fisheries
-
మత్స్యకారుల ఆశలపై నీళ్లు చల్లిన కూటమి ప్రభుత్వం
సముద్రపు ఆటుపోటుల సమయంలో ఉండే అల జడి ఇప్పుడు మత్స్య కారుల కుటుంబాల్లో కని పిస్తోంది. నిత్యం ఉద్రేకంగా ఉరకలు వేసే సము ద్రంతో సావాసం చేసే గంగపుత్రులకు పొంచి ఉన్న మరో పెనుముప్పు ఇందుకు కారణం. గంగమ్మ కరుణిస్తేనే కడుపు నిండే తీరప్రాంత మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉప్పెనలాంటి ముప్పు తీసుకొని వచ్చింది. కష్టాలు తీర్చవలసిన ప్రభుత్వమే ముప్పులాగ మారితే మత్స్యకారుల పరిస్థితి చుక్కాని లేని నావలా మారడం తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో సువిశాలమైన 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతములో వేట కోసం కనీస సౌకర్యాలు లేక ఇక్కడ మత్స్య కారులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళి సమస్యలు కొనితెచ్చుకొంటున్నారు.ఇది గమనించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో 10 ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో జవ్వలిదిన్నె ఫిషింగ్ హార్చర్ ప్రారంభమయ్యింది. మరికొన్ని సగానికి పైగా పనులు పూర్తిచేసుకుంటున్నాయి. దీనితో తమ జీవితాలలో వెలుగులు రానున్నాయని ఆనందంగా ఉన్న మత్స్యకారుల ఆశలుపై కొత్తగా వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం నీళ్ళు చల్లుతూ ఫిషింగ్ హార్బర్లను ప్రైవేట్ పరం చేసేందుకు సన్నహాలు ప్రారంభించింది. ఈ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వనిస్తూ కూటమి ప్రభుత్వం టెండర్లను పిలిచి మత్స్యకారుల కుటుంబాల్లో అమవాస్య చీకటిని నింపింది.గతంలో వైస్ జగన్ ప్రభుత్వం రూ. 3,520 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీ పట్నం, ఉప్పాడ, మంచినీళ్ళుపేట, బూడగడ్ల పాలెం, పుడిమెడక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప లాంటి 10 ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు కోసం పనులు ప్రారంభించింది. ఈ హార్బర్లు అందుబాటులోకి వస్తే సుమారు 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు సుమారు 5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపదను పెంచుకొనే వెసులు బాటు ఉంటుంది. దీనితోపాటు ప్రత్యక్షంగా, పరో క్షంగా వేలాది మంది మత్స్య కారులకు జీవనోపాధి పెరుగుతుంది. ఇటువంటి హార్బర్లను ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేటుకు అప్పగిస్తే, కార్పొరేట్ల చేతుల్లోకి మత్స్యకారుల బతు కులు వెళతాయి.వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం ‘మత్స్యకార భరోసా’ పేరుతో భృతి అందించేది. దీన్ని కూడా రీ సర్వే పేరుతో కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వేట నిషేధ సమయంలో నాలుగు వేల రూపాయల భృతి ఇచ్చేది. దాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 10,000కు పెంచింది. అన్నిరకాల బోట్లతో పాటు, తెప్పలు, నాటు పడవలకు మత్యకార భరోసా అందించింది. గత 5 ఏళ్లలో ప్రతీ సంవత్సరం మే నెలలో మత్స్యకార భరోసా అందిస్తూ 5 ఏళ్ళల్లో రూ. 538 కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకం అమలు చేయడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!జగన్ ప్రభుత్వం మత్స్యకారులకు ఇతర పథకాల ద్వారానూ చేదోడుగా వాదోడుగా నిలిచింది. చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం రూ. 5 లక్షలు పరిహారం అందించగా... జగన్ ప్రభుత్వం దాన్ని రూ. 10 లక్షలకు పెంచి వెనువెంటనే అందించింది. గత ఐదేళ్లలో 175 మంది గంగపుత్రులు మృతి చెందగా వారి కుటుంబాలకు ఒక్కక్కరికి రూ. 10 లక్షలు చొప్పున జగన్ ప్రభుత్వం రూ. 17.50 కోట్ల పరిహారాన్ని అందజేసింది. అదేవిధంగా గతంలో ఆరు రూపాయలుగా ఉన్న డీజిల్ సబ్సిడీని తొమ్మిది రూపాయలకు పెంచింది. ఈ లెక్కన ఐదేళ్లలో బోట్ల యజమానులకు రూ. 148 కోట్లు చెల్లించింది. వీటితో పాటు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్పీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ. 78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపు లైను తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు 5 విడతల్లో రూ. 647.44 కోట్లు సహాయాన్ని జగన్ ప్రభుత్వం అందించింది.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా? మొట్టమొదటిసారిగా మత్స్యకార వర్గానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి సమున్నత గౌరవం కల్పించింది వైఎస్సార్సీపీనే అనేది మరువరాదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించాలి. అలాగే ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటీకరణను నిలిపి వేయాలి.- బందన పూర్ణచంద్రరావు జాతీయ మత్స్యకార సంఘం వైస్ చైర్మన్(నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం) -
అంతర్జాతీయ ప్రాసెసింగ్ హబ్‌గా భారత్
సాక్షి, విశాఖపట్నం: మత్స్య రంగంలో భారత్‌ను అంతర్జాతీయ ప్రాసెసింగ్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ఫిషరీస్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. రొయ్యల పెంపకం–వాల్యూచైన్ బలోపేతం చేయడంపై దృష్టి సారించేలా మత్స్య ఎగుమతి ప్రమోషన్‌పై వాటాదారులతో సంప్రదింపులకు విశాఖపట్నంలో శుక్రవారం జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి రాజీవ్ సింగ్‌తో పాటు మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో 9 శాతం వృద్ధి రేటుతో మత్స్య రంగం ముఖ్య భూమిక పోషి స్తోందన్నారు. ఈ వృద్ధి 2047 నాటికి వికసిత్ భారత్‌గా అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ మాట్లాడుతూ పీఎంఎంఎస్ వై పథకం కింద నిధుల కేటాయింపులు పెంచుతూ ఫిషరీస్, ఆక్వా పరిశ్రమలకు చేయూతనందిస్తున్నామని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ రూ.1,564 కోట్ల విలు వైన 218 కొత్త ప్రాజెక్టుల అమలు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఫీడ్ ఇన్పుట్లు, ఇతర సౌకర్యాలకు సంబంధించిన దిగుమతి సుంకాలను తగ్గించామని తెలిపారు. -
ఉపాధికి గడ్డుకాలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వ్యవసాయం, మత్స్యకార రంగాల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉపాధి దొరికేది గ్రానైట్ పరిశ్రమల్లోనే. ఇప్పుడా పరిశ్రమలు మూతబడ్డాయి. నూతన పాలసీ పేరుతో గ్రానైట్ పరిశ్రమలను ప్రభుత్వమే మూసివేయించింది. రెండు నెలలుగా గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనులు జరగడం లేదు. ఉపాధి లేక కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి. వారి ఆకలికేకలను జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.ఇప్పట్లో పరిశ్రమలు తెరుచుకునే పరిస్థితి లేదని భావిస్తున్న కార్మికులు.. మళ్లీ వలస బాట పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 150 క్వారీలు ఉన్నాయి. వాటికి అనుసంధానంగా మరో 150 పాలిíÙంగ్ యూనిట్లు, 30 క్రషర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా సుమారు 25 వేల మంది, పరోక్షంగా 45 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో జిల్లాకు చెందిన వారే కాకుండా ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పశి్చమ బెంగాల్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. కూటమి నేతల పెత్తనం.. టీడీపీ అధికారంలోకి వచి్చన వెంటనే గ్రానైట్ పరిశ్రమలపై కూటమి నేతల పెత్తనం మొదలైంది. మళ్లీ తాము చెప్పేవరకు గ్రానైట్ పరిశ్రమల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదని అధికారవర్గాల ద్వారా ఆదేశించారు. దీనికి నూతన గ్రానైట్ పాలసీ అనే ముసుగు తొడిగారు. పర్మిట్లను ఇవ్వకుండా నిలిపేశారు. దీంతో గ్రానైట్ క్వారీలతో పాటు వాటి అనుబంధ యూనిట్లు అన్నీ రెండు నెలల క్రితమే మూతపడ్డాయి. దీంతో వాటిపై ఆధారపడ్డ కార్మికులంతా గగ్గోలు పెడుతున్నారు.ఈ సంక్షోభం ఒక్క కార్మికులపైనే కాదు యాజమాన్యాలపైనా ప్రభావం చూపింది.. ఇక్కడ గ్రానైట్ బ్లాకులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లేవి. ప్రస్తుతం విక్రయాలు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు తీసిన బ్లాక్‌లు ఆరు బయటే ఉండిపోవటంతో కలర్ మారి మార్కెట్లో విలువ తగ్గిపోయేలా ఉంది. ఫలితంగా గ్రానైట్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోనుంది. అటు కార్మికుల ఆకలికేకలు, ఇటు యాజమాన్యాల నష్టాలను క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలించింది. కార్మికుల వేదన వర్ణనాతీతం గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న టెక్కలి మండలంలో కార్మికుల వేదన వర్ణనాతీతంగా ఉంది. బొరిగిపేట సమీపంలోని ఓ క్వారీ సూపర్వైజర్ మాట్లాడుతూ.. తాను టీడీపీ అభిమానినని, కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు మంచి జరుగుతుందని భావిస్తే చివరకు కడుపుకొట్టారని చెప్పారు.పరిశ్రమలు తెరిపించండి అని కోరడానికి ఇక్కడి మంత్రి వద్దకు వెళితే.. పరిశ్రమ తెరవకపోతే తినడం మానేస్తావా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడిపేట, మెలియాపుట్టి, దీనబంధుపురం, సవర, జాడుపల్లి, నిమ్మాడ తదితర గ్రామాల్లో నివసించే కార్మికుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఫ్యాక్టరీలు ఆపేసి తమ ఉపాధిపై దెబ్బకొట్టి పస్తులు పెట్టడం ఏంటని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాసుల కక్కుర్తి కోసమే.. గ్రానైట్ పరిశ్రమల నుంచి కాసులు ఆశించే ఇలా చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా 2014–19లో గ్రానైట్ కార్యకలాపాలన్నీ మంత్రి సోదరుడు కనుసన్నల్లోనే జరిగేవి. వారి కుటుంబానికి కూడా గ్రానైట్ అనుబంధ పరిశ్రమలు ఉండటంతో వాటి ముసుగులో చక్రం తిప్పేవారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వారి పప్పులు ఉడకలేదు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో గ్రానైట్ కంపెనీలపై పెత్తనం కోసం ప్రయతి్నస్తున్నారు. దానికి నూతన పాలసీ అంటూ బూచిగా చూపిస్తున్నారు అని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి పోయింది మా ఊరికి దగ్గరలో మేలిసతివాడ వద్ద క్వారీలో జాకీ లేబర్‌గా పనిచేస్తుండేవాడిని. క్వారీలు నడవక ఉపాధి పోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా లాంటి పేదలకు పెద్ద ఇబ్బందులు వచ్చాయి. గత ప్రభుత్వంలో బాగానే క్వారీలు నడచి జీతాలు వచ్చాయి. –కొర్రాయి నారాయణ, జీడిపేట, వీకేజీ క్వారీ మేలిసతివాడగ్రానైట్ కార్మికులను రోడ్డున పడేశారు కూటమి ప్రభుత్వం గ్రానైట్ క్వారీల నిర్వాహణపై ఆంక్షలు పెట్టింది. దీని వలన జిల్లాలోని క్వారీలు, వాటికి అనుసంధానంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లు, క్రషర్లు ఆగిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు నడిరోడ్డున పడ్డారు. జిల్లాలో ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందెన్నడూ లేదు. దీని వలన జిల్లాలో వలసలు ఆరంభమయ్యాయి. జిల్లాలో వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగ యువతకు ఉపాధికి ఆసరాగా ఉన్న గ్రానైట్ రంగాన్ని కుదేలు చేస్తున్నారు. –షణ్ముఖరావు, గ్రానైట్ కార్మికుల యూనియన్ జిల్లా నాయకుడుపని లేదు.. బత్తాలు లేవు ఈ ప్రభుత్వం వచ్చాక క్వారీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీని వలన పని లేదు. బత్తాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజు రేపు అని చెబుతున్నారు కానీ క్వారీలు తెరవడం లేదు. పని లేక పస్తులుంటున్నాం. –ముఖలింగాపురం అప్పారావు, జాకీ లేబర్, ప్రియాంక గ్రానైట్, జీడిపేట -
బీఎఫ్ఎస్సీలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం(నరసాపురం)లో 2024–25 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ) నాలుగేళ్ల కోర్సులో సీట్ల భర్తీ కోసం యూనివర్సిటీ రిజి్రస్టార్ ఒ.సుధాకర్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు.‡ నరసాపురంలోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో 60 సీట్లు, ముత్తుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో 40 సీట్లు చొప్పున మొత్తం 100 సీట్లు ఉన్నాయి. పది శాతం సూపర్‌న్యూమరీ సీట్లను ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. 25 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాలకు చెందిన పిల్లలకు ఇస్తారు. ఈ కోటాలో సీట్లకు దరఖాస్తు చేయాలంటే విద్యార్థులు నాలుగేళ్లు గ్రామీణ పాఠశాలల్లో చదివి ఉండాలి. తల్లిదండ్రులు లేదా విద్యార్థి కనీసం ఎకరం భూమి కలిగి ఉండాలి. మొత్తం సీట్లలో 85 శాతం స్థానికులకు ఇస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడవచ్చు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ నేచురల్ సైన్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఏపీఈఏపీసెట్–2024 ర్యాంక్ ఆధారంగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 20వ తేదీ లోగా యూనివర్సిటీ వెబ్ సైట్ (ఠీఠీఠీ.్చpజu.్చp.జౌఠి.జీn) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సెపె్టంబర్ 10న సీట్లు కేటాయిస్తారు. ఇతర వివరాల కోసం 0866–3500560, 8985318321 నంబర్లలో సంప్రదించాలి. -
‘మీన’మేషాలు!
సాక్షి, సిద్దిపేట : రాష్ట్రంలో స్థానిక జాతుల చేపలు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. కొన్ని రకాల చేపలనే విస్తృ తంగా పెంచడం, మిగతా వాటి బ్రీడింగ్, పరిరక్షణ లేకపోవడమే దీనికి కారణమవుతోంది. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల బీఎస్సీ (ఫిషరీస్), ఎమ్మెస్సీ (ఫిషరీస్) అధ్యాపకులు, విద్యార్థులు చేపల జీవవైవిధ్య స్టడీ ప్రాజెక్ట్ చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్థానిక చేపలను సేకరించి భద్రపరుస్తున్నారు. ప్రభుత్వం సహకరిస్తే స్థానిక రకాల చేపల బ్రీడింగ్ చేపడతామని చెబుతున్నారు. ఎన్ని ఉన్నా ఆ 4 రకాలే ఎక్కువ రాష్ట్రంలో మొత్తం 166 రకాల చేపలుండగా.. నాలుగు రకాల చేపలే ఎక్కువగా లభిస్తాయి. రోహు (రవ్వ), బొచ్చ, బంగారు తీగ, బొమ్మె చేపలే విస్తృతంగా పెంచడం, వినియోగించడం జరుగుతోంది. మిగతా రకాల చేపలు మెల్లగాఅంతరించిపోతున్నాయి. భవిష్యత్తులో పలు రకాల చేపల పేర్లు వినడమే తప్పితే చూసే పరిస్థితి ఉండదని నిపుణులు అంటున్నారు.ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తమ రెడ్‌బుక్‌లో ఇప్పటికే పలు రకాల చేపలు అంతరించిపోతున్నాయని వెల్లడించింది. అందులో తెలంగాణకు చెందిన 20 రకాల జాతుల చేపలు కూడా ఉండటం గమనార్హం.65 రకాల చేపలు సేకరించి.. చేపల జీవవైవిధ్య స్టడీ ప్రాజెక్ట్‌లోభాగంగా సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు కలసి ఇప్పటివరకు 65 రకాల చేపలను సేకరించారు. వాటిని ముందు తరాలకు చూపించడం, అందించడం కోసం ప్రయత్నిస్తున్నారు. సహజ ఆవాసాల్లో లభించే వివిధ రకాల చేపలను సేకరించి, స్పెసిమెన్లనూ నిల్వ చేస్తున్నారు. ఇప్పటివరకు గోదావరి, మున్నేరు, కృష్ణా నదులు, వైరా, పాలేరు రిజర్వాయర్ల నుంచి మంచినీటిలోపెరిగే చేపలను తీసుకువచ్చారు. మలుగు పాము పాములా కనిపిస్తున్నా ఇది చేపనే. మలుగు పాముగా పిలిచే ఈ చేపలు సాధారణంగా2 నుంచి 3 అడుగుల మేర పెరుగుతాయి. మత్స్యకారులు దీనిని మున్నేరు వాగులో పడితే విద్యార్థులు కొనుగోలు చేసి తెచ్చారు. దీనికి పొలుసులు ఉండవు.ఇది బ్రీడింగ్ సమయంలో వలస వెళ్తుంది.మగ దుమ్మ ఈ చేప పేరు మగ దుమ్మ. ఇది వైరా రిజర్వాయర్‌లో లభించింది. అంతరిస్తున్న చేపల రకాల్లో ఇది కూడా ఉంది. క్యాట్ ఫిష్ జాతికి చెందిన ఈ చేపల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఒమెగా–3 ఫ్యాట్ అధికంగా ఉంటుంది. చుక్క పాంప్రెట్ చేప ఇది చుక్క పాంప్రెట్ చేప.ఈ రకం చేపలువలకు చిక్కాయంటే మత్స్యకారులకుపండగే. ఇవి బాగా రుచిగా ఉండటంతో ముంబై, కేరళ ప్రాంతాల ప్రజలు లొట్టలేసుకొని తింటారు. ఇవి మున్నేరు నదిలో ఉన్నాయి. ఒక్క సిద్దిపేటలోనే ఎమ్మెస్సీ ఫిషరీస్ కోర్సురాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బీఎస్సీ (ఫిషరీస్) కోర్సును నిర్వహిస్తున్నా.. ఒక్క సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాల (అటానమస్)లో ఎమ్మెస్సీ(ఫిషరీస్) కోర్సు అందుబాటులో ఉంది. 2017–18లో ప్రారంభమైనఈ పీజీ కోర్సును ఏటా 40 మంది విద్యార్థులు పూర్తి చేస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేకంగా చేపల ఫారి్మంగ్ తీరును చూపించేందుకు.. కళాశాల ప్రాంగణంలోనే రకరకాల చేపలను పెంచుతున్నారు. ఆ చేపలకు ఫుడ్‌ను కాలేజీలోనే తయారు చేస్తున్నారు. అలాగే ఎక్వేరియం చేపల బ్రీడింగ్ కూడా చేస్తున్నారు. బ్రామ బెలగారి ఈ చేపను ఓసియో బ్రామ బెలగారి చేపఅంటారు. దీనిని గోదావరి నది నుంచితీసుకువచ్చారు. ఇవి అచ్చం పరక చేపల మాదిరిగా ఉంటాయి. ఈ రకం చేపలుఅంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. స్థానిక చేపల విత్తనోత్పత్తి చేస్తాం స్థానికంగా లభించే రకరకాల చేపలు అంతరించి పోతున్నాయి. స్థానిక చేపల విత్తనోత్పత్తి దిశగా ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వం సహకరిస్తే స్థానిక చేపల విత్తనోత్పత్తి చేసి అందిస్తాం. మా కళాశాలలో చదివిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు ఫిషరీస్ చేసిన విద్యార్థులను వినియోగించుకోవడం వల్ల మేలు జరుగుతుంది. – అయోధ్యరెడ్డి, ఫిషరీస్ హెడ్, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల సిద్దిపేట65 రకాలు సేకరించాం.. చేపల జీవవైవిధ్య స్టడీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు 65 రకాల చేపలను సేకరించి భద్రపరిచాం. కృష్ణా, గోదావరి, మున్నేరు నదులు, వైరా, పాలేరు రిజర్వాయర్ల నుంచి అంతరించి పోతున్న చేపలను సేకరించాం. ఏదైనా కొత్త రకం చేప పడితే చెప్పాలని మత్స్యకారులను కోరాం. ఫిషరీస్ చదివిన వారికి ప్రభుత్వంఉద్యోగాలు కల్పించి మన మత్స్య సంపదను కాపాడాలి. – సాయికుమార్, ఎమ్మెస్సీ సెకండియర్ -
మత్స్య రంగంలో ఏపీ అద్భుత ప్రగతి
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: మత్స్య రంగంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధించిందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల కితాబిచ్చారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. 2023లో బెస్ట్ మెరైన్ స్టేట్‌గా ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా–2023లో కేంద్రమంత్రి రూపాల చేతుల మీదుగా ప్రతిష్టాత్మక బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఆప్సడా) కో–వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్, మత్స్యశాఖ అడిషనల్ కమిషనర్ అంజలి అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రూపాల మాట్లాడుతూ.. మత్స్య ఉత్పత్తుల దిగుబడులు, ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఆక్వా ఆధారిత రాష్ట్రాలు ఆంధ్రలో తీసుకొచ్చిన చట్టాలు, మార్పులపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ఇస్తున్న చేయూతతో నాణ్యమైన ఉత్పత్తుల సాధనకు మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగు పర్చాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ కృషి ఫలితమే ఈ సందర్భంగా అప్సడా కో–వైస్ చైర్మన్ రఘురామ్ మాట్లాడుతూ.. నాలుగేళ్లలో రెండోసారి బెస్ట్ మెరైన్ స్టేట్‌గా ఏపీ నిలవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో మత్స్యరంగ సుస్థిరాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులే కారణమన్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు ఆక్వా రైతులకు భరోసా, భద్రత కల్పించేందుకు అప్సడా చట్టంతో పాటు నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం ఏపీ స్టేట్ సీడ్, ఫీడ్ యాక్టులను తీసుకొచ్చిందన్నారు. అడిషనల్ కమిషనర్ అంజలి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2018–19లో 39 లక్షల టన్నులున్న దిగుబడులు 2022–23లో ఏకంగా 52 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. -
Live Stock Expo : పశు సంపద రంగానికి తగినంత గుర్తింపు రావాలి
ఎల్డిఎఫ్ ఇండియా, పశువులు, పాడి పరిశ్రమ మరియు మత్స్య పర్యావరణ వ్యవస్థలన్నింటిని ఒకే పైకప్పు కిందకు తీసుకువచ్చే భారతదేశపు మొట్టమొదటి ఎక్స్పో గురువారం హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఆదివారం వరకు మూడురోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో సుమారు 80 స్టాల్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్, ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ (AFTS) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డాక్టర్ తరుణ్ శ్రీధర్, మాజీ యూనియన్ సెక్రటరీలతో పాటు పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ వేడుకలో పాల్గిన్నారు. ఈ సందర్భంగా డా. తరుణ్ శ్రీధర్ మాట్లాడుతూ.. పశుసంపద సరైన గుర్తింపుకు నోచుకోలేదని, భారత్‌లో ఇప్పటికే చాలామంది గ్రామాల్లోనే నివసిస్తున్నారని తెలిపారు. అసలు పశువులతో సంబంధం లేకుండా ఏ రైతును చూడలేరన్నారు. భారతదేశం గణనీయమైన పశువుల జనాభాను కలిగి ఉందని, ప్రపంచ చేపల ఉత్పత్తి సహా పాల ఉత్పత్తి వినియోగంలో భారత్ ముందుందని పేర్కొన్నారు. ఎల్‌డిఎఫ్‌పై అంకితమైన ఎక్స్పో చాలా అవసరం. ఇది త్వరలో ప్రపంచ స్థాయిలో బోస్టన్ సీఫుడ్స్‌తో సమానంగా ఎదుగుతుందనన్నారు.ఇలాంటి ఎక్స్‌పోలు మన బలాన్ని ప్రదర్శించడమే కాకుండా విధి విధానాలను నిర్మించే ప్రభుత్వ అధికారులను మేల్కొల్పుతాయని అన్నారు డాక్టర్ తరుణ్ శ్రీధర్. 2022-23లో రికార్డు స్థాయిలో 174 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించింది. ఇది రూ.63,960 కోట్ల సీఫుడ్ ఎగుమతులను సాధించిందని, ఇంకా, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు అని భారతదేశంలోని చేపలలో 68% ఆక్వాకల్చర్ రంగం నుండి వస్తుందని తెలిపారు. పశువులు శక్తి. పశువులు ఎల్లప్పుడూ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ ఇది చాలా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, యువతకు ఆకర్షణీయంగా కనిపించదు. అయితే ప్రపంచం మొత్తం సహజ, సేంద్రియ, పున రుత్పత్తి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నందున మంచి రోజులు వచ్చాయి. పశుసంవర్ధక రంగం ఇప్పుడు ఆహార భద్రత నే కాక, పోషకాహార భద్రతగానూ గొప్ప సంభావ్యత కలిగిన చాలా పెద్ద రంగంగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఆకలి సూచీలో 121 స్థానాల్లో భారతదేశం 107 స్థానాల్లో ఉన్న నేపథ్యంలో పశు సంపదకు సంబంధించిన ఉత్పత్తులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మాంసం తినే జనాభాలో 70% కంటే ఎక్కువ భారతదేశం. 2050లో 18.1 MT తలసరి మాంసం వినియోగం 13.8 కిలోల అంచనాగా ఉందని NABARD చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల అన్నారు. గోదావరి కట్స్‌లో 25 కిలోల ఎల్లోఫిన్ ట్యూనా అనే అరుదైన చేపలను ప్రదర్శించారు. ఎల్లోఫిన్ ఆరు లేదా ఏడు సంవత్సరాల వరకు జీవించగలదు. ఇవి అధిక వలసలు, పసిఫిక్, అట్లాంటిక్ -హిందూ మహాసముద్రాల అంతటా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జీవరాశి అయిన ఎల్లో ఫిష్ ట్యూనా అంతరించిపోతోంది. భారత ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు డెవలప్మెంట్ కమీషనర్ డి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ''భారతదేశంలో 46 (23 మంది స్థానిక, 23 మంది స్థానికేతర) సూక్ష్మ, చిన్న వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు మంత్రిత్వ శాఖ వీలు కల్పించింది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన డబ్ల్యువిఆర్ రెడ్డి మాట్లాడుతూ మనమందరం చిన్నతనం నుండే పశువులతో ముడిపడి ఉన్నాం. కానీ మన యువత ఇప్పుడు దానిపై ఆసక్తి చూపడం లేదు. యువతను ఆకర్షించేందుకు వీలుగా ఈ రంగాన్ని బ్లూ కాలర్ లాంటి రంగంగా మార్చాలి. మీరు సాంకేతికతపరమైన ఆవిష్కరణలను తీసుకురావాలని ఆయన పిలుపునిచారు.దళిత బంధు లబ్ధిదారులు కూడా అవకాశాలను అన్వేషించడానికి ఎక్స్పోను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎక్స్‌పోలో కంట్రీ చికెన్ వంటి అనేక స్టాల్స్ ఉన్నాయి. దీనిని ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు సాయికేష్ గౌండ్, మొహమ్మద్ సమీ ఉద్దీన్ స్థాపించారు. ఆధునిక,పరిశుభ్రమైన మాంసం దుకాణాలు అవసరమని చాలా మంది తెలియచేశారు. కూరగాయలకు మంచి, పరిశుభ్రమైన దుకాణాలు ఉన్నప్పటికీ, పరిశుభ్రమైన మాంసం దుకాణాలు ఎక్కువగా కనిపించవు. గడ్డకట్టిన చేపలను కొనడానికి ప్రజలు నిరాకరిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అన్నీ క్రమంగా మారుతూ వస్తున్నాయి. అందరూ తమ వ్యాపారాలకి ప్రజలను ఆకర్షించే కొత్త దారులను వెతుకుతున్నారు. -
సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం
సాక్షి, అమరావతి: మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో మత్స్య సంపదను వేటాడే వేళ గంగపుత్రులు ఆపదలో చిక్కుకుంటే.. రక్షించేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెల్ సిగ్నల్ అందకపోయినా.. రక్షణ పరిధిలోకి తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్ల వరకు రాష్ట్ర పరిధిలో ఉండగా.. 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు దేశీయ జలాలు. 200 నాటికల్ మైళ్ల దూరం దాటితే అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లు తీరం నుంచి 4 నాటికల్ మైళ్ల వరకు వెళ్తుంటాయి. మోటరైజ్డ్ బోట్లు 12 నాటికల్ మైళ్ల వరకు, మెకనైజ్డ్ బోట్లు 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు వెళ్లి వేట సాగిస్తుంటాయి. రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22 వేల మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 1.60 లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఇప్పటివరకు వేట సాగించే మత్స్యకారులకు ఇన్కాయిస్ సంస్థ శాటిలైట్ ద్వారా సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాలను (పీఎఫ్జెడ్–పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్) గుర్తించి బోట్లలో అమర్చే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏఐఎస్), మత్స్య శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్స్ ద్వారా 12 నాటికల్ మైళ్ల పైబడి దూరం వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు సమాచారం అందిస్తున్నాయి. ఈ సమాచారం సంప్రదాయ, మోటరైజ్డ్ బోట్లకు అందించే అవకాశం లేదు. పైగా ఇది 2–3 రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. మరో వైపు ఏదైనా ఆపదలో ఉంటే తమ క్షేమ సమాచారం మొబైల్స్‌కు ఉండే సిగ్నల్స్‌పై ఆధారపడి ఉంటుంది. సిగ్నల్ మిస్ అయితే తీరానికి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఈ పరిస్థితికి ఇక చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. 100 శాతం సబ్సిడీపై.. కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్‌పాండర్)ను 12 నాటికల్ మైళ్లకు పైబడి దూరం వెళ్లే మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లకు అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.36,400 విలువైన ఈ పరికరాన్ని 100 శాతం సబ్సిడీతో అమర్చనున్నారు. తీరంలో గస్తీ కోసం అభివృద్ధి చేసిన ఐఆర్ఎన్ఎస్ (నావిక్), జీపీఎస్ శాటిలైట్స్‌తో ఈ డివైస్ అనుసంధానమై పనిచేస్తుంది. బోట్లలోని మత్స్యకారుల వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలు సిగ్నల్‌తో సంబంధం లేకుండా రెండువైపులా సమాచారాన్ని పరస్పరం పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సమయం వృథా కాకుండా.. మరోవైపు ఇన్కాయిస్ సంస్థ అందించే పీఎఫ్జెడ్ సమాచారాన్ని కచ్చితమైన లొకేషన్స్‌తో బోట్లలోని మత్స్యకారులకు పంపడం వలన వారు క్షణాల్లో అక్కడకు చేరుకొని వేట సాగించడం ద్వారా సమయం, ఆయిల్ ఆదా అవుతుంది. పట్టుబడిన మత్స్యసంపదను ఏ సమయంలో ఏ రేవుకు తీసుకొస్తే మంచి రేటు వస్తుందో కూడా ఈ డివైస్ ద్వారా సమాచారం పంపిస్తారు. దీంతో తీరానికి చేరుకున్న తర్వాత తగిన ధర లేక మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఉండదు. అయితే ఈ డివైస్ పనిచేయాలన్నా, సిగ్నల్‌తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా.. సంబంధిత బోట్లలో రీ జనరేట్ చేసుకునే పవర్ సిస్టమ్ అవసరం ఉంటుంది. వైపరీత్యాల వేళ అప్రమత్తం చేయొచ్చు తుపాను హెచ్చరికలు, అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైస్ ద్వారా లోతు జలాల్లో వేట సాగించే అన్నిరకాల బోట్లకు క్షణాల్లో పంపించి వారిని అప్రమత్తం చేయవచ్చు. లోతు జలాల్లో ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా తీరానికి చేరుకునేలా హెచ్చరికలు జారీ చేయొచ్చు. ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే ఈ డివైస్ ద్వారా సమాచారం పంపితే శాటిలైట్ ద్వారా గ్రౌండ్ స్టేషన్‌కు చేరుతుంది. అక్కడ నుంచి క్షణాల్లో ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేçస్తున్న మోనిటరింగ్ స్టేషన్స్తోపాటు కోస్ట్ గార్డు, మెరైన్, నేవీ విభాగాలతోపాటు సమీపంలో ఉండే కమర్షియల్ వెసల్స్‌కు కూడా సమాచారం అందిస్తారు. తద్వారా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ప్రాణాలతో రక్షించే అవకాశం ఉంటుంది. దశల వారీగా అమర్చుతాం కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్‌పాండర్)ను లోతు జలాల్లో మత్స్య వేట సాగించే బోట్లకు దశల వారీగా అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి దశలో 4,484 బోట్లలో అమర్చనున్నాం. అక్టోబర్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. – వీవీ రావు, జేడీ, మత్స్య శాఖ (సముద్ర విభాగం) -
వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు. -
'363 బీచ్‌లు' కోస్తా తీరానికి కొత్త అందాలు
సాక్షి, అమరావతి: బీచ్ పర్యాటకంతో కోస్తా తీరానికి కొత్త కళ చేకూరనుంది. 12 జిల్లాల్లో కోస్తా తీరం వెంట 363 బీచ్‌లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిషరీస్ యూనివర్సిటీ, పర్యాటక శాఖ, మత్స్యశాఖలతో కూడిన 11 బృందాలు కోస్తా తీరం వెంట సర్వే చేసి ఎక్కడెక్కడ బీచ్‌లను అభివృద్ధి చేయవచ్చో గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో కోస్టల్ జోన్ టూరిజం పేరుతో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తారు. చేపల ఉత్పత్తి, మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలగకుండా పర్యావరణానికి అనుకూలంగా బీచ్‌లను తీర్చిదిద్దనున్నారు. కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ చట్ట ప్రకారం బీచ్‌లకు అనుమతి కోసం పర్యాటక శాఖ కలెక్టర్లకు నివేదిక పంపించింది. బీచ్‌ల అభివృద్ధిపై ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు.మత్స్యకారులతో పాటు టూరిజం ఆపరేటర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి బీచ్‌లను ఖరారు చేసి పర్యాటక అథారిటీకి వివరాలు పంపాలని సూచించారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో67 బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ♦ మంగినపూడి (కృష్ణా జిల్లా) ♦ పేరుపాలెం, మొల్లపర్రు (పశ్చిమ గోదావరి జిల్లా) ♦ కాకినాడ (కాకినాడ జిల్లా) ♦ మైపాడు (నెల్లూరు జిల్లా) ♦ సూర్యలంక, రామాపురం (బాపట్ల జిల్లా) ♦ చింతలమోరి (బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా) బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే..? బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే 33 ప్రమాణాల ఆధారంగా ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ బీచ్‌లను పరిశీలించి ధృవీకరిస్తుంది. పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, నిర్వహణ, భద్రత, సేవలు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. బీచ్‌లు పరిశుభ్రంగా ఉండాలి. సందర్శకులకు మెరుగైన సేవలను అందించేందుకు అధికారుల కమిటీ, విశేషాలను వివరించేందుకు సిబ్బంది ఉండాలి. రుషికొండ తరహాలో 8 బ్లూఫ్లాగ్ బీచ్‌లు విశాఖలోని రుషికొండ తరహాలో మరో ఎనిమిది బ్లూ ఫ్లాగ్ బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మౌలిక వసతులను కల్పించేందుకు భూ కేటాయింపు ప్రతిపాదనలను సీసీఎల్ఏకు పంపాలని సీఎస్ ఆదేశించారు. దేశంలో 10 బ్లూ ఫాగ్ బీచ్లుండగా అందులో రుషికొండ చోటు సాధించింది. కోస్టల్ జోన్ రెగ్యులేషన్‌కు అనుగుణంగా బీచ్‌ల అభివృద్ధి: కన్నబాబు కేంద్రం 2019లో విడుదల చేసిన కోస్టల్ జోన్ రెగ్యులేషన్ నోటిఫికేషన్ ప్రకారం బీచ్‌లను అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైనట్లు చెప్పారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి రాగానే పనులు చేపడతామన్నారు. స్థానికులకు ఉపాధితో పాటు సేవల రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. -
Andhra Pradesh: మినీ పోర్టులా ఉప్పాడ!
(ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నుంచి సాక్షి ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు): ఉప్పాడ వద్ద రాష్ట్ర ప్రభుత్వం రూ.361 కోట్లతో భారీ ఫిషింగ్ హార్బర్‌ను వేగవంతంగా నిర్మిస్తుండటం పట్ల స్థానిక మత్స్యకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న మంచి రోజులు కనుల ముందు కనిపిస్తున్నాయి. అన్ని పనులూ పూర్తి చేసుకుని డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుండటంతో మత్స్యకార కుటుంబాల్లో సంతోషం అంతా ఇంతా కాదు. ఇకపై తమ కష్టం వృథా కాదన్న ధీమా ఏర్పడిందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో కాకినాడ వద్ద అత్యంత విలువైన ట్యూనా, సొర వంటి చేపలు ఉన్నా.. సరైన వసతులు లేకపోవడంతో మత్స్యకారులు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. నడి సముద్రంలోకి వెళ్లి పది రోజుల వరకు ఉండి చేపలు పట్టుకునే భారీ స్థాయి బోట్లను నిలుపుకునే చోటు లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి పరిష్కారాన్ని చూపిస్తూ రాష్ట్రంలోనే భారీ ఫిషింగ్ హర్బర్‌ను ఉప్పాడ వద్ద నిర్మిస్తోంది. మిగిలిన హార్బర్లలో సముద్రం నుంచి లోతైన కాలువను తవ్వి అక్కడ బోట్లు నిలుపుకోవడానికి జెట్టీలను నిర్మిస్తుంటే.. ఉప్పాడ వద్ద మాత్రం పోర్టు మాదిరిగానే సముద్ర ఒడ్డుకు ఆనుకునే బోట్లను నిలుపుకునే విధంగా హార్బర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 55 శాతం పనులు పూర్తి చేసుకున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌ను ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఉత్తర, దక్షిణ బ్రేక్ వాటర్ పనులు పూర్తి స్థాయిలో పూర్తవగా.. డ్రెడ్జింగ్ పనులు, ఒడ్డున బిల్డింగ్‌ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2,500 బోట్లు నిలుపుకునేలా.. ♦ రెండ్రోజుల నుంచి 10 రోజుల వరకు ఏకబిగిన వేట కొనసాగించే విధంగా వివిధ పరిమాణాల బోట్లను నిలుపుకునేందుకు అనువుగా ఈ హార్బర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ♦ సుమారు 2,500 బోట్లను నిలుపుకునేలా జెట్టీని నిర్మిస్తున్నారు. ♦ దాదాపు 58 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ హార్బర్లో ఫిషింగ్ హ్యాండ్లింగ్, వేలం కేంద్రం, పది టన్నుల ఐస్ ప్లాంట్, 20 టన్నుల శీతల గిడ్డంగి, పరిపాలన కార్యాలయాలతో పాటు ట్యూనా చేపల కోసం ప్రత్యేకంగా ట్యూనా ఫిష్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ♦ ట్యూనా చేపలు పట్టుకునేందుకు వీలుగా తొమ్మిది మీటర్ల నుంచి 24 మీటర్ల వరకు ఉండే లాంగ్‌లైన్ బోట్లను ఇక్కడ నిలుపుకునే అవకాశముంది. ♦ ఈ ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏటా రూ.859 కోట్ల విలువైన 1,10,600 టన్నుల మత్స్య సంపద వస్తుందని అధికారుల అంచనా. 17,700 మందికి ఉపాధి లభించనుంది. పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం రాష్ట్రంలోని మత్యకారులు వేట కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలు వలస వెళ్లకుండా స్థానికంగానే చేపలు పట్టుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏక కాలంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లయిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సుమారు రూ.3,500 కోట్లకు పైగా నిధులతో 60,858 మత్యకార కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా వీటిని నిర్మిస్తున్నాం. మినీ పోర్టు తరహాలో వీటి నిర్మాణం చేపట్టడమే కాక వీటిపక్కనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – ప్రవీణ్‌కుమార్, సీఈఓ, ఏపీ మారిటైమ్ బోర్డు త్వరలో మంచి రోజులు ఇప్పటి వరకు బోట్లు నిలుపుకోవడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల నిలుపుకునేందుకు నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. కానీ, ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలుపుకోవడం దగ్గర నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి. దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50,000 మత్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్ గతంలో ఎంతటి భారీ చేప తీసుకొచ్చినా పొద్దున రూ.1,000 ధర ఉంటే సాయంత్రం రూ.500కు పడిపోయేది. దీంతో బాగా నష్టపోయే వాళ్లం. ఇప్పుడు ఈ హార్బర్ రావడం.. ఇక్కడ శీతల గిడ్డంగులు ఉండటంతో ఆ భయం ఉండదిక. నచ్చిన ధర వచ్చినప్పుడే అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. గతంలో హార్బర్ లేకపోవడం వల్ల పోటు సమయంలో బోటు నిలుపుకోవడానికి కష్టంగా ఉండేది. సరుకు దింపే సమయంలో ప్రమాదాలు జరిగేవి. మనుషులు గల్లంతైన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడా భయాలు మాకు ఉండవు. సునామీ వచ్చినా మా పడవలు భద్రంగా నిలుపుకోవచ్చు. – ఉమ్మడి యోహాను, మత్స్యకారుడు, ఉప్పాడ -
మత్స్య, ఆక్వా పెట్టుబడుల హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మత్స్య, ఆక్వా రంగాల్లో పెట్టుబడుల హబ్‌గా నిలవబోతోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) జాతీయ కమిటీ కో చైర్మన్ అరబింద్దాస్ చెప్పారు. సముద్ర ఉత్పత్తులు, ఎగుమతుల్లో అగ్రగామిగా ఏపీని నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సీఐఐ కట్టుబడి ఉందన్నారు. సీఐఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మత్స్య, ఆక్వారంగాల సుస్థిరాభివృద్ధిపై విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ఆక్వారంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సీఐఐ కృషి చేస్తుందన్నారు. మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నవారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు తీరం వెంబడి పెద్దఎత్తున మౌలికసదుపాయాల కల్పనకు కృషిచేస్తున్న ప్రభుత్వ తీరు ప్రశంసనీయమన్నారు. తీరం వెంబడి చేపల కేజ్ కల్చర్‌కు ప్రోత్సాహం ఏపీ మారిటైమ్ బోర్డ్ డిప్యూటీ సీఈవో లెఫ్టినెంట్ సి.డి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిషింగ్ హార్బర్లు, ఇంటిగ్రేటెడ్ సీ పార్కుల ఏర్పాటుకు కృషి జరుగుతోందన్నారు. తీరం వెంబడి చేపల కేజ్ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చేందుకు పరిశీలిస్తోందని చెప్పారు. మత్స్య, ఆక్వారంగాల్లో నైపుణ్యత కలిగిన మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా ఏపీæ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్స్యశాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ఎస్.ఏంజెలి మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యరంగాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. సీఐఐ రాష్ట్రశాఖ వైస్ చైర్మన్ డాక్టర్ ఎం.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ మత్స్య రంగాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి లోతైన, వ్యూహాత్మక ఆలోచన ఉందని చెప్పారు. ఈ రంగంపై ఆధారపడిన వర్గాల జీవనోపాధికి, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగకల్పన, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ తమకు స్ఫూర్తినిస్తున్నట్లు తెలిపారు. మత్స్యశాఖతో పాటు ఈ రంగంలోని వాటాదారులందరితో సీఐఐ కలిసి పనిచేస్తుందని చెప్పారు. వాటర్‌బేస్ లిమిటెడ్ సీఈవో రమాకాంత్, డెల్టా ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఫిష్ బాస్కెట్‌గా రాష్ట్రం సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా ఫిష్ బాస్కెట్‌గా రాష్ట్రం నిలిచిందన్నారు. హేచరీలు, విత్తన పెంపకం, బ్రూడ్ బ్యాంకులు, బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్లు, న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్లు, పంట అనంతర నష్టాన్ని తగ్గించడానికి తగిన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని వివరించారు. పంటకోతకు ముందు, అనంతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటురంగ పాత్ర చాలా కీలకమన్నారు. సప్లయి చైన్‌ను బలోపేతం చేయడం ద్వారా చేపలు, ఆక్వా ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపునకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. -
గంగపుత్రులకు మరింత చేరువగా..
కొవ్వూరు: జిల్లాల పునర్విభజన పుణ్యమా అని మత్స్యకారులకు ఆ శాఖ సేవలు మరింత చేరువయ్యాయి. గతంలో ఉన్న జాయింట్ డైరెక్టర్ పోస్టును ఇప్పుడు జిల్లా మత్స్యశాఖ అధికారిగా మార్చారు. రాజమహేంద్రవరంలో 10, కొవ్వూరులో 9 మండలాలు ఉండేటట్లు జిల్లాను రెండు డివిజన్లుగా విభజించారు. అసిస్టెంట్ డైరెక్టర్ల (ఏడీ) పర్యవేక్షణలో ఈ డివిజన్లు పని చేస్తాయి. రాజమహేంద్రవరం డివిజన్లో రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, కడియం, కోరుకొండ, సీతానగరం, గోకవరం, రాజానగరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాలు ఉంటాయి. ఈ డివిజన్లో ఏడీతో పాటు ఇద్దరు మత్స్యశాఖ డెవలప్మెంట్ అధికారులు, ఇద్దరు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు, 10 మంది గ్రామ మత్స్యశాఖ సహాయకులు పని చేస్తారు. కొవ్వూరు డివిజన్లో కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, పెరవలి, ఉండ్రాజవరం మండలాలు ఉంటాయి. ఈ ఏడీ పరిధిలో ఇద్దరు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు, గ్రామ మత్స్యశాఖ సహాయకులు ఉంటారు. గోదారే ఆధారం జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, సీతానగరం, కొవ్వూరు, తాళ్లపూడి, గోపాలపురం మండలాల్లో మాత్రమే మత్స్యకారులున్నారు. వీరిలో గోపాలపురం మినహా మిగిలిన చోట్ల మత్స్యకారులు ప్రధానంగా గోదావరి నది పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మత్స్యసంపద అభివృద్ధికి జిల్లాలో అవకాశాలు అధికంగా ఉన్నాయి. పురుషోత్తపట్నం నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వరకూ 41 కిలోమీటర్ల పొడవునా గోదావరి విస్తీర్ణం 12 వేల హెక్టార్లు కాగా, ఇందులో వెయ్యి హెక్టార్లలో నిరంతరం నీరుంటుందని మత్స్యశాఖ అధికారులు లెక్కలు కట్టారు. చేపలు గుడ్డు పెట్టే దశ కావడంతో ఏటా మే 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ గోదావరిలో వేట నిషేధం అమలులో ఉంటుంది. మత్స్యకారుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని మత్స్యశాఖ ఆధ్వర్యాన ఏటా 20 లక్షల నుంచి 30 లక్షల వరకూ చేప పిల్లలను గోదావరి నదిలో విడిచిపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లోని 489 మంది రైతులు 974.99 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ప్రధానంగా నిడదవోలు, పెరవలి, బిక్కవోలు, సీతానగరం, చాగల్లు తదితర మండలాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. మిగిలిన మండలాల్లో 50 ఎకరాల్లోపే ఈ సాగు జరుగుతోంది. కడియంలో చేప పిల్లల నర్సరీ కడియంలో 6.54 ఎకరాల్లో మేజర్ చేపల పిల్లల నర్సరీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏటా చిరు చేపపిల్లలు (స్పాన్) 5 కోట్లు, 12 ఎంఎం చేప పిల్లలు 53.21 లక్షలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు చేపపిల్లలు 20 లక్షలు ఉత్పత్తి చేస్తున్నారు. కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అవసరమైన చేప పిల్లలను ఇక్కడి నుంచే సరాఫరా చేస్తున్నారు. గోదావరితో పాటు, ఏలేరు రిజర్వాయర్‌కు ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నారు. రైతులకు అవసరమైన చేప స్పాన్‌ను విక్రయిస్తారు. ప్రధానంగా బొచ్చలు, శీలావతి, మోసే, బంగారు తీగ రకాల చేప పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. మత్స్యసంపద అభివృద్ధికి చాన్స్ గోదావరి తీర ప్రాంతం కావడంతో మత్స్యసంపద అభివృద్ధికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏటా 20 లక్షల నుంచి 30 లక్షల చేపపిల్లల్ని నదిలో విడిచిపెడుతోంది. ఏపీ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్టు (ఏపీఐఐఏటీపీ) కింద ఒక హెక్టారు చెరువు తవ్వి చేపపిల్లల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. కడియం నర్సరీ ద్వారా అవసరమైన వారందరికీ చేపపిల్లలను అందిస్తున్నాం. 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛను అందిస్తోంది. మత్స్యకారులకు సబ్సిడీపై వివిధ వాహనాలు, బోట్లు అందజేస్తున్నాం. వీటిని మత్స్యకారులు వినియోగించుకోవాలి. – ఇ.కృష్ణారావు, జిల్లా మత్స్యశాఖాధికారి -
అర్హులైన ప్రతి ఒక్కరికీ సభ్యత్వం
సాక్షి, హైదరాబాద్: మత్స్యరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విదేశీ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సొసైటీల్లో సభ్య త్వం మత్స్యకారుల హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు. సోమ వారం పశుసంవర్థకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో ఎక్క డా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని వివరించారు. నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు, నూతన సభ్యత్వంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలి పారు. 18 ఏళ్లు నిండిన మత్స్యకార కులాలకు చెందిన వారిని అర్హులుగా గుర్తించాలని సూచించా రు. ఇప్పటికే రాష్ట్రంలో 4,753 సొసైటీలు ఉన్నాయని, అందులో 3,47,901 మంది సభ్యులుగా ఉన్నా రన్నారు. ఇంకా 1,185 సంఘాలను ఏర్పాటు చే సేందుకు అవకాశం ఉందని చెప్పారు. మే 15లోగా 100 శాతం సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు సభ్యత్వం పొం దేందుకు అనర్హులు అవుతారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మత్స్యకార సంఘాల ఏర్పాటుకు స్థాని క గిరిజనులు మాత్రమే అర్హులని స్పష్టంచేశారు. అనంతరం నూతన మత్స్య సహకార సంఘాల రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం, అడిషనల్ డైరెక్టర్ శంకర్ రాథోడ్ పాల్గొన్నారు. -
వలలో వరాలు.. అదృష్టం అంటే ఇదే!
సాక్షి,అరసవల్లి( శ్రీకాకుళం): ఉద్దానం మత్స్యకారుల వలలో వరాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అరుదుగా దొరికే ట్యూనా చేపలు నాలుగు రోజులుగా ఇక్కడి గంగపుత్రులకు దండిగా దొరుకుతున్నాయి. టన్నుల కొద్దీ చేపలను ఇతర రాష్ట్రాలకు తరలించి వారు సంబరపడుతున్నారు. జిల్లాలో అక్టోబర్–డిసెంబర్ మధ్యకాలంలో ఉద్దానం తీరాల్లో తక్కువ మొత్తంలోనే ట్యూనా దొరికేది. ఎవరికో గానీ ఆ అదృష్టం వరించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం దాదాపుగా వేటకు వెళ్లిన అన్ని వలలకు ట్యూనా చేపలు పడటం విశేషం. నాలుగు రోజుల్లో 200 టన్నులు.. జిల్లాలో సోంపేట, కవిటి మండలాల పరిధిలోనే ట్యూనా చేపలు లభ్యమవుతున్నాయని స్థానిక మత్స్యకారులు, అధికారులు చెబుతున్నారు. బారువ, ఇసుకలపాలెం, ఉప్పలాం, గొల్లగండి తదితర తీర ప్రాంతాల్లో గత నాలుగైదు రోజుల నుంచి భారీగా ట్యూనా చేపలు లభ్యమయ్యాయి. ఈ చేపల లభ్యత సమాచారాన్ని తెలుసుకున్న చేపల వ్యాపారస్తులు స్థానికులతో ఫోన్లలో బేరాసారాలు చేసుకుని రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజుల్లో సుమారు 200 టన్నుల ట్యూనా చేపలు కేరళ, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాలకు తరలించారు. తొలి రెండు రోజుల్లో కిలో చేపల ధర రూ.30 వరకు ఉంటే, ఇప్పుడు రూ.38 నుంచి రూ.45కి చేరింది. ఇదే ధరలతో కేరళకు భారీగా చేపలు విక్రయాలు జరిగినట్లుగా మత్స్యశాఖాధికారులు చెబుతున్నారు. ఇక ఈ చేపలకు జపాన్ తదితర నార్త్ ఈస్ట్ దేశాల్లో గిరాకీ అధికంగా ఉండడంతో ఇక్కడి నుంచి చేపలను ఎగుమతి చేసేందుకు వ్యాపారులు సన్నాహాలు చేస్తున్నారు. విదేశాల్లో డిమాండ్ ఉంది ట్యూనా చేపలను స్థానికంగా సూరలని పిలుస్తుంటారు. ఇక్కడి వారి కంటే ఇతర దేశస్తులు అధికంగా ఆహారంగా తీసుకుంటారు. గతంలో పోల్చితే ఈసారి అధికంగా చేపల సంతతి బయటపడటంతో అక్కడి వలలకు చిక్కాయి. దేశంలోనే చేపల అభివృద్ధిలో ప్రథమ స్థానంలో మన రాష్ట్రం నిలిచింది. అలాగే ఇందులో మన జిల్లా కూడా ప్రాధాన్యతను పొందడం విశేషం. – పీవీ శ్రీనివాసరావు, మత్స్యశాఖ, జేడీ ఇన్ని ఎప్పుడూ దొరకలేదు ట్యూనా చేపలు అప్పుడప్పుడూ దొరుకుతాయి. అయితే ఇంత ఎక్కువ ఎప్పుడూ చూడలేదు. కేజి రూ.38 చొప్పున సుమారు 60 టన్నుల వరకు కేరళ రాష్ట్రానికి పంపించాం. ముందు రోజుల్లో ధర కాస్తా తగ్గించి ఇచ్చాం. ట్యూనా చేపలతో లాభం బాగుంది. – చిడిపల్లి గురుమూర్తి, మత్స్యకారుడు వచ్చే నెల వరకు చిక్కుతాయి ట్యూనా చేపలకు డిమాండ్ ఉంది. మరో నెల రోజుల వరకు కూడా చేపలు వలలకు చిక్కుతాయనే అనుకుంటున్నాం. అందుకే మళ్లీ వేటకు వెళ్తాం. ఇతర దేశాలకు ఉద్దాన తీర ప్రాంత చేపల రుచి చేరనుంది. వాతావరణం అనుకూలిస్తే మరిన్ని రోజులు వేట కొనసాగిస్తాం. – సవధాల ఢిల్లేసు, మత్స్యకారుడు చదవండి: విదేశీ అతిథులు రా..రమ్మంటున్నాయి.. -
మత్స్యరంగంలో ఏపీ అద్భుత ప్రగతి
సాక్షి, అమరావతి: మత్స్యరంగంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధిస్తోందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తమ్ రూపాలా ప్రశంసించారు. విప్లవాత్మక సంస్కరణలతో ఏపీ మత్స్య రంగం గణనీయమైన పురోగతి దిశగా అడుగులేస్తోందని అభినందించారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆదివారం భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డును ఏపీ మత్స్య శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కె.కన్నబాబులకు కేంద్ర మంత్రి ప్రదానం చేశారు. అవార్డు కింద రూ.10 లక్షల చెక్కుతో పాటు ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందజేశారు. చదవండి: AP: శరవేగంగా విద్యుత్ పునరుద్ధరణ అనంతరం పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో మత్స్యరంగ సుస్థిరాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా అందించడంతో పాటు డీజిల్ సబ్సిడీ పెంపు, ఆక్వా రైతులకు విద్యుత్ టారిఫ్ తగ్గింపు తదితర ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్‌ను ఆక్వా రైతులకు అందజేస్తున్నామని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడుల ఎగుమతుల్లో పెరుగుదల నమోదైందని చెప్పారు. 8 ఫిషింగ్ హార్బర్లు, రెండు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, నాలుగు ఫ్లోటింగ్ జెట్టీలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. 70 ఆక్వా హబ్‌లు, 14 వేలకు పైగా అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కేంద్రమంత్రి స్పందిస్తూ.. మత్స్య రంగంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అభినందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 మిలియన్ మెట్రిక్ టన్నులున్న మత్స్య ఉత్పత్తులను.. 22 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి మురుగన్ తదితరులు పాల్గొన్నారు. -
World Fisheries Day: మత్స్యకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో డీజిల్‌పై సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ‘‘మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు. డీజిల్ సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకూ, కొత్త హార్బర్ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడంలోనూ ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా నిలిచింది. ఇక పైనా మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది.’’ అని సీఎం ట్వీట్ చేశారు. చదవండి: ఆ ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు. డీజిల్ సబ్సిడీ నుండి మత్స్యకార భరోసా వరకూ, కొత్త హార్బర్ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడంలోనూ ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా నిలిచింది. ఇకపైనా మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది.#MatsyakaraDinotsavam — YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2021 -
మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. గన్నవరంలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన మత్స్య సహకార నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. గుజరాత్లో డ్రగ్స్ కేసుల్ని ఏపీకి అంటగట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. (చదవండి: ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు: సీఎం జగన్) దసరాకు 4వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని మంత్రి వెల్లడించారు. అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్ బస్సులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం త్వరలో ప్రత్యేక వాట్సాప్ నెంబర్ అందుటులోకి తీసుకువస్తామన్నారు. ఆన్ లైన్ టిక్కెట్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టామని మంత్రి పేర్ని నాని తెలిపారు. చదవండి: దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు -
పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట
ఇటీవల కురిసిన వర్షాలకు మంచిర్యాల జిల్లాలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంట చేలలోకి వరద నీరు చేరింది. గోదావరి నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బుధవారం చేపల వేటకు అధికారులు అనుమతించలేదు. అయితే కొందరు మత్య్సకారులు నీరు నిలిచిన పొలాల్లో చేపల వేట కొనసాగించడం ఆసక్తికరంగా మారింది. పరివాహక ప్రాంతంలోని పంట చేలలో వరద నీటిపై తెప్పలు వేసుకుని వెళ్లి మత్య్సకారులు చేపలు పట్టారు. తమ రెక్కల కష్టం వరద పాలైందని రైతులు వాపోతున్నారు. పంట నష్టం జరిగిన పొలాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. పత్తి ఏరాల్సిన చోట చేపలు పట్టడం వింతగా ఉంది. - సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల -
కార్గో ఫ్లైట్ ద్వారా మత్స్య సంపద ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు
-
చేపల వినియోగం పెంచడానికి హబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి,అమరావతి: ఆక్వా రైతులకు మంచి ధరలు అందాలని, ఈ లక్ష్యాలను చేరుకోవడానికి రాష్ట్రంలో వినియోగం పెంచే దిశగా ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. చేపల వినియోగం పెరగాలని, సరసమైన ధరలకు ప్రజలకు చేరాలని ఆయన అధికారులకు సూచించారు. పశుసంవర్ధకశాఖ, డెయిరీ, ఫిషరీస్ విభాగాలపై వైఎస్ జగన్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చేపల రవాణా, నిల్వ తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా లాబ్స్‌ను వినియోగించుకోవడంపై ప్రచారం, అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్స్ ఎలా చేయించుకోవాలన్నదానిపై అవగాహన పెంచాలన్నారు. ఈ ల్యాబ్‌లను ఆర్బీకేలకు అనుసంధానం చేయాలని, ఆక్వా సీడ్, ఫీడ్ల విషయంలో ఎలాంటి కల్తీలు ఉండకూడదని తెలిపారు. కేజ్ ఫిష్ కల్చర్‌పై కార్యాచరణ ప్రణాళిక 5 ఫిషింగ్ హార్బర్లు, 1 ఫిస్ ల్యాండ్ సెంటర్లో పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేజ్ ఫిష్ కల్చర్, మరీకల్చర్‌లపై దృష్టి పెట్టాలని, ఆదాయాలు బాగా పెరుగుతాయని తెలిపారు. కేజ్ ఫిష్ కల్చర్‌పై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, రైతులు, ఔత్సాహికులతో కలిసి ముందుకు సాగేలా ఒక ప్రణాళిక తీసుకురావాలని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్ ఫిష్ కల్చర్, మూడు చోట్ల మరీకల్చర్‌లను మొదలుపెట్టాలని తెలిపారు. వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలని, ప్రతి గ్రామం, మండలంలో ఏం ఉండాలనేదాన్ని నిర్ధారించాలని అధికారులకు సీఎం సూచించారు. డిస్పెన్సరీలు ఆర్బీకేలతో అనుసంధానం హేతుబద్ధత ప్రకారం డిస్పెన్సరీలను పెట్టాలని, తర్వాత వాటిని మెరుగ్గా నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. డిస్పెన్సరీలు ఆర్బీకేలతో అనుసంధానం చేయాలన్నారు. అయితే కొన్ని డిస్పెన్సరీలు లేని మండలాలు కూడా ఉన్నాయని అధికారులు ముందు మ్యాపింగ్ చేసి తర్వాత వాటిని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆస్పత్రుల్లో నాడు-నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడులో భాగంగా నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను ముందు నిర్దారించుకోలన్నారు. తర్వాత పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
31 నుంచి ఆక్వా ఎక్స్పో–2019
హైదరాబాద్: ఆక్వా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇండియన్ ఫిషరీస్ అండ్ ఆక్వా కల్చర్, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఆక్వా ఎక్స్పో–2019 జరగనుంది. ఈ మేరకు గురువారం మత్స్యశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ సుల్తానియా ఎక్స్పో బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులనూ, కొనుగోలుదారులనూ, సరఫరా దారులనూ, పరిశ్రమ నిపుణులనూ ఒక గొడుగు కిందకు తీసుకురావడమే ఎక్స్పో ఉద్దేశమని పేర్కొన్నారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎక్స్పో జరుగుతుందన్నారు. మత్స్యకారులు ఒక సంఘంగా ఏర్పాటైతే వారికి కావలసిన పరికరాలు అందిస్తామని సుల్తానియా చెప్పారు. కార్యక్రమంలో జాతీయ మత్య్సశాఖ అభివృద్ధి బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణి కుముదిని, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీ‹ -
క్యాట్‌ఫిష్ అక్రమ రవాణా!
సాక్షి, కామారెడ్డి: ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ అక్రమ దందా కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి ప్రాంతం నుంచి 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రవాణా అవుతోంది. సోమవారం జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో క్యాట్‌ఫిష్ అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. చింతామణి ప్రాంతంలో ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి లారీల్లో బెంగళూరు–నాగ్‌పూర్ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు తరలిస్తున్నారని సమాచారం. ఈనెల 19న లారీలో క్యాట్‌ఫిష్ తరలిస్తున్న ముఠా.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో లారీలో నీటిని నింపుకోవడానికి యత్నించింది. ఈ సందర్భంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానం వచ్చి లారీపై కప్పిన కవర్‌ను విప్పి చూశారు. అవి ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ అని తేలింది. దీంతో మత్స్యశాఖ అధికారులు జేసీబీని తెప్పించి పెద్ద గుంతను తవ్వి లారీలో ఉన్న దాదాపు నాలుగు టన్నుల క్యాట్‌ఫిష్‌ను పారబోయించి పూడ్చి వేశారు. వీటి విలువ రూ. 2 లక్షలపైనే ఉంటుందని అంచనా. ‘క్యాట్‌ఫిష్’ వెనుక మాఫియా క్యాట్‌ఫిష్ ఉత్పత్తి, పెంపకం, రవాణా, అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఫిష్‌ను తింటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వాటిపై నిషేధం విధించిందని మత్స్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ అక్రమార్కులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. క్యాట్‌ఫిష్ అక్రమ రవాణా వెనుక పెద్ద మాఫియా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా క్యాట్‌ఫిష్‌ను స్వాధీనం చేసుకుని పూడ్చివేయించిన పోలీసులు.. డ్రైవర్ మీద మాత్రమే కేసు నమోదు చేశారు. క్యాట్‌ఫిష్ రవాణా నేరం క్యాట్‌ఫిష్ వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. క్యాట్‌ఫిష్‌ను పెంచినా, అమ్మినా, రవాణా చేసినా చర్యలు తప్పవు. జాతీయ రహదారిపై పోలీసులు లారీని పట్టుకుని మాకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి పరిశీలించాం. అవి క్యాట్‌ఫిష్ అని తేలడంతో వాటిని గుంతలో వేసి, పూడ్చి వేయించాం. –పూర్ణిమ, జిల్లా మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి -
వెజిటేరియన్ కొర్రమీను మేడిన్ చైనా!
కొర్రమీను ఉత్పత్తి పెంపునకు చైనా టెక్నాలజీ - రాష్ట్రంలో వాటి సంతతిని తిరిగి పెంచే యత్నంలో మత్స్యశాఖ - వాటి అలవాటునే మార్చేసిన చైనా శాస్త్రవేత్తలు - మాంసాహార చేపలు శాకాహారులుగా మార్పు - వేటాడే లక్షణమూ బంద్.. - బయటినుంచి వేసిన ఆహారం తినేలా పరిజ్ఞానం కొర్రమట్ట.. కొర్రమీను.. ఎలా పిలిచినా ఆ చేపను ఇష్టపడనివారుండరు. పులుసు, ఫ్రై ఎలా వండినా లోట్టలేసుకుంటూ తినేస్తారు.. ముళ్లు తక్కువగా ఉండడం, రుచి ఎక్కువగా ఉండడం దీని ప్రత్యేకత. కానీ రానురాను కొర్రమీను దొరకడం కష్టమవుతోంది. డిమాండ్ పెరిగిపోవడంతో ఏకంగా కిలో రూ.600 వరకు పలుకుతోంది. కృత్రిమంగా వీటి సంతతిని పెంచడానికి అవకాశాలూ లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మత్స్య శాఖ కొర్రమీను సంతతి పెంచడమెలాగనే దానిపై దృష్టి సారించింది. చైనాలో కొర్రమీను చేప పిల్లలను ఉత్పత్తి చేసి, పెంచే టెక్నాలజీని అభివృద్ధి చేయడంతో.. అధికారులు ఆ దేశానికి వెళ్లి పరిశీలించి వచ్చారు.ఆ తరహా టెక్నాలజీతో రాష్ట్రంలోని కోయిల్‌సాగర్ రిజర్వా యర్‌లో కొర్రమీనులను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ ముళ్లు తక్కువ.. రుచి ఎక్కువ ఇతర చేపలేవైనా దాదాపు చనిపోయిన స్థితిలోనే విక్రయిస్తారు. కానీ కొర్రమీనును బతికుండగా విక్రయిస్తారు. ఇతర చేపలు కేవలం నీటిలోని ఆక్సిజన్‌ను సంగ్రహించే బతుకుతాయి. కానీ కొర్రమీను మాత్రం తక్కువ నీటిలోనూ బతకగలదు. అవి నీటితోపాటు గాలిలోని ఆక్సిజన్‌నూ సంగ్రహించగలవు. ఇక కొర్రమీనులో ముళ్లు తక్కువ.. రుచి చాలా ఎక్కువ. వండటానికి ముందే ముళ్లను పూర్తిగా తీసేయవచ్చు కూడా. దీంతో చిన్న పిల్లలూ ఇష్టంగా తింటారు. ఇక కొర్రమీను పులుసుతో కీళ్ల సంబంధిత నొప్పులు తగ్గుతాయని, పలు ఇతర సమస్యలు ఉపశమించేందుకూ తోడ్పడుతుందన్న ప్రచారం ఉంది. రాష్ట్రంలో గోదావరి నదిలో శ్రీరాంసాగర్ ప్రాంతం నుంచి కరీంనగర్, వరంగల్ జిల్లాల వరకు కొర్రమీను లభిస్తుంది. కాలువల వసతి ఉన్న ప్రాంతాల నుంచి కొంత లభ్యమవుతుంది. రాష్ట్రంలో ఏడాదికి 2.5 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతుంటే.. అందులో కొర్రమీను కేవలం 2 శాతమే ఉండటం గమనార్హం. ఇది రాష్ట్ర అధికారిక చేప కూడా. ఏటికేడు తగ్గిపోతూ కొర్రమీను చేపల సంతతి ఏడాదికేడాది తగ్గిపోతోంది. కొర్రమీను సహజ లక్షణాలకు తోడు, ఇతర చేపల్లా కొర్రమీనును ప్రత్యేకంగా ఉత్పత్తి చేయలేకపోవడం దీనికి కారణం. పునరుత్పత్తి (హేచరీస్) కేంద్రాల్లో ప్రత్యేకంగా విత్తనాన్ని (చేప పిల్లలను) ఉత్పత్తి చేసి వాటిని జలాశయాలు, చెరువులు, కుంటల్లో వదలడం ద్వారా ఇతర చేపలను పెంచవచ్చు. ఆయా హేచరీస్లలో చేపలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి చేప విత్తనాన్ని తయారు చేస్తారు. బొచ్చె, బంగారుతీగ, గడ్డి చేప పిల్లలను అలాగే ఉత్పత్తి చేస్తారు. అయితే అలాంటి పరిజ్ఞానం కొర్రమీను చేపల విషయంలో అందుబాటులో లేదు. ఇది సహజ సిద్ధంగా చెరువులు, జలాశయాల్లో గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది. దీని ప్రత్యుత్పత్తి సహజంగా జరుగుతుంది. పైగా ఇది మాంసహార చేప. ఇతర చేప పిల్లలను, చిన్న చేపలను వేటాడి తింటుంది. అందువల్ల వీటిని పునరుత్పత్తి కేంద్రాల్లో పెంచడం సాధ్యంకాదు. దీంతో కరువు, కాటకాల సమయంలో చెరువులు, జలాశయాల్లోకి నీరు చేరని సమయంలో వీటి సంతతి బాగా పడిపోతుంది. మరోవైపు పంట పొలాల్లో అధికంగా వాడే ఎరువులు, పురుగుమందులు వర్షాలతో చెరువులు, కుంటల్లోకి చేరి.. ఆ కలుషిత నీటి కారణంగా కొర్రమీను సంతతి తగ్గిపోతోంది. తమ పిల్లలను తామే... సహజంగా గుడ్లు పెట్టి పిల్లలను కనే కొర్రమీను చేపలు ఆ పిల్లలను కొన్నాళ్ల వరకు మగ, ఆడ కలసి కాపాడతాయి. ఇతర చేపల నుంచి ఎటువంటి హాని జరగకుండా చూస్తాయి. పిల్లలను 40–50 రోజుల తర్వాత వదిలేస్తాయి. కానీ వాటిని వదిలేశాక ఏవి తన పిల్లలో గుర్తుపట్టక తామే తినేస్తుం టాయి కూడా. కొర్రమీను సంతతి తగ్గిపోవడానికి ఇదీ కూడా కారణమని మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొర్రమీను అలవాటునే మార్చిన చైనా చైనాలో కొర్రమీను కిలో ధర మన కరెన్సీలో రూ.200 మాత్రమే. దానికి కారణం అక్కడ కొర్రమీను ఉత్పత్తి పెరగడమే. ఆ దేశంలో పునరుత్పత్తి కేంద్రాల్లో కొర్రమీను విత్తనాన్ని తయారు చేసి జలాశయాల్లో వదిలేస్తున్నారు. ఇందుకోసం దాదాపుగా ఐదు తరాలపై పెద్ద ప్రయోగం చేశారు. కొర్రమీను సహజ స్వభావాలను మార్చారు. దాంతో కొర్రమీను వేటాడే లక్షణం, మాంసహార స్వభావం పోయి.. శాకాహారిగా మారిపోయింది. అంతేకాదు పునరుత్పత్తి కేంద్రాల్లో ఇతర చేపల్లా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి చేప విత్తనాన్ని తయారు చేశారు. ఆ చేప పిల్లలను చెరువులు, జలాశయాల్లో వదిలి ఇతర చేపల్లా పెరిగేలా చేశారు. దీంతో అక్కడ కొర్రమీను ఉత్పత్తి బాగా పెరిగింది. రాష్ట్ర మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ చైనాకు వెళ్లి.. ఈ విషయంపై అధ్యయనం కూడా చేసి వచ్చారు. అయితే కొర్రమీను విత్తనాన్ని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే టెక్నాలజీని బహిర్గత పరచడానికి చైనా శాస్త్రవేత్తలు ముందుకు రాలేదని ఆయన ‘సాక్షి’కి వివరించారు. వియత్నాం దేశంలోనూ ఇటువంటి టెక్నాలజీ ఉందని చెప్పారు. ఇక్కడా చైనా తరహా టెక్నాలజీ.. చైనాలో దాదాపు ఐదు తరాలుగా కృషి చేసి కొర్రమీను చేపల అలవాట్లనే మార్చేశారు. దాంతో అక్కడ కొర్రమీను సంతతి పెరిగింది. అయితే కొర్రమీనును ప్రత్యేకంగా పునరుత్పత్తి చేసే టెక్నాలజీని బహిర్గతం చేయడానికి వాళ్లు ఇష్టపడడం లేదు. కానీ ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న మంచినీటి చేపల పరిశోధన కేంద్రంలో చైనా తరహా టెక్నాలజీతో కొర్రమీను చేప విత్తనం తయారు చేసే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనిని వచ్చే ఏడాది కోయిల్‌సాగర్‌లో ప్రయో గాత్మకంగా పరిశీలించాలని అనుకుంటున్నాం. అందుకోసం భువనేశ్వర్ చేపల పరిశోధన కేంద్రంతో ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నాం.. – శ్రీనివాస్,మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ -
క్రేజ్ కల్చర్
ఈసారి ఏడు చెరువుల్లో నూతన విధానంలో చేపల పెంపకం ► ‘అలీసాగర్’ సత్ఫలితాలివ్వడంతో జిల్లాలో పెరిగిన యూనిట్లు ► ఇతర జిల్లాల నుంచి నిధుల మళ్లింపు సాక్షి, నిజామాబాద్: కేజ్‌కల్చర్.. అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టడం. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘కేజ్‌కల్చర్’ సత్ఫలితాలు ఇవ్వడంతో.. ఈ విధానాన్ని మరిన్ని చెరువులకు విస్తరించా లని అధికారులు నిర్ణయించారు. ఇతర జిల్లాలకు కేటాయించిన నిధులను కూడా నిజామాబాద్ జిల్లాకు మళ్లించేందుకు సర్కారు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కేజ్ కల్చర్ విధానాన్ని ప్రోత్సహిస్తోం ది. ఇందులో భాగంగా గతేడాది అలీ సాగర్‌లో కేజ్‌కల్చర్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ విధానాన్ని జిల్లాలోని మరిన్ని చెరువులకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. కేజ్ కల్చర్ యూనిట్ల కోసం వివిధ జిల్లాలకు కేటాయించిన నిధులు సకాలంలో వినియోగం కాకపోవడం, నిజామాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కేజ్‌కల్చర్ విధానంలో చేపల పెంపకం సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు కేటాయించిన నిధులను మన జిల్లాకు మళ్లిస్తున్నారు. దీంతో గతేడాది ఒక్క అశోక్సాగర్కే పరిమితమైన కేజ్‌కల్చర్ యూనిట్‌ను ఈసారి మరిన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నారు. యూనిట్ల విస్తరణ.. నీలి విప్లవం పథకంలో భాగంగాప్రభుత్వం కేజ్‌కల్చర్‌ను సాగు చేసే మత్స్యకారులకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. యూనిట్ వ్యయంలో 80 శాతం సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన 20 శాతం లబ్ధిదారులు చెల్లించాలి. ఆయా మత్స్య సహకార సంఘాలు ఈ 20 శాతం వాటాను చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎసీడీసీ) కింద ఈ నిధులు మంజూరవుతున్నాయి. వంద ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న పెద్ద చెరువుల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గతేడాది ఒక్క అలీసాగర్‌లో మాత్రమే ఈ విధానంలో చేపల పెంపకం చేపట్టారు. ఈసారి అలీసాగర్‌తో పాటు గుత్ప, వెల్మల్, కుద్వాన్పూర్, రెంజల్, మెండోరా, రెంజర్ల చెరువుల్లో కేజ్ కల్చర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అలీసాగర్‌లో సత్ఫలితాలు.. అలీసాగర్‌లో చెరువులో చేపట్టిన కేజ్ కల్చర్ చేపల పెంపకం విధానం మంచి ఫలితాలనిచ్చింది. పంగాసిస్, తిలాపియా అనే రెండు రకాల చేపలను పెంచారు. ఒక్కో కేజ్ (పంజరం) 96 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ఉన్నాయి. ఇలా మొత్తం పది కేజ్‌లలో చేపల పెంపకం చేపట్టారు. సుమారు 11 టన్నుల చేపల ఉత్పత్తి జరిగినట్లు మత్స్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీటిని కిలోకు రూ.వంద చొప్పున విక్రయించారు. అది కూడా ఎలాంటి రవాణా, ఇతర ఖర్చు లేకుండా చెరువు గట్టుపైనే విక్రయించడంతో 11 టన్నులకు సుమారు రూ.11 లక్షల వరకు ఆదాయం వచ్చిందని అంచనా వేశారు. మొత్తంగా కేజ్ కల్చర్ ప్రయోగం సత్ఫలితాలనివ్వడంతో మరో ఏడు చెరువులకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ నెలలో యూనిట్ల ఏర్పాటు ఈ నెలలోనే కేజ్ కల్చర్‌కు సంబంధించిన యూనిట్లను ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలిచారు. ఈ పనులు దక్కిం చుకున్న సంస్థలే యూనిట్లను ఏర్పాటు చేసి, ఆయా మత్స్య సహకార సంఘాలకు అప్పగిస్తాయి. చేప పిల్లలను కూడా ఉచితంగా సరఫరా చేస్తాం. – మహిపాల్, అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్