ట్రిపుల్‌ ఐటీల్లో ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీ | Replacement of Special Category Seats in IIIT | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీ

Published Tue, Dec 7 2021 4:49 AM | Last Updated on Tue, Dec 7 2021 4:49 AM

Replacement of Special Category Seats in IIIT - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఉన్న ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ను ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు సోమవారం తెలిపారు. కౌన్సెలింగ్‌ నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్‌సీసీ, సైనిక సంతతి కోటా వారికి ఈ నెల 12న, క్రీడా, వికలాంగుల కోటా వారికి ఈ నెల 13న కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 2వ తేదీతో జనరల్‌ కౌన్సెలింగ్‌ పూర్తికాగా ప్రత్యేక కేటగిరీకి చెందిన 257 సీట్లు అలాగే ఉన్నాయి. ఈ సీట్లకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనను నవంబరు నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరిశీలన అనంతరం స్పోర్ట్స్, ఎన్‌సీసీ, వికలాంగులు, సైనిక సంతతి కోటాలకు సంబంధించి మెరిట్‌ జాబితాను తయారు చేశారు. ఈ జాబితాను ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement