నూజివీడు: జాతీయ స్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల యోగా పోటీల్లో పాల్గొనే ఆర్జీయూకేటీ జట్లను ఆదివారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎంపిక పోటీల్లో నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు చెందిన యోగా క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ పోటీలను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ప్రారంభించారు. టీం ఈవెంట్, వ్యక్తిగత, రిథమిక్, ఆర్టిస్టిక్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని ఆర్జీయూకేటీ జట్లకు ఎంపిక చేశారు. వీరు డిసెంబర్ 24 నుంచి 27 వరకు భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా రాజమహేంద్రవరం శాప్ యోగా కోచ్ నాగేంద్రన్ వ్యవహరించారు.
ఎంపికైన విద్యార్థులు..
మహిళల విభాగంలో టీం ఈవెంట్ జట్టుకు ఏవీఎల్ నిఖిల, ఎస్.ప్రమీల, ఎ.అనూష, సీహెచ్ దివ్య, జేహెచ్‌వీఎస్ దుర్గ, సీహెచ్ మేఘశ్రీ, వ్యక్తిగత విభాగంలో ఎ.అశ్విత, ఆర్టిస్టిక్ విభాగంలో పి.మేఘన, రిథమిక్ విభాగంలో బి.హేమ ఎంపికయ్యారు. పురుషుల జట్టులో టీం ఈవెంట్‌కు కె.లక్ష్మణరావు, ఆర్.శేషసురేష్, పి.ఆదిశంకర్‌రెడ్డి, టి.అభిషేక్, టి.అశోక్, పి.సాయిసురే‹Ù, వ్యక్తిగత విభాగంలో పి.భరత్కుమార్, ఆర్టిస్టిక్ విభాగంలో ఆర్.సాయిచైతన్య, రిథమిక్ విభాగంలో టి.దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు. వీరంతా నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందినవారే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment