
హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీలకు జరిగిన మొదటి విడత ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌లో బీ–కేటగిరీలో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సీ–కేటగిరీలో 319 ఎంబీబీఎస్ సీట్లకు 199 భర్తీ కాగా 120 సీట్లు మిగిలినట్లు అధికారులు తెలిపారు.
సీ–కేటగిరీలో 150 బీడీఎస్ సీట్లకు 48 భర్తీ కాగా 102 సీట్లు మిగిలినట్లు పేర్కొన్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 26 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని, లేదంటే సీటు రద్దవుతుందన్నారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. పూర్తి వివరాలు హెల్త్ వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment