హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు శనివారం హైదరాబాద్లో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 55 శాతం భూమి మాత్రమే సాగులోకి వచ్చిందని వెల్లడించారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కోరత లేకుండా చూస్తామన్నారు. నిధుల సేకరణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రుణమాఫీని అమలు చేస్తామని పుల్లారావు స్పష్టం చేశారు.