ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : అకాలవర్షంతో చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. వరిపైరు నేలకొరిగి గింజలు రాలాయి. చేతికొచ్చిన ధాన్యం మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచగా తడిసింది. దీంతో తడిసిన ధాన్యానికి మద్దతు ధర దక్కదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల రైతులు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనలు చేపట్టారు. మామిడి రైతులదీ ఇదే పరిస్థితి ఉంది. నేలరాలడంతో మామిడి దెబ్బతిని నాణ్యత కోల్పోయింది. దీంతో మార్కెట్‌లో సగం ధర కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదుకోవాలని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.5 కోట్ల పంట నష్టం సంభవించినట్లు అంచనా.
ధర దక్కేనా?
జిల్లాలో 3 వేల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. మంచిర్యాల, దండేపల్లి, నిర్మల్, లక్సెట్టిపేట, జన్నారం, సారంగాపూర్, కుంటాల, ముథోల్, దిలావర్‌పూర్, మామడలో వరిపైరు నేలకొరిగింది. 5 వేల క్వింటాళ్ల వరి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం త డిసింది. అధికంగా దండేపల్లి, జన్నారం మండలాల్లో తడిసిన ధాన్యం రంగు మారి నాణ్యత కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో మద్దతు ధర వస్తుందో లేదోనని రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ గ్రేడ్-ఏ రకానికి రూ.1345, ఇతర రకాలకు రూ.1310 చొప్పున మద్దతు ధర చెల్లిస్తున్నారు.
తడిసిన ధాన్యానికి నాణ్యత లేదంటూ కొనుగోలు కేంద్రాల్లో నిరాకరిస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. సన్నరకాలను కొనుగోలు చేస్తూ మిగతా రకాల కొనుగోలుకు నిరాకరిస్తుండడంతోనే ఆయా కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దండేపల్లి, జన్నారం, జైపూర్, నెన్నెల, వేమనపల్లి, కోటపల్లి, ఖానాపూర్‌లో సుమారు 550 ఎకరాల్లో మామిడి నేల రాలినట్లు ఉద్యానవన శాఖాధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో మామిడి టన్నుకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ధర లభిస్తోంది. దెబ్బతిన్న మామిడికి రూ.10వేల లోపే ఇస్తుండడంతో ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగజ్‌నగర్, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, తరోడాలో కూరగాయల పంటలకు కూడా నష్టం చేకూరింది.
నిర్మల్, దిలావర్‌పూర్, సారంగాపూర్, మామడ, లోయెశ్ర, ముథోల్‌లలో మిరప సుమారు 150 ఎకరాల్లో నష్టం చేకూరింది. కళ్లాలలోని ఎండు మిరప తడిసిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. జిల్లాలో గుంటూ రు సన్నాలను అధికంగా పండిస్తారు. క్వింటాలుకు రూ.5,500 నుంచి రూ.6వేల ధర ఉండ గా తడిసిన మిరపకు మద్దతు ధర వచ్చే పరిస్థి తి లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కళ్లాలలో ఆరబెట్టిన పసుపు కొమ్ములు తడిసిపోవడంతో వాటికి కూడా మద్దతు ధరలు లభించలేని పరిస్థితి ఉంది. రంగు మారి నాణ్యత కోల్పోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.
గుండె కోత
Published Sun, May 11 2014 12:23 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement