వాషింగ్టన్: గ్లోబల్ వార్మింగ్, గ్రీన్‌హౌస్ ఉద్గారాలు, ఇంధన వనరుల వినియోగంతో భూతాపం రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ధృవ ప్రాంతాల్లోని మంచు కరగడంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. సముద్రతీర ప్రాంతాలు నీట మునగడానికి ఇవే ప్రధాన కారణాలు. అయితే రోజురోజుకీ పెరిగిపోతున్న ప్రకృతి విధ్వంసం కారణంగా 2100 నాటికి సముద్ర మట్టం 8 అడుగులు పెరగనుండగా, ఇది 2300 నాటికి ఏకం గా 50 అడుగులకు చేరుకోనుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తల తాజా అధ్యాయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ‘ఈ శతాబ్ధం ప్రారం భం నుంచి ప్రపంచ వ్యాప్తంగా సరాసరి సముద్ర మట్టాలు 0.2 అడుగులు పెరిగాయని అమెరికాలోని రూట్జర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచ జనాభాలో సుమారు 11 శాతం మంది ప్రజలు సముద్ర మట్టానికి 33 అడుగుల లోపుఉన్న ప్రాంతాల్లో నివిసిస్తున్నారు. నీటి మట్టాల పెరుగుదల వల్ల ఇలాంటి ఎంతో మంది మనుగడనే ప్రశ్నార్థకంగా మారుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
Published Mon, Oct 8 2018 9:42 PM | Last Updated on Mon, Oct 8 2018 9:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment