స్పెషల్ డ్రైవ్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న తలసాని
సాక్షి, హైదరాబాద్: మత్స్యరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విదేశీ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సొసైటీల్లో సభ్య త్వం మత్స్యకారుల హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు. సోమ వారం పశుసంవర్థకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దేశంలో ఎక్క డా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని వివరించారు. నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు, నూతన సభ్యత్వంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలి పారు. 18 ఏళ్లు నిండిన మత్స్యకార కులాలకు చెందిన వారిని అర్హులుగా గుర్తించాలని సూచించా రు. ఇప్పటికే రాష్ట్రంలో 4,753 సొసైటీలు ఉన్నాయని, అందులో 3,47,901 మంది సభ్యులుగా ఉన్నా రన్నారు. ఇంకా 1,185 సంఘాలను ఏర్పాటు చే సేందుకు అవకాశం ఉందని చెప్పారు.
మే 15లోగా 100 శాతం సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు సభ్యత్వం పొం దేందుకు అనర్హులు అవుతారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మత్స్యకార సంఘాల ఏర్పాటుకు స్థాని క గిరిజనులు మాత్రమే అర్హులని స్పష్టంచేశారు. అనంతరం నూతన మత్స్య సహకార సంఘాల రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం, అడిషనల్ డైరెక్టర్ శంకర్ రాథోడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment