జిల్లాను వీడని వర్షం | people facing problems with continuous rains | Sakshi
Sakshi News home page

జిల్లాను వీడని వర్షం

Published Fri, Mar 7 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

people facing problems with continuous rains

జన్నారం, న్యూస్‌లైన్ :  జిల్లాను అకాల వర్షం వీడడం లేదు. జన్నారం మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యా యి. గంటపాటు కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని సినిమా హాలుకు వెళ్లే రోడ్డు నీటి తో నిండింది. వరదలు పారాయి. మండలంలోని కామన్‌పల్లి, కవ్వాల్, కలమడుగు, ఇందన్‌పల్లి, రేండ్లగూడ, రాంపూర్, తిమ్మాపూర్, తపాలపూర్ తదితర గ్రామాల్లో మామిడి తోటల్లోని చెట్ల పూత రాలింది. తీవ్రంగా న ష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

 తాండూర్‌లో
 తాండూర్ : మండలంలో గురువారం మధ్యాహ్నం గంటపాటు ఉరుములు, మెరుపులతో కూ డిన భారీ వర్షం కురిసింది. కొ న్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మాదారం-3 ఇంక్లైన్ నర్సాపూ ర్ ప్రాంతాల్లో జొన్న చేను నేల వాలింది. నాలుగై దు రోజు లుగా వర్షం కురుస్తుండడంతో శెనగ వేర్లు కుళ్లిపోయి పంట నష్టపోయే ప్రమా దం ఉంది. ఇప్పటికే మామిడి రైతు లు పూత, పిందెలు రాలి తీవ్రం గా నష్టపోయారు. గురువారం కురిసిన వర్షం మరింత నష్టపర్చింది.

 వర్షానికి కూలిన ఇళ్లు
 భీమిని : మండలంలో గురువా రం ఈ దురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మెట్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధి ఏసయ్యపల్లిలో దుర్గం తమ్మయ్య ఇం టిపై చెట్టు విరిగి పడింది. దీంతో ఇంటి పైకప్పు ధ్వంసమైంది. దు గుట చంద్రయ్య, కోట శాంత ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. వెంకటాపూర్‌లో ఇందూరి లచ్చన్న ఇల్లు నేల మట్టమైంది. కన్నెపల్లిలో శనిగారపు చం టయ్య, మోర్ల మల్లేశ్, బాబాజీ ఇంటి పైకప్పులు ధ్వంసమయ్యాయి. భీమి ని, మెట్‌పల్లి, కన్నెపల్లి గ్రామాల్లో ఉల్లితోపాటు వివిధ రకాల కూరగాయల పంటలు దె బ్బతిన్నాయి. తహశీల్దార్ శ్రీనివాస్‌రా వు వెంకటాపూర్ గ్రామాన్ని సందర్శించి ఇళ్లు కూలిపోయిన బాధితులను పరామర్శించారు. తక్షణ సాయం కింద 25 కిలోల బియ్యం అందజేశారు. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

 మొలకలు వచ్చిన పొద్దుతిరుగుడు
 కుంటాల : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మిర్చి, పత్తి, మొక్కజొన్న, గోధుమ పంటలు దెబ్బతిన్నాయి. మండలంలోని వెంకూర్ గ్రామంలో పొద్దుతిరుగుడు పంట నేలకొరిగి మొలకలు వచ్చాయి. దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 కెరమెరిలో..
 కెరమెరి : మండలంలో గురువారం ఉద యం 11గంటల ప్రాంతంలో భారీ వర్షం కురి సింది. ప్రధాన రహదారులు చిత్తడిగా మారా యి. గోయేగాం, ధనోరా, ఝరి, రింగన్‌ఘా ట్, కెరమెరి గ్రామాల్లో రోడ్లు బురదగా మారడంతో పాదచారులు, వాహన చోదకులు ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. గోయేగాం పాఠశాల ఆవరణ వర్షపు నీటితో నిండిపోయింది. రింగన్‌ఘాట్ వద్ద నిర్మిస్తున్న రో డ్డు కారణంగా కాంట్రాక్టర్లు పక్కనుంచి మట్టిదారి నిర్మించారు. వర్షం వచ్చినప్పుడల్లా బురదగా మారుతోంది. దీంతో ఇప్పటివరకు సు మారు 25మంది వాహనదారులు జారిపడ్డారు.

 వేమనపల్లిలో..
 వేమనపల్లి : మండలంలోని లింగాల గ్రా మంలో గురువారం రాత్రి కురిసిన అకాల వ ర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు నాగెపెల్లి గ్రామంలో 20 గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. నాలుగు ఇళ్లు నేలమట్టం అ య్యాయి. వందల ఎకరాల్లో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంట నేలవాలింది. గంటన్నరపాటు కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వరి పొలాల్లో నీరు చేరి నష్టపోయినట్లు లింగాల గ్రామానికి చెందిన చౌదరి శంకర్ తెలిపాడు. 200 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, 400 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. మరో వారం రోజుల్లో చేతికందే పొద్దుతిరుగుడు పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 నేలకొరిగిన పంటలు
 దహెగాం : మండలంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లగ్గాం, కుంచవెల్లి, మాడవెల్లి, ఐతపల్లి తదితర గ్రామాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. గాలివాన కు చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. కన్నెపల్లి నుంచి మాడవెల్లికి సరఫరా అవుతున్న 11కేవీ లైన్‌పై చెట్లు పడడంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కుంచవెల్లిలో వ్యవసాయానికి విద్యు త్ సరఫరా చేసే స్తంభాలు పడిపోయాయి. మాడవెల్లిలో రాదండి శంకర్, వరిమడ్ల పోచ య్య ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement