ఫిషరీస్‌లో 218 కొత్త ప్రాజెక్టుల అమలుకు రూ.1,564 కోట్లు కేటాయింపు
టూనా ఎగుమతులపై ప్రత్యేక దృష్టి
కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్ రంజన్
సాక్షి, విశాఖపట్నం: మత్స్య రంగంలో భారత్‌ను అంతర్జాతీయ ప్రాసెసింగ్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ఫిషరీస్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. రొయ్యల పెంపకం–వాల్యూచైన్ బలోపేతం చేయడంపై దృష్టి సారించేలా మత్స్య ఎగుమతి ప్రమోషన్‌పై వాటాదారులతో సంప్రదింపులకు విశాఖపట్నంలో శుక్రవారం జాతీయ స్థాయి సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు కేంద్ర మంత్రి రాజీవ్ సింగ్‌తో పాటు మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో 9 శాతం వృద్ధి రేటుతో మత్స్య రంగం ముఖ్య భూమిక పోషి స్తోందన్నారు. ఈ వృద్ధి 2047 నాటికి వికసిత్ భారత్‌గా అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు.
మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ మాట్లాడుతూ పీఎంఎంఎస్ వై పథకం కింద నిధుల కేటాయింపులు పెంచుతూ ఫిషరీస్, ఆక్వా పరిశ్రమలకు చేయూతనందిస్తున్నామని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ రూ.1,564 కోట్ల విలు వైన 218 కొత్త ప్రాజెక్టుల అమలు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఫీడ్ ఇన్‌పుట్‌లు, ఇతర సౌకర్యాలకు సంబంధించిన దిగుమతి సుంకాలను తగ్గించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment