి అవసరాల్లో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చుకోగలిగితే తప్పకుండా వాయు ఉద్గారాలను గణనీయంగా నియంత్రించ గలుగుతుంది. వాయు కాలుష్య నియంత్రణ అనేది ఒక వ్యయం కాదు, దేశ భవిష్యత్తుకు అవసరమైన పెట్టుబడి. – డా. సృజన కత్తి ఐసీఎస్ఎస్ఆర్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్, పాండిచ్చేరి విశ్వవిద్యాలయం -
పిల్లల్ని కనే ప్రసక్తే లేదు..
సిడ్నీ నుంచి సియోల్ వరకు మనీలా నుంచి ముంబై వరకు ఇప్పుడో సమ్మె నడుస్తోంది. విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్లపై ర్యాలీలు తీస్తున్నారు. యువతులు పిల్లల్ని కనమని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకోసమో తెలుసా స్వచ్ఛమైన గాలి పీల్చడం కోసం భవిష్యత్ తరాల బాగు కోసం.. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పులపై అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ నెల 23న భారీ సదస్సు నిర్వహిస్తున్న సందర్భంలో యువతరం చేస్తున్న ప్రపంచ పర్యావరణ సమ్మె ప్రభుత్వాలను మేల్కొలుపుతుందా? భూతాపోన్నతిని అరికట్టడానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తాయా? ఎందుకింత ఆందోళన ! మనం వేసుకున్న అంచనాలు మారిపోతున్నాయి. చేరుకోవాల్సిన లక్ష్యాలు భారమైపోతున్నాయి. భూతాపాన్ని అదుపులోకి తీసుకురావడం అంత సుల భం కాదని తెలుసు. కానీ ఎంతో కొంత అరికట్టగలమని భావించాం. అది కూడా సాధ్యం కాదేమోనన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. పచ్చటి అమెజాన్ కాలిబుగ్గయింది. ఆర్కటిక్ మంచు కరిగి నీరైంది. వడగాడ్పులకు యూరప్ వణికిపోయింది. రోజు రోజుకీ వేడెక్కిపోతున్న భూతాపాన్ని రెండు డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చేయాలని 2015లో పారిస్‌లో ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞలు చేశారు. వీలైతే 1.5 డిగ్రీ లకే పరిమితం చేయాలని అనుకున్నారు. కానీ దానిని తూచ తప్పకుండా పాటించిన దేశాలను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఫలితంగా వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది. 2100నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు 3డిగ్రీలసెల్సియస్‌కు చేరుకుంటాయన్న యూఎన్ అంచనాలు తారుమారయ్యే పరిస్థితు లు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్హౌస్ వాయువులు 2017లో 1.7% పెరి గితే 2018లో 2.7% పెరి గాయి. ఫ్రాన్స్ తాజా అధ్యయనం ప్రకారం ఇదే తరహాలో గ్రీన్హౌస్ వాయువులు గాల్లో కలిస్తే 2100 నాటికి ఉష్ణోగ్రతలు 6.5– 7.0 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతాయని హెచ్చరిస్తున్నాయి. వాతావరణంలో అరటిపండు వాతావరణం క్షణానికోరంగు మారుతూ ఉండడంతో పంట దిగుబడులపై ప్రభావం పడుతోందని అందరికీ తెలిసిందే. కానీ అన్నింట్లోకి దేని మీద అధికంగా ప్రభావం పడుతోందా తెలుసా. అరటి పండు మీదట. ఇంగ్లండ్‌లోని ఎగ్జిటర్ వర్సిటీ చేసిన అధ్యయనాన్ని నేచర్ క్లైమేట్ ఛేంజ్ జర్నల్ ప్రచురించింది. దీని ప్రకారం అరటిపండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న భారత్ సహా 10 దేశాల్లో ఇటీవల కాలంలో పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. పర్యావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి అరటి పండు కనిపించకుండా పోతుందని ఆ అధ్యయనం అంచనా వేసింది. భారత్ చేస్తున్నదేంటి..? భూతాపాన్ని అరికట్టడానికి మనం చేస్తున్న కృషి తక్కువేమీ కాదు. ప్రపంచం మొత్తం మీద మంచి ఫలితాలను సాధిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. క్లైమేట్ యాక్షన్ ట్రాకర్( క్యాట్) అంచనాల ప్రకారం మొరాకో, జాంబియా గ్రీన్ హౌస్ వాయువుల్ని అరికట్టడంలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. సంప్రదాయేతర ఇంధనాన్ని వాడడంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా నిలిచింది. దానికి తగ్గట్టు ఇదే రంగాల్లో పెట్టుబడులు పెంచుతోంది. 2030 నాటికి దేశ విద్యుత్‌లో 40%సంప్రదాయేతర ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆ దిశగా భారత్ సాధిస్తున్న పురోగతి చూస్తుంటే లక్ష్యాలను అందుకుంటుందనే క్యాట్ అంచనా వేసింది. అగ్రరాజ్యం అమెరికా కల్లబొల్లి కబుర్లు చెప్పడమే తప్ప పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ఆ దేశం చివరి స్థానంలో ఉంది. ఆమెకి పట్టుమని పదహారేళ్లు కూడా లేవు. అయితేనేం పర్యావరణంపై ఆమె చేస్తున్న పోరాటం ప్రపంచవ్యాప్తంగా యువతరాన్ని ఏకతాటి పైకి తెచ్చింది. స్వీడన్ టీన్ యాక్టవిస్ట్ గ్రేటా థెన్‌బెర్గ్ పర్యావరణ పరిరక్షణ కోసం స్కూలుకి వెళ్లడం మానేసింది. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా 123 దేశాల్లో యువతీ యువకులు తరగతులు బహిష్కరించి మరీ రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్నా రు. పర్యావరణాన్ని కాపాడకపోతే తమ భవిష్యత్ నాశనమైపోతుందంటూ నినదిస్తున్నారు. పిల్లల్ని కనే ప్రసక్తే లేదు.. పర్యావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు భవిష్యత్ తరాలకు ఎంత చేటు తెస్తాయో యువతరంలో అవగాహన పెరిగింది. అమెరికా, కెనడాకు చెందిన కొందరు యువతీ యువకులు ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే తాము పిల్లల్ని కనమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కెనడాలోని మాంట్రీల్లో మెక్‌గిల్ యూనివర్సిటీలో చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి ఎమ్మాలిమ్ సోషల్ మీడియాలో నో ఫ్యూచర్ నో చిల్డ్రన్ హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ఉద్యమాన్ని లేవదీశారు. ‘‘ఏ అమ్మాయికైనా అమ్మ కావాలని కోరిక ఉంటుంది. మాతృత్వం అంటే నాకెంతో అపురూపం. కానీ నా బిడ్డకు భద్రమైన జీవనం ఇవ్వలేను కాబట్టి నేను పిల్లల్ని కనదలచుకోలేదు. గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల కంటే తక్కువకి తీసుకురావడానికి ప్రభుత్వాలు సమగ్రమైన ప్రణాళికలు తీసుకురావాలి. అప్పుడే మేము పిల్లల్ని కంటాం’’ అని ఆమె తేల్చి చెప్పేశారు. ఎమ్మాలిమ్ ఉద్యమానికి అమెరికా, కెనడాలో యువతరం నుంచి అనూహ్యమైన మద్దతు వచ్చింది. వారంతా కూడా ఆమె బాటలో నడుస్తూ పిల్లల్ని కని వారి భవిష్యత్‌ని నాశనం చేయలేమని నినదిస్తున్నారు. -
నీటి ముప్పు తప్పదా?
వాషింగ్టన్: గ్లోబల్ వార్మింగ్, గ్రీన్హౌస్ ఉద్గారాలు, ఇంధన వనరుల వినియోగంతో భూతాపం రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ధృవ ప్రాంతాల్లోని మంచు కరగడంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. సముద్రతీర ప్రాంతాలు నీట మునగడానికి ఇవే ప్రధాన కారణాలు. అయితే రోజురోజుకీ పెరిగిపోతున్న ప్రకృతి విధ్వంసం కారణంగా 2100 నాటికి సముద్ర మట్టం 8 అడుగులు పెరగనుండగా, ఇది 2300 నాటికి ఏకం గా 50 అడుగులకు చేరుకోనుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తల తాజా అధ్యాయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ‘ఈ శతాబ్ధం ప్రారం భం నుంచి ప్రపంచ వ్యాప్తంగా సరాసరి సముద్ర మట్టాలు 0.2 అడుగులు పెరిగాయని అమెరికాలోని రూట్జర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచ జనాభాలో సుమారు 11 శాతం మంది ప్రజలు సముద్ర మట్టానికి 33 అడుగుల లోపుఉన్న ప్రాంతాల్లో నివిసిస్తున్నారు. నీటి మట్టాల పెరుగుదల వల్ల ఇలాంటి ఎంతో మంది మనుగడనే ప్రశ్నార్థకంగా మారుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. -
2070 నాటికి ఆ ఖండం పరిస్థితి
ఈ భూమి మీద ఏ జీవరాశికి లేని అరుదైన లక్షణం విచాక్షణ శక్తి మానవుని సొంతం. మంచికి, చెడుకు మధ్య తేడా గుర్తించడం మానవునికే సాధ్యం. ఇంత అరుదైన సామార్ధ్యం ఉన్న మనిషి మాత్రం స్వార్ధపూరితంగా తయారయ్యాడు. అతని అత్యాశకు బలవుతున్నది వాతావరణం, జీవరాశి. వీటి గురించి శాస్త్రవేత్తలు గొంతు చించుకుని చెప్తున్న మనం మాత్రం తలకెక్కించుకోవటం లేదు. ఫలితం ఎలా ఉండబోతుందో ఇప్పటికే చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే గతి తప్పిన వాతావరణం, విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులు, నిప్పులు చెరుగుతున్న భానుడు వెరసి తీవ్ర క్షామం, ఆకలి, దరిద్రం. వీటన్నింటిని నిత్యం చూస్తున్నా మనిషిలో మార్పు రావడం లేదు. కనీసం ఇప్పటికైనా మనిషి మేలుకోకపోతే అతి త్వరలోనే మనిషి మనుగడ తుడిచిపెట్టుకుపోతుందంటున్నారు శాస్త్రవేత్తలు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆందోళనకరంగా మారిన అంటార్కిటికా వాతావరణ పరిస్ధితులు. భూమి మీద ఉన్న ఏడు ఖండాల్లో అంటార్కిటికాకు ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం మంచుతో కప్పబడి మానవ నివాసానికి అనుకూలంగా లేని వాతవారణంతో పాటు.. అరుదైన జీవరాశికి ఆవాసంగా ఉన్న ప్రాంతం ఇది. అలాంటిది ఇప్పుడు ఈ ఖండంలోని మంచు ఆందోళనకర రీతిలో కరిగిపోతుంది. కేవలం 1992 నుంచి 2017 మధ్య కాలంలో దాదాపు 3 ట్రిలియన్ టన్నుల మంచు కరిగిందని సాటిలైట్ పరిశీలనలో తెలింది. దక్షణ అంటర్కిటికా ప్రాంతంలో ఈ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయంటున్నారు శాస్త్రవేత్తల. గడిచిన శతాబ్ద కాలంలో మంచు మూడు రెట్ల అధికంగా కరుగుతూ ఏకంగా ఏడాదికి 159 బిలియన్ టన్నులకు చేరుకున్నట్లు అంచనా వేశారు శాస్త్రవేత్తలు. మంచే కదా.. కరగుండా ఉంటుందనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే మంచు కరిగి నీరుగా మారుతుంది. ఆ నీరు సముద్రాలలో కలుస్తుంది. ఫలితంగా సముద్రాల నీటి మట్టం పెరుగుతుంది. గత పాతికేళ్ల నుంచి అంటార్కిటికాలో మంచు కరగడం వల్ల సముద్ర జలాల స్థాయి దాదాపు 8 మిల్లి మీటర్లు పెరిగింది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే 2070నాటికి అంటార్కిటికా పరిస్థితి ఏంటి..? అంటార్కిటికాలో కలిగే మార్పులు.. ప్రపంచపై ఉండే ప్రభావం వంటి అంశాల గురించి పరిశోధించిన శాస్త్రవేత్తలు ఆందోళనకర వాస్తవాలను వెల్లడించారు. ఈ అంశాల గురించి ప్రముఖ బ్రిటీష్ జర్నల్ ‘నేచర్’లో వెల్లడించారు. అంతేకాక ప్రంపంచ ముందు రెండు పరిష్కారాలను కూడా ఉంచారు. వీటిలో ఒకటి గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను పట్టించుకోకుండా, మన స్వార్ధ పూరిత చర్యలతో ప్రకృతిని మరింత నాశనం చేయడమా లేక ఇప్పటికైన మేల్కొని గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించి, పర్యావరణాన్ని కాపడడమా. ఈ రెండింటిలో మనిషి ఎంచుకునే దాని మీదనే అంటార్కిటిక భవిష్యత్తు ఆధారపడి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అంటర్కిటికాయే ఎందుకు... భూమి మీద ఎక్కడ ఎలాంటి మార్పులు జరిగిన వాటి ఫలతం మిగితా ప్రాంతాల్లో అంత త్వరగా కనిపించే అవకాశం ఉండదు. కానీ అంటార్కిటికా, దక్షిణ సముద్రంలో వచ్చే మార్పులు మాత్రం మానవాళి మీద చాలా త్వరగా ప్రభావం చూపుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు అధిక మొత్తంలో విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా, మంచు శకలాలు కూడా త్వరగా కరుగుతాయి. ఫలితంగా ఇంతకాలం సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడుతున్న దక్షిణ సముద్రం అతి త్వరలోనే విపత్కర పరిస్థితులును ఎదుర్కొనున్నట్లు ఆందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. తక్షణ కర్తవ్యం... భూమి మీద ముఖ్యమైన అంటార్కిటికా, దక్షిణ సముద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ‘అంటార్కిటికా ట్రీటి సిస్టం’ పర్యవేక్షిస్తుంది. ఇన్నాళ్లు అంటార్కిటికా బాధ్యతలను కాపాడిన ఈ సంస్థకు మారుతున్న పర్యావరణ పరిస్ధితుల నుంచి అంటార్కిటకాను కాపాడటం పెద్ద సవాలుగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మంచు తిరోగమనం వల్ల సముద్ర జలాల ఆమ్లీకరణ పెరుగుతుంది. ఫలితంగా మహాసముద్రాల పర్యావరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైత అంత త్వరగా గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించడంతో పాటు పర్యావరణానికి హానీ చేసే మానవ కార్యకలపాలను కూడా తగ్గించుకుంటే అంటార్కిటికాను మాత్రమే కాక ప్రపంచాన్ని కూడా కాపాడిన వాళ్లం అవుతాము. -
చాక్లెట్లతో పర్యావరణానికి హాని!
లండన్: మనం ఎంతో ఇష్టపడే చాక్లెట్ల వల్ల పర్యావరణానికి అపారమైన హాని కలుగుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన పరిశోధకులు చాక్లెట్ల తయారీలో వాడే పదార్థాలు, తయారీ విధానం, ప్యాకింగ్ వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఇందులో బ్రిటన్‌లోని చాక్లెట్ల పరిశ్రమ ఏటా 20 లక్షల టన్నుల గ్రీన్ హౌన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా చాక్లెట్లు, ప్యాకింగ్ వాడే ముడి పదార్థాల వల్ల ఎక్కువ హాని కలుగుతోందని గుర్తించారు. -
గ్రీన్‌హౌస్‌కు ఉచిత విద్యుత్
స్పష్టం చేసిన టీఎస్ఈఆర్సీ టారిఫ్ ఉత్తర్వుల సవరణ సెప్టెంబర్ నుంచే అమల్లోకి సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్, పాలీహౌస్, ఫ్లోరీ కల్చర్ (పూల మొక్కల పెంపకం) సాగుకు కూడా ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పరిధిలోకి ఈ కేటగిరీలను చేర్చింది. ప్రస్తుత సెప్టెంబర్ నుంచే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. సోమవారం ఈ మేరకు 2017–18కి సంబంధించిన టారిఫ్‌లను సవరిస్తూ ఈఆర్సీ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. -
గ్రీన్హౌస్ సాగులో నెదర్లాండ్ సహకారం
మంత్రి పోచారంతో నెదర్లాండ్ దౌత్య బృందం భేటీ సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ (పాలీ హౌస్) సేద్యంలో తెలంగాణ రైతులకు సాంకేతిక సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని నెదర్లాండ్ హామీ ఇచ్చింది. ఢిల్లీలోని నెదర్లాండ్ ఎం బసీ కాన్సుల్ జనరల్ గైడో తైల్ మెన్ ఆధ్వ ర్యంలోని ప్రతినిధి బృందం సోమవారం సచివాల యంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో సమావేశమైంది. చిన్నగా ఉన్నా తమ దేశం వ్యవసాయం, మాంసం, పాడి ఉత్పత్తు ల ఎగుమతులలో ఎంతో అభివృద్ధి సాధించిందని, పూల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని నెదర్లాండ్ ప్రతినిధులు మంత్రికి వివరిం చారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసేవిధంగా పరిశ్రమలు నెలకొల్పాలని ఆ దేశ ప్రతినిధులను కోరారు. తెలంగాణలో వ్యవ సాయం, అనుబంధ రంగాలలో అపార అవకాశాలు ఉన్నాయని... రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పుత్తులకు అగ్రి ప్రాసె సింగ్ యూనిట్లను జోడిస్తే రైతులకు మంచి ధరలు లభిస్తాయని మంత్రి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావించాక రాష్ట్రంలో గ్రీన్హౌస్ సేద్యానికి ప్రాధా న్యం ఇచ్చామని... ఇప్పటివరకు వెయ్యి ఎకరాలకు పైగా అనుమతులు ఇచ్చామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ భారీగా సబ్సిడీలు ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్ దేశంలోని అత్యు త్తమ వ్యవసాయ వర్సిటీ వాగెనింగన్లు పరిశోధన రంగంలో పరస్పరం సహకరించు కోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ సమావేశంలో వ్యవసా యశాఖ కమిషనర్ జగన్మోహన్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ హౌస్‌కు 100 శాతం సబ్సిడీ
ఎస్సీ, ఎస్టీ రైతులకు ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయం ఎకరాకే వర్తింపు... సీఎం వద్దకు ఫైలు సాక్షి, హైదరాబాద్: గ్రీన్ హౌస్ (పాలీ హౌస్) నిర్మాణానికి అయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం సబ్సిడీ ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇటీవలే 95 శాతం సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం... మరో ఐదు శాతం కూడా వారు భరించడం కష్టమని భావించింది. ఆ ఐదు శాతాన్ని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా, మిగిలిన 95 శాతం ఉద్యాన శాఖ బడ్జెట్ నిధుల నుంచి కేటాయించాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఇందుకు సీఎం అంగీకరించినందున తక్షణమే అమలులోకి వచ్చేలా ప్రతిపాదన ఫైలును సిద్ధం చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వద్దకు ఫైలు వెళ్లనుంది. ఇదిలావుంటే ప్రస్తుతం 3 ఎకరాల వరకు ఏ రైతైనా 75 శాతం సబ్సిడీ పొందే వీలుంది. కానీ ఎస్సీ, ఎస్టీ రైతులు మాత్రం నూటికి నూరు శాతం సబ్సిడీని ఒక ఎకరానికి మాత్రమే పొందేలా పరిమితి విధించారు. వారు ఒక ఎకరానికి మించి గ్రీన్ హౌస్ సాగు చేసినా ఆర్థికంగా ఇబ్బంది పడతారని... కనుక ఎకరాకే పరిమితం చేశామని అధికారులు వెల్లడించారు. ఒకవేళ అంతకు మించి రెండు మూడు ఎకరాల వరకు సాగు చేస్తే 75 శాతం సబ్సిడీ వర్తింపచేస్తారు. ఎకరానికి రూ.40 లక్షలు... ఎకరా విస్తీర్ణంలో గ్రీన్ హౌస్ నిర్మాణానికి రూ.33.76 లక్షలు, దీనికి అదనంగా పూలు, కూరగాయల నారు మొక్కలకు రూ.5.6 లక్షల నుంచి రూ.25.3 లక్షలు ఖర్చవుతుంది. మొక్కలు, దుక్కులు తదితరాల కోసం మొత్తం కలిపి 40 లక్షల రూపాయలకు పైన వ్యయమవుతుందని అంచనా. వివిధ మొక్కలను బట్టి అది మారుతుంటుంది. నూరు శాతం సబ్సిడీ అమల్లోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రైతులకు ఈ మొత్తం అందుతుంది. -
గ్రీన్హౌజ్లకు 70శాతం సబ్సిడీ
చిత్తూరు: రాష్ట్రంలో గ్రీన్ హౌస్‌ల ఏర్పాటుకు సంబంధించి 70 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇప్పటి వరకు 50 శాతం సబ్సిడీ ఉండగా, రైతుల విజ్ఞప్తి మేరకు దీనిని 70 శాతానికి పెంచుతున్న సీఎం వెల్లడించారు. కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు బుధవారం గుడుపల్లె మండలం గుడివంక గ్రామం వద్ద జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు గ్రీన్‌హౌస్‌లు లాభదాయకంగా ఉంటాయన్నారు. వీటి ఏర్పాటు వల్ల నీటిని ఆదా చేయవచ్చన్నారు. కనుక గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలన్నారు. -
మంచునూ ఒడిసిపట్టే ‘గ్రీన్’హౌస్!
వరుణ దేవుడు వ్యూహం మార్చినప్పుడు.. మనమూ అదేపని చేయాలి! కరువు తాండవించే గడ్డు పరిస్థితుల్లో ఎప్పుడో కురిసే వర్షం కోసమే కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ మిన్నకుంటే ఎలా? ఇంకేదైనా నీటి సంపాదన మార్గం అన్వేషించాలి కదా! ఉత్తర ఇథియోపియావాసులు అదే చేశారు. వర్షపు చినుకులనే కాదు, మంచు బిందువులను కూడా ఒడిసిపట్టి సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చుకునే లోకాస్ట్ గ్రీన్‌హౌస్‌ను ఆవిష్కరించారు. ఉత్తర ఇథియోపియాలోని యూనివర్శిటీ ఆఫ్ గోండర్కు చెందిన శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. అందుబాటు ధరలో లభ్యమయ్యే బయోప్లాస్టిక్ షీట్, నీటి తొట్టె, ఆ రెంటినీ కలిపే చిన్న పైపు, కర్రలు ఒకచోట చేరిస్తే ఈ గ్రీన్హౌస్ సిద్ధమవుతుంది. ఈ గ్రీన్హౌస్ పగటి పూట వేడి గాలుల నుంచి, అధిక ఎండవేడి నుంచి మొక్కలకు రక్షణ కల్పిస్తుంది. రాత్రి వేళల్లో మంచు బిందువుల నీటిని బక్కెట్లలోకి ఒడిసిపడుతుంది. ఇది మామూలుగా చూడ్డానికి పిరమిడ్‌లా ఉంటుంది. బయోప్లాస్టిక్ షీట్‌తో తయారు చేసిన పలకలను దీనికి అమర్చుతారు. వాటికి పైభాగాన కట్టి ఉండే తాళ్లను లాగితే.. ఆ పలకలు వెలుపలి వైపునకు పువ్వులా విచ్చుకుంటాయి. గ్రీన్హౌస్ లోపల ఏర్పాటైన తొట్టె.. దానిపైన గరాటాలోకి వాన చినుకులు లేదా మంచు బిందువులు వచ్చి చేరతాయి. శుద్ధమైన ఈ జలంతో దప్పిక తీర్చుకోవచ్చు. మొక్కలకూ అందించొచ్చు. ఎడారిలో పంటల సాగుకు ఇటువంటి గ్రీన్హౌస్లలో ఉత్తర ఇథియోపియా ప్రభుత్వం రైతులకు శిక్షణ ఇస్తోంది. ఐడియా బాగుంది కదూ.. -
ఇక ‘గ్రీన్స్‌హౌస్’ సాగు
పుణేలో శిక్షణ పొందిన ఉద్యాన అధికారులు ఆధునిక టెక్నాలజీతో ఉద్యాన పంటల సాగుకు సన్నాహాలు పంటల సాగుకు ప్రభుత్వం పెద్దపీట ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో గ్రీన్హౌస్ వ్యవసాయానికి కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ల్లో పంటల సాగుకు ప్రాధాన్యం ఇస్తుంది. ఆధునిక సాంకేతిక పరి/ా్ఞనంతో గ్రీన్హౌస్లను ఏర్పాటు చేసి వాటిలో ఉద్యాన పంటలను పండించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 5 జిల్లాలో గ్రీన్ హౌస్‌ల వ్యవసాయాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంతో పాటు పొరుగున ఉన్న బెంగళూరు, చెన్నై తదితర మహానగరాలు, పెద్ద నగరాలు, పట్టణాలకు కూరగాయలు, పూలు తదితర ఉద్యాన పంటలను సరఫరా చేరుుంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పద్ధతిలో రైతులు ఆధిక ఆదాయూన్ని గడించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ గ్రీన్హౌస్ సాగు విధానానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఒక్కో గ్రీన్ హౌస్‌కు రూ.11 నుంచి రూ. 15 లక్షల వెచ్చించి నిర్మింపజేయూలని ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. మొదటి విడతగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. రెండో విడత ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈ సాగు విధానాన్ని చేపట్టాలని రాష్ట్ర ఉద్యాన శాఖ నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గ్రీన్హౌస్ వ్యవసాయాన్ని రాష్ట్రంలో రైతులతో చేయించాలని ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న వర్షాభావ పరిస్థితులు, నీటి వనరులు, ఏటేటా పడిపోతున్న భూగర్భజలాలు తదితర కారణాలతో రైతులను ఆధునిక వ్యవసాయం వైపునకు మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉన్న వనరులను వినియోగించుకుంటూ మార్కెట్లో అవసరాలను దృష్టిలో పెట్టుకొని పంటలను సాగు చేస్తూ డిమాండ్ తగిన ధరలకు రైతులు అమ్ముకునే విధంగా సాగు పద్ధతులు తీసుకురావాలని ప్రభుత్వం గ్రీన్హౌస్ విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఈ వ్యవసాయంపై తొలుత ఉద్యాన అధికారులకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 జిల్లాలకు చెందిన 45 మంది ఉద్యాన అధికారులకు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోర్త్ హార్వెస్ట్ టెక్నాలజీస్ సంస్థ, మహాబలేశ్వరంలో శిక్షణ ఇప్పించారు. జిల్లా నుంచి ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు కె.సూర్యనారాయణ, కస్తూరి వెంకటేశ్వర్లు, ఉద్యాన అధికారులు ఉదయ్‌కుమార్(అశ్వారావుపేట), బి.వి.రమణ(కల్లూరు), భారతి(సత్తుపల్లి), సందీప్‌కుమార్ (ఇల్లెందు) శిక్షణ పొందారు. శిక్షణ గురించి ఉద్యాన అధికారి కె.సూర్యనారాయణ ‘సాక్షి’కి వివరించారు. -
వ్యవసాయ బడ్జెట్ రూ. 7,500 కోట్లు?
రెండు వేల ఎకరాల్లో గ్రీన్హౌస్.. రూ. 500 కోట్లు రూ. 4,250 కోట్లు రెండో విడత రుణమాఫీకి నేడు ఆర్థిక మంత్రితో భేటీ కానున్న పోచారం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో వ్యవసాయశాఖకు రూ. 7,500 కోట్లు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రతిపాదిం చింది. మంగళవారం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో జరిగే బడ్జెట్ ముందస్తు సమావేశంలో ఈ మేరకు నివేదికను అందించనుంది. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం తన శాఖలోని అన్ని విభాగాల అధికారులతో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గత ఏడాది కంటే ప్రతీ విభాగంలో 20 నుంచి 30 శాతం అదనంగా నిధుల అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేశారు. వ్యవసాయశాఖకు రూ.7,500 కోట్లను కోరనుండగా... అందులో ప్రణాళిక కింద రూ. 2,472 కోట్ల మేరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రణాళికేతర బడ్జెట్లో రూ. 4,250 కోట్లను రుణమాఫీ రెండో విడత కోసం కేటాయించనున్నారు. మిగతా సొమ్మును వేతనాలు, ఇతరత్రా ఖర్చులకు వినియోగిస్తారు. గ్రీన్‌హౌస్‌కు రెండింతలు... ఈసారి బడ్జెట్లో గ్రీన్హౌస్, సూక్ష్మసేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ, కోల్డ్‌స్టోరేజీలు, రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన (ఆర్కేవీవై) తదితర పథకాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. సూక్ష్మసేద్యానికి రూ. 800 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు తయారుచేశారు. రెండు వేల ఎకరాల్లో గ్రీన్హౌస్ (పాలీహౌస్)ల ఏర్పాటుకు రూ. 500 కోట్లు కేటాయించాలని కోరనున్నారు. ఇక వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 234 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇక విజయ డెయిరీని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం పాడి రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకం కింద ఇస్తున్న నేపథ్యంలో... దానిని వచ్చే ఏడాది కూడా కొనసాగించేందుకు రూ. 36 కోట్లు కోరనున్నారు. మొత్తంగా పాత పథకాలే కొనసాగుతాయని, కొత్త పథకాలకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టకపోవచ్చని తెలుస్తోంది. ‘గిరిజన’శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15)లో గిరిజన సంక్షేమ శాఖకు బడ్జెట్లో కేటాయించిన మొత్తాన్ని ఏ మేరకు ఖర్చుచేశారు, మిగతా నెలన్నర రోజుల్లో ఏ మేరకు ఖర్చు చేయగలరనే అంశంపై సోమవారం శాఖ కార్యదర్శి జీడీ అరుణ సచివాలయంలో సమీక్షించారు. బడ్జెట్లో గిరిజన ఉప ప్రణాళిక (సబ్‌ప్లాన్)లో వివిధ శాఖల వారీగా కేటాయించిన మొత్తం రూ. 4.559 కోట్లలో (శాఖకు కేటాయించిన బడ్జెట్ రూ. 1,237 కోట్లు కలిపి) దాదాపు 60 శాతం నిధులు విడుదల కాగా... 30-40 శాతం వరకు వ్యయమైనట్లు తేలింది. మొత్తం రూ.1,237 బడ్జెట్లో ఇంజనీరింగ్ విభాగం రూ. 229 కోట్లు బిల్లుల ద్వారా తీసుకోవాల్సి ఉంది. మరో నెలన్నర రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున నిధుల వ్యయం వేగాన్ని పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వచ్చే బడ్జెట్ 2015-16కు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖకు రూ. 2 వేల కోట్ల మేర ప్రతిపాదనలు పంపించాలని శాఖాధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనితోపాటు వివిధ శాఖల నుంచి వచ్చే గిరిజన సబ్‌ప్లాన్ నిధులు ఎంతనేది పరిశీలించాల్సి ఉంది. -
గ్రీన్హౌస్ కంపెనీల అత్యాశ
చదరపు మీటరుకు ప్రభుత్వం నిర్ణయించిన రేటు రూ. 700 కంపెనీల బిడ్డింగ్‌లో కనిష్ట ధర రూ. 840, గరిష్టం రూ. 1260 సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక బిడ్ వివరాలు వెల్లడయ్యాయి. టెండర్లలో పాల్గొన్న కంపెనీలు ప్రభుత్వ నిర్ణీత ధరకు మించి కోట్ చేశాయి. దీంతో ఆయా కంపెనీ ప్రతినిధులతో ఐదో తేదీన చర్చలు జరిపి తుది నిర్ణయానికి రావాలని సాంకేతిక కమిటీ నిర్ణయించింది. కోట్ చేసిన ధరలను తగ్గించేలా రాజీ చేసుకుని సర్కారు మార్గదర్శకాల ప్రకారం అర్హత గల కంపెనీల జాబితాను కమిటీ తయారు చేయనుంది. తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. అనంతరం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. నిజానికి గ్రీన్హౌస్ నిర్మాణానికి ఒక్కో చదరపు మీటరుకు రూ. 700 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఎకరా స్థలంలో 4 వేల చదరపు మీటర్ల పరిధిలో నిర్మాణాన్ని చేపడితే అందుక య్యే వ్యయం రూ. 28 లక్షలు. ఇందులో 75 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. మిగిలిన ఖర్చును రైతు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విత్తనాలు, భూమి చదును, ఇతరత్రా నిర్వహణ కోసం చదరపు మీటరుకు రూ. 140 ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇందులోనూ రైతుకు 75 శాతం సబ్సిడీ లభిస్తుంది. అయితే తాజాగా కంపెనీలు గ్రీన్‌హౌస్‌ల నిర్మాణానికి ఎక్కువ ధరను కోట్ చేశాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక్కో చదరపు మీటరుకు ఇండియన్ గ్రీన్హౌస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 935, నోయిడాకు చెందిన జెస్తా డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ. 840, హైదరాబాద్‌కు చెందిన భానోదయం ఇండస్ట్రీస్ కంపెనీ రూ. 1044, శ్రీసాయి ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 1260, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ. 1244, హైతాసు కార్పొరేషన్ రూ. 991, తమిళనాడుకు చెందిన అగ్రిఫ్లాస్ట్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 844, మహారాష్ట్రకు చెందిన సన్మార్గ్ ఆగ్రో సర్వీసెస్ రూ. 1035గా ధరలను కోట్ చేశాయి. తుది ధర ఎంతైనా సర్కారు మాత్రం ఒక్కో చదరపు మీటరుకు ఇప్పటికే నిర్దేశించిన మేరకు రూ. 700 ధర ప్రకారమే 75 శాతం సబ్సిడీ ఇస్తుందని, మిగిలిన సొమ్మును రైతులే భరించాలని చెబుతున్నారు. రైతులు తమకు ఇష్టమైన కంపెనీని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తామంటున్నారు. -
సేద్యానికి భారీ బడ్జెట్ రూ.3,500 కోట్లతో ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: ఈ సారి బడ్జెట్లో వ్యవసాయరంగానికి సుమారు రూ. 3,500 కోట్లు కేటాయించాలని వ్యవసాయశాఖ విన్నవించింది. బడ్జెట్లో సూక్ష్మ సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనోత్పత్తి, గ్రీన్హౌస్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ సోమవారం నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ బి.జనార్దన్‌రెడిలు పాల్గొన్నారు. రైతు ప్రభుత్వం కనుక గతం కంటే ఈసారి బడ్జెట్లో వ్యవసాయానికి అధికనిధులు కేటాయించాలనికోరారు. దీనికి ఆర్థికశాఖ కూడా సమ్మతించినట్టు తెలిసింది. రూ. 800 కోట్ల మేర ప్రణాళికేతర బడ్జెట్ కాగా, మిగిలినది ప్రణాళిక బడ్జెట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈసారి సూక్ష్మసేద్యానికి రూ. 500 కోట్లు కేటాయించాలని కోరారు. కేంద్రం ఈసేద్యానికి సబ్సిడీ తగ్గించడంతో రాష్ట్రం ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. యాంత్రీకరణకు రూ. 200 కోట్లు, విత్తనోత్పత్తికి రూ. 50 కోట్లు ఇవ్వాలని కోరారు. 300 ఎకరాల్లో గ్రీన్‌హౌసెస్ కోసం రూ. 134 కోట్లు కోరారు. ఒక్కో ఎకరా గ్రీన్‌హౌజ్‌కు రూ. 40 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. మండలాల్లో వ్యవసాయశాఖకు భవనాలు నిర్మించడానికి నిధులు కోరారు. ఒక్కో భవనానికి రూ. 10 లక్షల చొప్పున సుమారు 500 భవనాలకు నిధులు కోరారు. మండల వ్యవసాయాధికారుల అద్దె వాహనాలకోసం రూ. 15 కోట్లు కోరారు. అలాగే, వ్యవసాయశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. -
పాలీహౌస్ రైతులకు ప్రోత్సాహం ఏదీ?
చేవెళ్ల, న్యూస్‌లైన్: పాలీహౌస్‌ల (గ్రీన్హౌస్) ద్వారా ఉద్యాన పంటలను సాగుచేస్తున్న రైతులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఓ వైపు ఆధునిక వ్యవసాయంపై ఆర్భాటపు ప్రకటనలు చేస్తూ...మరోవైపు ఆసక్తి చూపుతున్న రైతులపట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ నీరు, తక్కువ స్థలంలో సాగయ్యే ఉద్యానపంటలైన పూలు, కూరగాయల పట్ల జిల్లా రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. 2000 సంవత్సరం క్రితం వరకూ మన రాష్ర్టంలో పాలీహౌస్‌ల ద్వారా పూలు సాగుచేసే రైతులు తక్కువ సంఖ్యలో ఉండేవారు. మన వాతావరణానికి తట్టుకుంటాయో లేదోనన్న అభిప్రాయంతో వీటి జోలికి పోలేదు. దీంతో వివాహాది శుభకార్యాలకు అలంకరణ కోసం ఉపయోగించే పూలను అధిక విస్తీర్ణంలో పండించే మహారాష్ట్రలోని సాంగ్లీ, సతారా జిల్లాల నుంచి దిగుమతి చేసుకునేవారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తడం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అధికం కావడం, అలంకరణ పూలకు డిమాండ్ అధికంగా ఉండడంతో క్రమంగా రైతులు పాలీహౌస్‌ల వైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. 2010లో కొంతమంది రైతులు మహారాష్ట్రకు వెళ్లి పాలీహౌస్‌ల ద్వారా పూల సాగు విధానాన్ని తెలుసుకున్నారు. నాలుగేళ్ల క్రితం కొంతమంది చేవెళ్ల ప్రాంతంలో ఈ సాగును ప్రారంభించారు. ప్రస్తుతం వందల సంఖ్యలో పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకొని పూలు, కూరగాయలను సాగుచేస్తున్నారు. ప్ర స్తుతం జిల్లాలో సుమారు 200కుపైగా పాలీ హౌస్లున్నాయంటే రైతులు వీటిపై ఎంతగా ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతోంది. సబ్సిడీ విధానం ఇదే... పదేళ్ల క్రితం పాలీహౌస్ను ఏర్పాటుచేసుకోవడానికి ఒక రైతుకు 560 స్క్వేర్మీటర్ విస్తీర్ణంలో ఉద్యానశాఖ అనుమతిచ్చేది. ఇతర రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణానికి సబ్సిడీ ఇస్తున్నారన్న రైతుల డిమాండ్ మేరకు 2010లో వెయ్యి, ప్రస్తుతం నాలుగువేల స్క్వేర్మీటర్లకు అనుమతి స్తున్నారు. ఒక పాలీహౌస్ వేసుకోవాలంటే నెట్షెడ్కు రూ.6లక్షల నుంచి 8 లక్షలు, లోపల మట్టిబెడ్కు రూ. 2లక్షల నుంచి 3 లక్షలు, ప్లాంటేషన్‌కు రూ.2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఖర్చవుతోంది. ఒక పాలీహౌస్‌కు మొత్తం కలిసి సుమారు రూ.15లక్షల వరకూ ఖర్చవుతోంది. ప్రభుత్వం ఒక స్క్వేర్మీటర్కు రూ.467 చొప్పున సబ్సిడీ ఇస్తోంది. అంటే వెయ్యి గజాల్లో వేసుకుంటే రూ.4 లక్షల 67 వేలు సబ్సిడీ ఇస్తోంది. ప్లాంటేషన్‌కు రూ.2లక్షల 50వేలు, మొత్తం రూ.7లక్షల 17 వేల సబ్సిడీ అందజేస్తోంది. సాగుచేస్తున్న పంటలివే... పాలీహౌస్‌లలో అలంకరణ పూలైన జర్భరా, కార్నేషన్, డచ్రోస్ తదితర రకాలను పండిస్తున్నారు. కూరగాయల్లో క్యాప్సికమ్, టమాట తదితరాలను సాగుచేస్తున్నారు. కొన్నిచోట్ల వాణిజ్య పంట అయిన అల్లం పండిస్తున్నారు. సబ్సిడీ కోసం ఎదురుచూపులు.. పాలీహౌస్‌ల ద్వారా పూలు, కూరగాయలను పండించడం లాభసాటిగా మారడంతో ప్రస్తుతం 300 మంది రైతులు పాలీహౌస్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2013లో ప్రభుత్వం ఆరు హెక్టార్ల వరకే సబ్సిడీ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ సుమారు 50 హెక్టార్లలో వందలాదిమంది రైతులు పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకొని సబ్సిడీ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. సబ్సిడీ వస్తుందనే ఆశతో 35 మంది రైతులు లక్షల్లో అప్పు తెచ్చి పాలీహౌస్‌లు వేసుకొని, ప్లాంటేషన్ చేసుకొన్నారు. సబ్సిడీ కోసం నెలలతరబడి ఎదురుచూస్తున్నా బడ్జెట్లేని కారణంగా ఇవ్వడంలేదు. సంఘం ఏర్పాటు... 2010లో తెలంగాణలోని పలు జిల్లాల రైతులు 15 మంది కలిసి ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘంలో 150 మంది రైతులున్నారు. పాలీహౌస్‌ల రైతులకు ఏ సమాచారం కావాలన్నా, సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తూ కార్యవర్గం చురుకైన పాత్రను పోషిస్తోంది. తమవంతు ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందిస్తోంది. పాలీహౌస్‌ల పట్ల అవగాహన కల్పిస్తోంది. కేంద్రమంత్రిని కలిసినా... రెండు నెలల క్రితం సంఘం కోశాధికారి గుండన్నగారి ప్రభాకర్‌రెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ సోలిపురం బల్వంత్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీపీ మల్గారి విజయభాస్కర్‌రెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని కలిశారు. పాలీహౌస్ రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడం, నిధుల కొరత, సబ్సిడీ విడుదలలో జాప్యం, పెండింగ్ దరఖాస్తులు తదితర విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శరద్‌పవార్ ద్వారా ఉద్యాన శాఖ కార్యాలయంలోని ఉన్నతాధికారికి విషయాన్ని చేరవేశారు. దీంతో ఆయన రాష్ట్రంలోని ఉద్యానశాఖ కమిషనర్ నుంచి నిధులకోసం రిక్విజేషన్ లెటర్‌ను పంపాలని సూచించారు. ఆ పని పూర్తయినప్పటికీ ఇంతవరకూ ఒక్కపైసా కూడా విడుదల కాలేదని సంఘం సభ్యులు అంటున్నారు.