Seat replacement
-
మెడికల్ సీట్లు వదులుకోవడం హేయం
కాశీబుగ్గ: మెడికల్ సీట్లు వదులుకోవడం హేయమైన చర్య అని.. ఈ విషయంలో ఏకైక అత్యంత చెత్త ప్రభుత్వం చంద్రబాబుదేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాటలు ఆశ్చర్యం కలిగించాయన్నారు.చంద్రబాబు హామీలకు తాను గ్యారంటీ అన్న పవన్‌కళ్యాణ్ దీనిపై స్పందించాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 17 మెడికల్ కాలేజీలు స్థాపించేందుకు గత సీఎం వైఎస్ జగన్ ఏర్పాట్లు చేశారని, వాటిలో ఐదింటిని పూర్తి చేశారని గుర్తు చేశారు. ఫలితంగా 2023–24లో విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలో వైద్య కళాశాలలు ప్రారంభమై ఒకేసారి 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయి ఉంటే.. ఈ విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు సైతం ప్రారంభమై మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చి ఉండేవని అన్నారు. మరోవైపు ముందుగా నిర్దేశించుకున్నట్టు 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, పెనుకొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురంలలో ఏడు కాలేజీలు కూడా ప్రారంభమైతే రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్లు దాదాపు 5వేలకు చేరేవన్నారు. -
బీఎఫ్ఎస్సీలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం(నరసాపురం)లో 2024–25 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ) నాలుగేళ్ల కోర్సులో సీట్ల భర్తీ కోసం యూనివర్సిటీ రిజి్రస్టార్ ఒ.సుధాకర్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు.‡ నరసాపురంలోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో 60 సీట్లు, ముత్తుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో 40 సీట్లు చొప్పున మొత్తం 100 సీట్లు ఉన్నాయి. పది శాతం సూపర్‌న్యూమరీ సీట్లను ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. 25 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాలకు చెందిన పిల్లలకు ఇస్తారు. ఈ కోటాలో సీట్లకు దరఖాస్తు చేయాలంటే విద్యార్థులు నాలుగేళ్లు గ్రామీణ పాఠశాలల్లో చదివి ఉండాలి. తల్లిదండ్రులు లేదా విద్యార్థి కనీసం ఎకరం భూమి కలిగి ఉండాలి. మొత్తం సీట్లలో 85 శాతం స్థానికులకు ఇస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడవచ్చు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ నేచురల్ సైన్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఏపీఈఏపీసెట్–2024 ర్యాంక్ ఆధారంగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 20వ తేదీ లోగా యూనివర్సిటీ వెబ్ సైట్ (ఠీఠీఠీ.్చpజu.్చp.జౌఠి.జీn) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సెపె్టంబర్ 10న సీట్లు కేటాయిస్తారు. ఇతర వివరాల కోసం 0866–3500560, 8985318321 నంబర్లలో సంప్రదించాలి. -
జేఎన్టీయూకేలో స్పాన్సర్డ్ కేటగిరీ సీట్ల భర్తీకి షెడ్యూల్
సాక్షి, అమరావతి: జేఎన్టీయూ (కాకినాడ)లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ల్లో స్పాన్సర్డ్ కేటగిరీలో ఎంటెక్, ఎంబీఏ, ఎంబీఏ (సీఎంయూ) సీట్ల భర్తీ కోసం ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.ఎల్.సుమలత సోమవారం తెలిపారు. ఈ సీట్ల కోసం ఈ నెల 20, 21, 22 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు గేట్/జీప్యాట్/ఏపీపీజీఈసెట్/ఐసెట్‌లలో అర్హత సాధించి ఉండాలన్నారు. అంతేకాకుండా ఏడాదిపాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి అని చెప్పారు. ఈ నెల 20న జేఎన్టీయూకే సెనేట్ హాల్లో ఎంబీఏ, ఎంబీఏ (సీఎంయూ) కోర్సులకు, 21, 22 తేదీల్లో ఎంటెక్ కోర్సులకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ మార్కుల జాబితాలు, టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్, స్పాన్సర్షిప్ సర్టిఫికెట్, గేట్/జీప్యాట్/ ఏపీపీజీఈసెట్/ఐసెట్ 2021 హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. పూర్తి వివరాలను https:// www. jntuk. edu. in/ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. -
ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీ
నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఉన్న ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ను ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు సోమవారం తెలిపారు. కౌన్సెలింగ్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్సీసీ, సైనిక సంతతి కోటా వారికి ఈ నెల 12న, క్రీడా, వికలాంగుల కోటా వారికి ఈ నెల 13న కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీతో జనరల్ కౌన్సెలింగ్ పూర్తికాగా ప్రత్యేక కేటగిరీకి చెందిన 257 సీట్లు అలాగే ఉన్నాయి. ఈ సీట్లకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనను నవంబరు నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరిశీలన అనంతరం స్పోర్ట్స్, ఎన్సీసీ, వికలాంగులు, సైనిక సంతతి కోటాలకు సంబంధించి మెరిట్ జాబితాను తయారు చేశారు. ఈ జాబితాను ఆర్జీయూకేటీ వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపారు. -
రూ.8 లక్షల వార్షికాదాయంపై పునఃసమీక్ష
న్యూఢిల్లీ: నీట్–పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ఆలిండియా కోటా సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) కింద రిజర్వేషన్ పొందడానికి వార్షికాదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉండాలన్న నిబంధనను పునఃసమీక్షించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారన్నది తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీని తేల్చే ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేస్తామన్నారు. కోర్టు అనుమతి మేరకు నీట్–పీజీ కౌన్సెలింగ్‌ను నాలుగు వారాలపాటు వాయిదా వేసినట్లు తెలిపారు. కేంద్ర సర్కారు, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) జూలై 29న జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నీట్–పీజీ మెడికల్ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ఎంసీసీ గతంలో తెలిపింది. కేంద్రీయ విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 15 శాతం సీట్లు, పీజీ కోర్సుల్లో 50 శాతం సీట్లు అఖిల భారత కోటాకు కిందకు వస్తాయి. పీజీ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద రిజర్వేషన్లు పొందడానికి అర్హులని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ‘జాతీయ జీవన వ్యయ సూచిక’ ఆధారంగా ఈ పరిమితి విధించినట్లు స్పష్టం చేసింది. దీనిపై పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈడబ్ల్యూఎస్ కోటా అమలును వాయిదా వేయడం సాధ్యం కాదని తుషార్ మెహతా అన్నారు. తుషార్ మెహతా వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి ఆరవ తేదీకి వాయిదావేసింది. -
నేడు ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్
భైంసా (ముధోల్): నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ 2021–22 విద్యాసంవత్సరానికి సీట్ల భర్తీ నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేయడంతో తొలిసారిగా ట్రిపుల్ఐటీ సీట్లను పాలిసెట్ ర్యాంకును పరిగణనలోకి తీసుకుని కేటాయించనున్నారు. నోటిఫికేషన్ వివరాలను శనివారం ట్రిపుల్ఐటీ ఏవో రాజేశ్వర్‌రావు వెల్లడించారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి ఆగస్టు 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 2 నుంచి 12 వరకు ఆన్లైన్లో విద్యార్థుల దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు 14 వరకు సడలింపు ఇవ్వనున్నారు. 18న సీట్లు లభించిన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు. విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 6304893876 అందుబాటులో ఉంచారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఫోన్ చేసి వివరా లు తెలుసుకోవచ్చు. ఇతర సాయం కోసం admi ssions@rgukt. ac. inకు మెయిల్ చేయొచ్చు. www. rgukt.ac.in, http://admissions. rgukt. ac. inలో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులకు సూచనలు.. విద్యార్థులకు 31–12–2021 నాటికి 18 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 ఏళ్ల వయసు వరకు సడలింపు ఇచ్చారు. పాలిసెట్ ర్యాంకు, పదో తరగతి జీపీఏ, రిజర్వేషన్లను పాటిస్తూ సీట్లు కేటాయిస్తారు. గ్రామీణ విద్యార్థులకు 0.4 జీపీఏను అదనంగా కలుపుతారు. రాష్ట్ర పునర్విభజన చట్టం 371/డి ప్రకారం 85 శాతం తెలంగాణ, 15 శాతం ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులతో అన్రిజర్వ్డ్ సీట్లు భర్తీ చేస్తారు. 5 శాతం రాష్ట్రేతర విద్యార్థులు, గల్ఫ్ దేశాల్లోని భారతీయ సంతతి విద్యార్థులు, 2 శాతం ఎన్ఆర్ఐ, విదేశీ విద్యార్థులతో సూపర్ న్యూమరరీ సీట్లు భర్తీ చేస్తారు. ఆన్లైన్లో పొందుపరిచిన ధ్రువపత్రాల కాపీలను ఆర్జీయూకేటీ బాసర చిరునామాకు స్పీడ్‌పోస్ట్ ద్వారా పంపించాలి. -
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో బడుగులకే సర్కార్ పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు న్యాయం చేకూరింది. ప్రముఖ కళాశాలల్లో కీలకమైన కోర్సుల్లో ఈ వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. గతంలో ఆన్లైన్ విధానం లేనందున కళాశాలల్లోని వివిధ కోర్సుల సీట్లను ఆయా యాజమాన్యాలు ఇష్టానుసారం భర్తీ చేసుకునేవి. రిజర్వేషన్ల విధానాన్ని పాటించకుండా ఆ వర్గాలకు కేటాయించాల్సిన సీట్లను కూడా అధిక ఫీజులు తీసుకొని తమకు నచ్చిన వారికి కేటాయించేవి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లో అన్ని కోర్సుల సీట్ల భర్తీకి ప్రభుత్వం ఆన్లైన్ విధానం తప్పనిసరి చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి ఉన్నత విద్యామండలి ద్వారా ఆన్లైన్ కౌన్సెలింగ్ విధానంలో ఆయా కోర్సుల సీట్లు భర్తీ చేయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వారి కోటా ప్రకారం సీట్లు భర్తీ చేసింది. అంతేకాకుండా మొత్తం సీట్లలో 33.5 శాతం మహిళలకు కేటాయించింది. ఇటీవల ముగిసిన డిగ్రీ ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలోని గణాంకాలే దీనికి నిదర్శనం. రిజర్వుడ్ వర్గాలకు 79.26 శాతం సీట్లు రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, తదితర నాన్ ప్రొఫెషనల్ యూజీ కోర్సులు నిర్వహించే విద్యా సంస్థల్లో 152 ప్రభుత్వ, 120 ఎయిడెడ్, 1,062 ప్రైవేటు, 2 యూనివర్సిటీ కళాశాలలున్నాయి. వీటిలో మొత్తం 4,96,055 సీట్లు ఉండగా రెండు విడతల ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో 2,60,103 సీట్లు భర్తీ చేశారు. ఈ సీట్లలో 2,06,173 (79.26 శాతం) సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు లభించాయి. బీసీలకు అత్యధికంగా 1,40,340 సీట్లు దక్కగా.. ఎస్సీలకు 52,668, ఎస్టీలకు 13,165 సీట్లు కేటాయించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 2,117 సీట్లు దక్కాయి. బీఎస్సీకే ఎక్కువ ప్రాధాన్యం రెండు విడతల కౌన్సెలింగ్‌లో ఎక్కువ మంది విద్యార్థులు బీఎస్సీలో చేరేందుకు ఆసక్తిని చూపారు. భర్తీ అయిన 2,60,103 సీట్లలో 1,30,923 మంది బీఎస్సీ, 84,547 మంది బీకాం, 28,244 మంది బీఏ కోర్సులను ఎంచుకున్నారు. ఇక బీబీఏ, బీసీఏ, బీవీఓసీ, బీహెచ్ఎం, కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి ఇతర కోర్సుల్లో 16,389 మంది చేరారు. మిగిలిన సీట్లు 2.35 లక్షలకు పైనే.. మొత్తం సీట్లలో రెండు విడతల ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా 2,60,103 సీట్లు భర్తీ కాగా ఇంకా 2,35,952 సీట్లు మిగిలి ఉన్నాయి. వీటిని స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా ఆయా కళాశాలలు భర్తీ చేయనున్నాయి. వీటిని కూడా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఆయా వర్గాలకు కేటాయించనున్నారు. వీటిని కూడా కలిపితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించే సీట్ల సంఖ్య మరింత పెరగనుంది. -
సీ–కేటగిరీలో 120 ఎంబీబీఎస్ సీట్ల మిగులు
హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీలకు జరిగిన మొదటి విడత ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌లో బీ–కేటగిరీలో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సీ–కేటగిరీలో 319 ఎంబీబీఎస్ సీట్లకు 199 భర్తీ కాగా 120 సీట్లు మిగిలినట్లు అధికారులు తెలిపారు. సీ–కేటగిరీలో 150 బీడీఎస్ సీట్లకు 48 భర్తీ కాగా 102 సీట్లు మిగిలినట్లు పేర్కొన్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 26 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని, లేదంటే సీటు రద్దవుతుందన్నారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. పూర్తి వివరాలు హెల్త్ వర్సిటీ వెబ్సైట్లో చూడాలని సూచించారు. -
ఇంజనీరింగ్‌లో 52,621 మందికి సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా ప్రవేశాల కమిటీ విద్యార్థులకు సీట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 186 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 64,946 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి దశలో 52,621 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించింది. 12,325 సీట్లు ఖాళీగా ఉన్నాయని, సీట్లు పొందిన విద్యార్థులకు సమాచారాన్ని తెలియజేశామని ప్రవేశాల కమిటీ శుక్రవారం పేర్కొంది. 81 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 14 యూనివర్సిటీ, 67 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ఒక కాలేజీలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. సింగిల్ డిజిట్లో విద్యార్థులు చేరిన కాలేజీలు 2 ఉన్నాయి. 20 కాలేజీల్లో 50 మందిలోపు, 45 కాలేజీల్లో 100 మందిలోపే విద్యార్థులు చేరినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. సరైన ఆప్షన్లు ఇచ్చుకోని కారణంగా 5,427 మంది విద్యార్థులకు సీట్లు లభించలేదు. ఇంజనీరింగ్ 12,325 సీట్లు, బీఫార్మసీలో 2,109 సీట్లు, ఫార్మ్–డిలో 117 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరి... విద్యార్థులు వెబ్సైట్ నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకుని నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. https://tseamcet.nic.in లో లాగిన్ అయి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అనంతరం జాయినింగ్ రిపోర్టును డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఫీజు చెల్లింపునకు ఈ నెల 12వ తేదీ వరకు గడువు ఇచ్చామని తెలిపారు. నిర్ణీత తేదీలోగా ఫీజు చెల్లించకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా వారి సీటు రద్దవుతుందని పేర్కొన్నారు. రెండో దశ తర్వాతే కాలేజీల్లో చేరికలు... పీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులంతా రెండో దశ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు తర్వాతే కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. ట్యూషన్ ఫీజు చెల్లించిన తర్వాత కూడా సీటు రద్దు చేసుకోవాలనుకుంటే రెండో దశ కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు ఆన్లైన్లో రద్దు చేసుకోవాలని, వారు చెల్లించిన మొత్తం ఫీజు తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు కావాలనుకుంటే రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని, ఆప్షన్లను మార్చుకోవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు డిగ్రీలో సీట్లు వచ్చి ఉంటే వారు డిగ్రీ వద్దనుకొని రీలింక్విష్‌మెంట్‌కు అండర్‌టేకింగ్ ఇవ్వాలని సూచించారు. జూలై 16 నుంచే తరగతులు ఇంజనీరింగ్ కాలేజీల్లో జూలై 16వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు ఒకటో తేదీ వరకు ఓరియెంటేషన్ తరగతులు నిర్వహించనున్నారు. జూలై మొదటి వారం లేదా రెండో వారంలో రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై చివరి వారంలో మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. కాలేజీ పరిధిలో ఇంటర్నల్ స్లైడింగ్‌ను ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించి సీట్లను కేటాయించనున్నారు. -
సూపర్ స్పెషాలిటీ సీట్ల భర్తీకి గడువు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీ యార్, కాళోజీ నారాయణ రావు వైద్య విశ్వవిద్యాలయాలు సహా దేశవ్యాప్తంగా డీఎం, ఎంసీహెచ్ తదితర సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వివిధ కారణాలతో ఖాళీగా మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు గడువు పొడిగిస్తూ సుప్రీం కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్యలో సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాల భర్తీ షెడ్యూలు ప్రకారం ఆగస్టు 31లోగా కౌన్సెలింగ్ పూర్తయినప్పటికీ దేశవ్యాప్తంగా 1,969 సీట్లు భర్తీ మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో సీట్లు ఖాళీగా ఉన్నాయని, ప్రవేశాలకు మరింత గడువు పెంచాలని రిట్ పిటిషన్ దాఖలవడంతో కోర్టు ఈ గడువును సెప్టెంబర్ 14కు పొడిగించింది. అయినా 553 సీట్లు మిగిలిపోయాయి. వీటిలో తెలంగాణలో 26, ఏపీలో 22 కూడా ఉన్నా యి. సీట్ల భర్తీకి గడువును పొడిగించాలని దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలతో పాటు ఏపీ నుంచి పిన్నమనేని సిద్దార్థ కళాశాల, నారాయణ వైద్య కళాశాలలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఏపీ నుంచి పలువురు విద్యార్థులు, కళాశాలల తరపున న్యాయవాది అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను బుధవారం విచారించి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సీట్ల భర్తీ గడువు పొడిగింపులో నాలుగు షరతులు విధించారు. 1) భర్తీ కాని 553 సీట్లకు 10 రోజుల్లోగా డీజీహెచ్ఎస్ మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించాలి. 2) షెడ్యూల్‌ను, కౌన్సెలింగ్ తేదీలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) నిర్ణయిస్తుంది. అభ్యర్థులకు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు తగిన సమయం ఇవ్వాలి. జాతీయ వార్తాపత్రికల్లో వరసగా 5 రోజులపాటు ప్రకటన ఇవ్వాలి. డీజీహెచ్ఎస్, భారత వైద్యమండలి(ఎంసీఐ) వెబ్సైట్లో కూడా వివరాలను ఉంచాలి. 3) కౌన్సెలింగ్‌ను సాధ్యమైనంత మేరకు ఒకే నిర్ధిష్ట తేదీలో నిర్వహించాలి. 4) అభ్యర్థులు సీట్లు పొందాక చేరేందుకు 4 రోజుల కంటే ఎక్కువ వ్యవధి ఇవ్వరాదు.ఈ ఉత్తర్వులు ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తాయని సుప్రీం కోర్టు ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
సూపర్ స్పెషాలిటీ సీట్లను భర్తీ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: రెండో కౌన్సెలింగ్ తరువాత కూడా దేశవ్యాప్తంగా మిగిలిపోయిన సుమారు 500 సూపర్ స్పెషాలిటీ సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను ఎంపీ వినోద్‌కుమార్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. వైద్యకోర్సుల్లో సీట్లు మిగిలిపోవడం మంచి పరిణామం కాదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 48 సీట్లు కలుపుకొని దేశవ్యాప్తంగా మిగిలిన సుమారు 500 సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. కౌన్సెలింగ్ గడువును అక్టోబర్ 7వ తేదీవరకు పొడిగించాలని లేఖలో కోరారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో దేశ ప్రజల ఆరోగ్య సేవలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం కూడా ఆ మేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
సంక్షోభ హాస్టళ్లు!
సీట్ల భర్తీ కోసం అధికారుల పాట్లు జిల్లాలో మూడుచోట్ల హాస్టళ్ల మూసివేత అయోమయంలోతల్లిదండ్రులు జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు సంక్షోభంలో చిక్కుకున్నాయి. హాస్టళ్లలో వసతులు.. చదువులు అంతంతమాత్రంగా ఉండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు విముఖత చూపుతున్నారు. ఫలితంగా సంక్షేమ హాస్టళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. విద్యార్థులు లేక ఇప్పటికే మూడు హాస్టళ్లు మూతపడగా, మరిన్ని హాస్టళ్లు అదే దారిలో నడుస్తుండడం అధికారులకు గుబులు పుట్టిస్తోంది. చిత్తూరు (గిరింపేట) : సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి దయనీయంగా మారింది. సీటిస్తాం.. మీ పిల్లల్ని హాస్టల్‌కు పంపండి అంటూ ఆయా హాస్టళ్ల వార్డెన్లు ఇల్లిల్లూ తిరిగినా స్పందన లేదు. ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య వేలల్లో తగ్గిపోయింది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఇవి మూతపడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 123 ఉన్నాయి. వీటిల్లో 12వేల సీట్లు భర్తీ చేయాలి. అయితే ఇప్పటివరకు దాదాపు పది వేలలోపే భర్తీ అయ్యాయి. రెండు వేల సీట్లు వరకు భర్తీ కావాల్సి ఉంది. బీసీ వేల్ఫేర్ హాస్టళ్లు 65 ఉండగా ఇందులో 8,500 సీట్లు భర్తీ చేయాలి. కానీ ఇప్పటివరకు ఏడువేల లోపే భర్తీ అయ్యాయి. ఇంకా 1,500 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఎస్టీ హాస్టళ్లు 12కు గాను 1,200 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఏ డు వందల లోపే సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన 500 సీట్లు భర్తీ చేసేందుకు అధికారుల పాట్లు అన్నీఇన్నీకావు. ఇది లావుండగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో బీసీ వేల్ఫేర్ హాస్టళ్లు కార్వేటినగరంలో ఒకటి, శ్రీకాళహస్తిలో ఒకటి మూసేందుకు అధికారులు సంబంధిత అధికారులకు నివేదిక పంపారు. ఇక్కడున్న విద్యార్థులను సమీపంలోని గురుకుల పాఠశాలల్లో చేర్పించనున్నట్లు వారు వెల్లడించారు. విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది పుత్తూరు సహాయక సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని బాలికల హాస్టల్లో గత సంవత్సరం 128 మంది విద్యార్థులుండేవారు. ప్రస్తుతం ఎంత ఉన్నారో కూడా చెప్పలేని పరిస్థితి. కార్వేటినగరంలోని బాలుర హాస్టల్ రెండులో గత సంవత్సరంలో 47 మంది విద్యార్థులుండగా ప్రస్తుతం దాదాపు ఖాళీ అయిపోయింది.సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం బాలుర హాస్టల్లో గత ఏడాది 82 మంది ఉండగా ప్రస్తుతం 40కి తగ్గిపోయింది. చిత్తూరు సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని అరుల్పురం బాలుర హాస్టల్, చిత్తూరు బాలికల హాస్టల్-2, పెద్దతిప్పసముద్రం మండలంలోని కందుకూరు బాలుర హాస్టల్ ఇప్పటికే మూతపడ్డాయి. ఆయా హాస్టళ్లలో నామమాత్రంగా ఉన్న విద్యార్థులను సమీపంలోని గురుకుల పాఠశాలలకు చేర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ వీరిని ఇంకా ఎక్కడా చేర్చకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండేళ్లలో 30 మంది విద్యార్థులున్న హాస్టళ్లలన్నింటినీ గురుకుల పాఠశాలల హాస్టళ్లలోకిమార్పు చేసేందుకు కసరత్తు సాగుతోంది. అన్నీ ఉన్నా.. హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెం చుకునేందుకు అధికారులు ఈ ఏడాది విద్యార్థులకు అవసరమైన స్టడీమెటీరియల్, యూనిఫాం, దుప్పట్లు సిద్ధం గా ఉంచారు. అయినా విద్యార్థుల తల్లిదండ్రుల్లో స్పందన రావడం లేదు. ఈ ఏడాది కనీస సంఖ్యలో కూడా ప్రవేశా లు లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మండలాల్లో వెలుస్తున్న ప్రైవేటు పాఠశాలలకు తోడు, కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వైపే మక్కువ చూపుతున్నారని వారు అంటున్నారు. -
‘బి’ కేటగిరీ సీట్ల భర్తీకి 24న ఎంసెట్
విజయవాడ: ప్రైవేటు మెడికల్, డెంటల్ కళాశాలల్లోని మేనేజ్మెంట్ కోటాలో ‘బి’ కేటగిరీ సీట్ల భ ర్తీకి ఈ నెల 24న వెబ్ ప్రాతిపదికన ఉ మ్మడి పరీక్షను(ఎంసెట్) నిర్వహించనున్నట్లు క న్వీనర్ డాక్టర్ కేజే రమేష్ తెలిపారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ డెంటల్ కా లేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్’ ఆధ్వర్యం లో నిర్వహించే ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణ ల్లోని అభ్యర్థులు తమ దరఖాస్తులను అసోసియేషన్ వెబ్సైట్ ఈ నెల 15 లోగా అప్లోడ్ చేసుకోవాలన్నారు. హాల్ టికెట్లను ఈ నెల 19 నుంచి 24 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. మార్కుల ప్రాధాన్యత క్రమంలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఈ కౌన్సెలింగ్ ద్వా రా ‘బి’ కేటగిరీలోని 665 ఎంబీబీఎస్, 350 బీ డీఎస్ సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.