
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి వానలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ విద ర్భ నుంచి మరఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉత్తరాది జిల్లాలు, తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకట్రెండు చోట్ల వడగండ్ల వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 37.0 డిగ్రీల సెల్సియస్‌గా నమో దైంది. వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.