మత్స్యకార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మత్స్యకార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి శంకర్
ఇబ్రహీంపట్నం : మత్స్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మత్స్యకారుల, మత్స్యకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్.శంకర్ అన్నారు. జిల్లా తూర్పు డివిజన్ మత్స్యకారుల సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశాన్ని మంగళవారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కరువు పరిస్థితుల్లో మత్స్యకార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. రూ.2వేల నగదు, 60 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని...50 సంవత్సరాలు నిండిన మత్స్యకార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. మత్స్య సొసైటీలకు సరిపడే నాణ్యమైన 3 అంగుళాల చేపపిల్లలు, రొయ్యలను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, కాలుష్యానికి గురికాకుంగా కాపాడాలన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో మత్స్యకారులను భాగస్వామ్యం చేయాలని కోరారు. చెరువులు, కుంటల లీజు రద్దు అయిందని, దీనిని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు లక్ష్మయ్య, వెంకటేష్, శ్రీనివాస్, కె.రవీందర్, సతీష్, అశోక్, దయాకర్, నాగరాజు, నాగేష్‌లు, బాలగణేష్‌లు పాల్గొన్నారు.