గ్రీన్‌హౌస్ సాగులో నెదర్లాండ్ సహకారం
మంత్రి పోచారంతో నెదర్లాండ్ దౌత్య బృందం భేటీ
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్ (పాలీ హౌస్) సేద్యంలో తెలంగాణ రైతులకు సాంకేతిక సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని నెదర్లాండ్ హామీ ఇచ్చింది. ఢిల్లీలోని నెదర్లాండ్ ఎం బసీ కాన్సుల్ జనరల్ గైడో తైల్ మెన్ ఆధ్వ ర్యంలోని ప్రతినిధి బృందం సోమవారం సచివాల యంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో సమావేశమైంది. చిన్నగా ఉన్నా తమ దేశం వ్యవసాయం, మాంసం, పాడి ఉత్పత్తు ల ఎగుమతులలో ఎంతో అభివృద్ధి సాధించిందని, పూల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని నెదర్లాండ్ ప్రతినిధులు మంత్రికి వివరిం చారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసేవిధంగా పరిశ్రమలు నెలకొల్పాలని ఆ దేశ ప్రతినిధులను కోరారు.
తెలంగాణలో వ్యవ సాయం, అనుబంధ రంగాలలో అపార అవకాశాలు ఉన్నాయని... రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పుత్తులకు అగ్రి ప్రాసె సింగ్ యూనిట్లను జోడిస్తే రైతులకు మంచి ధరలు లభిస్తాయని మంత్రి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావించాక రాష్ట్రంలో గ్రీన్‌హౌస్ సేద్యానికి ప్రాధా న్యం ఇచ్చామని... ఇప్పటివరకు వెయ్యి ఎకరాలకు పైగా అనుమతులు ఇచ్చామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ భారీగా సబ్సిడీలు ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్ దేశంలోని అత్యు త్తమ వ్యవసాయ వర్సిటీ వాగెనింగన్‌లు పరిశోధన రంగంలో పరస్పరం సహకరించు కోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ సమావేశంలో వ్యవసా యశాఖ కమిషనర్ జగన్‌మోహన్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.