నరసాపురం, ముత్తుకూరు కళాశాలల్లో 100 సీట్లు
ఏపీఈఏపీసెట్–2024లో ర్యాంక్ ఆధారంగా సీట్ల భర్తీ
సాక్షి, అమరావతి: ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం(నరసాపురం)లో 2024–25 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్సీ) నాలుగేళ్ల కోర్సులో సీట్ల భర్తీ కోసం యూనివర్సిటీ రిజి్రస్టార్ ఒ.సుధాకర్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు.‡ నరసాపురంలోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో 60 సీట్లు, ముత్తుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో 40 సీట్లు చొప్పున మొత్తం 100 సీట్లు ఉన్నాయి.
పది శాతం సూపర్‌న్యూమరీ సీట్లను ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. 25 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాలకు చెందిన పిల్లలకు ఇస్తారు. ఈ కోటాలో సీట్లకు దరఖాస్తు చేయాలంటే విద్యార్థులు నాలుగేళ్లు గ్రామీణ పాఠశాలల్లో చదివి ఉండాలి. తల్లిదండ్రులు లేదా విద్యార్థి కనీసం ఎకరం భూమి కలిగి ఉండాలి. మొత్తం సీట్లలో 85 శాతం స్థానికులకు ఇస్తారు.
మిగిలిన 15 శాతం సీట్లకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడవచ్చు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ నేచురల్ సైన్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఏపీఈఏపీసెట్–2024 ర్యాంక్ ఆధారంగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 20వ తేదీ లోగా యూనివర్సిటీ వెబ్ సైట్ (ఠీఠీఠీ.్చpజu.్చp.జౌఠి.జీn) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సెపె్టంబర్ 10న సీట్లు కేటాయిస్తారు. ఇతర వివరాల కోసం 0866–3500560, 8985318321 నంబర్లలో సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment