కొట్టుకుపోయిన వడ్లు.. దెబ్బతిన్న పంటలు | Untimely rains and storms caused huge losses to farmers | Sakshi
Sakshi News home page

కొట్టుకుపోయిన వడ్లు.. దెబ్బతిన్న పంటలు

Published Sat, Apr 22 2023 2:55 AM | Last Updated on Sat, Apr 22 2023 2:49 PM

Untimely rains and storms caused huge losses to farmers - Sakshi

నల్లగొండ/జగిత్యాలఅగ్రికల్చర్‌/డొంకేశ్వర్‌ (ఆర్మూర్‌): ఈదురుగాలులు.. అకాల వర్షంతో శుక్రవారం రాత్రి పలు జిల్లాల్లో పంటనష్టం వాటిల్లింది. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మార్కెట్‌యార్డులు, ఐకేపీ కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది.

ఇంకొన్ని కేంద్రాల్లో వర్షపు నీటితో పాటే వడ్లు కొట్టుకుపోయాయి. వర్షం తగ్గిన తరువాత చీకట్లోనే రైతులు ధాన్యాన్ని కాపాడుకునే యత్నాలు చేశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 23,560 ఎకరాల్లో మామిడి, వందల ఎకరాల్లోని వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఆరబెట్టిన పసుపు కుప్పలు తడిసిపోయాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement