మంత్రి తలసాని క్షమాపణలు | Steel Bridge Incident: Minister Talasani Srinivas Yadav Apologizes | Sakshi
Sakshi News home page

ఆరోజు జరిగింది ఇదే.. స్టీల్‌ బ్రిడ్జి ఘటనపై తలసాని క్షమాపణలు

Published Fri, Aug 25 2023 4:12 PM | Last Updated on Fri, Aug 25 2023 4:46 PM

Steel Bridge Incident: Minister Talasani Srinivas Yadav Apologizes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముషీరాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభం సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పందించారు. బైంసా ఏఎంసీ ఛైర్మన్‌ రాజేష్‌బాబుకు మంత్రి క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు.

కేటీఆర్‌ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని.. పక్కనున్న ఓ వ్యక్తి తన కాలు తొక్కుతూ ముందుకెళ్లడంతో కాలికి గాయం అయ్యిందని ఆ సందర్భంగానే వ్యక్తిని నెట్టివేశానని అన్నారు మంత్రి తలసాని. సోషల్‌ మీడియాలో కావాలనే ఈ ఘటనను పెద్దది చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన.

తను తోసేసిన వ్యక్తి రాజేష్ బాబు అని, గిరిజన బిడ్డ తర్వాతే తెలిసిందని, వెంటనే ఫోన్ చేసి క్షమాపణ చెప్పానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై గిరిజనుల మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని చెప్పారు.

తాను బడుగు, బలహీన, దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకనని, తెలంగాణలో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని పేర్కొన్నారు.

చదవండి: ‘పాలేరు నుంచే తుమ్మల పోటీ’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement