సాక్షి, సంగారెడ్డి: మళ్లీ ‘అకాల’ వర్షం విజృంభించింది. మండుటెండల్లో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలపై దెబ్బకొట్టింది. చేతికొచ్చిన పంటలను నేలకూల్చి అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న భీకర గాలివానలతో జిల్లాలో 777 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచ నా వేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక అంచనా నివేదిక పంపించింది. మండలాల వారీగా పరిశీలిస్తే.. దౌల్తాబాద్‌లో 510 హెక్టార్లు, వెల్దుర్తిలో 101, చేగుం టలో 106, కొ ల్చారంలో 60 హెక్టార్లలో వరికి నష్టం వాటిల్లింది. గాలివాన ఉధృతికి చేతికొచ్చిన వరి గింజలు నేలరాలాయి. సోమవారం సైతం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురవడంతో పంట నష్టం మరింత పెరగనుందని అధికారులు భావిస్తున్నారు.
రెండో సారీ..!
ఈ ఏడాది రబీ రైతాంగంపై ప్రకృతి రెండు పర్యాయాలు విరుచుకుపడింది. గత ఫిబ్రవరి 27 మార్చి 9 మధ్య కాలంలో కురిసిన వడగండ్ల వానకు జిల్లాలోని 27 మండలాల పరిధిలో 2021.66 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తం 4,800 మంది రైతులు నష్టపోయారు. దీంతో రైతులను ఆదుకోవడానికి రూ.1.35 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ గత నెలలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
వర్రి @777 హెక్టార్లు
Published Mon, May 5 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM
Advertisement