విజయవాడ: ప్రైవేటు మెడికల్, డెంటల్ కళాశాలల్లోని మేనేజ్‌మెంట్ కోటాలో ‘బి’ కేటగిరీ సీట్ల భ ర్తీకి ఈ నెల 24న వెబ్ ప్రాతిపదికన ఉ మ్మడి పరీక్షను(ఎంసెట్) నిర్వహించనున్నట్లు క న్వీనర్ డాక్టర్ కేజే రమేష్ తెలిపారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ డెంటల్ కా లేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్’ ఆధ్వర్యం లో నిర్వహించే ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణ ల్లోని అభ్యర్థులు తమ దరఖాస్తులను అసోసియేషన్ వెబ్‌సైట్ ఈ నెల 15 లోగా అప్‌లోడ్ చేసుకోవాలన్నారు.
హాల్ టికెట్లను ఈ నెల 19 నుంచి 24 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. మార్కుల ప్రాధాన్యత క్రమంలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఈ కౌన్సెలింగ్ ద్వా రా ‘బి’ కేటగిరీలోని 665 ఎంబీబీఎస్, 350 బీ డీఎస్ సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
‘బి’ కేటగిరీ సీట్ల భర్తీకి 24న ఎంసెట్
Published Fri, May 8 2015 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement