సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల నియామకంలో గత పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, కొత్త ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేయాలని సంకల్పించింది. గతంలో పాలకమండలిలో 18 మంది ఉంటే, అందులో నలుగురు మార్కెటింగ్, మత్స్య, ఉద్యానవన, వ్యవసాయ శాఖల ఏడీలు సభ్యులుగా ఉండేవా రు.
మిగతా 14 మందిలో ఐదుగురు సన్న, చిన్నకారు రైతులు, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీ, మహిళావర్గాల నుం చి ఒక్కొక్కరు ఉండేవారు. కొత్త కమిటీల ఏర్పాటు నేపథ్యంలో మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధి లో ఉన్న 13 మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది.
నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి 10 నుంచి 15 మంది పోటీ పడుతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి, నిజామాబాద్, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాలు కూడా ఈ మార్కెట్లోకే వస్తాయి. మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన దాదన్నగారి విఠల్‌రావుకు కేసీఆర్ గట్టి హామీ ఇచ్చా రని అంటున్నారు. డిచ్‌పల్లి జడ్‌పీటీసీ మాజీ సభ్యుడు దినేశ్‌కుమార్, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శక్కరికొండ కృష్ణ, ధర్పల్లి నుంచి పీసు రాజ్‌పాల్‌రెడ్డి, సిరికొండ మండలం నుంచి గడీల రాములు, జక్రాన్‌పల్లి మండలం నుంచి అర్గుల్ నర్సయ్య రేసులో ఉన్నారు. టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి కూడా ఈ పదవిని కోరుకుంటున్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి, భిక్కనూర్ మార్కెట్ కమిటీలున్నాయి. కామారెడ్డి చైర్మన్ పదవిని ఇటీవల జడ్‌పీటీసీ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయిన మంద వెంకటేశ్వర్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హామీ ఇచ్చిన ట్టు ప్రచారం జరుగుతోంది. మార్కెట్ కమి టీ మాజీ చైర్మన్ మాచారెడ్డి మండలం అక్కాపూర్‌కు చెందిన పొన్నాల లక్ష్మారెడ్డి కూడా రేసులో ఉన్నారు. భిక్కనూరు మార్కెట్ కమిటీకి సంబంధించి అధికారిక ప్రక్రి య పూర్తి కాకపోవడంతో ఇంకా అక్క డ చైర్మన్ పదవి విషయంలో ఎవరూ బయటపడటం లేదు.
ఆర్మూర్‌లో ఆర్మూర్, జక్రాన్‌పల్లి, బాల్కొండ, వేల్పూర్ మండలాలను కలుపుతూ మార్కెట్ కమిటీ ఉంది. ఆర్మూర్ నియోజకర్గ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని బాల్కొండ, వేల్పూర్ మండలాలు, నిజామాబాద్ రూరల్ పరిధిలోని జక్రాన్‌పల్లి మండలం ఉండడంతో ముగ్గురు శాసనసభ్యులకు సమ్మతమయ్యే నేతనే మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి సన్నిహతులుగా ఉన్న పలువురు నాయకులు చైర్మన్ పీఠాన్ని దక్కిం చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మూర్ మండల పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి గంగారెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జీ యామాద్రి భాస్కర్, అంకాపూర్ సొసైటీ చైర్మన్ మార గంగారెడ్డి, వేల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు కొట్టాల చిన్నారెడ్డి తదితరులు పోటీలో ఉన్నారు.
జుక్కల్ నియోజకవర్గంలో మద్నూర్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. మద్నూర్ చైర్మన్ కోసం జుక్కల్ మండలానికి చెందిన మాజీ జడ్‌పీటీసీ సాయాగౌడ్, బిచ్కుంద మండలానికి చెందిన శ్రీహరి, సీతారాంపల్లికి చెందిన ఎం.సిద్ధిరాం రేసులో ఉన్నారు. పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని నిజాంసాగర్ మండ లానికి చెందిన జడ్‌పీటీసీ మాజీ సభ్యుడు, టీఆర్‌ఎస్ నాయకుడు వినయ్‌కుమార్, పిట్లం మండలానికి చెందిన అన్నారం వెంకట్రాంరెడ్డి, తిమ్మానగర్ దేవేందర్‌రెడ్డితో పాటు ప్రస్తుత మార్కె ట్ కమిటి చైర్మన్ క్రిష్ణారెడ్డి ఆశిస్తున్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి, గాంధారి మార్కెట్ కమిటీలున్నాయి. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం కృష్ణాగౌడ్ (సిట్టింగ్ చైర్మన్), అశోక్‌రెడ్డి (లింగంపేట మండలం శెట్పల్లిసంగారెడ్డి) వెంకట్‌రెడ్డి (నాగిరెడ్డిపేట) పోటీ పడుతున్నారు. గాంధారి చైర్మన్ పదవిని సత్యం (సర్వాపూర్), రాంకిషన్‌రావు (గాంధారి) ఆశిస్తున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవికి టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నార్ల సురేష్ గుప్తా పోటీలో ఉన్నా రు. వర్ని మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవికి మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నరొజీ గంగారాం పోటీలో ఉన్నారు. మంత్రి ఆశీస్సులు మెండుగా ఉన్న వీరిద్దరు చైర్మన్‌లుగా ఖరారైనట్లేనన్న చర్చ ఉంది.
బాల్కొండ నియోజకవర్గం కమ్మర్‌పల్లి మా ర్కెట్ కమిటీకి ఉప్లూర్‌కు చెందిన చిన్నారెడ్డి, భీమ్‌గల్ జడ్‌పీటీసీ మాజీ సభ్యుడు ప్రకాష్‌గౌడ్, కమ్మర్‌పల్లి నాయకులు స్వామిరెడ్డి, వే ముల శ్రీనివాస్, మోర్తాడ్ మండలం సుంకెట్‌కు చెందిన తీగెల సంతోష్ పోటీ పడుతున్నారు. చిన్నారెడ్డికి ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రె డ్డి, జీవన్‌రెడ్డి, ఎంపీ కవితల ఆశీస్సులున్నాయన్న ప్రచారం ఉంది. ప్రకాష్‌గౌడ్‌కు కేసీఆ ర్‌తోనే సత్సంబంధాలు ఉన్నాయంటుం డగా, మిగిలిన నాయకులు ప్రశాంత్‌రెడ్డి మెప్పు కోసం యత్నిస్తున్నారు.
బోధన్ వ్యవసాయ మార్కెట్ కోసం చాలామందే పోటీ పడుతున్నారు. ఖండ్‌గాం ఎం పీటీసీ సభ్యుడు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షు డు వి.శ్యాంరావు, బోధన్‌కు చెందిన ప్రము ఖ వ్యాపారి, మైనార్టీ నాయకుడు కరీం ఈ ప దవిని ఆశిస్తున్నారు. ఇంతకు ముందు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అనుచరులే చైర్మన్లుగా వ్యవహరించగా, ఎమ్మెల్యే షకీల్ ఎవరికి అ వకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాలు ని జామాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలోకి వ స్తాయి. ఈ నియోజకవర్గంలోని సిరికొండ మండలం మాత్రం భీంగల్ మార్కెట్ కమిటీ పరిధికి వస్తుంది. భీమ్‌గల్ చైర్మన్ పదవి కో సం పలువురు పోటీ పడుతున్నారు.
ఆశల పల్లకి
Published Mon, Aug 4 2014 4:11 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement