పెద్ద చెరువు మత్స్య సంఘం అధ్యక్షడిగా ‘వేముల’
కోదాడ: పెద్దచెరువు మత్య్ససహకార సంఘం నూతన కార్యవర్గం గురువారం బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ కార్యాలయంలో సమావేశమైన డైరెక్టర్లు నూతన అధ్యక్షుడిగా వేముల రాముడుని, కార్యదర్శిగా గాదె మధుని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఐతేబోయిన ధనమూర్తి, కోశాధికారిగా సింగం శ్రీనులను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి సూర్యదత్ నూతన పాలకవర్గం చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర ముదిరాజ్ మహసభ అధ్యక్షుడు బండా ప్రకాశ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫెడరేషన్ చైర్మన్ పోలు లక్ష్మణ్, రాష్ట్ర ముదిరాజ్ యూత్ అధ్యక్షుడు గుళ్లపల్లి శ్రీను, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, వల్లూరి రామిరెడ్డి, పార సీతయ్య, కుక్కడపు బాబు తదితరులు పాల్గొన్నారు.