ముగిసిన దరఖాస్తు స్వీకరణ గడువు
1 నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం
11న ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకుగాను ఈనెల 25తో దరఖాస్తు స్వీకరణకు గడువు ముగిసింది. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2024–25 అడ్మిషన్లకు సంబంధించి మొత్తం 53,863 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు బుధవారం తెలిపారు.
నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4 వేల సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కింద మరో 400 సీట్లు కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్‌ను అనుసరించి ట్రిపుల్ ఐటీల సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రభుత్వ పాఠశాల నుంచి 34,154 మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 19,671 మంది ఉన్నారు.
అలాగే బాలురు 23,006 మంది, బాలికలు 30,857 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో స్పెషల్ కేటగిరిలైన క్యాప్ నుంచి 3,495 మంది, ఎన్‌సీసీ నుంచి 2,129 మంది, దివ్యాంగులు 381 మంది, క్రీడా కోటాలో 1,389 మంది, స్కౌట్స్ అండ్ గైడ్ నుంచి 327 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 28,573 మంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 21,559 మంది, తెలంగాణ నుంచి 3,693 మంది, రెండు తెలుగు రాష్ట్రాలను మినహాయించి ఇతర రాష్ట్రాలకు చెందిన 38 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
1 నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు సంబంధించిన సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌ను జూలై 1 నుంచి నిర్వహించనున్నారు. సైనికోద్యోగుల పిల్లలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జూలై 1 నుంచి 3వ తేదీ వరకు, క్రీడా కోటా జూలై 3 నుంచి 6 వరకు, దివ్యాంగుల కోటా జూలై 3న, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా జూలై 2, 3 తేదీల్లో, ఎన్‌సీసీ కోటా జూలై 3 నుంచి 5 వరకు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నట్లు ట్రిపుల్‌ఐటీ అధికార వర్గాలు తెలిపాయి.
అలాగే జూలై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. జూలై 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీల్లో, 24, 25 తేదీల్లో ఒంగోలు ట్రిపుల్‌ఐటీలో, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో ఎంపికైన అభ్యర్థుల సరి్టఫికెట్లను పరిశీలన చేసి అడ్మిషన్లను కలి్పంచనున్నారు.
ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ కన్వినర్‌గా అమరేంద్ర
వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఆయా ట్రిపుల్ ఐటీల్లో 2024–25 జరిగే అడ్మిషన్ల ప్రక్రియకు కన్వినర్‌గా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న అధ్యాపకుడు డాక్టర్ అమరేంద్ర కుమార్ సండ్రాను ఆర్జీయూకేటీ అధికారులు నియమించారు. గతంలో ఆయన ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా, ఎగ్జామ్స్ కంట్రోలర్‌గా, ఏఓగా పనిచేశారు. అడ్మిషన్ల ప్రక్రియను సమర్థంగా చేపడతానని అమరేంద్ర తెలిపారు. ఈయన నియామకంపై ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment