Untimely rain
-
మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
సాక్షి నెట్వర్క్: అకాల వర్షం పుట్టి ముంచింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని ముంచేసింది. చెట్లపై ఉన్న మామిడి కాయలను రాల్చేసింది. ఈదురుగాలులతో విరుచుకుపడి పలువురి ప్రాణాలనూ బలిగొంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వాన బీభత్సం సృష్టించింది. వరి ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురుగాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరంగల్: నీట మునిగిన ధాన్యం వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. జనగామ వ్యవసాయ మార్కెట్ వెయ్యి బస్తాల ధాన్యం తడిసిపోయింది. బచ్చన్నపేట, జనగామ రూరల్, పాలకుర్తి, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పుల తదితర మండలాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, 33కేవీ లైన్లు నేలకొరిగాయి. చిల్పూరు, జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో వందల ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట, కిష్టాపూర్, మహాముత్తారం, కోనంపేటలలో ధాన్యం కొట్టుకుపోయింది. ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలో ధాన్యం తడిసింది. మహబూబాబాద్ జిల్లా కురవి, బయ్యారం, గంగారం, మహబూబాబాద్ రూరల్ మండలాల్లో పంటలకు నష్టం జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ధాన్యం నీట కొట్టుకుపోయింది. కరీంనగర్: వడగళ్ల వాన మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. పలు గ్రామాల్లో ఇళ్లపై కప్పు రేకులు ఎగిరిపోయాయి. వడగళ్ల వానతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో మామిడికాయలు రాలిపోయాయి. జమ్మికుంటలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. ఉమ్మడి ఆదిలాబాద్: వాన తిప్పలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన వర్షంతో రైతులు తిప్పలు పడ్డారు. పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. సిరికొండ, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, తలమడుగు మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. నర్సాపూర్(జీ), నిర్మల్, లక్ష్మణచాంద మండలాల్లో తీవ్రంగా ఈదురుగాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలయి. ఆసిఫాబాద్ మండలంలో కోతకు వచ్చిన వరిపంట నేలకొరిగింది. ఉమ్మడి నల్లగొండ: దెబ్బతిన్న మామిడి నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడ్డాయి. వందల ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి, మోత్కూరు మండలాల్లో చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యాదాద్రి కొండపై ఈదురుగాలులు, వానతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చలువ పందిళ్లు నేలకూలాయి. క్యూకాంప్లెక్స్ పైకప్పు రేకులు ఎగిరి సమీపంలో ఉన్న వాహనాలపై పడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్: వణికించిన ఈదురుగాలులు బలమైన ఈదురుగాలులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను వణికించాయి. నాలుగైదు గంటల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి రంగారెడ్డి: నీట మునిగిన కాలనీలు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల వాన వణికించింది. పలుచోట్ల వడగళ్లు కురిశాయి. మామిడి నేల రాలింది. చేవెళ్ల, మొయినాబాద్, యాచారం మండలాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. షాద్‌నగర్ పట్టణంలోని లోతట్టు కాలనీలు నీటమునిగాయి. ఉమ్మడి మెదక్ జిల్లా: ముంచెత్తిన వాన మెదక్ ఉమ్మడి జిల్లాను అకాల వర్షం ముంచెత్తింది. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో 3 వేల బస్తాలకుపైగా ధాన్యం మొత్తం తడిసింది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో భారీగా ధాన్యం తడిసింది. పటాన్చెరు నియోజకవర్గంలో పలుచోట్ల చెట్లు విరిగిపడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిన్నారం, హత్నూర మండలాల్లో వడగళ్లు పడ్డాయి. ధాన్యం తడిసిపోయింది. జిల్లాలో రెండు ఇళ్లు, ఓ హోటల్ పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలంలో ధాన్యం నీట మునిగింది. హైదరాబాద్ ఆగమాగం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని ఆగమాగం చేసింది. మియాపూర్‌లో ఏకంగా 13.3 సెంటీమీటర్లు, కూకట్‌పల్లిలో 10.7 సెంటీమీటర్లు భారీ వర్షపాతం నమోదైంది. మూసాపేట గూడ్స్òÙడ్ రోడ్డులో పార్కింగ్ చేసిన లారీలు, కంటైనర్ లారీలు మట్టి దిగబడి ఓ వైపు ఒరిగి పోయాయి. చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు, హోర్డింగ్స్ కూలిపోయాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అత్తాపూర్‌లో ఇళ్ల రేకులు ఎగిరిపోయి సమీపంలోని సబ్‌స్టేషన్‌లో పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. ‘వాన’ దెబ్బకు ఆరుగురు బలి రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు, వర్షం ధాటికి చెట్ల కొమ్మలు విరిగిపడి, గోడలు కూలి, పిడుగులు పడి ఆరుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఇల్లందలో చెట్టు కొమ్మలు విరిగిపడి బీటెక్ విద్యార్థి ఆబర్ల దయాకర్ (22) మృతిచెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్ (నాగ్సాన్పల్లి) శివారులోని మామిడితోటలోని కోళ్ల ఫారం గోడ కూలడంతో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మరణించారు. పిడుగుపాటుకు గురై సంగారెడ్డి జిల్లా అందోల్ మండల ఎర్రారంలో గోవిందు పాపయ్య (52), సిద్దిపేట జిల్లాలో కుకునూరుపల్లికి చెందిన మల్లేశం (33)మృతి చెందారు. హైదరాబాద్ బాచుపల్లిలో గోడ కూలి.. భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనం రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆ పక్కనే ఉన్న రేకుల ఇళ్లపై గోడ, మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో వాటిలో నివాసం ఉంటున్న ఏడుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కూలీలు ఇచ్చిన వివరాల మేరకు 8 మంది వరకు శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రికల్లా శిథిలాల కింద ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
సాక్షి, విజయవాడ: ఏపీలో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో నల్లటి మేఘాలు కమ్మేసి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షపు నీటితలో లోతట్లు ప్రాంతాలన్నీ నిటమునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. బైక్‌లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. దురుగాలుల ప్రభావంతో పలు చోట్ల చెట్లు నెలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిసింది.ఉమ్మడి కృష్ణా జిల్లాలో అకాల వర్షం కురిసింది. నూజివీడు తరువూరు కైకలూరు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు సిటీ, కైకలూరు, కలిదిండి, ఆచంట ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయంగా మారాయి. ఏలూరుజిల్లా పోలవరం మండలంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరి, మొక్క జొన్న పంటంతా వర్షపు నీటిపాలు అయ్యింది. రైతులు పరదాలు కప్పి పంట రక్షించుకుంటున్నారు.కృష్ణాజిల్లా :బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో అకాల వర్షం.ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం.ఉదయం నుండి భానుడి భగభగలతో అల్లాడిన జనం.భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.ఏలూరు జిల్లానూజివీడు డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం.మధ్యాహ్నం మూడు గంటలకు పట్టపగలే కారుమబ్బులు, నల్లని మబ్బులతో కమ్మేసిన ఆకాశం.అకాల వర్షంతో సేద తీరుతున్న నూజివీడు ప్రాంత ప్రజలు.అల్లూరి సీతారామరాజు జిల్లాచింతూరు,కూనవరం, విఆర్ పురం మండలాల్లో ఈదురుగాలల భీభత్సంపలు ప్రాంతాల్లో రోడ్లపై విరిగిపడిన విద్యుత్తు స్థంభాలు, వృక్షాలు. -
రైతన్నకు అకాల నష్టం
నిజామాబాద్/కామారెడ్డి నెట్వర్క్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శని వారం ఉదయం 10 గంటల వరకు కురిసిన అకాల వర్షానికి కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి పోయింది. పలుచోట్ల వర్షపు నీటి ప్రవాహంలో వడ్లు కొట్టుకుపోయాయి. చేతికందిన పంటను అమ్ముకు నే సమయంలో వర్షం దెబ్బతీయడంతో రై తులు కంటతడి పెడుతున్నారు. ఆర్మూరు, ఆలూర్, ఎడపల్లి, వర్ని, చందూర్, మోస్రా, సాలూర, రుద్రూర్, కోట గిరి, పొతంగల్, రెంజల్, మాక్లూర్, డొంకేశ్వర్ మండలాల్లో రైతుల కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, లింగంపేట, పి ట్లం, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలా ల్లో రోడ్లపై ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ధాన్యం రాశుల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో పోలీసుస్టేషన్ సమీపంలో రోడ్లపై ఉన్న ధాన్యం రాశుల మధ్య నీరు భారీగా చేరడంతో మోటార్ల సహాయంతో తొలగించారు. వర్షాలతో అంతటా వరి కోతలకు బ్రేక్ పడింది. -
నూజివీడులో మామిడి పౌడర్ యూనిట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అకాల వర్షం, ఈదురు గాలులకు నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అకాల వర్షాలు, ఈదురు గాలులకు రాలిపోయిన, దెబ్బతిన్న మామిడి కాయలను కొని, వాటి నుంచి పౌడర్ తయారు చేసే సరికొత్త మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌కు శ్రీకారం చుట్టింది. అది కూడా స్థానికంగా ఉండే మహిళా రైతులను యజమానులుగా మార్చి వారి భాగస్వామ్యంతోనే మామిడి పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయిస్తోంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో వెయ్యి మంది మహిళలు రూ. 50 లక్షల భాగస్వామ్యం కలిగి ఉంటారు. మిగిలిన రూ.4.50 కోట్లు సబ్సిడీగా లభిస్తుంది. ఏలూరు జిల్లా నూజివీడులోని మార్కెట్ యార్డులో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. నూజివీడు మామిడికి ప్రసిద్ధి. ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 1.40 లక్షల ఎకరాల్లో ఈ రకం మామిడి సాగవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది మామిడికి మంచి ధర ఉన్నప్పటికీ అకాల వర్షాలకు కాయకు మంగు రావడం, మచ్చలు ఉండటం, ఇతర కారణాలతో మార్కెట్ పూర్తిగా పతనమైంది. ప్రధానంగా నూజివీడులో పెద్ద రసాలు, చిన రసాలు, జలాలు, సువర్ణరేఖ, హిమామ్‌పసంగ్, బంగినపల్లి, తొతాపూరి తదితర వెరైటీలు సాగవుతుంటాయి. అయితే ఎక్కువగా తొతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు 90 శాతం మార్కెట్లో ఉంటాయి. మార్కెట్ యార్డ్‌లో ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఏడాది అకాల వర్షాలు, ఈదురు గాలలకు కాయ రాలిపోవడంతో మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటికి పరిష్కారం చూపే విధంగా పంటకు మంచి ధర ఉండేలా స్ధానికంగా మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూజివీడు మార్కెట్ యార్డ్‌లో ఎకరం విస్తీర్ణంలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుజ్జు (పల్ప్) సేకరించే యూనిట్ కాకుండా పచ్చడి మామిడికాయ నుంచి పౌడర్ తీసే యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా వెయ్యి మంది మహిళా రైతులను గుర్తించి ఇప్పటికే వారితో ఒక సమాఖ్య రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్కొక్కరు రూ. 5 వేల మూలనిధితో రూ. 50 లక్షలు సమకూర్చుకోగా మిగిలిన రూ. 4.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులో స్ధలం కేటాయించింది. పథకం అమలు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మరో నెల రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్రతో పనులు ప్రారంభమై మూడు నెలల్లో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం కానుంది. డీఆర్డీఏ నేతృత్వంలో మహిళా సమాఖ్య దీన్ని నిర్వహించనుంది. ప్రత్యేకంగా చెట్టు నుంచి కోసిన కాయలతో పాటు, రాలిపోయిన కాయలు, వర్షానికి దెబ్బతిన్న కాయలను కూడా సమాఖ్య మార్కెట్ ధరకు కొంటుంది. రైతుకు వెంటనే డబ్బు చెల్లిస్తుంది. కాయల నుంచి మామిడి పౌడర్‌ను తయారు చేసి క్యాండీ, జెల్లీలు తయారు చేసే పరిశ్రమలకు విక్రయించేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొదటి ప్రాసెసింగ్ యూనిట్ రాష్ట్రంలోనే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మొట్టమొదటి మ్యాంగో పౌడర్ యూనిటŒæ ఇది. నూజివీడులోని మార్కెట్ యార్డులో ఎకరం స్ధలంలో రూ. 5 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. నూజివీడులో 12 వేల ఎకరాలు, ఆగిరిపల్లిలో 20 వేల ఎకరాల్లో మొత్తంగా 32 ఎకరాల్లో రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ఉపయుక్తంగా ఉంటుంది. మహిళలే యజమానులుగా దీన్ని డీఆర్డీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. – ప్రసన్న వెంకటేష్, జిల్లా కలెక్టర్, ఏలూరు -
కొట్టుకుపోయిన వడ్లు.. దెబ్బతిన్న పంటలు
నల్లగొండ/జగిత్యాలఅగ్రికల్చర్/డొంకేశ్వర్ (ఆర్మూర్): ఈదురుగాలులు.. అకాల వర్షంతో శుక్రవారం రాత్రి పలు జిల్లాల్లో పంటనష్టం వాటిల్లింది. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మార్కెట్‌యార్డులు, ఐకేపీ కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ఇంకొన్ని కేంద్రాల్లో వర్షపు నీటితో పాటే వడ్లు కొట్టుకుపోయాయి. వర్షం తగ్గిన తరువాత చీకట్లోనే రైతులు ధాన్యాన్ని కాపాడుకునే యత్నాలు చేశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 23,560 ఎకరాల్లో మామిడి, వందల ఎకరాల్లోని వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన పసుపు కుప్పలు తడిసిపోయాయి. -
కన్నీటి పంట
► అకాల వర్షంతో జిల్లాలో భారీగా నష్టం ► దెబ్బతిన్న మొక్కజొన్న, పొగాకు, నువ్వులు ► బూజుపడుతున్న మిర్చి ► నూజివీడులో నేలరాలిన మామిడి ► గింజ రాలిపోతున్న మినుము మచిలీపట్నం : అకాల వర్షం రైతులకు అపార నష్టం కలగజేసింది. ఊహించని విధంగా ఆదివారం కురిసిన వర్షం, బలమైన గాలులకు మొక్కజొన్న, పొగాకు, నువ్వు, అరటితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా నూజివీడు, బాపులపాడు, పమిడిముక్కల, ముసునూరు, వీరులపాడు తదితర ప్రాంతాల్లో వర్షానికి తోడు ఈదురుగాలులు వీయడంతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న 2,575 ఎకరాలు, పొగాకు 225 ఎకరాలు, నువ్వులు 60 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇచ్చేవిషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉం టుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మొక్కజొన్న.. ఆందోళనలో రైతన్న నూజివీడు మండలం తుక్కులూరు, జంగంగూడెం, మోర్సపూడి, బాపులపాడు, పమిడిముక్కల తదితర మండలాల్లో మొక్కజొన్న గింజలు కట్టే దశలో ఉంది. ఈదురుగాలుల ప్రభావంతో గింజలు గట్టిపడవని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.30వేల వరకు ఖర్చు చేశామని, కీలకదశలో పైరు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలురైతులకు మరో రూ.10వేలు అదనంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నూజివీడులో 1.60 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈదురుగాలల ప్రభావంతో కాయలు నేలరాలాయి. నూజివీడు మండలంలో పొగాకు పందిళ్లు తడిచిపోయాయి. తడిసిన మిర్చి ఈ ఏడాది జిల్లాలో 25వేల ఎకరాలకు పైగా మిర్చి సాగైంది. ఎకరాకు లక్ష రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించగా, 10, 15 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి. గతేడాది క్వింటాలు మిర్చి రూ.12,500 ధర పలకగా, ఈ ఏడాది రూ.5,200 నుంచి రూ.5,500కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. వీరులపాడు, బాపులపాడు తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న మిర్చి తడిచింది. మిర్చి నల్లరంగులోకి మారడం.. బూజుపట్టే అవకాశం ఉండటంతో నాణ్యత తగ్గి ధర మరింత దిగజారుతుందని రైతులు వాపోతున్నారు. ముంచిన మినుము జిల్లాలో ఈ ఏడాది 3.86 లక్షల ఎకరాల్లో మినుము సాగు చేశారు. 60 శాతం మేర మినుముతీత జరిగింది. మిగిలిన 40 శాతం మినుముతీత దశలో ఉంది. జిల్లావ్యాప్తంగా ఆదివారం వర్షం కురవడంతో పనలపై ఉన్న మినుము తడిచింది. ఎండిన మినుముకాయలు వర్షానికి తడిచి గింజలు రాలిపోతాయని రైతులు చెబుతున్నారు. మినుముకు జరిగిన నష్టంపై తమకు సమాచారం రాలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. -
అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన
నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం రైతన్నకు తీవ్ర నష్టం కలిగించింది. శుక్రవారం తెల్లవారు జామున జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం, ఎల్లారెడ్డి మండలాల్లో అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవటంతో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని కుప్పలుగా పోసి ఉంచారు. వర్షం దెబ్బకు రోడ్లపై ఉన్న ధాన్యం కొట్టుకుపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సిద్దిపేటను ముంచెత్తిన జడివాన
మెదక్: సిద్దిపేట పట్టణంలో గురువారం రాత్రి కురిసిన వర్షం పట్టణాన్ని ముంచెత్తింది. జడివానకు వీధులన్నీ జలమయమయ్యాయి. సాయంత్రం ఆరున్నర నుంచీ రాత్రి 8:30 వరకు కురిసిన వర్షం గాలి దుమారంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిది. దీంతో పట్టణమంతా అంధకారం నెలకొంది. పట్టణంలోని మార్కెట్ యార్డుకు అమ్మకానికి తెచ్చిన రైతుల ధాన్యం తడిసి ముద్దయ్యింది. రైతులు టార్పాలిన్లతో ధాన్యాన్ని తడవకుండా తంటాలు పడ్డారు. అదే విధంగా రైతు బజార్లో అమ్మకానికి ఉంచిన కూరగాయలు అకాల వర్షపు నీటిలో కొట్టుకు పోయాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో నిర్వహిస్తున్న డెక్కన్ చైర్ ఎగ్జిబిషన్ వెలివేషన్ తాత్కాలిక కట్టడాలు నేలకొరిగాయి. ఎగ్జిబిషన్లో ప్రధాన ఆకర్షనగా నిలిచిన బారీ జాయింట్ వీల్ గాలి దుమారానికి పక్కకు ఒరిగి పోయింది. వర్షం కారణంగా ఎగ్జిభిషన్కు సందర్శకులు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నియోజక వర్గంలోని చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట మండలాల్లోని ఆయా గ్రామాల్లో కొద్దిపాటి వర్షం కురిసిందని సమాచారం. -
అకాల వర్షం...భారీనష్టం..!
►రాళ్లవానతో రాలిపోయిన ధాన్యం ►ఈదురు గాలులతో ఇళ్లపై ఎగిరిపోయిన పై కప్పులు ►అవుసలపల్లిలో పిడుగుపాటుకు పాడిగేదె, దున్నపోతు మృతి ►కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ►ప్రభుత్వమే ఆదుకోవాలి బాధితుల వినతి మెదక్ రూరల్ : అకాలవర్షంతో తీవ్రనష్టం వాటిల్లింది. చేతికందిన పంటంతా నేలపాలైంది సంఘటన మండల పరిధిలోని పలుగ్రామాల్లో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. బుధవారం సాయంత్రం ఉన్నట్టుండి ఈదురుగాలులతో రాళ్లవర్షం పడింది. దీంతో మండల పరిధిలోని పాతూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రలోని ధాన్యం తడిసి ముదైంది. అలాగే భయంకరమైన ఈదురుగాలులతో మండలంలోని ఔరంగాబాద్ గిరిజన తండాలోని పలు ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. తండాకు చెందిన నానావత్ భాస్కర్ అనేవ్యక్తి ఇంటిపై ఉన్న సిమెంటు రేకులు గాలిధాటికి ఎగిరి వందగజాల దూరంలో పడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు భయంతో పరుగున బయటకు వచ్చి వేరేవారి ఇంట్లో తలదాచుకున్నారు. అవుసులపల్లి గ్రామానికి చెందిన కందుల రాములు అనేరైతు పాడిగేదెను, దున్నపోతును వ్యవసాయపొలం వద్ద చెట్టుకు కట్టేయగా పిడుగుపడడంతో మృత్యువాత పడ్డాయి. దీంతో సుమారు రూ.60 వేలనష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పిడుగు పడిన చోట నిలబడితే మంచుపై నిలబడినంత చల్లగా ఉంది. దీనిని బట్టి ఇది చలిపిడుగై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. పిడుగు పడిన సమయంలో భయంకరమైన శబ్దం వచ్చి మెరుపు మెరిసిందని పిడుగు పడిన ప్రదేశానికి తాను కొద్దిదూరంలో ట్రాక్టర్ కింద తలదాచుకున్నానని బాధిత రైతు తెలిపాడు. గేదే మృత్యువాత పడటంతో తాను జీవనాధారం కోల్పోయానని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాళ్లవర్షంతో అవుసులపల్లి శివారులోని కోతకు వచ్చిన వరిపొలంలోని వడ్లు రాలిపోయాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడినా ఫలితం దక్కలేదని, మరో వారం రోజుల్లో కోతకోద్దామనుకుంటున్న సమయంలో అకాలవర్షం తమను ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు, బాధితులు కోరుతున్నారు. అయోమయంలో అన్నదాత కొల్చారం: బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో ఈ ప్రాంత అన్నదాతలు అయోమయంలో పడ్డారు. సాయంత్రం 5గంటలకు చిరు జల్లుతో ప్రారంభమైన వర్షం పెద్దదిగా మారడంతో రోడ్ల వెంట, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టడంతో చాలా మేరకు తడిసింది. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
మెదక్ జిల్లాను కుదిపేసిన అకాలవర్షం
మెదక్: మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షాలు అన్నదాతకు నష్టం మిగిల్చాయి. సిద్దిపేటలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం, పొద్దు తిరుగుడు విత్తనాలు తడిసి ముద్దయ్యాయి. సుమారు 500 బస్తాల ధాన్యం తడిసినట్లు సమాచారం. ఆయిల్ ఫెడ్ కొనుగోలు కేంద్రంలోని పొద్దు తిరుగుడు విత్తనాలు కూడా తడిచిపోయాయి. అలాగే, నారాయణఖేడ్, పరిగి, ములుగు, వర్గల్ మండలాల్లో కురిసిన వడగండ్ల వానలతో జనం ఇబ్బందుల పాలయ్యారు. -
అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
సాక్షి నెట్వర్క్: అకాల వర్షం వీడడం లేదు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన వర్షం వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ జిల్లాల్లో వరి, మామిడి రైతులతోపాటు ఇతర రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్ జిల్లాలో వడగళ్లు, ఈదురు గాలులకు పంటల కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 2,393.4 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఏజెన్సీ ప్రాంతంలో 68.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాంనగర్ వద్ద జీడివాగు ఉప్పొం గి ప్రవహిస్తుండగా, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వృక్షాలు, కరెంట్ స్తంభాలు నేలమట్టం కాగా, వాహనాల రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తాడ్వారుు మండలంలోని మేడా రం వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లా గుండ్రాతి మడుగులోని రైలు సిగ్నల్ ప్యానెల్ బ్లాంక్ డెడ్ కావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు రైల్వే అధికారులు తెలి పారు. బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటలో చెట్టు కింద ఉన్న బెడిద భీరయ్యతో పా టు మరో ఇద్దరు రైతులు రాజు, జయరాములు పిడుగుపాటుకు గురయ్యారు. భీరయ్య శరీరం కాలిపోగా, మిగ తా ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మార్కెట్‌యార్డులో రైతులు ఆరబోసుకున్న సుమారు ఐదు వందల టన్నుల ధాన్యం శుక్రవారం కురిసిన వర్షానికి తడిసి ముద్దరుుంది. మండల వ్యాప్తంగా సుమారు కోటీ యూభై లక్షల రూపాయల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తం గా 470 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. ఉద్యానవన శాఖ ఒకటో డివిజన్ పరిధిలో 234 హెక్టార్లలో మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. కొడంగల్, కోస్గి, మద్దూరు, దౌల్తాబాద్ మండలాల్లో మామిడి కాయలు నేలరాలాయి. -
తెలంగాణలో భారీ వర్షం..రైతులకు తీవ్ర నష్టం
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా వాణిజ్య పంటలతో పాటూ కూరగాయలు, పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాగా భారీ వర్షం కారణంగా జిల్లాలోని పలు రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ , నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు తీవ్రం ప్రభావం చూపాయి. అకాల వర్షాలతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. నల్లగొండ: జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడలో ఈదురుగాలులతో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వందల ఎకరాల్లో వరి కి నష్టం వాటిల్లింది. నడిగూడెంలో మామిడి తోటలు ధ్వంసం అయ్యాయి. హుజుర్ నగర్ మార్కెట్ యార్డులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోయింది. రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల, పరిగి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కూరగాయాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరంగల్: జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు పడ్డాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిని పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నారావు పేట మండలంలో కోళ్ల షెడ్లు కూలి 50 వేల కోళ్లు మృత్యవాత పడ్డాయి. పలు చోట్ల పిడుగుపాటుతో 15 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పినపాక నియోజక వర్గంలో అకాల వర్షంతో మామిడి పంటకు తీవ్రంగా నష్టపోయింది. చేతికొచ్చిన కాపు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొండికొండ ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. -
నేడు తేలనున్న పంటనష్టం లెక్క
- సర్వేలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం - ఇప్పటి వరకు వరి 1648 హెక్టార్లలో నష్టం నల్లగొండ అగ్రికల్చర్: ఇటీవల జిల్లాలో కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానలతో నష్టపోయిన పంటల లెక్క శుక్రవారం తేలనుంది. పంటనష్టం సర్వే చేయడంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖలు నిమగ్నమయ్యాయి. గ్రామాల వారీగా బృందాలను ఏర్పాటు చేసి రైతు వారీగా పంటనష్టం అంచనాలు వేయడం వలన సర్వే కొంత ఆలస్యమవుతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా 37 మండలాలలోని 320 గ్రామాల్లో సుమారు13287 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అందులో వరి 1367 హెక్టార్లు, 16 హెక్టార్లలో మొక్కజొన్న పంటలకు నష్ట జరిగినట్లు ప్రాథమికంగా అంచనాలు వేశారు. అయితే 10 మండలాలలో పంటలకు నష్టం జరగలేదని క్షేత్ర స్థాయిలో పర్యటించిన సర్వే బృందాలు ఇప్పటి వరకు నివేదికలు అందించాయి. 27 మండలాల్లో మాత్రమే పంటలకు నష్టం జరిగినట్లు నిర్ధారించారు. గురువారం నాటికి 13 మండలాల నుంచి పంటనష్టం నివేదికలు వ్యవసాయ శాఖకు అందాయి. అందులో వరి 1648 హెక్టార్లు కాగా మొక్కజొన్న 16 హెక్టార్లలో నష్టం జరిగినట్లు నివేదించారు. అయితే అత్యధికంగా పంట నష్టం జరిగిన 14 మండలాల నుంచి నివేదికలు నేడు అందే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి రైతుల వారీగా వివరాలను సేకరించి వారి బ్యాంకు అకౌంట్ బుక్ జీరాక్స్‌లను తప్పక తీసుకోవాల్సి ఉన్నందున సర్వే కొంత ఆలస్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 33 శాతం వరకు పంటనష్టం జరిగినా పరిహారం అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో పంటనష్టం జరిగిన రైతులు తమ పంట పొలాలను అధికారులకు చూపించి జాబితాలో పేర్లను నమోదు చేయించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. సర్వే పూర్తి అయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన తరువాత నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందే అవకాశం ఉంటుంది. -
2లక్షల ఎకరాల్లో పంట నష్టం
మరిపెడలో 8.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు హైదరాబాద్: అకాల వర్షం 2 లక్షల ఎకరాల పంటను నాశనం చేసింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రైతన్న కుదేలయ్యాడు. వడగళ్లతో అనేకచోట్ల పంట ధ్వంసమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మండలాల్లోని 889 గ్రామాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రకటించారు. 1.09 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సజ్జ, నువ్వులు, జొన్న పంటలకు నష్టం వాటిల్లగా, సుమారు 91వేల ఎకరాల్లో పండ్లతోటలు, ఇతర పంటలకు నష్టం జరిగింది. ఆయా జిల్లాల్లో వ్యవసాయ, రెవెన్యూ యంత్రాంగాలు పంటనష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనావేసే పనిలో ఉన్నాయి. వరి, మామిడికే అధిక నష్టం: అకాల వర్షాల కారణంగా ఆహార పంటల్లో వరి, ఉద్యాన పంటల్లో మామిడికే తీవ్రమైన నష్టం వాటిల్లింది. వరికి 74,382 ఎకరాల్లో, మామిడికి 73,236 ఎకరాల్లో నష్టం జరిగింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 38,507 ఎకరాల్లో, నల్లగొండ జిల్లాలో 33,207 ఎకరాల్లో నష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 19,227 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉద్యాన పంట ల్లోనూ కరీంనగర్ జిల్లానే అధికంగా నష్టపోయింది. అక్కడ అన్ని ఉద్యాన పంటలు కలిపి 53,859 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. వరంగల్ జిల్లాలో 8,455 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో 6,411 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మరో ఐదు రోజులు తేలికపాటి వర్షాలు మరో ఐదు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇన్చార్జి డెరైక్టర్ సీతారాం ‘సాక్షి’కి చెప్పారు. అయితే వడగళ్ల వానలు ఉండబోవని ఆయన పేర్కొన్నారు. గత 24 గంటల్లో వరంగల్ జిల్లా మరిపెడలో అత్యధికంగా 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
పోటాపోటీగా.. పంటల పరిశీలన
గత వారం రోజులుగా అకాలవర్షం, వడగళ్ల వానతో అతలాకుతలమైన కరీంనగర్ జిల్లా బుధవారం రాజకీయ నేతల తాకిడితో ఉక్కిరిబిక్కిరైంది. పంటనష్టం పరిశీలన పేరుతో అధికార, విపక్ష పార్టీల నేతలు ఉన్నట్లుండి ఒకేరోజు క్షేత్రస్థాయి పర్యటనల పేరుతో పోటీపడ్డారు. నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతుల గోడు విన్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు హమీ ఇస్తే... కేంద్రం తరపున రైతులకు సత్వర సాయం అందించేందుకు యత్నిస్తానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మల్యాల మండలంలో పంటలను పరిశీలించిన సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి రైతాంగానికి కేంద్రం ఎంత నష్టపరిహారం చెల్లిస్తుందో... రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని జతచేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :వాస్తవానికి కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ జిల్లా పర్యటన మాత్రమే తొలుత అధికారికంగా ఖరారైంది. జగిత్యాల, మేడిపల్లి మండలాల్లో తదితర ప్రాంతాల్లో పర్యటించేందుకు బుధవారం ఉదయమే కరీంనగర్‌కు వచ్చా రు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు బుధవారం ఉదయం మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్, హరీష్‌రావులతో సమావేశమయ్యారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో బీజేపీ కంటే ముందే పర్యటించడం మేలని, లేనిపక్షంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. అనుకున్నదే తడవుగా అప్పటికప్పుడే మంత్రులు ఈటెల, కేటీఆర్ సహా జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కె.విద్యాసాగర్‌రావు, సిహెచ్.రమేష్‌బాబు తదితరులు జగిత్యాల మండలం నర్సింగాపూర్, చల్గల్, మేడిపల్లి మండలం కట్లకుంట, కోరుట్ల మండలం జోగిన్‌పల్లి, మాదాపూర్ గ్రామాల్లో పర్యటించారు. మరో మంత్రి హరీష్‌రావు చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి పెగడపల్లి మండల కేంద్రం, ఏడుమోటలపల్లి గ్రామాల్లో పంటలను పరిశీలించారు. తలపట్టుకున్న అధికారులు కేంద్ర మంత్రి దత్తాత్రేయ కోసం ఎదురుచూస్తున్న అధికారులకు అదే సమయంలో రాష్ట్ర మంత్రులు ఈటెల, కేటీఆర్, హరీష్‌రావు వస్తున్నట్లు ఆకస్మికంగా సమాచారం రావడంతో ఎటువైపు వెళ్లాలో తెలియక ఇబ్బందిపడ్డారు. చివరకు జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్, ఉద్యానవన అధికారులు రాష్ట్ర మంత్రులతోపాటు నర్సింగాపూర్‌కు వచ్చారు. అక్కడ పంటలను పరిశీలిస్తున్న సమయంలో దత్తాత్రేయ జగిత్యాలలోని ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌కు వచ్చారు. రాష్ట్ర మంత్రులిరువురు దత్తాత్రేయను కలవకుండానే నేరుగా చల్గల్ వెళ్లిపోయారు. వారితోపాటు అధికారులూ వెళ్లారు. అక్కడినుంచి మేడిపెల్లికి వెళుతుండగా దత్తాత్రేయ కాన్వాయ్ ఎదురుపడడంతో ఆగిన రాష్ట్ర మంత్రులు తమ వాహనాలు దిగి దత్తాత్రేయతో కొద్దిసేపు మాట్లాడి వెళ్లారు. రాష్ట్ర మంత్రులు వెళ్లిన తరువాత దత్తాత్రేయ చల్గల్, తాటిపల్లి గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. రైతుల గోడు విన్నారు. కేంద్రం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మేడిపెల్లి మండలం పోరుమల్ల, తొంబర్రావుపేట, కలికోట గ్రామాల్లో పంటలను పరిశీలించిన అనంతరం కోరుట్ల మీదుగా నిజామాబాద్ జిల్లాకు వెళ్లిపోయారు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు మరికొందరు అధికారులు మాత్రం కేంద్ర మంత్రి వెంటే ఉన్నారు. సాయంత్రం కాంగ్రెస్ నేతల పరిశీలన కేంద్ర, రాష్ట్ర మంత్రులు జిల్లాలో పర్యటించి వెళ్లడంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమా ర్, ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్ తదితరులు మ ల్యాల మండలం మానాల గ్రామానికి వెళ్లి వడగళ్ల వానకు నష్టపోయిన పంటలను పరామర్శించారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. కేంద్రం సైతం తక్షణమే అధికారుల బృందాన్ని జిల్లాకు పంపాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ విమర్శల దాడి పంటనష్టం జరిగి సుమారు వారం రోజులు అవుతున్నప్పటికీ జిల్లా మంత్రులు ఇంతవరకు ఎందుకు పర్యటించలేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రశ్నించారు. దత్తాత్రేయతో కలిసి జిల్లాకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరీంనగర్, చల్గల్ ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. వారం రోజులుగా రైతులు అల్లాడుతుంటే పట్టించుకోని రాష్ట్ర మంత్రులు ప్రధానమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రులు జిల్లాల్లో పర్యటిస్తుంటే అడ్డుతగులుతూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పంటనష్టం జరిగి వారం రోజులు గడుస్తున్నా గ్రామాల్లో ఎందుకు తిరగలేదని ప్రశ్నించారు. సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలకు జగిత్యాల డివిజన్ రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పడంతోపాటు వెంటనే పర్యటించాలని కోరానని తెలిపానన్నారు. అయినప్పటికీ పట్టించుకోని రాష్ట్ర మంత్రులు హడావుడిగా జగిత్యాలకు వచ్చి వెళ్లడం సరికాదు. ప్రొటోకాల ప్రకారం మంత్రులు పర్యటనల సమయంలో స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించిందన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ జగిత్యాల పర్యటన సందర్భంగా తనకు ముందస్తుగా సమాచారం ఇచ్చారని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గత వారం రోజులుగా వర్షాలతో రైతుల నష్టపోతే కనీసం వివరాలను సేకరించే విషయంలోనూ టీఆర్ఎస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు. -
వర్ష బీభత్సం..
-
అకాల దెబ్బ
జగిత్యాల అగ్రికల్చర్/సారంగాపూర్ /మెట్‌పల్లిరూరల్: వర్షాభావంతో రైతులు అంతంతే సాగు చేయగా.. అకాల వర్షం ఆ పంటను సైతం తుడిచిపెట్టుకుపోరుుంది. జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఇప్పుడిప్పడే వస్తున్న మామిడి పిందెలు నేల రాలిపోగా.. మొక్కజొన్న పంట పాడరుుంది. పసుపును ఉడకబెట్టిన రైతుల కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. మామిడి రైతులు ఎకరాకు రూ.50 వేలు, మొక్కజొన్న రైతులు రూ.10 వేల చొప్పున పెట్టుబడిగా ఖర్చు చేశారు. పసుపును తవ్వి ఉడుకబెట్టి, ఆరబెడుతున్న సమయంలో వర్షం కురవడంతో నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బూజు రావడంతోపాటు పసుపులోని కుర్క్మిన్ శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సారంగాపూర్‌లో గంటన్నర పాటు ఏకదాటిగా 42.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మండల కేంద్రంతోపాటు, రేచపల్లి, రంగపేట, నాగునూర్, లచ్చక్కపేట, పెంబట్ల, కోనాపూర్, పోతారం, బట్టపల్లి, లక్ష్మీదేవిపల్లి, బీర్పూర్, తుంగూర్, న ర్సింహులపల్లె, కొల్వాయి గ్రామాల్లోని మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. తహశీల్దార్ రాజమల్లయ్య, ఏవో తిరుపతినాయక్, ఆర్ఐలు విజయరంగారావు, శ్రీనివాస్ నష్టపోరుున పంటలు పరిశీలించారు. అకాల వర్షంతో రైతులు, అడ్తీవ్యాపారులు నష్టపోయూరు. 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెట్పల్లి వ్యవసాయమార్కెట్‌కు వచ్చిన సుమారు వెయ్యి క్వింటాళ్ల పసుపు వర్షంతో తడిసి ముద్దరుుంది. గిట్టుబాటు ధర కోసం కల్లాల్లోనే ఆరబెట్టిన పసుపు సైతం తడిసిపోరుుంది. మండలంలోని కోనరావుపేటలో మామిడి పిందెలు నేలరాలారుు. మరో మూడు రోజులు వర్షాలు జగిత్యాల అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణితో జిల్లాలో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త మధుకర్‌రావు తెలిపారు. సముద్రజలాల మీద అప్పటికప్పుడే ఏర్పడిన ఉపరితల ద్రోణి తో అకాల వర్షాలు కురిశాయని చెప్పారు. పూణే నుంచి మంగళవారం పూర్తి సమాచారం అందనుందన్నారు. పలు మండలాల్లో వర్షపాతం ఇలా.. జిల్లాలోని సారంగాపూర్‌లో 42.8 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్లో అత్యల్పంగా 1 మిల్లీమీటర్, ధర్మపురిలో 36.4, రామగుండంలో 27, జగిత్యాలలో 22, మెట్పల్లిలో 16, ముస్తాబాద్‌లో 13.2, గంభీరావుపేటలో 12.4, పెగడపల్లిలో 8.4, జూలపల్లిలో 5.8, సిరిసిల్లలో 5.2, సుల్తానాబాద్‌లో 3.2, గంగాధరలో 1.6 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. వ్యాపారులను ఆదుకోవాలి మార్కెట్లో ఆరబోసుకున్న పసుపు వర్షం పాలైంది. దీంతో వ్యాపారులు నష్టపోయూరు. వ్యాపారులందరం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నందునా ఆదుకోవాలి. సకాలంలో స్పందించేందుకు తగిన కూలీలు, మార్కెట్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి - నిమ్మల భూమారెడ్డి, అడ్తీ వ్యాపారి, మెట్పల్లి మార్కెట్ -
మాయదారి వర్షం
జిల్లావ్యాప్తంగా అకాల వర్షం దెబ్బతిన్న పంటలు జిల్లాలో అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది.. గురువారం రాత్రి, శుక్రవారం వేకువజామున ఉరుములు, మెరుపులు, గాలి దుమారం, పిడుగుపాటుతో కూడిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి.. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసింది.. మొక్కజొన్న నేలవాలింది.. మామిడి తోటల పూతరాలింది.. పిడుగుపాటుకు గేదెలు, గొర్రెలు మృతిచెందారుు.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.. వీధులు జలమయం అయ్యూరుు.. జిల్లావ్యాప్తంగా రూ.కోట్లలో నష్టం వాటిల్లింది.. జనగామ మండలంలో... అకాల వర్షం కొన్ని పంటలకు మేలు చేయగా.. మరికొన్నింటికి నష్టాన్ని తెచ్చిపెట్టింది. వరి, టమాట, పుచ్చ, మొక్కజొన్న పంటలకు వర్షం ఊపిరి పోసినట్లైంది. నెల రోజుల్లో కోతకు రావాల్సిన మొక్కజొన్న పంటలు అకాల వర్షంతో నేలవాలాయి. గాలి దుమారంతో అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనగామ మండల పరిధిలో సంభవించిన పిడుగుపాటుతో వెంకిర్యాలలో ఎదునూరి మల్లేశానికి చెందిన పాడి గేదె, గోపరాజుపల్లిలో లింగాల మోహన్‌రెడ్డికి చెందిన జెర్సీ ఆవు, అదే గ్రామంలోని రొంపెల్లి భూపతిరెడ్డికి చెందిన పాడి గేదె, అడవికేశ్వాపూర్‌లో ఎర్ర ఐలయ్యకు చెందిన జెర్సీ ఆవు మృతి చెందారుు. వీఆర్ఓలు పంచనామా నిర్వహించి, సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. తమకు తగిన పరిహారం అందించాలని బాధిత రైతులు కోరారు. - జనగామ రూరల్ రాయపర్తి మండలంలో... రాయపర్తి మండల కేంద్రంతోపాటు పెర్కవేడు తదితర గ్రామాల్లో కురిసిన అకాలవర్షంతో మిర్చి, మొక్కజొన్న రైతులకు నష్టం వాటిల్లింది. తడిసిన మిర్చి రంగుమారి తెల్లగా మారే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో సర్వే చేయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. - రాయపర్తి నల్లబెల్లి మండలంలో... అకాలవర్షంతో సుమారు 2500 ఎకరాల్లో మిరపకు నష్టం వాటిల్లింది. రంగాపురం, ముచ్చిం పుల, నందిగామ, రేలకుంట, బోల్లోనిపల్లి, రుద్రగూడెం, గొవిందాపురంలో కల్లాల్లోనే ఉన్న మిరప కాయలు తడిసిముద్దయ్యూరుు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, సర్పంచ్ రాంబాబు డిమాండ్ చేశారు. - నల్లబెల్లి సంగెం మండలంలో... సుమారు రెండున్నర గంటల పాటు కురిసిన వర్షం రైతులకు దుఃఖాన్ని మిగిల్చింది. మొక్కజొన్న నేలకొరిగింది. మరి కొన్ని గ్రామాల్లో తీసిన కంకులు.. చేల్లో నిలిచిన నీటిలో తడిసిముద్దయ్యూరుు. మామిడి తోటల్లో పూలు, పిందే రాలిపోయింది. - సంగెం గణపురం మండలంలో... రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో కల్లాల్లో ఉన్న మిరప తడిసిపోయింది. కొండాపురం, బంగ్లాపల్లి, అప్పయ్యపల్లి, బుద్దారం, మైలారం, గాంధీనగర్ గ్రామాల్లో మిరప పంటకు భారీ నష్టం వాటిల్లింది. - గణపురం జంగిలికొండ అతలాకుతలం గాలివాన మహబూబాబాద్ మండలంలోని జంగిలిగొండ గ్రామాన్ని అతలాకుతలం చేసింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామశివారులో కొండారెడ్డి, గంజి యాకుబ్ రెడ్డికి చెందిన కోళ్ల ఫారమ్ గాలివానకు కూలిపోయింది. వందలాది కోళ్లు మృతిచెందగా, రూ.10 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. చెట్లు , విద్యుత్ స్తంభాలు నేలమట్టంకావడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నగేష్, వెంకటనారాయణ, యుగంధర్‌కు చెం దిన షెడ్లు కూలిపోయూరుు. కొయ్యాల వెంకటరమణ ఇంటికప్పు, కొట్టం కూలిం ది. చెట్టు కూలడంతో సామయ్య కు చెందిన 3 గొర్రెలు మృతిచెందాయి. అచ్చమ్మ, పుల్లయ్య, మల్లయ్య తదితరుల ఇళ్ల పై కప్పులు కూలాయి. స్థానిక పాఠశాల గది పైకప్పు పెంకులు ఊడిపోయాయి. ఎమ్మెల్యే శంకర్ నాయక్ గ్రామాన్ని సందర్శించి, నష్టపరిహారంపై అంచనా వేయూలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నెల్లికుదురు మండలం చిన్ననాగారంలో మిరప నీటిపాలుకావడం తో రైతులు లబోదిబోమంటున్నారు. -
అకాల వర్షం... రైతుకు భారీ నష్టం
కర్నూలు(అగ్రికల్చర్) : అకాల వర్షాలు రైతుల కష్టార్జితాన్ని నీటిపాలు చేశాయి. ఊహించని విధంగా పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియడంతో వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి రేయింబవళ్లు శ్రమించి పండించిన పంటలు దెబ్బతినడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. కల్లందొడ్లలో మిరప ఆరబెట్టుకున్నారు. పంట నూర్పిళ్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. పశుగ్రాసాలను వాములుగా వేస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి కురిసిన వర్షం రైతులకు నష్టాలను మిగిల్చింది. పగిడ్యాలలో ఏకంగా 61 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. కర్నూలులో 37, గూడూరులో 21.8, కల్లూరులో 15.8, వెల్దుర్తిలో 15.2, ఓర్వకల్లులో 13.6, శ్రీశైలంలో 12.8, గోనెగండ్లలో 15.6 మిల్లీమీటర్ల ప్రకారం వర్షాలు కురిసాయి. ఈ వర్షాల వల్ల కల్లందొడ్లలో ఉన్న ఎండుమిర్చితో పాటు నూర్పిళ్లు చేస్తున్న వివిధ పంటలు తడిచిపోయాయి. ఎండుమిర్చి తడవడం వల్ల రంగు మారే ప్రమాదం ఏర్పడింది. ఇందువల్ల గిట్టుబాటు ధర లభించదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై వెంటనే వివరాలు పంపాలని జేడీఏ ఠాగూర్‌నాయక్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. అకాల వర్షంతో రాకపోకలకు అంతరాయం నందికొట్కూరు: అకాల వర్షం వాహనాల రాకపోకలకు అంతరాయం కలగించింది. సోమవారం ఉదయం 6 గంటలకు వర్షం కురిసింది. దీంతో కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి వైపు వెళ్లే వాహనాలు కల్వర్టు నిర్మాణం పక్కన్న ఉన్న పొలం రస్తాలో ఇరుక్కపోయాయి. దీంతో దాదాపు రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని వాహనాలు ఉప్పల దడియా, మిడ్తూరు మీదుగా నందికొట్కూరు, ఆత్మకూరు, గుంటూరు వైపు వెళ్లాయి. విషయం తెలుసున్న ఎమ్మెల్యే, ఎంపీపీ, ఆర్ అండ్ బీ అధికారులు వాహనాలు ఇరుకున్న ప్రాంతాలను పరిశీలించారు. కల్వర్టు నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
పరుగులు పెట్టించిన అకాల వర్షం
నాదెండ్ల : బంగాళాఖాతంలో అధిక పీడనం కారణంగా సోమవారం ఉదయం పడిన చిరుజల్లులు రైతులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. వ్యవసాయపనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో అకాల వర్షం రైతులకు కొంత నష్టాన్ని కలిగించింది. పత్తి పంట 70 శాతం వరకు చేతికందింది. చేలపై ఉన్న మిగిలిన పంట వర్షంతో తడిసింది.కల్లాల్లో ఆరబోసిన మిరపకాయలను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడ్డారు. ఇళ్లల్లో ఉన్న పరదాలను తెచ్చి కప్పారు. పొలంలో 50 శాతంపైగా మిరపకాయలు పండి కోతకు వచ్చాయి. ఈ సమయంలో కురిసిన వర్షంతో తాలుకాయలు అయ్యి పంట రంగుమారి ధర పడిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వరిపంట కోతకు వచ్చి పొలాల్లోనే కుప్పలు పోశారు. వర్షంతో ధాన్యం రంగుమారే అవకాశం ఉందంటున్నారు. నూర్పిడి పూర్తై రైతులు పశుగ్రాసం ఇళ్లకు తెచ్చి ఉంచారు. వాములు వేయకముందే చిరుజల్లులు పడడంతో తడిసిపోకుండా పట్టలు కప్పారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు జల్లులు పడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి తెరపి ఇవ్వటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రబీ రైతుల ఆందోళన చిలకలూరిపేటరూరల్ : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల పాటు ఇదేతరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో రబీ రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికంగా బర్లీ, బ్యారన్ పొగాకు పండించే రైతులు ఈ వర్షం కారణంగా దిగుబడిలో గ్రేడ్ రాదని పేర్కొంటున్నారు.పొలాల్లోనే బర్లీ పొగాకును ఆరబెట్టారు. అలాగే పత్తి, శనగ, మిర్చి తడిసినట్టు రైతులు తెలిపారు. తెనాలిలో అకాల వర్షం తెనాలిఅర్బన్ : తెనాలి పట్టణంలో ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం కొద్దిసేపు హడావుడి చేసింది. ఒక్కసారిగా పెద్దగా వర్షం రావటంతో రోడ్డుపై ప్రజలు తలదాచుకునేందుకు సమీపంలోని షాపుల్లోకి పరుగులు పెట్టారు. నకరికల్లులో.. నకరికల్లు : ఆకాశంలో కారుమబ్బులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మండలంలో సుమారు 1800 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. ఇప్పటి వరకు కౌలురైతులు సుమారు రూ.30 వేలు, సొంతరైతులు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట ప్రస్తుతం కోతకు వస్తోంది. ఈ తరుణంలో ఆకాశం మబ్బులు పట్టి చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో పత్తిపంట చేలోనే తడిసి పనికిరాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మాచర్లలో.. మాచర్లటౌన్ : ఎండలతో మండిపోతున్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం రాత్రి నుంచే వాతావరణంలో మార్పు వచ్చింది. సోమవారం ఉదయం ఆకాశం మబ్బులు పట్టి పట్టణ శివారులో వర్షం కురిసింది. మార్కెట్‌యార్డులోని సీసీఐ కేంద్రంలో నిల్వ ఉంచిన పత్తిబోరాలపై ఒక్కసారిగా వర్షం కురవటంతో రైతులు ఆందోళన చెందారు. వెంటనే పట్టలు కప్పేందుకు హడావుడి పడ్డారు. నెహ్రూనగర్, రాయవరం, కంభంపాడు గ్రామాల్లో వర్షం కురిసింది. కల్లాల్లో ఉన్న మిర్చి దెబ్బతింటుందని ఆందోళన చెందిన రైతులు పట్టలు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. గుంటూరు మిర్చియార్డులో.. పాతగుంటూరు : గుంటూరులో సోమవారం తెల్లవారుజామున చిరుజల్లులు పడటంతో యార్డులో మిర్చి టిక్కీలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. వేమెన్స్ , కమీషన్ షాపుల వద్ద ఉన్న పట్టలను తెచ్చుకుని మిర్చిని కాపాడుకున్నారు. చిరుజల్లులతోనే వర్షం ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పలు జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది రైతులు వర్షం పెద్దదవుతుందేమోనని ఆందోళనతో మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజీకి తరలించారు. -
అకాల వర్షం.. ఆగమాగం
సాక్షి, సంగారెడ్డి: వర్షాకాలంలో చేతిలెత్తిమొక్కినా కరుణించని వరుణుడు పిలవని అతిథిలా శీతాకాలంలో వచ్చేశాడు. కాలం కాని కాలంలో వచ్చి రైతన్నలకు కన్నీళ్లు తెప్పించాడు. అంతా ఆగమాగం చేసేశాడు. శనివారం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. శుక్రవారం రాత్రి నుంచి జల్లులతో ప్రారంభమైన వర్షం, శనివారం వేకువజాము నుంచి ఊపందుకుంది. సంగారెడ్డి, సిద్దిపేట రెవెన్యూ డివిజన్లలో భారీగా కురవగా, మెదక్ డివిజన్లో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 22.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితోపాటు మండలంలో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డిలో అత్యధికంగా 3.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా సంగారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా సిద్దిపేటలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిద్దిపేట శ్రీనివాస్‌నగర్ కాలనీలో వర్షపు నీళ్లు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనమైన పంచాయతీల్లోని గ్రామాల్లో సైతం వర్షం భారీగా కురిసింది. గజ్వేల్ మార్కెట్‌యార్డులో వ ర్షం ధాటికి ఆవరణలో ఉన్న మక్కలన్నీ తడిసిపోయాయి. మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక మార్కెట్‌యార్డు సందర్శించి మక్కల తరలించాలని అధికారులకు ఆదేశించా రు. దీంతో మార్కెట్లోని అధికారులు, సిబ్బంది తడిసిన మక్కలను రాత్రి వరకు తరలిస్తూనే ఉన్నారు. వెల్దుర్తిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అనంతరం వచ్చి సు డిగాలి బీభత్సం చేసింది. భారీ వర్షం తో పంటలు, చెట్లు దెబ్బతినగా, గాలులకు గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫారాలు దెబ్బతిన్నాయి. వర్షం కారణంగా పంట నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని వ్యవసాయశాఖ జేడీఏ హుక్యా నాయక్ తెలిపారు. సంగారెడ్డిలో భారీ వర్షం సంగారెడ్డిలో భారీగా వర్షం కురిసింది. ఉదయం 5.30 గం టల నుంచి 8 గంటల వరకు ఏకధాటికిగా వర్షం కురిసింది. వాన కారణం గా సంగారెడ్డిలోని రోడ్లు జలమయమయ్యాయి. మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. సంగారెడ్డిలో 3.4 సెం.మీ, సదాశివపేట మండలంలో 2.2 సెం.మీ, నర్సాపూర్‌లో 2.7 సెం.మీ, మనూరులో 2 సెం.మీ, హత్నూరలో 17 మిల్లీమీటర్లు, జిన్నారంలో 14.2 మి.మీ, కౌడిపల్లి, గజ్వేల్, రాయికోడ్, కొండాపూర్, కల్హేర్ మండలాల్లో 10 మి.మీ వర్షం కురిసింది. -
అకాల వర్షం...
పెదకూరపాడు : అకాల వర్షం మిరప, పత్తి రైతులను నష్టాలపాల్జేసింది. పంట చేతికి వస్తున్న సమయంలో వర్షం కురవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండలంలో శుక్రవారం ఉదయం లగడపాడు, కన్నెగండ్ల, హుస్సేన్‌నగరం, గారపాడు, బుచ్చియ్యపాలెం గ్రామాల్లో కురిసిన వర్షానికి పొలం మీద, కల్లాల్లో ఉన్న మిరప కాయలు, చేలల్లో విరగకాసిన పత్తి పూర్తిగా తడిసిపోయాయి. లగడపాడు, హుస్సేన్ నగరం, గారపాడు, బుచ్చియ్యపాలెం, రామా పురంలో మొదటి విడత మిరప కోతలు 10 రోజుల కిందట ప్రారంభమ య్యాయి. కాయలు కోసిన రైతులు కల్లాలకు చేర్చి ఆరబెడుతున్నారు. శుక్ర వారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న పంట పూర్తిగా తడిసి నీళ్లల్లో తేలియాడింది. చేలల్లో పత్తి కూడా పూర్తిగా తడిసిపోయి నేల రాలుతోంది. పత్తి, మిరప పనులకు వెళ్లిన కూలీలు వర్షం కారణంగా వెనుదిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం మిరప పంట పూర్తిగా కాయ, పూత దశలోఉంది. వర్షం పడడంతో చేలల్లోనే నేలరాలాయి. కాయలు తాలుగా మారే ప్రమాదం ఉంది. మిరప, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోతలు కోసిన వరి పంట కూడా తడిసిపోయింది. చేలల్లో పొట్టదశలో ఉన్న పంటకు కూడా నష్టం వాటిల్లింది. లబోదిబోమంటున్న అన్నదాతలు నకరికల్లు: అకాల వర్షంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం వర్షం కురిసింది. వరికోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో కురిసిన వర్షంతో పంట నీటిపాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చల్లగుండ్ల, నకరికల్లు, నర్సింగపాడు, దేచవరం, చేజర్ల తదితర గ్రామాల్లో వరికోతలు కోసి ఓదెలను ఆరబెడుతున్నారు. ఈ సమయంలో కురిసిన వర్షంతో పల్లపు ప్రాంతాల్లో పంటను కాపాడుకునేందుకు రైతులు పొలాలకు పరుగులు తీశారు. ఓదెలను కుప్పలుగా వేసి పట్టలు కప్పారు. -
రైతుకు కష్టం
కంచికచర్ల మార్కెట్ యార్డులో తడిసిన 2 వేల క్వింటాళ్ల పత్తి ఈ ఏడాది అసలే తగ్గిన దిగుబడిపెరిగిన సాగు వ్యయం తడిసిన పత్తి రంగు మారుతుందని ఆందోళనలో రైతులు కంచికచర్ల : అకాల వర్షంతో పత్తి రైతుకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పత్తిని ఎన్నో ఆశలతో సీసీఐ కొనుగోలు కేంద్రానికి తరలిస్తే.. మంగళవారం రాత్రి ఊహించనివిధంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో స్థానిక మార్కెట్ యార్డులోని పత్తి బోరాలు తడిసిపోయాయి. పత్తి బోరాల రక్షణకు ఏఎంసీ అధికారులు కొంతమంది రైతులకు మాత్రం నామమాత్రంగా పరదాలు ఇచ్చారు. అసలే ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల వల్ల పత్తి పంటకు ఆశించినంత దిగుబడి రాలేదు. పత్తి సాగుకు అధిక వ్యయం కావడంతో అప్పు చేసి మరీ సాగుచేసిన రైతులు వాటినుంచి బయటపడేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రానికి అమ్మకం కోసం పత్తి బోరాలను తీసుకొచ్చారు. 24.8 మిల్లీమీటర్ల భారీ వర్షం కురవడంతో అవి పూర్తిగా తడిసిపోయాయి. తడిసిన 1500 పత్తి బోరాలు... సుమారు 1500 పత్తి బోరాలు ఈ వర్షానికి తడిసిపోయాయి. తడిసిన పత్తి రెండు వేల క్వింటాళ్ల వరకు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపునీరు బయటకు వెళ్లకుండా నిలిచిపోవడంతో పత్తి బోరాలు నీటిలోనే నానుతున్నాయి. రాత్రివేళ వర్షం కురవడంతో పత్తిని రక్షించుకునేందుకు కూడా రైతులకు అవకాశం లేకుండా పోయింది. మార్కెట్ యార్డు వైఫల్యంతోనే... పత్తిని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కనీస వసతులు కల్పించలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో పత్తిని కాపాడుకునేందుకు రైతులకు పరదాలు అందజేయాల్సిన బాధ్యత ఏఎంసీదేనని చెబుతున్నారు. కొద్దిమందికి మాత్రమే పరదాలు అందజేయడంతో మిగిలిన పత్తి బోరాలన్నీ తడిసిపోయానని పేర్కొంటున్నారు. గిట్టుబాటు ధర దక్కేనా? కాటన్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం 8 శాతం తేమ ఉన్న పత్తికి మాత్రమే రూ.4,050 మద్దతు ధర లభిస్తుంది. గరిష్టంగా తేమ 12 శాతం వరకు మాత్రమే అనుమతిస్తారు. తేమ శాతాన్ని అనుసరించి పత్తి ధరలో క్వింటాలుకు రూ.40 చొప్పున కోత విధిస్తారు. వర్షానికి తడిసిన పత్తి పరిస్థితి ఏమిటనేది అర్థం కాకుండా ఉందని రైతులు పేర్కొంటున్నారు. పత్తిని ఆరబెట్టాలని అధికారులు సూచిస్తున్నారని, ఆరబెట్టిన పత్తి రంగుమారే అవకాశమున్నందున గిట్టుబాటు ధర దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంట చేతికొచ్చి.. అమ్ముకునే దశలో ఈ పరిస్థితి ఏర్పడటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అసలే మార్కెట్లో పత్తికి సరైన మద్దతు ధర ప్రభుత్వం నుంచి రావడం లేదని, కేవలం రూ.4,050 మద్దతు ధర ప్రకటించిందని చెబుతున్నారు. ఈ ఏడాది దిగుబడి తగ్గి సాగు ఖర్చు పెరిగిన నేపథ్యంలో రూ.6 వేలు మద్దతు ధర ప్రకటిస్తే తమకు గిట్టుబాటయ్యేదని రైతులు అంటున్నారు. కనీసం పంట సాగుకైనా చేసిన అప్పులు తీరుతాయని అమ్ముదామని భావిస్తే వర్షం తమను మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందని వాపోతున్నారు. కల్లాల్లోనే తడిసిన మొక్కజొన్న విత్తనాలు నందిగామ రూరల్ : నందిగామ ప్రాంతంలోనూ మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కల్లాల్లోని మొక్కజొన్న విత్తనాలతో పాటు తీతలకు సిద్ధమైన పత్తి తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. -
వర్షంతో పెరిగిన ఉక్కపోత
సాక్షి, ముంబై: నగరంలో రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న అకాల వర్షంవల్ల ముంబైకర్లు హైరానా పడుతున్నారు. ఒకపక్క చలి పత్తాలేకుండా పోయింది. మరోపక్క ఉక్కపోత భరించలేక సతమతమవుతున్నారు. కాని రెండు రోజులుగా ఆకాశమంత మబ్బులు కమ్ముకుని ఉండడంతో వాతావరణం చల్లబడి చలి వేస్తుండవచ్చని అందరూ భావించారు. కాని పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చలి వేయకపోగా ఉక్కపోత మాత్రం రెట్టింపు అయింది. శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం నగరంలో అక్కడక్కడ వర్షం కురిసింది. రోడ్లన్నీ బురదగా, జారుడుగా మారాయి. వర్షా కాలం ముగిసి దాదాపు నెల రోజులు కావస్తోన్నా ఇంతవరకు చలి పత్తాలేకుండా పోయింది. ఉక్కపోత కారణంగా ఇళ్లలో, కార్యాలయాల్లో ఫ్యాన్లు, ఏసీలు యథాతథంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలవల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి తోటల్లో పూత నేల రాలడంతో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. మామిడితోపాటు పత్తి, కందిపప్పు, బత్తాయి, ఉల్లి, ద్రాక్ష పంటలకు నష్టం వాటిల్లగా, మరికొన్ని పంటలకు మేలు జరిగింది. నాసిక్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ద్రాక్ష, ఉల్లి, దానిమ్మ తోటలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈదురు గాలులవల్ల పండ్ల తోటలకు దాదాపు రూ.మూడు కోట్ల మేర నష్టం చేకూరిందని రైతులు చెబుతున్నారు. షోలాపూర్ గ్రామీణ ప్రాంతాల్లో నేలలో నాటిన జొన్న, ఉల్లి, వెల్లుల్లి విత్తనాలు గాలికి చెల్లాచెదురయ్యాయి. దీంతో రైతులు నేలను మళ్లీ సాగుచేసి విత్తనాలు నాటాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొన్ని పంటలకు ఈ అకాల వర్షాలు వరంగా పరిణమించాయని రైతులు చెబుతున్నారు. -
అయ్యో.. ఇదేం గోస..?
అకాల వర్షం తెచ్చిన తంటా.. మూడు రోజులుగా నిలిచిన క్రయవిక్రయాలు యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన నిల్వలు తడిసింది ఆరేదాకా కొనుగోళ్లు బంద్ పలుచోట్ల రైతుల ఆందోళన కరీంనగర్ అగ్రికల్చర్ :అకాల వర్షం తెచ్చిన తంటాతో మూడు రోజులుగా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. బుధవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులకు కరీంనగర్, పెద్దపల్లి, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్, మంథని తదితర ప్రాంతాల్లో మార్కెట్‌యార్డుకు తెచ్చిన ఉత్పత్తులు, కొనుగోలు కేంద్రాల వద్ద తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యం, కమ్ముకున్న మబ్బులసాకుతో కొనుగోలు చేయకుండా అధికారులు చేతులెత్తేశారు. ఉత్పత్తులను అమ్ముకోవడం నుంచి ధాన్యం తరలించేవరకు సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరి అన్ని కేంద్రాల్లో స్పష్టమవుతోంది. మక్కల కొనుగోలు బాధ్యతను ఏజెన్సీ రూపంలో డీసీఎంఎస్, పీఏసీఎస్ ఆధ్వర్యంలోని 15కేంద్రాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. జిల్లాలోని హుస్నాబాద్, పెద్దపల్లి కేంద్రాల్లో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన నిర్వహించారు. తేమ సాకుతో కొనుగోలు చేయకపోవడంతో వేరే దిక్కులేక రైతులు పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జేసీ సర్ఫరాజ్ అహ్మద్ మార్కెట్ కమిటీ, మార్క్‌ఫెడ్, సివిల్సప్లై అధికారులతో అత్యవసర సమావేశమై కొనుగోళ్లపై సమీక్షించారు. నిల్వ ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టాకే కొనుగోలుకు సుముఖం తెలిపి నిర్ణయానికి వచ్చారు. మూడు రోజులు బంద్ మరో మూడు రోజులపాటు మార్కెట్లకు బంద్ ఇవ్వాలని కలెక్టర్ ప్రకటించడంతో తెచ్చిన పంటను తిరిగి తీసుకెళ్లలేక.. వేరో చోట అమ్ముకోలేక గోసపడుతున్నారు. మార్కెట్ యార్డులో పడిగాపులు గాస్తున్న రైతుల్లో ప్రస్తుతం వర్ష సూచన గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో వర్షంవస్తే ధాన్యం కుప్పలపై కప్పడానికి సంబంధిత అధికారులు అవసరమైన టార్పాలిన్లు ఏర్పాట్లు చేయడంలేదు. ఇంటినుంచి తెచ్చుకున్న ప్లాస్టిక్ కవర్లు, గోనె సంచులతో కాపాడుకుంటూ నిరీక్షిస్తున్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం ఉదయం వెయ్యి క్వింటాళ్ల మక్కలు రాగా.. ఆ రోజు రాత్రి వరకు ధర నిర్ణయించిన డీసీఎంఎస్ అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగగా.. కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గురువారం ఉదయం 11 గంటలు దాటినా అధికారులెవరూ కన్నెత్తి చూడలేదు. పైగా కొత్తగా 1300 క్వింటాళ్లు రాగా యార్డులో నిల్వలు పేరుకుపోయాయి. ఆ మక్కలలో అధిక తేమశాతం ఉన్నవాటిని సగానికి పైగా మక్కలను కొనుగోలు చేయలేదు. దీంతో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. 1900 క్వింటాళ్ల వరిధాన్యం రాగా.. వ్యాపారులు తేమ సాకుతో రూ.1340లోపే కొనుగోలు చేసి క్వింటాలుకు రూ. 60 వరకు దోపిడీ చేశారు. సుల్తానాబాద్ మార్కెట్లో బుధవారంరాత్రి కురిసిన వర్షానికి మార్కెట్లో నిల్వ ఉన్న సుమారు 300 క్వింటాళ్ల వరిధాన్యం బస్తాలు తడిసిపోయాయి. దీంతో రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు సుల్తానాబాద్ మార్కెట్‌కు చేరుకుని, తడిసిన ధాన్యాన్ని పరిశీలించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు. పెద్దపల్లిలోసైతం మార్కెట్‌కు చేరిన మొక్కజొన్నలను అధికారులు తేమశాతం ఎక్కువగా ఉందనే సాకుతో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో అధికారులతీరుపై మండిపడ్డారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యానిన కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ హుస్నాబాద్‌లో వివిధపార్టీల నాయకులు, రైతులు స్థానిక వ్యవసాయమార్కెట్కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. చర్చల అనంతరం మార్క్‌ఫెడ్‌కు విక్రయించేందుకు తీసుకొచ్చిన మొక్కజొన్నలు తడిసినప్పటికి కొనుగోలుచేస్తామని మార్క్‌ఫెడ్ అధికారులు హామీఇచ్చారు. కాగా తూకంవేసిన వరి ధాన్యం తడిసిందని వాటిని తీసుకోమని చెప్పడంతో ఆందోళన ఉధృతమైంది. రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు తేరాల మారుతి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి కొనుగోలుచేస్తామని చెప్పడంతో వివాదం సద్దు మణిగింది. బెజ్జంకి మండలంలో ధాన్యం తడవకపోయినా తేమ శాతం రాకపోవడంతో తూకం వేయలేదు. తేమ శాతం రాగానే ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. చొప్పదండి మార్కెట్ యార్డులో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. మంగళ, బుధ వారాల్లో హమాలీలు, ఖరీదుదారుల మధ్య కూలీ రేటు పెంపుపై వివాదం నెలకొనడంతో రెండు రోజులు కొనుగోలు నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్, పెగడపల్లి, ధర్మారం, ధర్మపురి మండలాల్లో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షం వస్తే ధాన్యం కుప్పలపై కప్పడానికి అధికారులు అవసరమైన టార్పాలిన్లు ఏర్పాట్లు చేయలేదు. మంథనిలో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో పత్తిపంటను కొంతమంది రైతులు స్థానిక దళారులకు విక్రయిస్తుండగా, మరికొందరు పెద్దపల్లి, జమ్మికుంట, ఆదిలాబాద్ జిల్లా భైంసా మార్కెట్లకు తరలిస్తున్నారు. తేమశాతం సాకుతో మంథని మార్కెట్ యార్డులో, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యాన్ని నిర్వాహకులు కొనుగోలు చేయడంలేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు ధారపోసి నష్టపోతున్నారు.వేములవాడ యార్డుకు వరిధ్యానం అమ్ముకునేందుకు వస్తున్న రైతులకు సరిపడా కవర్లు అందించడం లేదు. -
గాలివాన బీభత్సం
శంకర్పల్లి, న్యూస్‌లైన్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారి ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలచోట్ల చెట్లు విరిగి పోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడి కాయలు పూర్తిగా నేలరాలయి. చాలా మంది ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపడ్డాయి. సుమారు రెండు గంటల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం అధికారులు సరఫరాను పునరుద్ధరించారు. తడిసిపోయిన ధాన్యం బస్తాలు తాండూరు: తాండూరులో అకాల వర్షం హడలెత్తించింది. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత జోరుగా వర్షం కురిసింది. గాలిదుమారంతో మొదలై మంగళవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షానికి వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి జరిగిన భారీ నష్టం దృష్ట్యా యార్డులో కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఈసారి ధాన్యం బస్తాలు తక్కువగా తడిసాయి. ఈసారి కొనుగోలుదారుల బస్తాలు వర్షంతో తడిసిపోయాయి. వరి ధాన్యం మొలకెత్తింది. తడిసిన ధాన్యాన్ని యార్డులో మంగళవారం ఉదయం లారీల్లో కొనుగోలుదారులు తరలించారు. కొందరు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టారు. దెబ్బతిన్న ఇళ్లు మొయినాబాద్: ఈదురు గాలులు, హోరువాన బీభత్సం సృష్టించాయి. సోమవారం అర్థరాత్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. కేతిరెడ్డిపల్లిలో ఈదురుగాలులకు ఓ చెట్టు విరిగి ఇంటిపై పడటంతో రేకులన్నీ పగిలిపోయాయి. అప్పోజిగూడలో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈదురుగాలులకు పలుచోట్లు విద్యుత్ తీగలు తెగిపోవడంతో గ్రామాల్లో సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమ్డాపూర్ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా అయ్యే 33 కేవీ లైన్లో శంషాబాద్ మండలంలోని రాయన్నగూడ చౌరస్తా వద్ద విద్యుత్ స్తంభం విరిగి పడటంతో సరఫరా నిలిచిపోయింది. మంగళవారం సాయంత్రం వరకు పునరుద్ధరించలేదు. సబ్‌స్టేషన్ పరిధిలోని అమ్డాపూర్, బాకారం, కాశీంబౌలి, శ్రీరాంనగర్, వెంకటాపూర్ గ్రామాల్లో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెరువుల్లోకి చేరిన నీరు కందుకూరు: మండల పరిధిలో సోమవారం రాత్రి 46.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కుంటలు, చెక్‌డ్యాంలు, రహదారుల వెంబడి గుంతల్లో నీరు నిలిచింది. కొన్ని గ్రామాల్లోని చెరువుల్లోకి స్వల్పంగా నీరు చేరింది. ఓ మోస్తరు వర్షం పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఉక్కపోతతో అల్లాడిన జనం చేవెళ్లరూరల్: మండలంలో సోమవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్‌వైర్లు తెగిపడ్డాయి. మంగళవారం ఉదయం వరకూ గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. పలుచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. పంటలకు నష్టం వాటిల్లింది. నేలకొరిగిన చెట్లు పూడూరు: మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి. బలమైన ఈదురు గాలులతో వర్షం కురవడంతో రాకంచర్ల గ్రామానికి చెందిన జంగయ్య పొలంలోని పెద్ద తుమ్మ చెట్టు విరిగిపడింది. పక్కనే విద్యుత్ వైర్లపై పడటంతో తీగల తెగిపడ్డాయి. కెరవెళ్లి, సిరిగాయపల్లి, సోమన్గుర్తి, కంకల్, మంచన్‌పల్లి గ్రామాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. స్తంభాలు ఒరిగిపోయాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతుకు అపార నష్టం గండేడ్: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోవువారం రాత్రి కురిసిన గాలివానకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి ట్రాన్స్ఫార్మర్లతో సహా కిందపడిపోయాయి. కూరగాయల తోటలు, మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల పరిధిలోని నంచర్ల, జిన్నారం, జక్లపల్లి, జిన్నారం తండా, సాలార్‌నగర్ గ్రామాల్లో ఇళ్లు కూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగి సరఫరా నిలిచిపోయింది. నంచర్ల, గండేడ్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం.. వికారాబాద్/ ఆలంపల్లి: డివిజన్లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలు మార్గాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మర్పల్లి, మోమిన్‌పేట, ధారూరు, బంట్వారం మండలాల్లో భారీ వర్షం కురిసింది. గాలి వానకు వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి సంబంధించిన స్తంభాలు పడి పోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లపై పడటంతో నాలుగు స్తంభాలు నేలకొరిగాయి. రాత్రి సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో రాత్రంతా రోగులు చీకట్లో ఇబ్బందులు పడుతూ గడిపారు. మంగళవారం ఉదయం విద్యుత్ సిబ్బంది సరఫరాను పునరుద్ధరించారు. మండలంలో అక్కడక్కడా చెట్లు విరిగిపోయాయి. గాలి వానతో మామిడికాయలు నేలరాలాయి. పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. -
అకాల వర్షం.. అపార నష్టం
ఖానాపూర్, న్యూస్‌లైన్ : మండలంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా రైతుల పంటలతో పాటు తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది. పస్పుల పంచాయతీ పరిధిలోని పుల్గంపాండ్రి, అర్చన్‌తండా, కొలాంగూడ, నాయకప్‌గూడ, పస్పుల, తులసీపేట తండా తదితర గ్రామాల్లో వర్షం నష్టం ఎక్కువగా జరిగింది. సుమారు 50 వరకు ఇళ్లు, 50 వరకు విద్యుత్ స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పుల్గం పాండ్రి గ్రామానికి చెందిన పలువురికి గాయాలయ్యాయి. గ్రామంలోని పుల్గం పాండ్రి గ్రామంలోని ధన్సింగ్, రమేష్, బలిరాం, రాజేశ్వర్, కనిరాం, కోక్య, సతీశ్, సురేశ్, గణేశ్, చందర్, జవహార్‌లాల్, సుభాష్, కోకియా, దూదిరాం, గణేష్ తదితరలకు చెందిన నివాసాలతో పాటు పశువుల పాకలు ధ్వంసమయ్యాయి. వీటితో పాటు నివాసాల్లో ఉన్న పసుపు, వరి ధాన్యం, బియ్యం, తదితర నివాస సామగ్రికి భారీగా నష్టం వాటిల్లింది. వీటితో పాటు గ్రామంలోని సింగిల్ ఫేస్ విద్యుత్ లైన్‌తో పాటు వ్యవసాయ మోటార్లకు అందే విద్యుత్ లైన్లకు సంబంధించిన స్తంభాలు 50 వరకు పూర్తిగా ధ్వంసమై నేలకొరిగాయి. కాగా సంబంధిత అధికారులు యుద్ధప్రతిపాదికన సర్వే చేసి తమకు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. -
వడగళ్ల వర్షంతో పంటలకు నష్టం
యాచారం, న్యూస్‌లైన్: అయ్యో పాపం అనేవాళ్లే గాని అన్నదాతను ఆదుకునే వారే లేరు. అది చేస్తాం... ఇది చేస్తామని ఉత్తుత్తి హామీలివ్వడమే తప్ప కనీసం వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలోని యాచారం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మంచాల, చేవెళ్ల, షాబాద్ తదితర మండలాల్లో గత పదిరోజుల క్రితం వడగళ్లు, అకాల వర్షంతో పంటలకు విపరీతంగా నష్టం జరిగింది. చాలా గ్రామాల్లో కూలీల కొరతతో వరి పంట కోతల్లో జాప్యం జరిగింది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం వడగళ్లు కురిసి వందలాది ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, మల్కీజ్‌గూడ, తాడిపర్తి తదితర గ్రామాల్లో దాదాపు రెండువేలకు పైగా ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. దాదాపు ఏడువందల మందికి పైగా రైతులు రూ.లక్షల్లో పెట్టుబడులు నష్టపోయారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పలు పార్టీల నాయకులతో పాటు జేడీఏ, రెవెన్యూ, ఈజీఎస్ అధికారులంతా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నాయకులైతే అయ్యో రైతుకు ఎంత నష్టం వాటిల్లింది అని విచారం వ్యక్తం చేశారు. పోయిన పంట పోయింది... మిగిలిన పంటను ఉపాధి హామీ పథకం కూలీలతో సేకరించేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతామని, పరిహారం అందించేందుకు కృషి చేస్తామని నమ్మబలికి వెళ్లిపోయారు. అయితే ఇప్పటివరకు కూడా పంట కోతల విషయమై, పరిహారం చెల్లింపునకు సంబంధించి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. సర్పంచ్‌లు, ఈజీఎస్ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కనీసం పంట నష్టం వివరాలు కూడా అధికారులు నమోదు చేయకపోవడంతో పరిహారంపై రైతులు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులే రంగంలోకి... వారం రోజులైనా ఉపాధి కూలీలతో పంట కోత పనులు ప్రారంభించకపోవడంతో రైతులు స్వయంగా రంగంలోకి దిగారు. నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్ గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పుట్ల కొద్ది ధాన్యం నేలపాలైంది. ఎంతో కొంత దక్కకపోతుందా అన్న ఆశతో కూలీలతో చెరి సగం చొప్పున ఒప్పం దం చేసుకొని నేలరాలిన ధాన్యాన్ని సేకరించుకుంటున్నారు. ఇదే ఒప్పందంపై పశుగ్రాసం కూడా కోయించుకుంటున్నారు. ఇక మామిడి, పూల, పండ్ల రైతుల పరస్థితి కూడా ఇలాగే ఉంది. రాలిన మామిడి కాయలను ఏరుకుని ఎంతకో కొంతకు అమ్ముకుంటున్నారు. త్వరలో కొలువుదీరన్ను కొత్త ప్రభుత్వమైనా స్పందించి తమను ఆదుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. -
భారీ నష్టం
ఖమ్మం, న్యూస్‌లైన్: గత మూడు రోజులుగా కురిసిన అకాలవర్షంతో జిల్లావ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి, బొప్పాయి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా దాదాపు రూ.30 కోట్ల మేరకు పంట నష్టం జరిగి ఉంటుందని అంచనా. అయితే వ్యవసాయశాఖాధికారులు మాత్రం కొండంత నష్టం జరిగితే గోరంత అంచనాలను చూపుతూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 1900 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అధికారులు నిర్ధారించడం విడ్డూరమని, పంటనష్టం అంచనా వేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు మరోసారి వంచనకు పాల్పడుతున్నారని రైతుసంఘాలు విమర్శిస్తున్నాయి. నష్టం కోట్లల్లో... జిల్లా వ్యాప్తంగా వరిపనుగులు, ధాన్యం, మిర్చి, మామిడి, బొప్పాయి, కూరగాయలు, మొక్కజొన్న, వేరుశన, పసుపు మొదలైన పంటలు నీటి మునిగి రూ. 30 కోట్ల మేరకు నష్టం జరిగిందని రైతుసంఘాలు అంచనా వేస్తున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలంలో రెండు వేల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం, మిర్చి, పత్తి, మొక్కజొన్నలు తడిసి పోయాయి. కొత్తగూడెం మండల పరిధిలో చేతికందే దశలో ఉన్న వరి నేలవాలింది. వేపలగడ్డ ప్రాంతంలో వరి నూర్పిడి చేసి బస్తాల్లో నింపి పెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. సింగభూపాలెం చెరువులో మత్స్యకారులు వేసిన చేపలు , మత్స్యకారుల వలలు, తెప్పలు, అలుగువల తదితర సామాన్లు సైతం కొట్టుకుపోయాయి. పాల్వంచ మండలంలోని సోములగూడెం, కరకవాగు, పునుకుల, సూర్యతండ, పూసలతండ, సూరారం, కోడిపుంజులవాగు తదితర గ్రామాల పరిధిలో సుమారు వంద ఎకరాల్లో కోసి ఆరబోసిన వరిపంట కొంత తడిసింది. పినపాక నియోజకవర్గంలో వెయ్యి ఎకరాల పంట తడిసింది. పాలేరు నియోజకవర్గంలో వరి,మిర్చి,పసుపు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో సుమారు 5వేల ఎకరాల్లో వేసిన వరి పంట ఎక్కువగా కల్లాల్లోనే తడిసిపోయింది. వరి,మిర్చి,పసుపు పంటలకు కలిపి రూ.4కోట్లు నష్టం వాటిల్ల వచ్చని అంచనా. ఇల్లెందు నియోజకవర్గంలో ఐదు వేల ఎకరాలకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. బయ్యారం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 100 ఎకరాలలో పండించిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. గార్ల మార్కెట్‌యార్డ్‌లో రైతులు ఆరబోసుకున్న సుమారు 2000 క్వింటాళ్ల వరిధాన్యం తడిసిపోయింది. మొక్కజొన్న, మిర్చి నీటిలో తడిసిపోయాయి. వైరా నియోజకవర్గంలో 8వేల ఎకరాల వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి పంటలు దెబ్బతిని సుమారు రూ. 2కోట్ల విలువ చేసే నష్టం జరిగింది. సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు మండలాల్లో శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న కంకులు తడిసిపోయాయి. సదాశివునిపాలెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. వివిధ గ్రామాలలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యంపై పట్టాలు కప్పినప్పటికీ వర్షపునీరు ఎక్కువగా చేరటంతో ధాన్యం రాశులు తడిసిపోయాయి. నియోజకవర్గంలో సుమారు 4వేల ఎకరాలకు చెందిన వరి, మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అశ్వారావుపేట మండలంలో మామిడి, పామాయిల్, నిమ్మ, సపోటా తోటలు వర్షం కారణంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల చెట్లు వేర్లతో సహా పడిపోయాయి. ముల్కలపల్లి మండలంలో మామిడి కాయలు రాలిపోయాయి. ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. కొండంత నష్టానికి గోరంత అంచనాలు.. అకాలవర్షానికి జిల్లా వ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు కనబతున్నా వ్యవసాయ అధికారుల లెక్కలు వేరుగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 948 మంది రైతులకు చెందిన 571 హెక్టార్లలోవరి, 88 హెక్టార్లలో మొక్కజొన్న, 150 ఎకరాల మామిడి, 100 ఎకరాల బొప్పాయి మాత్రమే పంటనష్టం జరిగిందని చెప్పి చేతులు దులుపుకోవడం గమనార్హం. ఈ నష్టం అంచనాలు వేయడంలో ప్రభుత్వ నిబంధనలు సాకుగా చెబుతున్నారు. నష్టం జరిగిన ప్రతీ రైతుకు పరిహారం ఇవ్వాలి: రైతు సంఘాలు కుండ పోతవర్షం, గాలి దుమారంతో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 30కోట్లకు పైగా పంటనష్టం జరిగిందని ఏపీ రైతు సంఘం నాయకులు మాదినేని రమేష్, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ ఏలూరి కోటేశ్వర్రావు పేర్కొన్నారు. మొక్కుబడి అంచనాలతో అధికారులు సరిపెట్టకుండా పంటనష్టం జరిగిన ప్రతిరైతు కుటుంబాన్ని అదుకోవాలని డిమాండ్ చేశారు. పరిహారం అందించడంతోపాటు తడిసిన ధాన్యం, రంగుమారిన మిర్చి, పసుపు, మొక్కజొన్నలను ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని, ఖరీఫ్ సీజన్‌కు ఉచితంగా రైతులకు విత్తనాలు, ఎరువులు అందచేయాలని, రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన ఉద్యమాలు చేసేందుకు సిద్ధమే అని హెచ్చరించారు. -
మోదం.. ఖేదం
విశాఖరూరల్, న్యూస్‌లైన్: అకాల వర్షం శుక్రవారం రాత్రి జిల్లాను ముంచెత్తింది. కొన్ని చోట్ల వ్యవసాయాన్ని అతలాకుతలం చేసింది. ఈదురుగాలులను వెంటబెట్టుకుని రైతన్నపై దాడి చేసింది. ఏజెన్సీలోని పాడేరులో రికార్డు స్థాయిలో 9.5 సెంటీమీటర్లు, మైదానంలో సగటున 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.కుండపోతగా కురిసిన వర్షానికి మన్యం తడి సి ముద్దయింది. వాతావరణం చల్లబడి జనం ఉపశమనం పొందినా, వ్యవసాయానికి ఎక్కువగా విఘాతం కలిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యవసాయానికి మేలు చేసింది. చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడంతో రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. పశుగ్రాసం పెంచుకునేందుకు, ఖరీఫ్ దుక్కులకు అనుకూలమ న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాణిజ్య పంటల కు ఈ వాన జీవం పోసింది. జనవరి నుంచి మైదానంలోని కొన్ని ప్రాంతాల్లో చిటుక్కున చినుకులేదు. భానుడి ప్రతాపంతో మెట్ట పంటలు ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. కొందరు రైతులు వ్యవసాయ మోటార్ల ఆధారంగా చెరకు, అరటి, కూరగాయల పంటలను కాపాడుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వర్షం ఊరటనిచ్చింది. దాంతో వేసవి దుక్కులకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఏజెన్సీలో కాఫీ, మిరియాల పంటలకు మేలు చేకూరుతుందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది మండలాల్లోనూ రబీ వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 200 హెక్టార్లలో కోతలు పూర్తయి పొలాల్లో ఉన్న రబీ వరి పనలు తడిసి ముద్దయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న సుమారు 190 హెక్టార్లలో వరి పంట నేలకొరిగింది. ఈదురు గాలులకు లక్షలు విలువైన మామిడి కాయలు నేల రాలిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేవరాపల్లి మండలంలో 50 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగి పంట దెబ్బతింది. అకాల వర్షం ఏజెన్సీలో కూరగాయల పంటలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా క్యాబేజీ పంట తుడిచిపెట్టుకుపోయింది. అరకులోయ మండలం చినలబుడు, హట్టగుడ,మంజగుడ గ్రామాల్లో ఆదివాసీ రైతులు సాగు చేపట్టిన ఈపంట పూర్తిగా పాడైపోయింది. డుంబ్రిగుడ మండలంలో దేముడువలస, మాలివలస, సొవ్వా, కురిడి, కొల్లాపుట్టు గ్రామాల్లో గిరిజనులు పండించి క్యాబేజీ, టమాటా పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.కుండ పోత వర్షానికి రబీవరికి కూడా నష్టం వాటిల్లింది. జీకే వీధి మండలం పీకేగూడెం గ్రామంలో 4 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రావికమతం మండలంలో అర్ధరాత్రి వర్షానికి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరుపాక, చీమలపాడు, గర్నికం గ్రామాల్లో బారీ వృక్షాలు పడి విద్యుత్ తీగలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మునగపాక ప్రాంతంలో 60 హెక్టార్లలో రబీవరి నీటమునిగింది. చింతపల్లిలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చౌడుపల్లి డ్యామ్, తాజంగి రిజర్వాయర్ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎస్.రాయవరం మండలం సైతారుపేట సమీపంలోని ఆర్అండ్బీరోడ్డుపై ఉన్న బ్రిడ్జి భారీ వర్షానికి కొంతమేర కుంగిపోవడంతో పాటు ధ్వంసమైంది. మండల కేంద్రంతో పాటు సుమారు 20 గ్రామాల వారు దీనిపై నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. -
నష్టం రూ.85 కోట్లపైనే..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. కళ్లముందే కొట్టుకుపోతూ, తడిసి ముద్దవుతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడ్డారు. గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షంతో జిల్లాలో నష్టం రూ.85 కోట్లపైమాటే. వరి, మామిడి రైతులను ఈ వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. ఇంత జరిగినా అధికారులు మాత్రం నష్టం లేదంటూ ఒక్కమాటలో తేల్చిచెబుతున్నారు. ఎన్నికల పేరు చెప్పి సర్వేలకు నిరాకరిస్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు రోజులపాటు కురిసిన వర్షం కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యాన్ని ముంచెత్తింది. శనివారం తెరిపినివ్వడంతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో కల్లాలు, మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం విలువ రూ.60 కోట్లపైమాటే అని ప్రాథమిక అంచనా. కోతకు వచ్చి నేలవాలిన వరి, కాయలు రాలిన మామిడితో మరో రూ.25 కోట్ల నష్టం రైతులకు వాటిల్లినట్లు అంచనా. కొన్నది 10 శాతమే... సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఈసారి రబీలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 13.25 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. రబీలో ధాన్యం ఒక్కసారిగా ముంచెత్తుతుందని తెలిసీ అధికారులు ఎన్నికల పేరుతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేశారు. చివరకు 5 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించి 619 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటివరకు 10 శాతం కొనుగోళ్లు కూడా చేపట్టలేదు. కేవలం 314 కేంద్రాలు ఏర్పాటు చేసి 30,982 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు బాధ్యత మిల్లర్లకే అప్పగించడంతో తేమ సాకుతో వారు జాప్యం చేస్తున్నారు. రవాణా ఆలస్యమవుతుండడంతో కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోంది. ధాన్యం తూకం కోసం ఎదురుచూస్తున్న క్రమంలోనే దిగుబడంతా వర్షార్పణమైంది. చాలాచోట్ల టార్పాలిన్లు అందుబాటులో లేక తడిసిపోయింది. మార్కెట్‌యార్డుల్లోనూ ఇదే పరిస్థితి. తడిసిన ధాన్యం రంగు మారి, ఇప్పుడు మొలకెత్తుతోంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారే లేరు. పర్యవేక్షణ కరువు వర్షంతో పంట నష్టం జరిగినప్పుడు పంటచేలల్లోకి వెళ్లి ప్రాథమిక అంచనా వేయాల్సిన వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల పేరు చెప్పి క్షేత్రస్థాయికి వెళ్లకుండానే.. ఎలాంటి నష్టం వాటిల్లలేదని తేల్చిచెబుతున్నారు. కల్లాలు, మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయా శాఖలు లెక్కలోకే తీసుకోవడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా, కొనుగోళ్ల సమయంలో అన్ని శాఖలను సమన్వయం చేసే జిల్లాస్థాయి ఉన్నతాధికారి పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారి స్థాయిలో కొనుగోళ్ల పర్యవేక్షణ చేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో 12.3 మి.మీ. వర్షపాతం కలెక్టరేట్ : జిల్లాలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 వరకు సగటున 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 39 మండలాల్లో వర్షం కురిసింది. -
‘తడిసి’ మోపెడు
మోర్తాడ్, న్యూస్‌లైన్: అకాల వర్షంతో తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకువెళ్లేందుకు రైస్ మిల్లర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రా ల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. అటు రైతు లు, ఇటు మిల్లర్ల మధ్య తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారయ్యిందని వారు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ సహకార సంఘాలు, ఇందిర క్రాంతి పథం మహిళా సంఘాల ఆధ్వర్యంలో 289 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. చాలా మంది రైతులు కోతలు పూర్తి కాగానే ధాన్యాన్ని ఈ కేంద్రాలకు తరలించారు. తూకం వేసి, నిర్వాహకులకు అప్పగించి వెళ్లిపోయారు. మామూలుగా అయితే ఈ ధాన్యాన్ని మిల్లర్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అనుకోకుండా మూడు రోజుల క్రితం అకాల వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల నిలువ ఉంచిన దాదాపు ఎనిమిది వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు వీలుగా కాంట్రాక్టర్లు లారీలను పంపాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎన్నిమార్లు మొత్తుకున్నా కాంట్రాక్టర్ లారీలను పంపడం లేదు. కొనుగోలు కేంద్రాలకు గిడ్డంగుల సౌకర్యం లేదు. దీంతో వారు ధాన్నాన్ని రహదారులపైనే కుప్పలుగా పోసి ఉంచారు. వాటిని తరలించడానికి లారీలు రాక పోవడంతో పెద్ద మొత్తంలో నిలువ ఉన్న ధాన్యం తడిసి పోయింది. దీంతో నిర్వాహకులు జిల్లా కలెక్టర్‌కు, జిల్లా ఉన్నతాధికారులకు విషయా న్ని వివరించారు. లారీలు సకాలంలో కొనుగోలు కేంద్రాల వద్దకు రాకపోవడంతో ధాన్యం నీటిపాలైందని వారి దృష్టికి తెచ్చారు. అధికారుల ఒత్తిడితో కాంట్రాక్టర్ లారీలను పంపాడు. అయితే, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని తీసుకోవడానికి రైస్ మిల్లర్లు నిరాకరించారు. తడిసిపోయిన ధాన్యంలో కొంత తరుగు తీసేసి తిరిగి లెక్క వేయాలని కోరుతూ వారు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు శనివారం తిప్పి పంపించారు. నష్టం వస్తుందంటూ జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యాన్ని నిజామాబాద్ మండలం ఖానాపూర్ శివారులోని రైస్‌మిల్లులకు తరలించేందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వారు తడిసిన ధాన్యాన్ని తీసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అయోమయం లో పడిపోయారు. ధాన్యంలో తేమ శాతం కొంత ఎక్కువగా ఉన్నా పర్వాలేదని, పూర్తిగా తడిస్తే మాత్రం తాము తీసుకోమని మిల్లర్లు చెబుతున్నారని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. తడిసిన ధాన్యానికి మొలకలు కూడా రావడంతో, వాటిని తీసుకుంటే తాము పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారని పేర్కొన్నారు. ఇటు రైతులు తాము తూకం వేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో అప్పగించి వెళ్లామని, అక్కడ ఏం జరిగినా వారిదే బాధ్యత అని చెబుతున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. లారీలు ఆలస్యంగా రావడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుంటేనే రైతులకు డబ్బు చెల్లింపు జరుగుతుంది. లేకపోతే లేదు. దీంతో రైతులలోనూ ఆందోళన నెలకింది. జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకుని దీనికి ఏదో ఒక పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు. -
గుండె కోత
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : అకాలవర్షంతో చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. వరిపైరు నేలకొరిగి గింజలు రాలాయి. చేతికొచ్చిన ధాన్యం మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచగా తడిసింది. దీంతో తడిసిన ధాన్యానికి మద్దతు ధర దక్కదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల రైతులు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనలు చేపట్టారు. మామిడి రైతులదీ ఇదే పరిస్థితి ఉంది. నేలరాలడంతో మామిడి దెబ్బతిని నాణ్యత కోల్పోయింది. దీంతో మార్కెట్లో సగం ధర కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదుకోవాలని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.5 కోట్ల పంట నష్టం సంభవించినట్లు అంచనా. ధర దక్కేనా? జిల్లాలో 3 వేల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. మంచిర్యాల, దండేపల్లి, నిర్మల్, లక్సెట్టిపేట, జన్నారం, సారంగాపూర్, కుంటాల, ముథోల్, దిలావర్పూర్, మామడలో వరిపైరు నేలకొరిగింది. 5 వేల క్వింటాళ్ల వరి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం త డిసింది. అధికంగా దండేపల్లి, జన్నారం మండలాల్లో తడిసిన ధాన్యం రంగు మారి నాణ్యత కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో మద్దతు ధర వస్తుందో లేదోనని రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ గ్రేడ్-ఏ రకానికి రూ.1345, ఇతర రకాలకు రూ.1310 చొప్పున మద్దతు ధర చెల్లిస్తున్నారు. తడిసిన ధాన్యానికి నాణ్యత లేదంటూ కొనుగోలు కేంద్రాల్లో నిరాకరిస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. సన్నరకాలను కొనుగోలు చేస్తూ మిగతా రకాల కొనుగోలుకు నిరాకరిస్తుండడంతోనే ఆయా కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దండేపల్లి, జన్నారం, జైపూర్, నెన్నెల, వేమనపల్లి, కోటపల్లి, ఖానాపూర్‌లో సుమారు 550 ఎకరాల్లో మామిడి నేల రాలినట్లు ఉద్యానవన శాఖాధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మామిడి టన్నుకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ధర లభిస్తోంది. దెబ్బతిన్న మామిడికి రూ.10వేల లోపే ఇస్తుండడంతో ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగజ్‌నగర్, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, తరోడాలో కూరగాయల పంటలకు కూడా నష్టం చేకూరింది. నిర్మల్, దిలావర్పూర్, సారంగాపూర్, మామడ, లోయెశ్ర, ముథోల్‌లలో మిరప సుమారు 150 ఎకరాల్లో నష్టం చేకూరింది. కళ్లాలలోని ఎండు మిరప తడిసిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. జిల్లాలో గుంటూ రు సన్నాలను అధికంగా పండిస్తారు. క్వింటాలుకు రూ.5,500 నుంచి రూ.6వేల ధర ఉండ గా తడిసిన మిరపకు మద్దతు ధర వచ్చే పరిస్థి తి లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కళ్లాలలో ఆరబెట్టిన పసుపు కొమ్ములు తడిసిపోవడంతో వాటికి కూడా మద్దతు ధరలు లభించలేని పరిస్థితి ఉంది. రంగు మారి నాణ్యత కోల్పోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. -
ఇంకా కొనసాగుతున్న అల్పపీడనం
-
అపార నష్టం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అకాల వర్షం రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆయకట్టు, ఆయకట్టేతర అన్న తేడా లేకుండా కొద్ది రోజులుగా మార్కెట్లను వరి ధాన్యం ముంచెత్తుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఒక్కసారిగా అకాల వర్షం ముంచెత్తడంతో ఎక్కడికక్కడ ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఇంకా కోతలు పూర్తి కాని ప్రాంతాల్లో వరి పొలాలపైనే పంట నష్టం జరిగింది. అసలే రబీ దిగుబడికి గిట్టుబాటు ధర లభించడం గగ నంగా మారింది. చివరకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను కూడా కొందరు మిల్లర్లు చెల్లించడం లేదు. ఈ స్థితిలో ధాన్యం తడిసి పోవడం రైతులకు అశనిపాతంలా మారింది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం 659.6 మిల్లీ మీటర్ల (జిల్లా సగటు11.2మి.మీ) వర్షపాతం నమోదయింది. అధికారిక సమాచారం ఇంకా ఏమీ ప్రకటించలేదు కానీ, అకాల వర్షానికి జిల్లాలో మెజారిటీ మండలాల్లో వరి ధాన్యం బాగా తడిసిపోయింది. ఆలేరు వరిచేలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఆలేరు, ఆత్మకూర్ (ఎం), తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం వర్షానికి తడిసింది. ఆలేరు మార్కెట్ యార్డుతో పాటు మందనపల్లి, గొలనుకొండ ఆత్మకూర్ ఎంచాడ, యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి, రాజపేట మండలం చల్లూరు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భువనగిరి మార్కెట్ యార్డులు, ఐకేపీ కేంద్రాలు, భువనగిరి గంజ్, నూతన మార్కెట్, వలిగొండ మార్కెట్లలో ఉన్న ధాన్యం తడిసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తరలించకపోవడంతో నిలిచిన ధాన్యం బస్తాలు తడిశాయి. భువనగిరి మండలం బొల్లేపల్లి, పచ్చబోడుతండా, రామచంద్రాపురం, పోచంపల్లి మండలం పోచంపల్లి, రేవణపల్లి, శివారెడ్డిగూడెం, బీబీనగర్, వలిగొండ మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భువనగిరి రెవెన్యూ డివిజన్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన 33 వేల క్వింటాళ్ల ధాన్యంలో 10వేల బస్తాలు తడిసిపోయింది. కొనుగోలు చేయని 20వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిందని అధికారుల అంచనా. నాగార్జున సాగర్ త్రిపురారం, నిడమనూరు, హాలియా మండల్లాలోని కోనుగోలు కేంద్రాల్లో 35 వేలబస్తాల ధాన్యం తడిసింది. గ్రామాల్లో హమాలీల కొరత కారణంగా సకాలంలో కాంటా వేయకపోవడం, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులకు సరిపడా పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం తడిసింది.. కోదాడ కోదాడ మండలం గణపవరం, యర్రవరం ఐకేపీ కేంద్రాల వద్ద కాంటాలు వేసిన సుమారు నాలుగు వేల బస్తాల ధాన్యం తడిసింది. ధాన్యం తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్ర నష్టం జరిగింది. మునగాల, చిలుకూరు, నడిగూడెం మండలాల్లో కల్లాలు పూర్తి కావడంతో ఇక్కడ అంతగా నష్టం జరగలేదు. ఈదురు గాలులు లేకపోవడంతో మామిడి రైతులకు నష్టం జరగలేదు. కోదాడ పట్టణంలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. మిర్యాలగూడ ఐకేపీ కేంద్రాలతో పాటు అవంతీపురం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసింది. వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం తడవడంతో మిల్లర్లు 70 కిలోల బస్తాకు అదనంగా మరో కిలో ధాన్యం కాంటా వేసుకున్నారు. తడకమళ్ల, దొండవారిగూడెంలో 3500 బస్తాల ధాన్యం పూర్తిగా తడిసింది. ఐకేపీ కేంద్రాలలో వర్షం నీరు నిలిచింది. దామరచర్ల మండలం దామరచర్ల, కొండ్రపోల్ ఐకేపీ కేంద్రాలలో 500 బస్తాల ధాన్యం తడిసింది. వేములపల్లి, సల్కనూరు, చిరుమర్తి, పోరెడ్డిగూడెం ఐకేపీ కేంద్రాలలో 35వేల బస్తాల ధాన్యం రాశులు తడిసిపోయాయి. సూర్యాపేట పట్టణంలో ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. మార్కెట్లో బస్తాలు తడిసి ముద్దయ్యాయి. రాయినిగూడెం, టేకుమట్ల, యండ్లపల్లి, రామారం గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. ఏపూర్ ఐకేపీ కేంద్రంలో ప్రహరీ గోడ కూలి ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. పెన్‌పహాడ్ మండలంలో కోతలు కోయని రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. చివ్వెంల మండలంలో10వేల క్వింటాళ్ల ధాన్యం రాశులు నీట మునగాయి. వెయ్యి ఎకరాల్లో వరి పొలాలు నేలవారాయి. హుజూర్నగర్ హుజూర్‌నగ ర్లోని శ్రీనగర్ కాలనీలో ఇంటి పోర్ట్‌కో కూలిపడి అక్కినేని మమత (39) మహిళ మృతి చెందింది. వేలాది ధాన్యం బస్తాలు తడిసి పోయాయి. మేళ్లచెరువు మండలం ఎర్రకుంటతండాలో పిడుగుపాటుతో ఇంటిలోని 2 క్వింటాళ్ల పత్తి, ఇల్లు దగ్ధమయ్యాయి. అంజలీపురంలో 1000 బస్తాలు, మఠంపల్లి మండలం భీల్యానాయక్‌తండా, అల్లీపురం ఐకేపీ కేంద్రాలలో 2000 బస్తాలు, నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నెలో 200 బస్తాలు, మేళ్లచెరువు మండలంలోని కందిబండ, కప్పలకుంటతండా, హేమ్లాతండా, మేళ్లచెరువులలోని ఐకేపీ కేంద్రాలలో 10వేల బస్తాలు వర్షానికి తడిసిపోయాయి. ఇంకా.. తుంగతుర్తి నియోజకవర్గంలో వరిచేలు దెబ్బతిన్నాయి. ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యం తడిసిపోయింది. నకిరేకల్‌లోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న ఐకేపీ కేంద్రంలో ధాన్యం రాశులు కొద్ది మేర తడిసిపోయాయి. కేతేపల్లి మండలం కొత్తపేట, కాసనగోడు , కట్టంగూర్ మండలం కురుమర్తి నార్కట్‌పల్లి మండలం అక్కనపల్లి ఐకేపీ కేంద్రాలలో ధాన్యం తడిసింది. దేవరకొండ పలుచోట్ల పంట నష్టం వాటిల్లింది. దీంతోపాటు మరికొన్ని మండల కేంద్రాలలో విద్యుత్ వైర్లు తెగిపడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడడంతో నియోజకవర్గంలో సుమారు 200 ఎకరాల వరి పంట నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. దేవరకొండ మండలం నసర్లబావి తండాలో విద్యుత్ తీగ తెగిపడడంతో పశువు మృతి చెందింది. -
అకాల వర్షం.. అపార నష్టం
-
అకాల వర్షంతో అన్నదాత కుదేలు
కరీంనగర్, న్యూస్‌లైన్: అకాల వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షం అన్నదాతకు తీరని నష్టాన్ని కలిగించింది. మార్కెట్ యార్డుల్లోకి తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయిపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించిన పంటకు ప్రతిఫలం వస్తుందనుకున్న సమయంలోనే ప్రకృతి కన్నెర్రజేయడంతో రైతుకు తీరని శోకం మిగిలి, మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోయే పరిస్థితి ఎదురైంది. జగిత్యాల డివిజన్లోని సారంగపూర్, రాయికల్, మేడిపల్లి, పెగడపల్లి మండలాల్లో వందల ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలిపోయాయి. రేపోమాపో వరికోతలు మొదలు పెడదామనుకున్న వరి ఈదురు గాలులతో కూడి వర్షానికి నేలవాలిపోయింది. సోమవారం కూడా కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, వేములవాడ తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో అపార నష్టం తలెత్తింది. గతంలో నష్టపోయిన పంటలకు పరిహారం రాక ఎదురు చూస్తున్న రైతులు ఈసారైనా సర్కారు ఆదుకుంటుందోలేదోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి నివేదిక జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షానికి 320 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాల జిల్లా అధికారి ప్రసాద్ తెలిపారు. జగిత్యాల మండలంలో 160 హెక్టార్లలో వరి, 20 హెక్టార్లలో నువ్వులు, మేడిపల్లి మండలంలో 120 హెక్టార్లలో వరి, 20 హెక్టార్లలో నువ్వుల పంటకు నష్టం జరిగిందన్నారు. తుది నివేదిక రాగానే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. పంట నష్టం 50 శాతం దాటిన చోట రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే జరుపుతామని చెప్పారు. -
వర్రి @777 హెక్టార్లు
సాక్షి, సంగారెడ్డి: మళ్లీ ‘అకాల’ వర్షం విజృంభించింది. మండుటెండల్లో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలపై దెబ్బకొట్టింది. చేతికొచ్చిన పంటలను నేలకూల్చి అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న భీకర గాలివానలతో జిల్లాలో 777 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచ నా వేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక అంచనా నివేదిక పంపించింది. మండలాల వారీగా పరిశీలిస్తే.. దౌల్తాబాద్‌లో 510 హెక్టార్లు, వెల్దుర్తిలో 101, చేగుం టలో 106, కొ ల్చారంలో 60 హెక్టార్లలో వరికి నష్టం వాటిల్లింది. గాలివాన ఉధృతికి చేతికొచ్చిన వరి గింజలు నేలరాలాయి. సోమవారం సైతం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురవడంతో పంట నష్టం మరింత పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. రెండో సారీ..! ఈ ఏడాది రబీ రైతాంగంపై ప్రకృతి రెండు పర్యాయాలు విరుచుకుపడింది. గత ఫిబ్రవరి 27 మార్చి 9 మధ్య కాలంలో కురిసిన వడగండ్ల వానకు జిల్లాలోని 27 మండలాల పరిధిలో 2021.66 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తం 4,800 మంది రైతులు నష్టపోయారు. దీంతో రైతులను ఆదుకోవడానికి రూ.1.35 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ గత నెలలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. -
గాలివాన బీభత్సం
చాగలమర్రి రూరల్, న్యూస్‌లైన్: పెనుగాలి, అకాలవర్షం కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి పెనుగాలితోపాటు ఓ మోస్తరుగా వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల పరిధిలో సాగు చేసిన మామిడి, అరటి చెట్లు నేలకొరిగి రైతుకు నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న పెసర, నువ్వులు, సజ్జ, కోత కోసి పొలాల్లో ఉంచిన పంటలు వర్షం కారణంగా తడిసిపోవడంతో నాణ్యత తగ్గే పరిస్థితి నెలకొంది. వనిపెంట గ్రామ పరిధిలో చిన్న గోపాల్‌కు చెందిన 20 మామిడి చెట్లు నెలకూలిపోయాయి. అలాగే ముత్యాలపాడు తండాకు చెందిన బాలస్వామి నాయక్, సాలమ్మ, లక్ష్మన్న, వెంకటేశ్వర నాయక్ సాగు చేసిన 20ఎకరాల మామిడితోటలో కాయలతో నిండి ఉన్న 75 చెట్లు కూలిపోయాయి. మిగతా చెట్లపై ఉన్న కాయలు విపరీతంగా రాలిపోయి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇదే గ్రామానికి చెందిన పెద్దబాలయ్య పొలంలో కోత కోసి ఉంచిన పెసర పంట వర్షం కారణంగా తడిచిపోయింది. అలాగే కొత్తపల్లె, శెట్టివీడు, చిన్నవంగలి తదితర గ్రామాల రైతులకు చెందిన అరటి చెట్లు కూడా కూలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పంట నష్టంపై సర్వే చేసి పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. రైతులకు కడగండ్లు హొళగుంద:మండలంలో సోమవారం సాయంత్రం సంభవించిన గాలివాన రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. కోత దశలో ఉన్న వరి, మిరప పంటలు నేలపాలయ్యాయి. మామిడి, అరటి చెట్లు కూలిపోవడంతో నష్టపోయామని రైతులు వాపోతున్నారు. పెనుగాలి బీభత్సం ఆళ్లగడ్డ రూరల్: ఆళ్లగడ్డ మండలంలోని పలుగ్రామాల్లో అరటి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీచెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. మిట్టపల్లె, యాదవాడ, మర్రిపల్లె, బాచేపల్లె, అహోబిలం తదితర గ్రామాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
ఈదురుగాలుల బీభత్సం
యాచారం: మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వడగళ్లతో మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, నల్లవెల్లి, నానక్‌నగర్, చింతపట్ల, నక్కగుట్ట తండా, మల్కీజ్‌గూడ, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నక్కగుట్ట తండాలో ఈదురుగాలులకు ఓ ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చింతపట్లలో రైతు అచ్చెన రమేష్‌కు చెందిన రూ. లక్ష విలువైన రెండు పాడి ఆవులు పిడుగుపాటుతో మృతి చెందాయి. సింగారం, నందివనపర్తి, తమ్మలోనిగూడ, మాల్ తదితర గ్రామాల్లో మామిడికాయలు నేలరాలాయి. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్, విస్తరణ అధికారి లక్ష్మణ్ తదితరులు దెబ్బతిన్న పంటల ను సోమవారం పరిశీలించారు. నివేదిక అం దజేయాలని ఆయా గ్రామాల ఆదర్శ రైతు లు, రెవెన్యూ కార్యదర్శులకు సూచించారు. శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: మండలంలోని పెద్దతూప్ర, పాల్మాకులలో సోమవారం హోరుగాలి, వడగళ్లతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పెద్దతూప్రలో మల్లెల యాదయ్య ఇంటి సమీపంలోని ఓ తుమ్మ చెట్టు, కరెంటు స్తంభం నేలకొరిగి ఇంటి గోడ పాక్షికంగా ధ్వంసమయ్యింది. పాల్మాకులలో ఎం.చంద్రయ్య, రుక్కమ్మ ఇళ్ల పైకప్పు రేకులు, పిల్లోనిగూడ రోడ్డులో పశువుల డెయిరీఫాం రేకులు గాలివానకు ఎగిరిపోయాయి. పి.యాదయ్య ఇంటిపై చెట్టు కొమ్మలు విరిగిపడడంతో పైకప్పు రేకులు విరిగిపడ్డాయి. ఇంట్లో ఉన్న వారిపై రేకుల ముక్కలు పడడంతో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. పెద్దతూప్ర, పెద్దతూప్రతండా, ఇనాంషేరి, పిల్లోనిగూడ, అచ్చం పేట, పాల్మాకుల, ముచ్చింతల్ గ్రామాల్లోని పంటలకు వాటిల్లింది. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. -
అకాల వర్షం.. అతలాకుతలం
భువనగిరిటౌన్, న్యూస్‌లైన్,భువనగిరి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆది వారం కురిసిన అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. భారీ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. బస్టాండ్ ఆవరణలో నీరు చేరడంతో ప్ర యాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్హాల్లో పార్కింగ్ చేసిన కారుపై కొబ్బరి చెట్టు కూలిపడడంతో పూర్తిగా ధ్వంసమైంది. అలాగే వడగండ్ల వానకు వరి నేలవాలింది. సుమారు 400 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంజ్ మార్కెట్ యార్డులో 100 బస్తాల ధాన్యం తడిసిపోయింది. మండల పరిధిలోని తుక్కాపురం, అనాజీపురం, పెంచికల్‌పహాడ్, రామచంద్రాపురం, రామకిష్టాపురం, రాయగిరి, బస్వాపురం, కూనూరు, ముత్తిరెడ్డిగూడెం, బీఎన్ తిమ్మాపురం గ్రామాల్లో వరితో పాటు మామిడికి నష్టం వాటినట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో అంధకారం పోచంపల్లి : ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పోచ ంపల్లి మండలం పెద్దరావులపల్లిలో కరెంట్ తీగలు తెగిపోయాయి. పలు గ్రామాల్లో స్తంభాలు నేలకూలడంతో అంధకా రం నెలకొంది. కప్రాయిపల్లి, జూలూరు, పోచంపల్లి, జలాల్పురం గ్రామాల్లో వరి, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. -
వరికి వర్షం దెబ్బ
ఒంగోలు టూటౌన్, టూటౌన్ :అకాల వర్షం అన్నదాతను కలవర పరుస్తోంది. ఊహించని విధంగా బుధవారం ఉరుములు.. మెరుపులతో కూడిన చిన్నపాటి వర్షం కురవడం ప్రారంభించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. కోసిన వరి ఓదెలన్నీ చేలోనే ఉన్నాయి. ఇంటి వద్ద వసతి, గ్రామంలో మార్కెట్ సౌకర్యం లేక పొలాల్లోనే ఎంతో మంది ధాన్యం నిల్వ ఉంచుకున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 86 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. సాగర్ ఆయకట్టు పరిధిలో ఆరుగాలం కష్టపడి పండించిన వందల ఎకరాల పంట నూర్పిళ్లకు సిద్ధంగా ఉంది. కొత్తపట్నం మండలంలో మోటుమాల, పాదర్తి, అల్లూరు, ఈతముక్కల, మడనూరు ప్రాంతాల్లో కొన్ని కోసిన చేలు ఉండగా మరికొన్ని కోతకు సిద్ధంగా ఉన్నాయి. అసలు పంట చేతికందుతుందో లేదోనన్న బెంగ రైతన్నను కుంగదీస్తోంది. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరాకు 40 బస్తాలు కూడా పండని పరిస్థితితో దిగాలు చెందుతుంటే అకాల వర్షం అసలుకే ముంచేటట్లు ఉందని వాపోతున్నారు. వరి రైతులతో పాటు పొగాకు రైతును అకాల వర్షం ఇబ్బంది పెట్టేటట్లు ఉంది. పందిళ్లపై ఆకు తడిస్తే రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు. చిరుజల్లులు కాస్తా భారీ వర్షంగా మారితే రైతన్నకు కోలుకోలేని దెబ్బ తగలనుంది. -
బాధిత రైతులను ఆదుకోండి: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: అకాలవర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీఆర్ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసింది. టీఆర్ఎస్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు తదితర నేతలతో కూడిన బృందం శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసింది. తెలంగాణ జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల మిరప, మొక్కజొన్న, చెరుకు, మామిడి, కూరగాయల పంటలు, కోళ్ల పరిశ్రమ, పాడి పశువులకు నష్టం కలిగిందని వారు గవర్నరుకు వివరించారు. నష్టంపై గ్రామాల వారీగా సర్వే చేయించి బాధిత రైతుల రుణాలను రీ షెడ్యూలు చేయాలని కోరారు. దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 20 వేల పరిహారం, మృతి చెందిన వారి కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లను కోల్పోయిన వారికి ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. గవర్నర్‌ను కలసిన వారిలో టీఆర్ఎస్ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొప్పుల ఈశ్వర్, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, మొలుగూరి బిక్షపతి, హనుమంత్ షిండే, ఎంపీ జి.వివేక్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తదితరులు ఉన్నారు. -
జిల్లాను వీడని వర్షం
జన్నారం, న్యూస్‌లైన్ : జిల్లాను అకాల వర్షం వీడడం లేదు. జన్నారం మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యా యి. గంటపాటు కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని సినిమా హాలుకు వెళ్లే రోడ్డు నీటి తో నిండింది. వరదలు పారాయి. మండలంలోని కామన్పల్లి, కవ్వాల్, కలమడుగు, ఇందన్పల్లి, రేండ్లగూడ, రాంపూర్, తిమ్మాపూర్, తపాలపూర్ తదితర గ్రామాల్లో మామిడి తోటల్లోని చెట్ల పూత రాలింది. తీవ్రంగా న ష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తాండూర్‌లో తాండూర్ : మండలంలో గురువారం మధ్యాహ్నం గంటపాటు ఉరుములు, మెరుపులతో కూ డిన భారీ వర్షం కురిసింది. కొ న్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మాదారం-3 ఇంక్లైన్ నర్సాపూ ర్ ప్రాంతాల్లో జొన్న చేను నేల వాలింది. నాలుగై దు రోజు లుగా వర్షం కురుస్తుండడంతో శెనగ వేర్లు కుళ్లిపోయి పంట నష్టపోయే ప్రమా దం ఉంది. ఇప్పటికే మామిడి రైతు లు పూత, పిందెలు రాలి తీవ్రం గా నష్టపోయారు. గురువారం కురిసిన వర్షం మరింత నష్టపర్చింది. వర్షానికి కూలిన ఇళ్లు భీమిని : మండలంలో గురువా రం ఈ దురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మెట్పల్లి గ్రామ పంచాయతీ పరిధి ఏసయ్యపల్లిలో దుర్గం తమ్మయ్య ఇం టిపై చెట్టు విరిగి పడింది. దీంతో ఇంటి పైకప్పు ధ్వంసమైంది. దు గుట చంద్రయ్య, కోట శాంత ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. వెంకటాపూర్‌లో ఇందూరి లచ్చన్న ఇల్లు నేల మట్టమైంది. కన్నెపల్లిలో శనిగారపు చం టయ్య, మోర్ల మల్లేశ్, బాబాజీ ఇంటి పైకప్పులు ధ్వంసమయ్యాయి. భీమి ని, మెట్పల్లి, కన్నెపల్లి గ్రామాల్లో ఉల్లితోపాటు వివిధ రకాల కూరగాయల పంటలు దె బ్బతిన్నాయి. తహశీల్దార్ శ్రీనివాస్‌రా వు వెంకటాపూర్ గ్రామాన్ని సందర్శించి ఇళ్లు కూలిపోయిన బాధితులను పరామర్శించారు. తక్షణ సాయం కింద 25 కిలోల బియ్యం అందజేశారు. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మొలకలు వచ్చిన పొద్దుతిరుగుడు కుంటాల : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మిర్చి, పత్తి, మొక్కజొన్న, గోధుమ పంటలు దెబ్బతిన్నాయి. మండలంలోని వెంకూర్ గ్రామంలో పొద్దుతిరుగుడు పంట నేలకొరిగి మొలకలు వచ్చాయి. దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కెరమెరిలో.. కెరమెరి : మండలంలో గురువారం ఉద యం 11గంటల ప్రాంతంలో భారీ వర్షం కురి సింది. ప్రధాన రహదారులు చిత్తడిగా మారా యి. గోయేగాం, ధనోరా, ఝరి, రింగన్ఘా ట్, కెరమెరి గ్రామాల్లో రోడ్లు బురదగా మారడంతో పాదచారులు, వాహన చోదకులు ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. గోయేగాం పాఠశాల ఆవరణ వర్షపు నీటితో నిండిపోయింది. రింగన్‌ఘాట్ వద్ద నిర్మిస్తున్న రో డ్డు కారణంగా కాంట్రాక్టర్లు పక్కనుంచి మట్టిదారి నిర్మించారు. వర్షం వచ్చినప్పుడల్లా బురదగా మారుతోంది. దీంతో ఇప్పటివరకు సు మారు 25మంది వాహనదారులు జారిపడ్డారు. వేమనపల్లిలో.. వేమనపల్లి : మండలంలోని లింగాల గ్రా మంలో గురువారం రాత్రి కురిసిన అకాల వ ర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు నాగెపెల్లి గ్రామంలో 20 గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. నాలుగు ఇళ్లు నేలమట్టం అ య్యాయి. వందల ఎకరాల్లో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంట నేలవాలింది. గంటన్నరపాటు కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వరి పొలాల్లో నీరు చేరి నష్టపోయినట్లు లింగాల గ్రామానికి చెందిన చౌదరి శంకర్ తెలిపాడు. 200 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, 400 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. మరో వారం రోజుల్లో చేతికందే పొద్దుతిరుగుడు పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలకొరిగిన పంటలు దహెగాం : మండలంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లగ్గాం, కుంచవెల్లి, మాడవెల్లి, ఐతపల్లి తదితర గ్రామాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. గాలివాన కు చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. కన్నెపల్లి నుంచి మాడవెల్లికి సరఫరా అవుతున్న 11కేవీ లైన్‌పై చెట్లు పడడంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కుంచవెల్లిలో వ్యవసాయానికి విద్యు త్ సరఫరా చేసే స్తంభాలు పడిపోయాయి. మాడవెల్లిలో రాదండి శంకర్, వరిమడ్ల పోచ య్య ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. -
వర్షార్పణం!
తాండూరు, న్యూస్‌లైన్: అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. వ్యాపారులకూ ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటల ఉత్పత్తులకు భారీ నష్టం వాటిల్టింది. అమ్ముకునేందుకు యార్డుకు తరలించిన పంటలతోపాటు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన ఉత్పత్తులు వర్షార్పణం అయ్యాయి. దీంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. క్రితం రోజు వర్షానికి వేలాది బస్తాల వేరుశనగలు, కందులు, శనగలు, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. సుమారు 12 వేల బస్తాల్లో నిల్వ చేసిన వేరుశనగలు నల్లగా రంగు మారాయి. సుమారు రూ.2 కోట్ల మేరకు పప్పుధాన్యాల ఉత్పత్తులు వర్షంలో తడిసి నష్టం వాటిల్లిందని వ్యాపారులు వాపోయారు. ఒకవైపు వర్షం జోరు.. మరోవైపు వడగళ్లు కురవడంతో యార్డులో పంటను కాపాడుకునేందుకు రైతులు, హమాలీలు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. మార్కెట్ యార్డులో పంటలను నిల్వ చేసుకునేందుకు రెండో షెడ్ లేకపోవడమే నష్టానికి కారణమని పలువురు వ్యాపారస్తులు పేర్కొన్నారు. పూర్తి సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు పాలకమండలి, మార్కెట్‌యార్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా షెడ్ నిర్మాణం చేపట్టలేదని వ్యాపారులు విమర్శిస్తున్నారు. అలాగే హైదరాబాద్ మార్గంలోని ఖాంజాపూర్ సమీపంలో కొత్త యార్డు ఏర్పాటులో జాప్యాన్ని వారు తప్పుపడుతున్నారు. జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చుతారని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మాకెవరు దిక్కని రైతులు వాపోతున్నారు. ఇకముందైనా ఇలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు మార్కెట్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, రైతులు కోరుతున్నారు. రెండు రోజల నుంచి కురుస్తున్న వర్షాలకు షాబాద్ మండలంలోని కక్కులూరు, కేసారం, నరెడ్లగూడ, హైతాబాద్, మద్దూర్ గ్రామాల్లో మిర్చి, కీరదోస, సొరకాయ, టమాటా, ఉల్లి, క్యాబేజి, కాకర పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, పూలతోటలకు నష్టం వాటిల్లింది. వడగళ్లు, ఈదురు గాలులకు ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్, శేరిగూడ, నాగన్‌పల్లి, పోల్కంపల్లి, ముకునూరు, నైల్లి గ్రామాల పరిధిలో గల వందలాది ఎకరాల్లోని మామిడి తోటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. పూత, పిందెలు రాలిపోయాయి. రాందాస్‌పల్లి, మల్శెట్టిగూడ, చింతపల్లిగూడ తదితర గ్రామాల్లో వడగళ్లు పడడంతో వివిధ పంటలకు నష్టం కలిగింది. మేడ్చల్ మండలం డబిల్పూర్, సోమారం, లింగాపూర్, రాయిలాపూర్, బర్మాజిగూడ, శ్రీరంగవరం గ్రామాల్లో టమాటా, ఆలుగడ్డ పంటలు దెబ్బతిన్నాయి. బషీరాబాద్ మండలం జీవన్గిలో వడగళ్ల కారణంగా మిరప పంట దెబ్బతిన్నది. వరుస నష్టాలను చవిచూస్తున్న మిర్చి రైతులకు ఈ సారీ కలిసిరాలేదు. కందుకూరు మండల పరిధిలోని నేదునూరులో అధిక మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. బాచుపల్లి, ధన్నారం, చిప్పలపల్లి, దెబ్బడగూడ, దాసర్లపల్లి గ్రామాల్లో వడగళ్లకు క్యాప్సికం, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. టమాటా, కీరదోస, చిక్కుడు, మొక్కజొన్న పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. -
ఈ పంటకు పరిహారం ఇవ్వరట!
ఆర్మూర్‌రూరల్, న్యూస్‌లైన్: ఏడెనిమిది నెలల పాటు పంటను కంటికి రెప్పలా కాపాడారు. చేతికి వచ్చిన పంటను రిక్కి, ఉడికించి కల్లాల వద్ద ఆరబెట్టుకున్నారు. మార్కెట్‌కు తరలించే లోపే అకాల వర్షం కాటేసింది. పంటంతా తడిసి ముద్దయ్యింది. రంగు మారిన పంటను అమ్ముదామంటే రేటు కూడా రాదు. పంటను పొలం నుంచి తవ్వితీసినందున నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం రాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పసుపు పంటను పండించిన రైతులు దిక్కుతోచని స్థి తిలోకి పడిపోయారు. కళ్ల ముందే పాడైపోయిన పసుపును చూసి కన్నీంటి పర్యంతమవుతున్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్లోని ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, సిరికొండ, భీమ్‌గల్, నందిపేట్ మండలాల్లో వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కలాల వద్ద ఆరబెట్టిన పసుపునకు న ష్టం వాటిల్లింది. రైతులు వేల రూపాయలు ఖర్చుచేసి పంటను పండించారు. ఆరబెట్టిన పసుపు వర్షానికి త డిసి నష్టం వాటిల్లితే ఎందుకు పరిహారం చెల్లంచరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపునకు పరిహారం అంచనా వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ హయాంలో న్యాయం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో అకాలవర్షాలతో కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపు పంట కు నష్టం వాటిల్లితే పరిహారం చెల్లించారు. ప్రభుత్వ ని బంధనలు సడలించి నష్టపరిహారం అందేలా అప్పటి ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. తడిసిపోయిన ఎకరం పసుపు పంటకు రూ. రెండు వేల చొప్పున రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ను ఆదర్శంగా తీసుకుని తడిసిన పసుపు నకు నష్టం పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. -
వరుణ దేవా... కరుణ లేదా...
పాల్వంచ రూరల్, న్యూస్‌లైన్: ఉరుములు, మెరుపులు, హోరు గాలితో మంగళవారం సాయంత్రం పాల్వంచ మండలంలో వడగళ్ల వాన పడింది. ఇది పడింది కొద్దిసేపే అయినప్పటికీ.. నష్టం మాత్రం తీవ్రంగానే ఉంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు వాతావరణం మామూలుగానే ఉంది. అంతలోనే ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఆకస్మికంగా ఉరుములు.. మెరుపులు.. ఈదురు గాలులతో వడగళ్ల మొదలైంది. దాదాపు అరగంటపాటు పడిన ఈ వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి. కరకవాగులో రేకుల ఇల్లు, కిన్నెరసానిలో పూరిపా క కూలిపోయాయి. రాజాపురంలో మొక్కజొన్న ధ్వంసమైంది. మరికొన్ని గ్రామాల్లో మామిడి పూత రాలింది. పత్తి పంట పూర్తిగా తడిచింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బయ్యారం: మండలంలో మంగళవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. రామచంద్రాపురం, వెంకటాపురం, కంబాలపల్లి గ్రామా ల్లో మొక్కజొన్న, మామిడి తోటలకు తీవ్ర నష్టం జరిగింది. పత్యాతండా ఐదు పూరిళ్ల పైకప్పులు గాలిదుమారానికి లేచిపోయాయి. వెంకటాపురం: మండలంలో రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలతో 1425 హెక్టార్లలో మిర్చి, దాదాపు వెయ్యి ఎకరాలలో మొక్కజొన్న పంట దెబ్బతింది. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పూర్తిగా తడిసింది. వాజేడు: మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాల్లోని వేలాది క్వింటాళ్ల మిర్చి తడిచింది. పంట నష్టం విలువ మొత్తంగా సుమారు 40లక్షల రూపాయలు ఉంటుందని రైతులు అంచనా వేస్తున్నారు. గుండాల: మండలంలో మంగళవారం కురిసిన వడగళ్ల బీభత్సం సృష్టించింది. ఈదరుగాలులతో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. అనంతోగు పంచాయతీలోని జగ్గుతండా గ్రామంలో రెండు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో ఐదు పూరిళ్ల పైకప్పులు లేచిపోయాయి. ఈ ఇళ్లలోని దాదాపు 200 క్వింటాళ్ల పత్తి తడిచింది. ఇల్లెందు-గుండాల మార్గంలో మర్రిగూడెం వద్ద రెండు విద్యుత్ స్తంభాంలు కూలిపోయి, తీగలు తెగిపడ్డాయి. కల్లాలోని మిర్చిని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. భద్రాచలం రూరల్: మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో అరగంటపాటు వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించారు. పినపాక: మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో కల్లాలోని మిర్చి తడిసింది. మండలంలో సుమారు పదివేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. సింగిరెడ్డిపల్లి, వెంకట్రావ్పేట, పాతరెడ్డిపాలెం, చింతల బయ్యారం, ఏడూళ్ళ బయ్యారం, మల్లారం, టి.కొత్తగూడెం, భూపతిరావుపేట, జానంపేట, భట్టుపల్లి, కరకగూడెం ప్రాంతాల్లో మిర్చి పంట తడిచింది. ఇల్లెందు: మండలంలోని చల్లసముంద్రం, రొంపేడు, మాణిక్యారం, కొమరారం, పోలారం పంచాయతీల్లో మంగళవారం కురిసిన వడగళ్ల వానతో సుమారు 500 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. వడగళ్ల వానతో మిర్యాలపెంటలో పలువురి గాయాలయ్యాయి. టేకులపల్లి: మండలంలో మంగళవారం కురిసిన వడగళ్ల వానతో రైతులు భీతిల్లారు. గంగారం పంచాయతీలో సుమారు 300 ఎకరాల్లోని మామిడి తోటల్లో ఎక్కువగా పూత, పిందె రాలింది. చింతకాయలు విపరీతంగా నేలరాలాయి. బద్దుతండా, కొప్పురాయి, బోడు, గంగారం గ్రామాల్లో మిర్చి తోటలకు నష్టం వాటిల్లింది. బర్లగూడెం గ్రామంలో బాలయ్య అనే రైతుకు చెందిన ఎకరన్నర మొక్కజొన్న నీటిపాలైంది. గంగారం పంచాయతీ కార్యాలయం ప్రహరీ కూలింది. ఒక్క గంగారం పంచాయతీలోనే పదికి పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరికొన్ని చోట్ల కూడా స్తంభాలు పడిపోయాయి. కొప్పురాయి, బోడు, గంగారం పంచాయతీల్లో వందకు పైగా పూరి గుడిసెలు కూలిపోయాయి. కొన్ని రేకుల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. -
వర్షార్పణం
సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షం.. భీకరంగా కురిసింది. వడగండ్లతో పెను బీభత్సాన్ని సృష్టించింది. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలను నీట ముంచాయి. నెల రోజుల్లో చేతికొస్తాయని ఆశించిన పంటలను వర్షాలు ఎక్కడికక్కడే ఛిద్రం చేశాయి. రెండు రోజులుగా పంట నష్టం తీవ్రత ఎక్కువైంది. 224 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇందులో 5 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 73 ఇళ్లు తీవ్రంగా, 146 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు జిల్లాలో 17.1 మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నర్సాపూర్ మండలంలో 71,6 మి.మీటర్ల వర్షం కురవగా.. సంగారెడ్డి మండలంలో 52 మి.మీటర్లు, కొండాపూర్‌లో 48, కంగ్టిలో 46.8, శివ్వంపేటలో 41.2, సదాశివపేటలో 40.4, ములుగులో 40, న్యాల్కల్ 36 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మిరుదొడ్డి, సిద్దిపేట, చిన్నకోడూరు, నంగనూరు, పటాన్చెరు, ఆర్సీపురం మినహా జిల్లాలోని అన్ని మండలాల్లో భారీ నుంచి ఓ మోస ్తరు వర్షం కురిసింది. ఈ వర్షాల పలు ప్రాంతాలలో రహదారులు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సోమవారం నాటికి కురిసిన వర్షాలతో జిల్లాలోని 16 మండలాల పరిధిలో 937.5 హెక్టార్ల వ్యవసాయ పంటలు వర్షార్పణమయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ తేల్చింది. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, వరి, శనగ పంట లు దెబ్బతిన్నాయి. ఈ మేరకు అంచనాలతో మంగళవారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను పంపించింది. అదే విధంగా 996 హెక్టార్లలో కూరగాయలు, మామిడి, అరటి తోటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖ నిర్ధారించింది. మంగళవారం సైతం భారీ వర్షం కురవడంతో నష్టం వేల ఎకరాలకు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ‘వ్యథ’సాయం 937. 5 హెక్టార్లు అత్యధికంగా కల్హేర్ మండలంలో 422.8 హెక్టార్లలో పంట లు దెబ్బతిన్నాయి. 380 హెక్టార్ల మొక్కజొన్న, 40 హెక్టార్ల పొద్దుతిరుగుడు, 2.8 హెక్టార్ల గోధుమలకు నష్టం వాటిల్లింది. అదే విధంగా సిద్దిపేట మండలంలో 60 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, సంగారెడ్డిలో 44 హెక్టార్లలో వరి, మెదక్‌లో 43.5 మొక్కజొన్న, శివ్వంపేటలో 40 హెక్టార్లలో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. చిన్నకోడూరులో 250 హెక్టార్లలో మిరప, సిద్దిపేటలో 14.4 హెక్టార్లలో మామిడి, దుబ్బాకలో 10 హెక్టార్లలో మామిడి, 4 హెక్టార్లలో మిరప పంటలు దెబ్బతిన్నాయి. -
అకాల వర్షం.. అపార నష్టం
మోమిన్‌పేట, న్యూస్‌లైన్: అకాల వర్షం వల్ల అపార నష్టం జరిగింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉల్లి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సోమవారం రాత్రి వడగళ్లకు మండలంలో ఉల్లిపంట పూర్తిగా దెబ్బతిన్నది.మండలంలో మేకవనంపల్లి, కోల్కుంద, రాళ్లగుడుపల్లి, ఏన్కతల, కాసులాబాదు, బూర్గుపల్లి, మోమిన్‌పేట, దేవరంపల్లి, చీమల్‌దరి, చక్రంపల్లి తదితర గ్రామాల్లో సుమారు 800ఎకరాల్లో ఉల్లి పంట సాగుచేశారు. వర్షం పడటంతో ఉల్లిఆకు పూర్తిగా నేలవారింది. ఉల్లిగడ్డ ఊరే దశంలో ఆకులన్నీ విరిగి నేలకొరగడంతో పంట ఆగిపోతుందని రైతులు పేర్కొంటున్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పంటలను సాగుచేస్తే వడగళ్లు దెబ్బతిశాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లినారు వేసేటప్పుడు నానాఇబ్బందులు పడి...పంట ఎదుగుదల బాగుంది అనుకుంటుండగా అకాల వర్షం నిరాశకు గురిచేసిందని వారు వాపోతున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టితే వర్షం వల్ల అన్నీ నెలపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. శామీర్‌పేట్, న్యూస్‌లైన్ : అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వడగళ్లవాన, ఈదురుగాలులకు వందలాది ఎకరాల కూరగాయలు, ద్రాక్ష తోటలు దెబ్బతిన్నాయి. ద్రాక్ష తోటల యజమానులకు లక్షల్లో నష్టం వాటి ల్లింది. మండలంలోని 22 పంచాయతీల పరిధిలో ఈ సీజన్లో వంద ఎకరాల పత్తి, ఏడు వందల ఎకరాల్లో మామిడి, వెయ్యి ఎకరాల్లో ద్రాక్ష సాగులో ఉంది. సోమ, మంగళవారాలు కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మండలంలోని లాల్గడిమలక్పేట్, శామీర్‌పేట్, బాబాగూడ, అలియాబాద్, పొన్నాల్, బొమ్మరాశిపేట్, కొల్తూర్, అనంతారం, పోతారం, నారాయణపూర్ గ్రామాలు ద్రాక్ష తోటలకు పెట్టింది పేరు. వారం రోజుల క్రితం ద్రాక్ష తోట, మామిడి పూత బాగుండడంతో ఆశించిన మేరకు దిగుబడులు వస్తాయని రైతన్న ఆనందంలో ఉన్నాడు. ఇంతలోనే అనుకోని వర్షాలు వారి ఆశలను గల్లంతు చేశాయి. పోతారంలో 15 ఎకరాలు, తుర్కపల్లిలో 200 ఎకరాలు, కొల్తూర్‌లో 60 ఎకరాలు, లక్ష్మాపూర్‌లో 40ఎకరాల్లో ద్రాక్ష తోటలు పూర్తిగా నాశనమయ్యాయి. వీటితో పాటు 300 ఎకరాల్లో మామిడి తోటలు పాడయ్యాయి. ఆరేళ్లుగా న ష్టాలతో ఉన్న తమపై ప్రకృతి మరోసారి ప్రతాపం చూపిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
హైద్రాబాద్‌లో వడగండ్ల వాన
-
అకాల వర్షం....అపార నష్టం
-
అకాల వర్షం
కల్హేర్, న్యూస్‌లైన్: జిల్లాలో శుక్రవారం అకాల వర్షం కురిసింది. దీంతో ప లుచోట్ల పంటకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా చెట్లు నేల వాలాయి. కల్హేర్ మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. అదేవిధంగా ఈదురుగాలులు వీచాయి. ఉరుములు మెరుపులతో వర్షం కురువడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో కరెంట్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఇదిలాఉండగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి కల్హేర్, మార్డి చోట్ల పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, గోధుమ పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లపై చెట్లు విరిగి పడ్డాయి. వర్షంతో పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖేడ్‌లో గంటపాటు.. నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం సా యంత్రం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. సాయంత్రం వేళ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో పాటు గంట సే పు వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలులతో కూడిన వర్షంతో విద్యు త్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. చల్లబడిన వాతావరణం మెదక్ మున్సిపాలిటీ: మెదక్‌లో శుక్రవారం సాయంత్రం కురి సిన చిరుజల్లులతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపం చూపగా, సా యంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఐదు గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో రాత్రి ఓ మో స్తారు వర్షం కురిసింది. కాగా వేసవి సమీపిస్తున్న తరుణంలో కురుస్తున్న వర్షం వల్ల మరింతగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దుబ్బాకలో చిరుజల్లులు దుబ్బాక: దుబ్బాకలో చిరు జల్లులతో కూడిన వర్షం కురిసిం ది. గురువారం రాత్రి ఈదురు గాలులతో పాటు చిన్నపాటి వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం కూడా చిరుజల్లు లు కురిశాయి. అయితే గత ఐదు రోజులుగా ఈదురు గాలు లు వీస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా గే వర్షాలు కురిస్తే మామిడి, ఇతర పంటలు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్థం చేస్తున్నారు. కురిసింది వాన జహీరాబాద్ టౌన్: జహీరాబాద్‌లో శుక్రవారం రాత్రి వర్షం కురిసింది. సాయంత్రం సన్నని జల్లులతో ప్రాంభమైన వాన ఆ తరువాత ఉరుములు, మెరుపులతో ఓ మోస్తారుగా కురి సింది. దీంతో పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. ప్రధానంగా బ్లాక్ రోడ్డుతో పాటు జాతీయరహదారిపై బాగారెడ్డి విగ్రహాం వద్ద నీరు నిలిచిపోయింది. సుభాష్‌గంజ్ తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు వచ్చిచేరింది. గురువారం రాత్రి కూడా సన్నని జల్లులు పడ్డాయి. ఎగిరిన రేకులు న్యాల్కల్, న్యూస్‌లైన్: మండలంలో శుక్రవారం రాత్రి వడగండ్ల వాన కురిసింది. దీంతో పలు గ్రామాల్లో ఇంటి పైకప్పు లు ఎగిరిపోయాయి. అదేవిధంగా మండల పరిధిలోని హుస్సెళ్లి గ్రామ సమీపంలో గిరిజనులు వేసుకున్న గుడిసెలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాల య్యాయి. కర్నాటక రాష్ట్రం జబ్గి గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు గ్రామంలో చెరకు నరకడానికి వచ్చారు. గ్రామ సమీపంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఉన్నట్లుండి గాలి వాన రావడం, గుడిసెలు కొట్టుకపోవడంతో పప్పు, బియ్యం ఇతర సామగ్రి కూడా పూర్తిగా పాడైపోయాయి. అంతే కాకుండా కమలాబాయి చేయి విరిగి పోగా చెట్టు కొమ్మ విరిగి మీదపడిన సంఘటనలో రెండేళ్ల బాలునితోపాటు మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యా యి. ఉన్నట్లుండి ఒకే సారి గాలితో కూడిన వడగండ్ల వాన రావడంతో గిరిజనులు భయందోళనకు గురై పరుగులు తీశా రు. వారు పూర్తి నిరాశ్రయులు కావడంతో గ్రామానికి చెంది న ఎండీ అఫీజ్,ఎండీ.మైపూజ్ మాస్టార్ వారికి స్థానిక పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. అంతే కాకుండా వారికి బియ్యం ఇతర వస్తువులు అందజేశారు. -
జిల్లాలో గాలివాన
కంగ్టి/కల్హేర్/తడ్కల్, న్యూస్‌లైన్: జిల్లాలో గురువారం సాయంత్రం పలుచోట్ల అకాల వర్షం కురిసింది. కంగ్టి, కల్హేర్, తడ్కల్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కంగ్టి పరిసర ప్రాంతాల్లో సాయంత్రం ఉన్నట్టుండి ఒకేమారు ఈదురు గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కంగ్టిలోని కొందరి ఇంటి పైకప్పు రేకులు గాల్లో ఎగిరి కింద పడిపోయాయి. స్థానిక సిద్ధేశ్వర ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకొని కాలి నడక వస్తున్న భక్తులు గాలి వాన బీభత్సానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తడ్కల్‌లో వడగళ్ల వర్షం కంగ్టి మండలం తడ్కల్ పరిధిలోని బాన్సువాడ, తడ్కల్, దామర్‌గిద్దా,ముర్కుంజాల్, చాప్టా తదితర గ్రామాల్లో వడగళ్ళుతో కూడిన వర్షం కురిసింది. దీంతో శనగ,కంది పంటల రాసులు చేస్తున్న రైతులకు కొంత మేర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మామిడి చెట్లకు పూసిన పూత వర్షం, వడగళ్ళ తాకిడికి రాలినట్లు అయా గ్రామాల రైతులు తెలిపారు. కల్హేర్‌లో.. మండల కేంద్రమైన కల్హేర్‌లో గురువారం రాత్రి ఓ మోస్తరుగా వర్షం కురిసింది. పొద్దుపోయే వేళ ఈదురుగాలులు వీచాయి. ఉరుములు మెరుపులతో వర్షం కురువడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సివచ్చింది. మహశివరాత్రి పర్వదినం సందర్భంగా మందిరాలకు వెళ్లిన భక్తులు.. ఒక వైపు వర్షం, మరోవైపు కరెంట్ సరఫరా లేకపోవడంతో ఇక్కట్లపాలయ్యారు. -
అసెంబ్లీకి ‘అకాల’ దెబ్బ
ముంబై: వడగండ్ల వాన అసెంబ్లీని బుధవారం తాకింది. అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలంటూ ప్రతిపక్షాల సభ్యులు ఆందోళనకు దిగారు. శివసేన, బీజేపీ నాయకులు వెల్‌లోకి చొచ్చుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నెల 23, 24 తేదీల్లో నాసిక్, ధులే, జల్గావ్, పుణే, అహ్మద్‌నగర్, భండారా, నాగపూర్, అమరావతి, యావత్మల్లో భారీ వర్షం, వడగండ్ల వాన వల్ల ఉల్లిగడ్డ, పత్తి, చెరకు, అరటి పండ్ల తోటలకు నష్టం కలిగిందన్నారు. వారిని వెంటనే ఆదుకునేందుకు త్వరితగతిన నష్టపరిహారం అందించాలని పట్టుబట్టారు. దీంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీనిచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి పంటలు కోల్పోయిన రైతులను త్వరితగతిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీని ఇచ్చారు. వడగండ్ల వాన కురిసేందుకు కారణం భూతాపమేనా అనేది తెలుసుకునేందుకు భారత వాతావరణ శాఖ అధికారులను సంప్రదిస్తున్నామని ఆయన వివరించారు. 13 జిల్లాలోని 94 తాలూకాల్లో 1,36,000 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందన్నారు. వీటిలో నాగపూర్, యావత్మల్, అమరావతి, వార్ధా, నాందేడ్, ధులేలు కూడా ఉన్నాయన్నారు. రాష్ట్ర విపత్తు పునరావాస నిధి కొత్త మార్గదర్శకాల ప్రకారం నష్టపరిహరం అందిస్తామని తెలిపారు. పంట నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చాక కేబినెట్ సమావేశంలో చర్చించి అదనపు సహాయంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో జిల్లా సహకార బ్యాంక్‌లు క్రియారహితంగా ఉండటంతో బ్యాంక్‌ల ద్వారా రైతులకు ఎలా సహాయం చేయాలన్న దానిపై కూడా దృష్టి కేంద్రీకరించామన్నారు. పంట నష్టాలపై ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు. వడగండ్ల వర్షం కురిసిన పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో గురువారం మంత్రులు పర్యటిస్తారని తెలిపారు. వాతావరణం అంతా అనుకూలించి పంట చేతికందింది అని అనుకున్న దశలో వడగండ్ల వాన మళ్లీ రైతులని శోకసంద్రంలోకి నెట్టిందని అన్నారు. శాంతి భద్రతలో సర్కార్ విఫలం: ఖడ్సే ముంబై: రాష్ర్టంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే ఆరోపించారు. ముంబై పోలీసు కమిషనర్ పదవికి సత్యపాల్ సింగ్ రాజీనామా చేసి బీజేపీలో చేరతారని తెలియని పాటిల్ ఇక ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అంచనా వేయడంలో ఎలా వ్యవహరిస్తారోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యంతో జరగుతున్న బదిలీలు, పదోన్నతుల వల్ల పోలీసు శాఖలో అసంతృప్తి నెలకొందని ఆయన వివరించారు. త్వరలోనే ఇద్దరు అదనపు డీజీ ర్యాంక్ పోలీసు అధికారులు పదవికి రాజీనామా చేస్తారన్నారు. విజయ్ కాంబ్లీ, అహ్మద్ జావదేలను ముంబై పోలీసు కమిషనర్ పదవి నుంచి తప్పించడం వెనుక కులం, ప్రాంతం ఉన్నాయని విమర్శించారు. సామాజిక కార్యకర్త నరేంద్ర దభోల్కర్‌ను హత్య చేసిన నేరస్తులను ఇప్పటివరకు పట్టుకోలేకపోయారని విమర్శించారు. మహిళలపై నేరాలు, నక్సల్స్ ఆగడాలు పెరగడంపై ఖడ్సే ఆందోళన వ్యక్తం చేశారు.