IIIT admissions
-
ట్రిపుల్ ఐటీ సీట్లలో అగ్రభాగంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యల్పంగా విద్యార్థులు ఎంపికయ్యారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4,400 సీట్లు ఉండగా, వీటిలో 400 సీట్లు ఈడబ్ల్యూఎస్ సీట్లు కాగా, ప్రత్యేక కేటగిరి కింద 280 సీట్లు మినహా 4,120 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేశారు. వీటిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 463 మంది, గుంటూరులో 434 మంది, నెల్లూరులో 393 మంది, పశ్చిమ గోదావరిలో 128 మంది, శ్రీకాకుళంలో 391 మంది, విజయనగరంలో 337 మంది, విశాఖలో 244 మంది, తూర్పు గోదావరిలో 275 మంది, కృష్ణాలో 269 మంది, కడపలో 231 మంది, కర్నూలో 260 మంది, చిత్తూరులో 357 మంది, అనంతపురంలో 232 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో బాలికలే అధికం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారిలో బాలికలే అధికంగా ఉన్నారు. బాలికలు 2,721 మంది ఎంపికవ్వగా, బాలురు 1,399 మంది మాత్రమే ఎంపికయ్యారు. మొత్తం సీట్లలో ఎంపికైన బాలికల శాతం 66.04, బాలుర శాతం 33.96గా ఉంది. బాలికలు నూజివీడు ట్రిపుల్ ఐటీకి 677 మంది, ఇడుపులపాయకు 676 మంది, ఒంగోలుకు 680 మంది, శ్రీకాకుళానికి 688 మంది ఎంపికయ్యారు. ఏపీ నుంచి 4,014 మంది, తెలంగాణ నుంచి 106 మంది ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారిలో ఉన్నారు. (క్లిక్ చేయండి: అక్టోబర్ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ సేవలు..) ముగిసిన ట్రిపుల్ ఐటీ ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్ల పరిశీలన నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న అడ్మిషన్లలో భాగంగా సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించిన ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారంతో ముగిసింది. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి దివ్యాంగులకు 120 సీట్లు, సైనికోద్యోగుల పిల్లలకు 80, ఎన్సీసీ 40, స్పోర్ట్స్ కోటా 20, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 20 సీట్లు ఉన్నాయి. ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్.ఎస్.ఎస్.వి.గోపాలరాజు పర్యవేక్షణలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించారు. క్రీడా కోటాకు 622 మంది, ఎన్సీసీ కోటాకు 1,267 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు 272 మంది, వికలాంగుల కోటాకు 198 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకు 63 మంది అభ్యర్థులు హాజరయ్యారు. -
ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీ
నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఉన్న ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ను ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు సోమవారం తెలిపారు. కౌన్సెలింగ్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్సీసీ, సైనిక సంతతి కోటా వారికి ఈ నెల 12న, క్రీడా, వికలాంగుల కోటా వారికి ఈ నెల 13న కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీతో జనరల్ కౌన్సెలింగ్ పూర్తికాగా ప్రత్యేక కేటగిరీకి చెందిన 257 సీట్లు అలాగే ఉన్నాయి. ఈ సీట్లకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనను నవంబరు నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరిశీలన అనంతరం స్పోర్ట్స్, ఎన్సీసీ, వికలాంగులు, సైనిక సంతతి కోటాలకు సంబంధించి మెరిట్ జాబితాను తయారు చేశారు. ఈ జాబితాను ఆర్జీయూకేటీ వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపారు. -
నవంబర్ 2 నుండి పాఠశాలల పునఃప్రారంభం
సాక్షి, విజయవాడ : ఈ ఏడాది ట్రిపుల్ ఐటీలో పదో తరగతి పరీక్షల ఫలితాల ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదని తెలిపారు. అందుకే ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా ఎన్జీ రంగా, ఎస్వీ వెటర్నరీ, వైఎస్సార్ హార్టీకల్చర్ డిప్లమా కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షల ప్రకటన వెలువడిందని, ఆన్లైన్లో దరఖాస్తులు నవంబర్ 10 వరకూ అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం 1000 రూపాయిల అపరాధ రుసుంతో నవంబర్ 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. నవంబర్ 28న పరీక్ష నిర్వహించి, డిసెంబర్ 5న ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ప్రవేశ పరీక్షకు ఓసీ అభ్యర్థులు- 300, బీసీ అభ్యర్థులు - 200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 100 రూపాయిలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పదవ తరగతి స్థాయిలో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, పరీక్ష ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ షీట్లో నిర్వహిస్తామని, ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ ఉండదన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. విద్యా సంవత్సరం వృధా కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నవంబర్ 2 నుండి పాఠశాలలు ప్రారంభిస్తాం. విద్యార్థులకు ప్రతీ రోజూ కరోనా క్లాసులు చెప్తాం. విద్యార్థులకు ఇప్పటికే విద్యాకానుకలో మాస్కులు ఇచ్చాం. సెలవులు, సిలబస్‌ని తగ్గించాల్సి ఉంటుంది. మొదటి నెల రోజులు ఒక్క పూట పాఠశాలలు నిర్వహిస్తాం. తరువాత సమీక్షించి భవిష్యత్ ప్రణాలిక ప్రకటిస్తాం. ప్రతీ విద్యార్థి రోజు తప్పించి రోజు వచ్చేలా తరగతులు. 1,3,5,7,9 తరగతులు ఒకరోజు నిర్వహిస్తాం. 2,4,6,8,10 తరగతులు ఇంకోరోజు నిర్వహిస్తాం. ఉపాధ్యాయులందరికీ రోజూ డీఎంహెచ్ఓ ద్వారా అవగాహన కల్పిస్తాం. ప్రతీ పాఠశాలకు వైద్య సిబ్బందిని, పీహెచ్సీలో డాక్టర్ని అందుబాటులో ఉంచుతా’’మన్నారు. -
ట్రీపుల్ ఐటీ పిలుస్తోంది
కరీంనగర్‌ఎడ్యుకేషన్: పదో తరగతి పూర్తి కాగానే విద్యార్థులు, తల్లిదండ్రులు భవిష్యత్ బంగారమయ్యే దారులవైపు కలలు కంటుంటారు. ఇందులో బాసర ట్రీపుల్ ఐటీ ఒకటి. ప్రభుత్వ సంస్థల్లో చదువు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాధాన్యతనివ్వడంతో అధికశాతం విద్యార్థులు ట్రీపుల్‌ఐటీ వైపు దృష్టిపెడుతున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. విద్యార్థుల తలిదండ్రులు ట్రీపుల్ ఐటీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయపడుతుంటారు. చిన్న పొరపాట్లతో చేజేతులార సీట్లు కోల్పోవడం చూస్తునే ఉంటాం. ఈ సందర్భంగా ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోనే విధానం ‘సాక్షి’ మీకోసం అందిస్తోంది. వసతులు.. విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాలతోపాటు రెండు జతల యూనిఫాం, షూలు, ల్యాప్‌టాప్‌లు తదితర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రిపుల్ఐటీ అధికారులు కోరారు. జత చేయాల్సిన పత్రాలు.. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, పదో తరగతి హాల్ టికెట్, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణపత్రాలు, వికంలాగులైతే వైకల్య ధ్రువీకరణపత్రం, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణపత్రం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణపత్రాలు సమర్పించాలి. ఫీజుల వివరాలు.. రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఏడాది రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు చెల్లించాల్సి అవసరం లేదు. రిజిష్టేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. క్యాష్ డిపాజిట్ కింద ఏ కేటగిరీ అభ్యర్థులైనా 2000 చెల్లించాలి. (దీనిని తిరిగి ఇస్తారు). ఇతర రాష్ట్రాల, గల్ఫ్ దేశాల్లో పనిచేసే వారి పిల్లలు ఏడాదికి రూ.1.36 ల„ýక్షలు, ఎన్నారై విద్యార్థులు రూ.3 లక్షల ట్యూషన్ ఫీజు చెల్లించాలి . అర్హతలు.. అభ్యర్థులు ప్రథమ ప్రయత్నంలో 2019–ఎస్ఎస్సీ, తత్సామాన పరీక్షల్లో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. 2019 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. దరఖాస్తు విధానం.. అభ్యర్థులు ఈ–సేవా లేదా మీ–సేవా కేంద్రాల ద్వారా ఆర్జీయూకేటీ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి. దరఖాస్తు ఫీజుతోపాటు సర్వీసు చార్జి కింద ఆన్లైన్లో అదనంగా రూ.25 చెల్లించాలి. అడ్మిషన్ల పద్ధతి.. పదో తరగతిలో గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (జీపీఏ) ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఒకే జీపీఏ ఉన్న అభ్యర్థులకు సబ్జెక్టు వారీగా పొందిన గ్రేడ్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రివేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. మోడల్, బాలికల, బాలుర పాఠశాల విద్యార్థులకు సైతం 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వేయింటేజీగా పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో 85 శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 371 ఆర్టికల్–డీ, సెక్షన్–95/2014 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని బాసర, ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. 3 వేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించే నోటిఫికేషన్ ను ఆర్జేయూకేటీ వైస్ ఛాన్సలర్ రాజ్ కుమార్ విడుదల చేశారు. జూన్ నెల 21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుందని, జూన్ 16 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు. జూలై 8న విద్యార్థుల ఎంపిక, జూలై 23, 24 కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. జూలై 28న తరగతులు ప్రారంభిస్తామని వీసీ ఓ ప్రకటనలో తెలిపారు.