ఉద్యానపంటలకు సంబంధించి ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య (ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్–ఎఫ్‌పీవో) క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీఎస్ సుబ్బరాయుడు తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్ : ఉద్యానపంటలకు సంబంధించి ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య (ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్–ఎఫ్‌పీవో) క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీఎస్ సుబ్బరాయుడు తెలిపారు. ఈ అంశంపై సోమవారం తిరుపతిలో జరిగిన జోనల్‌స్థాయి సమావేశంలో ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవిచౌదరి ఆదేశాలు ఇచ్చినట్లు మంగళవారం ఆయన 'సాక్షి'కి తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 22 ఏఫ్‌పీఓలు ఏర్పాటు చేశామన్నారు.
వారందరికీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు డిసెంబర్ నెలాఖరులోగా సర్వసభ్య సమావేశాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంటల వారీగా క్లస్టర్లతో పాటు పాలీహౌస్, షేడ్‌నెట్స్, గ్రీన్‌హౌస్, ప్యాక్‌హౌస్ లాంటి రక్షిత సేద్యపు పద్ధతుల ప్రోత్సానికి ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారన్నారు. అలాగే కమిషనర్ ఆదేశాల మేరకు వచ్చే 2017–18తో పాటు వచ్చే ఐదేళ్లకు సంబంధించి వార్షిక ప్రణాళికలు, ప్రతిపాదనలు తయారు చేసి పంపనున్నట్లు తెలిపారు. యాక‌్షన్‌ప్లాన్ తయారీకి వారంలోగా ఏడీలు, హెచ్‌ఓలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.