lightning
-
ఇలా చేస్తే పిడుగుపాటు నుంచి బయట పడవచ్చు!
వర్షాకాలంలో తరచూ పిడుగులు పడి మనుషులూ, పశువులూ చనిపోవడం తెలిసిందే. నిపుణులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే పిడుగుపాటు నుంచి బయట పడవచ్చు. వర్షం రాగానే చెట్ల కిందికి పరుగెత్తకూడదు. ఒంటరి చెట్టు అత్యంత ప్రమాదకరం. చెట్లు, స్తంభాల కిందకు వెళ్లకుండా ఇళ్లకు, సురక్షిత భవనాలకు చేరుకోవాలి. కారులో ఉంటే అందులో కూర్చొని, కిటికీ అద్దాలు మూసివేయాలి. చేతులు ఒళ్ళో పెట్టుకోవాలి. లోహపు తలుపులను తాకరాదు. ఇంటిలో ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు అవసరం. విద్యుత్ పరికరాలను ఆపేయాలి. ఛార్జింగ్ చేస్తున్న ఫోన్ తాకకూడదు. కాంక్రీటు గోడలను, నేలను తాకకూడదు. బాల్కనీ, కిటికీలకు దగ్గరగా ఉండకూడదు. నల్లా నీటిని తాకరాదు. తాము నిలబడిన భూమి పొడిగా ఉండాలి. తడిగా ఉంటే దగ్గరలో పిడుగు పడితే విద్యుత్ఘాతానికి గురి కావచ్చు.చర్మంపై గుచ్చినట్లున్నా, వెంట్రుకలు నిక్క బొడిచినా వెంటనే పిడుగు పడబోతోందని అర్థం (ఈ సూచికలు గుర్తించే అవకాశం ప్రతిసారీ ఉండక పోవచ్చు). పొలాల్లో ఉన్నప్పుడు కాలి మునివేళ్ళ పైన తల వంచి, చెవులు మూసుకొని కూర్చోవడం ఒక మార్గం. ఇందువల్ల నేరుగా పిడుగు పడే అవకాశాలు తగ్గుతాయి. రెండు కాలి మడమలు ‘V’ ఆకారంలో వెనక తాకి ఉండాలి. ఇందువల్ల భూమిపై పిడుగు పడితే ఒక కాలిలోకి ప్రవేశించిన విద్యుత్ మరో కాలిలోంచి భూమిలోకి త్వరగా వెళ్ళిపోతుంది. అడవిలో ఉంటే గుంపుగా ఉన్న చిన్న చెట్ల కింద ఉండవచ్చు. అప్పటికే కొండపై ఉంటే ఏదేని గుహ కనిపిస్తే వెళ్ళవచ్చు. తాటి చెట్లు ఎత్తుగా, తడిగా ఉండటం వల్ల సహజంగా పిడుగులను ఆకర్షించి భూమిలోకి విద్యుత్తును ప్రవహింపచేస్తాయి. ఇంటిలో ఉండడం క్షేమమే, అయినా పక్కనే పెద్ద చెట్టు ఉంటే ఏమి జరుగుతుందో సూర్యారావుపాలెం పిడుగుపాటు చెబుతోంది. చెట్టుకు దగ్గరలో ఎండు కర్రలు, దహనశీల పదార్థాలు ఉంటే అగ్ని తీవ్రత పెరుగుతుంది. కానీ అసలు చెట్లే లేకపోతే మైదాన ప్రాంతంలో కూడా పిడుగు పడుతుంది. కనుక గ్రామాల్లో చెట్లు అన్నీ ఒకే ఎత్తులో ఉండేట్లు పై కొమ్మలు తొలగిస్తే ప్రమాదావకాశాలు కొంత తగ్గుతాయి. మైదాన ప్రాంతంలో ఉండే పాన్ డబ్బాల దగ్గర మరీ ప్రమాదకరం. చదవండి: చలికాలంలో పొంచివున్న వ్యాధులు.. జాగ్రత్తలు ఇవే‘పిడుగు వాహకాలు’ (లైట్నింగ్ కండక్టర్) గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇవి 20 ఏళ్ళకు పైగా పని చేస్తాయి. పిడుగు వాహకాలు కొద్ది మీటర్ల మేరకే రక్షణ కల్పిస్తాయి గనుక అన్ని ఎత్తైన ఇళ్ళపై ఏర్పాటు చేసుకోవాలి. కేంద్ర భూవిజ్ఞాన శాఖ ‘దామిని’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. రానున్న 40 నిమిషాల్లో చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రదేశంలో పిడుగు పడుతుందో లేదో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పిడుగులను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా 83 ప్రాంతాల్లో నెట్ వర్క్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకులు -
పిడుగుపాటుకు యువతీ యువకుడు మృతి
ఐనవోలు/వర్ధన్నపేట: వ్యవసాయ భూముల్లో పనులు చేస్తుండగా పిడుగుపడి యువతీ యువకుడు మృతి చెందారు. కాగా, విద్యుత్ సౌకర్యం లేక టార్చ్‌లైట్ వెలుతురులోనే శవపరీక్ష చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దౌతుబాజి శ్రీనివాస్, దౌతుబాజి విజయ, రాధాబాయి, ఇందిర, కోమల, శ్రావణి, రాజు ఆదివారం పొలాల్లో పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో అందరూ సమీపంలోని రేకుల షెడ్డులోకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడింది. పిడుగు ధాటికి షెడ్డులో ఉన్న ఏడుగురూ కింద పడిపోయారు. తేరుకుని లేచి చూడగా ఇందిర కుమార్తె శ్రావణి (17), కూకట్ల కోమల కుమారుడు రాజు (24) మృతిచెంది ఉన్నారు. ఈ ఘటనలో కోమలతోపాటు మిగతా నలుగురు అస్వస్థతకు గురయ్యారు. జఫర్‌గఢ్ ఎస్సై రాంచరణ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టార్చ్‌లైట్ వెలుతురులో శవపరీక్ష ఇదిలా ఉండగా శ్రావణి, రాజు మృతదేహాలకు వర్ధన్నపేట శ్మశానవాటికలోని పోస్టుమార్టం గదిలో విద్యుత్ సౌకర్యం లేక టార్చ్‌లైట్ వెలుతురులోనే శవపరీక్ష చేశారు. వెంకటాపురం గ్రామం జఫర్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండడంతో వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాలను తీసుకురాగా శ్మశానవాటికలోని పోస్టుమార్టం గదికి తరలించారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వైద్యులు అక్కడికి చేరేసరికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో టార్చ్లైట్ల సహాయంతో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. అక్కడ విద్యుత్ మీటరు లేకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతుంటే.. పోస్టుమార్టం గది నిర్మించి ఇచ్చాం, మిగతా విషయాలకు ఆస్పత్రి వారిదే బాధ్యత అని మున్సిపల్ శాఖ చేతులు దులిపేసుకున్నట్టు సమాచారం. -
పిడుగొస్తే.. ఏం చేయాలి?
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక మేరకు 2022లో ప్రకృతి విపత్తుల కారణంగా మన దేశంలో 8,060 మరణాలు సంభవిస్తే.. అందులో 2,887 మరణాలకు పిడుగుపాటే కారణం.ప్రతి సెకనుకు భూమిపై 50 నుంచి 100 పిడుగులు పడతాయట.‘వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియవ’న్నది సామెత. కానీ దేశంలో ఏటా వేలాది మందిని బలిగొంటున్న పిడుగు పాటును మాత్రం ముందే గుర్తించేందుకు చాన్స్ ఉంటుంది. ఆకాశం మేఘావృతమై జల్లులు మొదలైతే.. ఉరుములు, మెరుపులు వస్తుంటే.. చాలా మంది ఏ చెట్టు కిందకో పరుగెడుతుంటారు.అంతేకాదు కారులో ఉంటే పిడుగు పడొచ్చనే భయంతో కిందకు దిగి కాస్త దూరంగా నిలబడుతూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలతో పిడుగు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో రైతులు, చిన్నారులు సహా పదుల సంఖ్యలో పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..పిడుగుపాటు బారిన పడకుండా..‘దామిని’ ఉంటే తప్పించుకోవచ్చు! పిడుగులకు సంబంధించి ముందుగానే హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘దామిని’అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచి్చంది. మీరు ఉన్న ఏ ప్రాంతంలోనైనా తర్వాతి 15 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉంటే ఈ యాప్ హెచ్చరిస్తుంది. పుణేకు చెందిన ఐఐటీఎం సంస్థ దీన్ని రూపొందించింది.జీపీఎస్ లొకేషన్ ఆధారంగా.. మీరున్న చోటేకాదు చుట్టుపక్కల ఎక్కడెక్కడ పిడుగులు పడే అవకాశముందో చెప్తుంది. అంతేకాదు.. గత 15 నిమిషాల్లో ఎక్కడైనా పిడుగుపడితే ఆ సమాచారం కూడా దీనిలో లభిస్తుంది. పిడుగుల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని కూడా చెప్తుంది. పిడుగుపాటును ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ దగ్గర కూడా ఉంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
విద్యుత్ కేంద్రాల రక్షణపై పిడుగు!
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా మణుగూరులోని 1,080 (4్ఠ270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై శనివారం రాత్రి పిడుగు పడటం రాష్ట్రంలోని కీలక థర్మల్ విద్యుత్ కేంద్రాల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పిడుగుల నుంచి రక్షణ కల్పించే పటిష్ట ఏర్పాట్లు ఉన్నా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగు పడటం అనేక సందేహాలకు తావిస్తోంది. పిడుగుల నుంచి రక్షణ కల్పించేందుకు జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ లైట్నింగ్ అరెస్టర్లు, ఎర్తింగ్ టవర్లు, ఎర్త్పిట్ల వంటి రక్షణ వ్యవస్థలన్నీ విఫలం కావడంతోనే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగు పడినా మంటలు వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి నైట్రోజన్ ఇంజెక్షన్, స్ప్రింక్లర్ల వ్యవస్థలు సైతం అనుకున్న రీతిలో పనిచేయలేదన్న చర్చ జరుగుతోంది. దీంతోనే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఒకటో యూనిట్‌కు సంబందించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైనట్లు కొందరు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. పిడుగుల నుంచి రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థల డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణలో లోపాలతోనే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.దీంతో రూ. వేల కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టులో జరిగిన భారీ అగి్నప్రమాదంలో 9 మంది ఇంజనీర్లు, ఇతర సిబ్బంది మృతిచెందడం తెలిసిందే. నాటి ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించినా వారిపై జెన్కో యాజమాన్యం చర్యలు తీసుకోలేదు. అందువల్లే ఆ తరహాలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ వ్యవస్థలన్నీ విఫలం... భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఒక్కో యూనిట్లో 16.8 కేవీ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌ను 400 కేవీ సామర్థ్యానికి పెంచితేనే గ్రిడ్‌కు సరఫరా చేయడానికి వీలవుతుంది. ఆ పనిని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లు చేస్తాయి. విద్యుత్ కేంద్రంలో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లు ఉండే ప్రాంతాన్ని స్విచ్యార్డ్గా పిలుస్తారు. అక్కడ సబ్ స్టేష న్కు సంబంధించిన అన్ని పరికరాలు ఉంటాయి. పిడుగుల నుంచి రక్షణ కల్పించడానికి స్విచ్‌యార్డ్ చుట్టూ రక్షణ వలయం ఉంటుంది. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి 400 కేవీ విద్యుత్ బయటకు సరఫరా అయ్యే చోట ఓ లైట్నింగ్ అరె స్టర్ ఉంటుంది.వెలుపలి ప్రాంతాల్లో ఎక్కడైనా పిడ గు పడినా స్విచ్యార్డ్కి అధిక వోల్టేజీ సరఫరా కాకుండా ఈ లైట్నింగ్ అరెస్టర్ రక్షణగా పనిచేస్తూ ఉంటుంది. ఇక పిడుగు నేరుగా స్విచ్‌యార్డ్ మీద పడినా ప్రమాదం ఉండకుండా దాని చుట్టూ టవర్లు ఉంటాయి. ఆ టవర్లన్నింటినీ వైర్లతో అనుసంధానించి భూమిలోకి ఎర్తింగ్ చేస్తారు. దీంతో స్విచ్యార్డ్పై పిడుగు పడి నా అందులోంచి హై వోల్టేజీ విద్యుత్ భూమిలోకి వెళ్లిపోయేలా ఈ వ్య వస్థ పనిచేస్తుంది. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మీద పిడుగు పడకుండా దారిమళ్లించడానికి దానికి రెండు వైపులా లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చే స్తారు.ఒకవేళ పిడుగు పడినా దాని ప్రభావం భూమిలోకి వెళ్లిపోతుంది. ఇక స్విచ్‌యార్డ్ కింద భూగర్భంలో అర మీటర్ లోపల మెటాలిక్ ప్లేట్లతో ఫెన్సింగ్ మెష్ తరహాలో వలయం ఏర్పాటు చేస్తారు. లైట్నింగ్ అరెస్టర్లను వాటితో అనుసంధానిస్తారు. స్విచ్‌యార్డ్ లోపుల ఎర్త్ పిట్లు కూడా ఉంటాయి. భూగర్భంలో 5 మీటర్ల లోతు వరకు రాడ్డును పాతి ఎర్తింగ్ వ్యవస్థతో కనెక్ట్ చేస్తారు. వాటన్నింటికీ తోడుగా జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ భూగర్భంలో సొంత ఎర్తింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ ఏకకాలంలో విఫలం కావడం వల్లే భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జనరేటింగ్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగుపడి తీవ్ర నష్టాన్ని కలిగించిందన్న చర్చ జరుగుతోంది. సరిగ్గా పనిచేయని రక్షణ వ్యవస్థలు.. పిడుగుపాటు లేదా ఇతర కారణాలతో జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగితే తక్షణమే మల్సిఫైయర్ యాక్టివేట్ అయి మంటలకు ఆక్సిజన్ అందకుండా నిరంతరం నీళ్లను చల్లుతుంది. దీంతో ఆక్సిజన్ అందక మంటలు ఆగిపోతాయి. ఇక టాన్స్ఫర్మర్ వద్ద మరో రక్షణ వ్యవస్థగా నైట్రోజన్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ మరుగుతూ వేడిగా ఉంటుంది. ఆయిల్ ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరితే ట్రాన్స్ఫార్మర్లలో మంటలు చెలరేగి దగ్ధమయ్యే ప్రమాదం ఉంటుంది.అందుకే నిరంతరం ఆయిల్ ఉష్ణోగ్రతలను నైట్రోజన్ ఇంజెక్షన్ సిస్టమ్ కనిపెడు తూ ఉంటుంది. ఒకవేళ మంటలు చెలరేగే స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగితే తక్షణమే ట్రాన్స్ఫార్మర్ను ట్రిప్ చేయడంతోపాటు అందులోని ఆయిల్ లో 10 శాతాన్ని బయటకు పంపిస్తుంది. అలా ఏర్పడే ఖాళీ ప్రదేశాన్ని నైట్రోజన్‌తో నింపేస్తుంది. దీంతో ఆక్సిజన్ అందక ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగవు. భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ రక్షణ వ్యవస్థలు సైతం సరిగ్గా పనిచేయలేదనే చర్చ జరుగుతోంది.ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ కాలంజనరేటర్ ట్రాన్స్ఫార్మర్ను 2020లో ప్రారంభించగా ఇప్పటికే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసింది. ఇన్సూ్యరెన్స్ చేయించి ఉంటేనే జెన్కోకు నష్టం తప్పనుంది. లేకుంటే సొంత ఖర్చుతో మరమ్మతులు నిర్వహించక తప్పదు. బీహెచ్ఈఎల్–¿ోపాల్ ఈ ట్రాన్స్ఫార్మర్ను తయారు చేసింది. -
బీటీపీఎస్‌లో పిడుగుపాటు?
మణుగూరు టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చిక్కుడుగుంట గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. స్టేజ్ –1 వద్ద ఉండే ‘జీటీ’ట్రాన్స్ఫార్మర్పై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఎగిసిపడిన మంటలు సుమారు అర్ధగంటకు పైగా చెలరేగాయి. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది, ప్లాంట్ కీలక అధికారులు ఉరుకులు, పరుగులు తీశారు. ఎట్టకేలకు రాత్రి 8.05 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మెయిన్ ట్రాన్స్ఫార్మర్లు ఉండే ప్రదేశం వద్దే అగ్ని ప్రమాదం జరగడంతో.. అధికారులు వెంటనే 1, 2 యూనిట్లలో విద్యుదుత్పత్తిని నిలిపి వేసినట్లు సమాచారం. అయితే చిన్న సాంకేతిక లోపంతో యూనిట్–1ను అధికారులు ఉదయమే నిలిపివేశారు. ఇప్పుడు జరిగిన ప్రమాదం యూనిట్–1కు సంబంధించినదా? లేక యూనిట్–2లోదా? అనేది తేలాల్సి ఉంది. అగ్ని ప్రమాదంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్లాంట్ ఏరియాలో పిడుగుపాటు నివారణకు స్విచ్ యార్డ్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండగా, దానికి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద పిడుగు పడిందని అధికారులు చెబుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సాంకేతిక లోపమా? లేక పిడుగుపాటా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై సీఈ బిచ్చన్నను వివరణ కోరగా పిడుగుపాటా? అనేది ఇప్పుడే చెప్పలేమని, విచారణానంతరమే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. యూనిట్ –1లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ధ్రువీకరించారు. -
Telangana Rains: రెండ్రోజులు వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం కూడా కొనసాగింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనావేసింది -
హైదరాబాద్‌లో కుండపోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను సోమవారం సాయంత్రం జడివాన వణికించింది. గంటపాటు ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. రాత్రి వరకు ఓ మోస్తరు వాన కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా శివరాంపల్లిలో 6.2, చార్మి నార్లో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో నాలుగైదు సెంటీమీటర్ల వరకు పడింది. అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. నాలాలు, మ్యాన్‌హోల్‌లు పొంగి పొర్లాయి. దీంతో నగరమంతా ట్రాఫిక్ స్తంభించి పోయింది. వాహనదారులు గంటల కొద్దీ అవస్థ పడ్డారు. అబిడ్స్ ప్రాంతంలో ఈదురుగాలుల ధాటికి రేకులు ఎగిరిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. లంగర్‌హౌజ్ ప్రాంతంలో ఒక మసీదుపై పిడుగు పడటంతో గోడలకు పగుళ్లు వచ్చాయి. పైన ఉన్న గుమ్మం కింద పడిపోయింది. వర్షంతో అప్రమత్త మైన అధికార యంత్రాంగం.. ప్రజలెవరూ అవస రమైతే తప్ప బయటికి రావొద్దని విజ్ఞప్తి చేసింది. నేడూ భారీ వర్షాలు.. అతిభారీ వర్షాలు: మహబూబాబాద్, వరంగల్,హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ అధికంగా భారీ వర్షాలు, ములుగు, భద్రాద్రికొత్తగూడెం,నల్లగొండ,ఖమ్మం,సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీవర్షాలు కురవచ్చు. మోస్తరు నుంచి భారీ వర్షాలు:జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి,హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురవచ్చు. -
వాలీబాల్ ఆడుతుండగా వర్షం.. చెట్టు కిందకు పరుగులు.. మరో చెట్టుపై పిడుగు
రావికమతం (అనకాపల్లి జిల్లా): చెట్టుపై ఆదివారం సాయంత్రం పిడుగు పడడంతో 11 మంది గిరిజన యువకులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురిని విశాఖ కేజీహెచ్‌కు, 8 మందిని 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రావికమతం మండలం తాటిపర్తి గిరిజన గ్రామంలో ఆ గ్రామానికి చెందిన సీదిరి శ్రీను, కుండ్ర బాలరాజు, షోమీల శ్రీను, పాడి చినబ్బాయి, బాలకృష్ణ, లోత కళ్యాణం, సుర్ల గణేష్ తదితర యువకులు ఆదివారం వాలీబాల్ ఆడుతుండగా వర్షం రావడంతో అంతా ఒక చెట్టు కిందకు పరుగులు తీశారు. ఆ సమయంలో వారికి సమీపంలోని మరో చెట్టుపై పిడుగుపడడంతో ఆ అదురుకు పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఉన్న మరికొంత మంది వెంటనే 108కు సమాచారం అందించడంతో హుటాహుటిన అంబులెన్స్ సిబ్బంది వచ్చి, గాయపడిన వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అందరూ కోలుకున్నారని ఆందోళన చెందాల్సిన పనిలేదని గ్రామ సర్పంచ్ వంజరి గంగరాజు తెలిపారు. -
ఇలా చేస్తే పిడుగులు పడవు..విద్యుత్ తీగల కింద.. టవర్ల దగ్గరలో ఉండొద్దు
సాక్షి, అమరావతి: భూమి, మేఘాల మధ్య విద్యుత్ విడుదల వల్ల మెరుపులు ఏర్పడి.. భూమి మీదకు అవి పిడుగులా ప్రసరిస్తుంటాయి. వానలు కురుస్తున్నప్పుడు పిడుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనీస జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుల బారినుంచి సునాయాసంగా రక్షించుకోవచ్చంటున్నారు. విద్యుత్ భద్రత డైరెక్టర్, ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి జి.విజయలక్ష్మి. ప్రతి ఇంటిపైనా ‘పిడుగు వాహకం’ అమర్చాలని ఆమె స్పష్టం చేశారు. వివరాలు ఆమె మాటల్లోనే.. నిటారుగా నిలబడొద్దు బెంజిమిన్ ఫ్రాంక్లిన్ 1752లో విద్యుత్, మెరుపుల మధ్య సంబంధాన్ని నిరూపించినప్పటి నుంచీ, వాటిని విద్యుత్‌గా మార్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. పిడుగు నుంచి వచ్చే విద్యుత్ నిల్వ చేయగలిగితే ఒక పిడుగు నుంచి 10 కోట్ల వాట్ల విద్యుత్ పొందవచ్చు. అంత శక్తి వాటిలో ఉంటుంది కాబట్టి కేవలం 50 మైక్రో సెకన్లలో పిడుగు ప్రభావం చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 100 పిడుగులు పడుతున్నాయనేది ఓ అంచనా. కాబట్టి పిడుగుల నుంచి రక్షణ పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు, కారు, బస్సు, రైలులో ఉన్నప్పుడు పిడుగుపాటు నుంచి రక్షణ లభిస్తుంది. పిడుగుల శబ్దం వినిపిస్తూ.. వర్షం పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కిందకి పోకూడదు. పిడుగు ఎత్తైన తాటి, కొబ్బరి వంటి చెట్లను వాహకంగా చేసుకుంటుంది. ఎత్తైనవి లేనిచోట ఇతర చెట్లపై పడుతుంది. చెట్టు మీద పిడుగు పడ్డప్పుడు చెట్టు చుట్టూ తడి నేలపై 50 మీటర్ల వరకు కరెంట్ ప్రసరిస్తుంది. తడిసిన పూరి గుడిసెల పైన, గడ్డివాములపైన కూడా పిడుగు పడుతుంది. వాన పడేటప్పుడు చెట్టు కిందకు, ఇలాంటి ప్రదేశాలకు వెళ్లకూడదు. చుట్టూ 500 మీటర్ల వరకు చెట్లు లేనప్పుడు, చెలకల వద్ద నల్లని దట్టమైన మేఘాలు (భూమి నుంచి 2 కి.మీ. ఎత్తు లోపల ఉండే క్యుములోనింబస్ మేఘాలు) వర్షించినప్పుడు నడుస్తున్నా, నిటారుగా నిల్చున్నా పిడుగు మనల్నే వాహకంగా చేసుకుంటుంది. తడిస్తే తడిచామని కింద పాదాలు మాత్రమే నేలకు తాకేలా, ఒకరికొకరు 100 అడుగుల దూరంగా కూర్చుంటే పిడుగుపాటు నుంచి తప్పించుకోవచ్చు. అలాంటి సమయంలో గడ్డపార లాంటి లోహపు వస్తువులు దగ్గర లేకుండా చూసుకోవాలి. పిడుగుల హెచ్చరికలు ఉన్నపుడు ఆరుబయట ఉండకూడదు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో భవనాలలో, సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవాలి. ఉరుముల శబ్దం వినిపించిన వెంటనే పిడుగు పడే అవకాశం ఉందని గమనించాలి. అలాగని వెంటనే చెట్టు కిందకు, పొలాల్లోకి, ఆరుబయటకు వెళ్లకూడదు. ‘లైట్నింగ్ కండక్టర్’ కాపాడుతుంది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్, 2010లోని 74వ నియమం ప్రకారం.. ప్రతి భవన నిర్మాణంలో పిడుగుపాటు నుంచి రక్షణ ఏర్పాట్లు ఉండాలి. ఎత్తైన భవనాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, విద్యుత్ ఉత్పాదక ప్రాంతాలు, సరఫరా టవర్లు, పంపిణీ కేంద్రాలు, సమాచారానికి వినియోగించే టవర్లకు పిడుగు వాహకం (లైట్నింగ్ కండక్టర్) అమర్చుకోవాలి. ఆట స్థలాలకు సమీపంలోని ఎత్తైన ప్రదేశంలో పిడుగు వాహకం అమర్చటం ద్వారా మైదానాల్లో ఆడుకునే చిన్నారులను పిడుగుల నుంచి రక్షించవచ్చు. 11 కేవీ, 33 కేవీ విద్యుత్ తీగల కింద, 132/220 కేవీ సరఫరా టవర్ల దగ్గర్లో నిలబడకూడదు. పెద్దపెద్ద చెట్ల కింద, సముద్రపు ఒడ్డున నిలబడొద్దు. విద్యుత్ వాడకం ఉన్న ప్రతిచోట ఎర్తింగ్ సిస్టం పాటించాలి. పిడుగుపడే సమయంలో విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించడం కూడా మంచిది కాదు. చదవండి: సోషల్ మీడియా 'కట్'.. వినోదానికే 'నెట్'..నివేదికలో ఆసక్తికర విషయాలు.. -
Telangana: మరో రెండు రోజులు వడగళ్ల వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ఈ పది మినహా మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడ, దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని వివరించింది. తగ్గిన ఉష్ణోగ్రతలు వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదవుతాయని వెల్లడించింది. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలంలో 35.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 18.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 2.97 సెంటీమీటర్ల సగటు వర్షపాతం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.97 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జనగామ జిల్లాలో 6.47 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లాలో 5.76, వరంగల్ జిల్లాలో 5.08, కరీంనగర్ జిల్లాలో 4.42, మంచిర్యాల జిల్లాలో 4.0, జగిత్యాల జిల్లాలో 4.0 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. -
టీఎంసీ ర్యాలీపై పిడుగు.. కార్యకర్త మృతి.. 25 మందికి గాయాలు..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బంకుర జిల్లా ఇందాస్లో టీఎంసీ ఆదివారం నిర్వహించిన ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. ర్యాలీ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో దాని కింద ఉన్న ఓ కార్యకర్త అక్కడికక్కడే కుప్పకూలాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వర్షం పడుతుండటంతో సభ పక్కనే ఉన్న ఈ చెట్టుకిందకు వెళ్లి కార్యకర్తలు తలదాచుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు పిడుగుపడి చెట్టుకూలిపోవడంతో దాని కింద ఉన్న 25 మంది గాయపడ్డారు. వీరందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం: పాక్ నుంచి మెసేజ్‌లు.. ఆ 14 యాప్స్ బ్లాక్) కాగా.. ఈ ఘటనపై టీఎంసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపింది. తప్పకుండా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. గాడపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పింది. ఈమేరకు ట్వీట్ చేసింది. ఈ ర్యాలీకి సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎంసీ యుత్ లీడర్ దేవాన్షు భట్టాచార్య ప్రసంగిస్తుండగా పిడుగు ఘటన జరిగింది. దీంతో వేదికపైనే ఉన్న అభిషేక్.. క్షతగాత్రులకు సాయం చేయాలని ఇతర కార్యకర్తలను కోరారు. చదవండి: మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వడగళ్ల వానలు: వాతావరణ శాఖ -
Telangana: రెండ్రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి వానలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ విద ర్భ నుంచి మరఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉత్తరాది జిల్లాలు, తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకట్రెండు చోట్ల వడగండ్ల వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 37.0 డిగ్రీల సెల్సియస్‌గా నమో దైంది. వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
ఆకాశంలో ఎరుపు రంగు వలయాకృతి.. గ్రహాంతరవాసుల వాహనమా?
రోమ్: ఎరుపు రంగులో వలయాకృతిలో కన్పిస్తున్న ఈ దృశ్యం ఇటలీలో ఇటీవల కలకలం రేపింది. విస్తుగొలిపే ఈ వింత వలయం సెంట్రల్ ఇటలీలో ఆల్ఫ్స్ పర్వతాల నుంచి అడ్రియాటిక్ సముద్రం దాకా ఆకాశంలో ఏకంగా 360 కిలోమీటర్ల పొడవున విస్తరించి కనువిందు చేసింది. అచ్చం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యాన్ని తలపించిన ఈ వలయం గ్రహాంతరవాసుల అంతరిక్ష వాహనం అయ్యుండొచ్చని కొందరు భావించారు. సైంటిస్టులు మాత్రం అదేమీ కాదని స్పష్టం చేశారు. కాంతి ఉద్గార క్రమంలో అతి తక్కువ ఫ్రీక్సెన్సీతో కూడిన అడ్డంకులు ఇందుకు కారణమని వారు వివరించారు. ఎల్్వగా పిలిచే ఈ దృగ్విషయం ఒక్కోసారి ఇలాంటి విచిత్రాకారపు వెలుతురు వలయాలకు దారి తీస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ఎల్్వలు తుపాను మేఘాలకు పై భాగాల్లో విడుదలయ్యే అత్యంత హెచ్చు విద్యుదయస్కాంత శక్తి వల్ల పుట్టుకొస్తుంటాయట. ఫొటోలోని ఎరుపు వలయం పుట్టుకకు సెంట్రల్ ఇటలీకి దాదాపు 285 కిలోమీటర్లు దక్షిణాన చెలరేగిన తుపాను సందర్భంగా చోటుచేసుకున్న శక్తిమంతమైన మెరుపు కారణమని వారు చెప్పారు. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ వాల్తెయిర్ బినొటో దీన్ని కెమెరాలో బంధించారు. ఆకాశంలో ఇలాంటి ఆకృతులను ఆయన తొలిసారిగా 2017లో ఫొటో తీశారట. అప్పటి నుంచీ ఇదే పనిలో ఉన్నట్టు చెబుతున్నారాయన. -
వదలని వానలు.. మరో మూడురోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. దాదాపు వారం రోజుల నుంచి వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, కొన్నిచోట్ల భారీగాను వర్షాలు పడుతున్నాయి. అంతర్గత తమిళనాడు నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ప్రస్తుతం రాయలసీమ నుంచి దక్షిణ జార్ఖండ్ వరకు తెలంగాణ, ఒడిశాల మీదుగా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం అనకాపల్లి, కాకినాడ, ఎస్పీఎస్సార్ నెల్లూరు, కృష్ణాజిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లిలో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సామర్లకోటలో 7.8 సెంటీమీటర్లు, యలమంచిలిలో 7.7, కావలిలో 4.6, గుడివాడలో 4.2, మల్లాదిలో 3.7, ఉప్పలపాడులో 3.5 సెంటీమీర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
AP: ఆ జిల్లాలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో మూడు రోజులపాటు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో శని, ఆది వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్ వరకు రాయలసీమ, తెలంగాణ, విదర్భల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించిన మరో ద్రోణి శుక్రవారం బలహీనపడింది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, యానాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లాల్లో, ఆదివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు కొన్నిచోట్ల పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో త్రిపురాంతకం కోట (తిరుపతి)లో 7.3 సెంటీమీటర్లు, అడ్డతీగల (అల్లూరి సీతారామరాజు)లో 5, రేపల్లె (బాపట్ల)లో 4.8, పోతిరెడ్డిపాలెం (కృష్ణా)లో 4.7, ఎన్.కండ్రిగ (చిత్తూరు), గుడ్లదోన (ఎస్పీఎస్సార్)లో 3.8, శివరాంపురం (అన్నమయ్య)లో 3.7, గుంటూరు పశ్చిమలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో, నంద్యాల జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం వడగండ్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి పిడుగుల శబ్దాలకు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. -
పేద బతుకులు.. పిడుగుకు సమిధలు! ప్రమాదకర జోన్లో ఆ 13 జిల్లాలు
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వెలుగు.. చీకటిని చీల్చి బతుకుపై భరోసానిచ్చే ఓ ఊపిరి! కానీ అదే మిరుమిట్లు గొలుపే వెలుగు నిరుపేదల బతుకును చీకటిలోకి నెడుతోంది. తీరని శోకాన్ని మిగుల్చుతోంది. ఆకాశంలో మేఘాల మధ్య జరిగే ఘర్షణ.. పిడుగుల గర్జనగా కోట్ల వోల్టుల విద్యుత్ ప్రవాహంతో నిరుపేద రైతుకూలీల ప్రాణాలు తీస్తోంది. ప్రమాదాన్ని నివారించలేని విపత్తు నిర్వహణ సంస్థల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికే అరవై రెండు మంది పిడుగుపాటుతో పంట పొల్లాల్లోనే ప్రాణాలు వదలగా.. గత ఆరేళ్లలో ఏకంగా 398 మంది కన్నుమూశారు. తెలంగాణలో ఏటా సగటున లక్షా యాభైవేల నుండి రెండు లక్షల వరకు పిడుగులు పడుతున్నట్టు అంచనా. రైతులు, కూలీలు పంట పొలాల్లో ఎక్కువ సమయం గడిపే అక్టోబర్‌లోనే ఎక్కువగా పిడుగులు పడుతున్నాయి. అందులో 90శాతం గ్రామాల్లోనే పడుతుండగా.. మరణిస్తున్న వారిలో నూటికి 96 మంది రైతులు, కూలీలే ఉంటున్నారు. ఊహించని విపత్తుతో మరణించిన మెజారిటీ కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కనీస ఆర్థిక సహాయం అందడం లేదు. భూమి ఉన్న రైతులు మరణిస్తే రైతు బీమా వర్తిస్తుండగా.. భూమి లేని నిరుపేదలు ఏళ్ల తరబడి సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రమాదకర జోన్లో 13 జిల్లాలు దేశంలో అత్యధికంగా పిడుగులు పడుతున్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. గత ఏడాది అక్కడ 6,55,788 పిడుగులు పడితే.. తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 5,76,498, మహారాష్ట్రలో 5,28,591 పిడుగులు పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మన పొరుగున ఉన్న కర్నాటక ఎనిమిదో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ పదకొండో స్థానంలో, తెలంగాణ 1,49,336 పిడుగులతో పద్నాలుగో స్థానంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో చూస్తే.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి, కొత్తగూడెం, మెదక్, సిద్దిపేట జిల్లాలు అత్యధిక పిడుగు పీడిత ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. గత ఆరేళ్లలో అత్యధికంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 90 మంది పిడుగుపాటుతో చనిపోయారు. వరంగల్ జిల్లాలో 59, ఆదిలాబాద్‌లో 52, మెదక్‌లో 27 మంది చనిపోయారు. పిడుగులు 96 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే పడుతుండగా.. మృతుల్లో 98శాతం రైతులు, కూలీలే. మొత్తంగా గత ఆరేళ్లలో తెలంగాణలో 398 మంది నిరుపేదలు మరణించగా.. మరో 1,220 మంది గాయాలపాలయ్యారు. (చదవండి: రేకుల పైకప్పు గదిలో... నిద్రించిన ప్రధాని మోదీ) నివారించే అవకాశమున్నా.. పిడుగుపాటు మరణాలను నివారించే అవకాశమున్నా.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టం కనిపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. పిడుగుపాటు నష్టాన్ని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా అధునాతన అరెస్టర్లు, కండక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. పుణె ఐఐటీ దామిని అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అది 20 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుపాటు ప్రమాదంపై ముందే అప్రమత్తం చేస్తుంది. దీనికితోడు ఎర్త్ నెట్వర్క్ అనే అమెరికా సంస్థ సైతం అధునాతన పరికరాలను మార్కెట్లోకి తెచ్చింది. పలు రాష్ట్రాల్లో గ్రామ, మండల యంత్రాంగాలు వీటి సందేశాలతో ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం విపత్తుల నిర్వహణ శాఖ నిర్లక్ష్యం భారీ నష్టానికి కారణం అవుతోంది. పొరుగున ఉన్న ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మెరుగైన పద్ధతులతో పేదల ప్రాణాలు కాపాడుతున్నారు. కోట్ల వోల్టుల శక్తితో పిడుగులు మేఘాల నుంచి ఒక్కసారిగా విడుదలయ్యే ఎలక్ట్రాన్లు 15–30 కోట్ల వోల్టుల విద్యుత్ ప్రవాహంతో భూమ్మీదకు దూసుకువచ్చే శక్తినే ‘పిడుగు’ అంటారు. ఒక మేఘం నుంచి మరో మేఘానికి ప్రసారమయ్యే పిడుగుల వల్ల ఆకాశంలో ఎగిరే విమానాలకు ముప్పు ఉంటుంది. మేఘం నుంచి భూమిని తాకే (క్లౌడ్ టు గ్రౌండ్) పిడుగులు మనుషులు, ఇతర జీవజాలానికి ముప్పు కలిగిస్తున్నాయి. పూరి గుడిసెలో బంగారమ్మ.. వనపర్తి జిల్లా బాలకిష్టాపూర్‌లో జూన్ 6, 2017న పడిన పిడుగులు ఒకే ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములను పొట్టనపెట్టుకున్నాయి. ముళ్ల పొదలు తొలగించే క్రమంలో ఆకాశమంతా ముప్పై సెకన్లపాటు వెలుగును చిమ్ముతూ పడిన పిడుగుతో తెలుగు లక్ష్మన్న (40), ఈదన్న (52), పరమేశ్ (27) ప్రాణాలు వదిలారు. ఊరంతా కన్నీరు పెట్టింది. ఆదుకుంటామంటూ ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు ఆపద్బంధు కింద సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఎలాంటి సాయం అందలేదు. ఆ ముగ్గురిలో ఈదన్న, లక్ష్మన్న కుటుంబాలకు పాత ఇళ్లయినా ఉండగా.. చివరివాడైన పరమేష్‌కు సొంత ఇల్లు కూడా లేదు. ఆయన భార్య బంగారమ్మ(24) రోజు కూలీకి వెళ్తూ.. సగం కూలిన గుడిసెలోనే కాలం వెళ్లదీస్తోంది. ఇలాంటి విషాద గాధలు ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలో ఇంకా ఎన్నో ఉన్నాయి. (చదవండి: రైలుకు ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కున్న మహిళ.. వీడియో వైరల్) కాలం కాటేసినా.. కదలని యంత్రాంగం అక్టోబర్ 9, 2021లో ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ పరిధిలోని బుర్కపల్లిలో సోయా చేనులో పనిస్తుండగా పిడుగుపాటుతో గరణ్ సింగ్ (45), ఆయన తమ్ముడి భార్య ఆశాబాయి (30) మరణించారు. విపత్తు పరిహారం కోసం బాధిత కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. త్రీమెన్ కమిటీ విచారణ పూర్తయినా ఇంకా పరిహారం అందలేదు. తక్షణ కార్యాచరణ అవసరం జాతీయ స్థాయిలో ప్రధాని చైర్మన్‌గా, నిపుణులు వైస్ చైర్మన్‌గా ఉండే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) తరహాలోనే రాష్ట్రస్థాయిలో సీఎం చైర్మన్‌గా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పనిచేయాలి. మన రాష్ట్రంలో విపత్తుల నిర్వహణను మర్చిపోయారు. వరద వచ్చాక సహాయక చర్యలు చేస్తున్నారు. అలాంటిది ముందే పిడుగుపాటు నివారణ చర్యలు ఎజెండాలోనే లేకపోవడం దారుణం – మర్రి శశిధర్‌రెడ్డి, ఎన్డీఎంఏ మాజీ వైస్ చైర్మన్ నివారించదగిన ప్రమాదాలు.. పిడుగు అనేది వంద శాతం నివారించదగ్గ విపత్తు. కానీ తెలంగాణలో పిడుగులతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అందుబాటులోకి వచ్చిన అరెస్టర్లు, కండక్టర్లతో పిడుగుపాటు మరణాలను అరికట్టవచ్చు. పిడుగుపాటు సమయాలను ముందే తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. ఇలాంటి చర్యల్లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. తెలంగాణలో ఆ ప్రయత్నాలేవీ మొదలుకాలేదు. తగిన సలహాలు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. – కల్నల్ సంజయ్ శ్రీవాస్తవ, క్లైమైట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్, న్యూఢిల్లీ -
Crime News: ఏలూరులో పెను విషాదం
సాక్షి, ఏలూరు: జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. చింతలపూడి నియోజకవర్గం లింగంపాలెం మండలం బోగోలులో పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు. జామాయిల్ తోటలో పనికి వచ్చారు ఆ కూలీలంతా. ఈ క్రమంలో.. సుమారు 30 మంది కూలీలు.. అక్కడే టెంట్లు వేసుకుని ఉంటున్నారు. జామాయిల్ కర్రలు తొలగిస్తుండగా పిడుగుపడడంతో.. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను 108లో ఏలూరు ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్లిక్: గుడ్ న్యూస్.. కాకినాడ సెజ్ భూములు.. రైతులకు రీ రిజిస్ట్రేషన్ -
అదిగో.. పిడుగు!
సాక్షి, అమరావతి: నడి వేసవిలో పిడుగులు హడలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై పిడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఆవరించిన ఉపరితల ద్రోణి, దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు, పిడుగులు పడుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. గత మూడు రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు పడగా మంగళవారం ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో గత మార్చి నుంచి ఇప్పటి వరకు పది మంది పిడుగుపాటుతో మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ నిర్థారించింది. అన్నమయ్య, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులు పడుతున్నాయి. ఈ మూడు నెలల్లోనే.. ఏప్రిల్, మే, జూన్ నెలలు పిడుగుల సీజన్. సంవత్సరం మొత్తం మీద 10 నుంచి 15 లక్షల పిడుగులు పడితే ఈ మూడు నెలల్లోనే 5 నుంచి 7 లక్షల పిడుగులు పడతాయి. శాటిలైట్ సమాచారం, ఇతర మార్గాల ద్వారా క్యుములోనింబస్ మేఘాలను బట్టి పిడుగుల సంఖ్యను లెక్కిస్తారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2018లో అత్యధికంగా 137 మంది పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఎలా ఏర్పడతాయి? ఉత్తర భారత దేశం నుంచి వీచే పొడి గాలులు, సముద్రం నుంచి వచ్చే తడి గాలులు కలసి మేఘాలుగా ఏర్పడతాయి. నిటారుగా ఉండే వీటిని క్యుములోనింబస్ మేఘాలుగా పిలుస్తారు. అవి ఏర్పడినప్పుడు కచ్చితంగా పిడుగులు పడతాయి. ఈ మేఘాల కిందభాగంలో తడి, పైభాగంలో పొడి గాలులు ఉంటాయి. ఒక మేఘంపైన మరో మేఘం ఆవరించి ఢీ కొన్నప్పుడు తడి, పొడి గాలుల ప్రతిస్పందనకు పిడుగులు పడతాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండాలి. సముద్రం, కొలనులు, సరస్సులు, చెరువులకు దూరంగా వెళ్లాలి. రేకు, లోహంతో చేసిన నిర్మాణాల వద్ద ఉండకూడదు. ఉరుముల శబ్దం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసేవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. కారు, బస్సులో ఉంటే అన్ని డోర్లు మూసివేయాలి. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నప్పుడు మెడ వెనుక జుత్తు నిక్కబొడవడం లేదా చర్మం జలదరింపు ఉంటే పిడుగుపాటుకు సంకేతంగా భావించి అప్రమత్తం కావాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉంటే రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని తల నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోవాలి. ఇంట్లో ఉంటే కిటికీలు, తలుపులు మూసివేయాలి. పిడుగుపాటు సమయంలో విద్యుత్, ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. స్నానం, చేతులు కడగడం, నీటిలో గడపడం చేయకూడదు. మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వేలాడుతున్న విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు, ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి. వాహనంలో ఉంటే లోహపు భాగాలను తాకరాదు. పిడుగును గుర్తించే సెన్సార్లు ఏ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందో హెచ్చరిస్తూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు ప్రజలను ముందే అప్రమత్తం చేస్తోంది. అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రంలో పిడుగుల సమాచారాన్ని తెలుసుకునేందుకు 11 సెన్సార్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
చార్మినార్ చెక్కుచెదరకుండా.. పిడుగుపాటుకు గురికాకుండా లైటనింగ్ కండక్టర్
సాక్షి, హైదరాబాద్: నాలుగు శతాబ్దాలకుపైగా నవనవోన్మేషం.. నగరానికే తలమానికం.. అపురూప కట్టడం మన చార్మినార్. దీనిని చెక్కుచెదరకుండా కాపాడేందుకు కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) రక్షణ చర్యలు తీసుకుంటోంది. పిడుగుపాటు ఇతర ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే దిశగా లైటనింగ్ కండక్టర్‌ను ఏర్పాటు చేస్తోంది. చారిత్రక కట్టడం దెబ్బతినకుండా.. పిడుగుపాటుకు గురైనా నష్టం వాటిల్లకుండా ఈ కండక్టర్ నిరోధించనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. చార్మినార్ అంతర్భాగంలో ఎలక్ట్రికల్ కండక్టర్ల ఏర్పాటు కోసం గోతుల తవ్వకాలు చేపట్టింది. సమాచార లోపం కారణంగా స్థానికులు.. సొరంగాల తవ్వకాలు జరుపుతున్నారని పొరబడి ఆందోళనకు దిగారు. చార్మినార్ కట్టడం పరిరక్షణలో భాగంగా నాలు గు మినార్లతో పాటు మరిన్ని అంతర్గత నిర్మాణాలకు ప్రకృతి పరంగా, ఇతర ప్రమాదాల కా రణంగా నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టా మని ఆర్కియాలజీ సూపరింటెండెంట్ ఎస్.ఎ.స్మిత, అధికారులు ఎస్. కుమార్, రాజేశ్వరి ‘సాక్షి’కి తెలిపారు. లైటనింగ్ కండక్టర్ల ఏర్పాటుకు చేస్తున్న తవ్వకాల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, కట్టడాన్ని పరిరక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవాస్తవాలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రబ్బరు ష్యూస్ వల్లే బ్రతికాను
క్వీన్స్‌ల్యాండ్: అనుకోని విధంగా అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాల్లో చాలా మటుకు బయటపడటం కష్టం. ఒకవేళ బయటపడితే చాలా అదృష్టవంతులుగా భావింస్తాం జౌనా. అచ్చం అలాంటి భయంకరమైన ప్రమాదం ఆస్ట్రేలియాలో సంభవించింది. వివరాల్లోకెళ్లితే ఆస్ట్రేలియాకు చెందిన టాలిన్ రోస్ అనే బాలుడు తన తండ్రితో కలిసి కారులో సమీపంలోని తన పాఠశాలకు వస్తాడు. (చదవండి: కోవిడ్ పేరు చెప్పి రుణం తీసుకున్నాడు...కటకటాల పాలయ్యాడు) ఆ తర్వాత కారు దిగి నెమ్మదిగా తన పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తాడు. అంతే ఒక్కసారిగి ఆ యువకుడి పిడుగుపాటుకి గురవుతాడు. ఈ మేరకు శక్తివంతమైన మెరుపు ఒక మెటల్ స్తంభం నుండి ఆ యువకుడి శరీరంలోకి చొచ్చుకుపోయి కాల్చి అతని చేతి గుండా బయటకు వస్తుంది. దీంతో ఆ యువకుడు పాఠశాల వెలుపల నేలపైకి విసిరిపడతాడు. అంతేకాదు అతని కండరాలు బిగుసుకుపోయి, పూర్తిగా మొద్దుబారిపోతాయి. అయితే అదృష్టవశాత్తు అతని తండ్రి కారులోంచి ఆ దృశ్యాన్ని చూసి వెంటనే అప్రమత్తమై అంబులెన్స్‌కి సమాచారం ఇస్తాడు. కానీ టాలిన్ మాత్రం షాక్‌కి గురై ఏమి వినలేని స్థితిలో ఉండిపోతాడు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంటూ షాక్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆసుపత్రికి తరలిస్తారు. ఈ మేరకు డాక్టర్లు టాలిన్ ధరించిన రబ్బరు ష్యూస్ ఆ శక్తివంతమైన విద్యుదావేశాన్ని శోషించుకోవటంతో సులభంగా బయటపడగలిగాడని చెప్పారు. పిడుగుపాటు జరిగినపుడు ఇలా సజీవంగా ఉండటం జరగదని టాలిన్ చాలా అదృష్టవంతుడంటూ ఆస్ట్రేయిన్ న్యూస్ ఏజెన్సీ డైలీమెయిల్ పేర్కొంది. అంతేకాదు ఆ మెరుపు దాడి చేసినప్పుడు ఏర్పడిన కాలిన మచ్చలు పాదాలపై భుజాలపై ఉన్నాయి. (చదవండి: 'గ్రీన్ పవర్ 'పేరుతో ఓలా, మహేంద్ర కంపెనీల్లో మొత్తం మహిళా బృందాలే) -
‘నైరుతి’కి ఆదిలోనే అంతరాయం!
సాక్షి, విశాఖపట్నం/పొదలకూరు: నైరుతి రుతు పవనాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగులుతోంది. కేరళను తాకిన రుతు పవనాలకు తుపాను రూపంలో ప్రతికూల పరిస్థితి ఏర్పడబోతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండ్రోజుల్లో తుపానుగా బలపడి, ఉత్తర వాయవ్య దిశగా పయనించనుంది. దీనివల్ల గాలిలోని తేమ పాకిస్తాన్ వైపు వెళ్లి నైరుతి రుతు పవనాల విస్తరణను అడ్డుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి రుతు పవనాలు ప్రవేశించాక అల్పపీడనాలు ఏర్పడితే అవి మరింతగా విస్తరించడానికి దోహదపడతాయి. అయితే, ప్రస్తుతం అరేబియా సముద్రంలోని అల్పపీడనం రెండ్రోజుల్లో తుపానుగా బలపడి పాక్ వైపు పయనించే అవకాశం ఉండటంతో రుతు పవనాల్లో చురుకుదనం తగ్గి ఇతర ప్రాంతాలకు విస్తరించటంలో జాప్యం చోటుచేసు కోనుంది. మరోవైపు అల్పపీడన ద్రోణులు ఏర్పడక పోవడం కూడా వర్షాలకు ఆటంకం ఏర్పడనుంది. ఇది రాష్ట్రంలోకి రుతు పవనాల ప్రవేశంపై ప్రభావం చూపు తుందని వాతావరణ శాఖ మాజీ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఇదిలావుంటే.. నైరుతి రుతు పవనాలు రానున్న 24 గంటల్లో తమిళనాడు, నైరుతి, ఆగ్నేయ, ఈశాన్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం మరింతగా దిగువకు వస్తే రుతు పవనాల్లో కదలిక వస్తుందని, రాష్ట్రంలోకి వాటి ప్రవేశానికి వీలుంటుందని మురళీకృష్ణ చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో రెండు మూడు రోజుల్లో వర్షాలకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు మూడు రోజులూ ఉక్కపోత అధికంగా ఉంటుందని తెలిపారు. నేడు ఉష్ణ తీవ్రత.. పిడుగుల వాన సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నెల్లూరు జిల్లాలో ముగ్గుర్ని బలిగొన్న పిడుగులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతోపాటు పిడుగులు పడ్డాయి. వీటి బారినపడి ఓ రైతు, ఓ మహిళతోపాటు గిరిజనుడు మృతి చెందారు. నెల్లూరు రూరల్ మండలం కందమూరు గ్రామానికి చెందిన రైతు పల్లం శ్రీనివాసులు (45) పిడుగుపాటుకు గురయ్యాడు. ఓజిలి మండలం అత్తివరం గ్రామానికి చెందిన పశువుల కాపరి కవిత (24) పిడుగుపాటుకు గురై మరణించింది. కలిగిరి మండలం పోలంపాడు సమీపంలోని పొలంలో పని చేసుకుంటుండగా దాసరి సుధాకర్ (35) అనే గిరిజనుడు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాడు. -
నేడు.. రేపు పిడుగుల వాన!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకపక్క అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోపక్క ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర కర్నాటక వరకు విదర్భ, మరఠ్వాడా, మధ్య మహారాష్ట్రల మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు కూడా పడనున్నాయి. అదే సమయంలో రాయలసీమలో గంటకు 30–40, కోస్తాంధ్రలో 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. ఇలావుండగా రాయలసీమలో రానున్న రెండు రోజులు వడగాడ్పులు కొనసాగనున్నాయి. కోస్తాంధ్రలో సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గడచిన 24 గంటల్లో సీతానగరంలో 5, పార్వతీపురం, పాలకొండలలో 4, సీతారాంపురం, దువ్వూరు, వీరఘట్టంలలో 3, పాతపట్నం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కంబం, బలిజపేట, పులివెందుల, చాపాడుల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది. పిడుగు పాటుకు ఇద్దరు గొర్రెల కాపరుల మృతి పెద్దపంజాణి / గురజాల: చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో బుధవారం పిడుగు పాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు. కోగిలేరు పంచాయతీ బసవరాజుకండ్రిగ గ్రామానికి చెందిన అబ్బన్న కుటుంబ సభ్యులు గొర్రెలు మేపుకొంటూ జీవనం చేస్తున్నారు. రోజులాగే అబ్బన్న భార్య నాగమ్మ(68), మనవడు శశికుమార్(17)తో కలిసి గొర్రెలను సమీపంలోని పొలాలకు తీసుకెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ఇద్దరూ సమీపంలోని మామిడి చెట్ల కిందకు వెళ్లారు. సమీపంలో పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పరిసర ప్రాంతంలోని రైతులు మృతదేహాలను చూసి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు.. పెద్దపంజాణి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గుంటూరు జిల్లా గురజాల మండలంలో బుధవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 గంటల వరకు వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. 31.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడా చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. అదే సమయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం వడదెబ్బ తగిలి నలుగురు మృత్యువాత పడ్డారు. -
పిడుగులు పడతాయ్.. జాగ్రత్త!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు తిరోగమనం మొదలయ్యాక రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి తేలికపాటి వర్షాలు కురిసేవి. కానీ ఇప్పుడు అల్పపీడన ద్రోణులు ఏర్పడుతున్నాయి. నైరుతి నుంచి దక్షిణ బంగాళాఖాతం మధ్య మహారాష్ట్ర వరకు తమిళనాడు, కర్ణాటక మీదుగా ఒక ద్రోణి, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో మరొక ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. ద్రోణుల వల్ల పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదై క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఆకస్మిక వర్షాలతో పాటు మెరుపులు, ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడచిన 24 గంటల్లో చింతలపూడిలో 7 సెం.మీ, సంతమగుళూరులో 5, అచ్చంపేటలో 3 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
ఏపీలో పెనుగాలులు, పిడుగుల వానలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతికూల వాతావరణం ప్రతాపం చూపనుంది. రుతుపవనాల ఆగమనానికి ముందు ఒక్కసారిగా అలజడి రేగనుంది. భారీ గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం తమిళనాడుకు ఆవల సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈస్ట్‌వెస్ట్ షియర్ జోన్(తూర్పు, పశ్చిమ గాలుల కలయిక) కూడా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోవైపు అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి తేమ గాలులు, ఉత్తరాది నుంచి వేడి గాలులు వీస్తున్నాయి. వీటన్నిటి ప్రభావంతో రాష్ట్రంలో క్యుములోనింబస్ మేఘాలేర్పడి పెనుగాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఈ పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం తెలిపింది. ఈ మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షం, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రుతుపవనాల ప్రవేశానికి ముందు ఇలాంటి వాతావరణ పరిస్థితులు సహజమేనని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. కాగా.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా క్షీణించాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా జంగమహేశ్వరపురంలో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ 39 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలే రికార్డయ్యాయి. గత 24 గంటల్లో అమరాపురంలో 13, ఆత్మకూరులో 9, తిరువూరు 8, అవుకు 7, చిలమత్తూరు, లేపాక్షి, గజపతినగరంలలో 6, బలిజపేట, రోళ్ల, వెంకటగిరి, పలమనేరుల్లో 5, పాడేరు, చోడవరంలలో 4 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
భూమిపై ఏంటా వెలుగు..?
వాషింగ్టన్ : ఈ ఫొటోలోని వెలుగులను చూశారా?. అర్థరాత్రి అంతరిక్షం నుంచి చిత్రీకరించిన ప్రపంచ వెలుగు జిలుగులు కావవి. ప్రకృతి ప్రకోపానికి నిదర్శనాలు. ఉత్తర, దక్షిణ అమెరికాల్లో సంభవించిన భారీ మెరుపులకు సంబంధించిన వెలుగు అది. ఇందుకు సంబంధించిన ఫుటేజిని జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలక సంస్థ(ఎన్ఓఏఏ) విడుదల చేసింది. జీవోఈఎస్-17 ఉపగ్రహం ద్వారా ఈ వీడియోను రికార్డు చేసినట్లు ఎన్ఓఏఏ వెల్లడించింది. ఈ నెల 9న ఈ వీడియోను ఉపగ్రహం రికార్డు చేసినట్లు పేర్కొంది. -
పొంచివున్న పిడుగుల గండం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో శని, ఆదివారాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురవవచ్చని పేర్కొంది. ప్రస్తుతం కొమరిన్ ప్రాంతం నుంచి కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో అనేకచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఎక్కడా వేసవి తీవ్రత కనిపించలేదు. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురంలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. గడిచిన 24 గంటల్లో కోడూరులో 15, తిరుమలలో 10, కదిరి, ఓబులదేవరచెరువు, నూజివీడు, నల్లమడ, పాకాలల్లో 7, అవనిగడ్డ, ముండ్లమూరు, వింజమూరు, ఆళ్లగడ్డ, తిరుపతిల్లో 6, పెనగలూరు, చిత్తూరు, ముద్దనూరు, చిత్తూరుల్లో 5, బెస్తవారిపేట, చింతపల్లి, తెనాలి, పులివెందల, ధోన్, నందికొట్కూరుల్లో 4 సెం.మీల వర్షపాతం నమోదైంది. -
పిడుగు నుంచి కాపాడిన యాప్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో పడుతున్న పిడుగుల కారణంగా 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. గత మంగళవారం ఒక్క రోజే ఏపీలో 41,025 పిడుగులు పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఏదో ఒక చోట పిడుగులు పడుతూనే ఉన్నాయి. మిన్ను విరిగి మనమీదే పడ్డట్టుగా ఉరుములు.. పిడుగులు.. భయానక వాతావరణాన్ని సృష్టించినప్పటికి మృతుల సంఖ్య తక్కువగా ఉండటానికి ఓ మొబైల్ యాప్ కారణం అంటున్నారు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు. కుప్పం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, ఇస్రో అధికారుల సహాయంతో లైటెనింగ్ ట్రాకర్ సిస్టమ్ యాప్‌ని రూపొందించారు. విద్యుదయస్కాంత తరంగాలను విశ్లేషించడం ద్వారా ఉరుములు, పిడుగులు ఏ ప్రాంతాల్లో పడతాయో ముందే గుర్తించగలుగుతారు. ఎవరైతే ఈ యాప్‌ని వినియోగిస్తున్నారో వారికి 45 నిమిషాల ముందుగానే సరిగా ఏ ప్రాంతంలో పిడుగులు పడుతాయో సమాచారం అందుతుంది. వాతావరణ నిపుణుడు కెటీ కృష్ణ మాట్లాడుతూ.. కేవలం లైటింగ్ ట్రాకింగ్ యాప్ సహాయంతో చాలా మంది ప్రాణాలు రక్షించగలిగామని తెలిపారు. ఈ యాప్ సహాయంతో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ తరపున 20.14 లక్షల మంది మొబైల్ వినియోగదారులకి ఊరుములు, పిడుగులకు సంబంధించిన ముందస్తు సమాచారం అందజేశామని తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ సాఫ్ట్‌వేర్‌ని(వజ్రపథ్) వినియోగించామన్నారు. ప్రస్తుతానికి ఇది కేవలం బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని దీనిని ఇతర మొబైల్ సర్వీస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. -
ప్రాణాలు తోడేసిన పిడుగుల వాన
సాక్షి, చిత్తూరు/శ్రీకాకుళం పాతబస్టాండ్/భోగాపురం/తెర్లాం/పూసపాటిరేగ: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వడగండ్లు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు గురై విజయనగరం జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మరణించారు. చిత్తూరు జిల్లాలో పిడుగుపాటుకు గురై 46 మేకలు మరణించాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజాపులోవ గ్రామానికి చెందిన దుక్క రామయ్యమ్మ (45), మురపాల శ్రావణి (9) చెరువుగట్టుపై నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించారు. శ్రావణికి పంటి నొప్పి ఎక్కువగా ఉండడంతో అమ్మమ్మ అయిన రామయ్యమ్మ తగరపువలసలో ఉన్న ఆస్పత్రికి బయలుదేరింది. చెరువుగట్టుపై నడిచి వెళ్తుండగా వారికి సమీపంలో పిడుగు పడడంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. తెర్లాం మండలంలోని సుందరాడ గ్రామానికి చెందిన దాకారపు ఆదినారాయణ (35) గ్రామానికి సమీపంలో మొక్కజొన్న గింజలు ఎండబెట్టాడు. మంగళవారం ఉదయం 11గంటల సమయంలో వర్షం రావడంతో గింజలు ఎత్తేందుకు వెళ్లాడు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పిడుగుపడడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.రెల్లివలస గ్రామానికి చెందిన రౌతు గౌరినాయుడు (22) సమీపంలోని చంపావతినదిలో గేదెలు కడుగుతుండగా పిడుగుపడి అక్కడకక్కడే మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం పనసనందివాడలో వంట మనిషి దుర్గారావు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. రేగిడి మండలంలో ఉపాధి పనులకు వెళ్లి వస్తున్న కండ్యాం గ్రామానికి చెందిన టి.జయమ్మపై పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయింది. చిత్తూరు జిల్లాలో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలమనేరు, రొంపిచెర్ల, బి.కొత్తకోట వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. పెద్దపంజాణి మండలం పెద్దకాప్పల్లి పంచాయతీ తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు 46 మేకలు చనిపోయాయి. -
పిడుగుపాటుకు నలుగురు మృతి
కూసుమంచి/తిరుమలాయపాలెం(పాలేరు): ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పిడుగుపాటుకు నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో భార్యాభర్తలు ఉన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన దంపతులు జాలె మల్లేశ్ (25), విజయలక్ష్మి(22) మంగళవారం మిర్చి తోటకు మందు కొట్టేందుకు వెళ్లారు. ఈ లోగా వర్షం రావడంతో చెట్టుకిందికి వెళ్లారు. వారితో వెళ్లిన కూలీలూ అదే చెట్టుకిందికి రావడంతో భార్యాభర్తలు మరో చెట్టు కిందికి వెళ్లారు. ఆ చెట్టుపై పిడుగు పడటంతో ఇద్దరూ చనిపోయారు. తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువు పంచాయతీ పరిధిలోని రమణా తండాకు చెందిన బాదావత్ జగ్మాల్ (35) భూమి కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేస్తున్నాడు. భార్య భద్రమ్మ కలుపుతీస్తుండగా, జగ్మాల్ పశువులకు మేత వేస్తూ వేపచెట్టు కిందికి వెళ్లాడు. ఈ చెట్టుపై పిడుగు పడడంతో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం ఆంబోతుతండాకు చెందిన ఆంబోతు సుక్యా కుమారుడు అరవింద్(13) హైదరాబాద్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు రావడంతో స్వగ్రామానికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం తండాలోని తమ పొలం వద్దకు వెళ్తుండగా వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగుపడి అరవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. -
పిడుగు పడి ఒకరు మృతి..
విజయనగరం: పొలంలో పనిచేస్తున్న దంపతులపై పిడుగు పడింది. ఈ ఘటనలో భర్త చనిపోగా భార్య పరిస్థితి విషమంగా మారింది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం పూడివాణిపాలెం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిల్లి అప్పాలు(55), అమ్మాయిలు(48) దంపతులు తమ పొలంలో పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా వాన మొదలైంది. అదే సమయంలో పెనుశబ్ధంతో పిడుగు వారిపై పడింది. పెను షాక్‌కు గురైనా అప్పాలు అక్కడిక్కడే చనిపోగా అమ్మాయిలు తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
పిడుగుపాటుకు ఐదుగురు మృతి
- మృతుల్లో బీటెక్ విద్యార్థి - మరో ఐదుగురికి గాయాలు మంచిర్యాల/నిర్మల్: పిడుగుపాటుకు శనివారం మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకరు బీటెక్ విద్యార్థి ఉన్నాడు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన కూలీలు చౌదరి చంద్రయ్య, చిడం బాపు, చౌదరి శంకర్, ఎల్కరి శంకర్, జిల్లెడ గ్రామానికి చెందిన గౌతూరి మదునయ్య శనివారం పెద్దచెరువు పనుల్లో కూలీలుగా వెళ్లారు. సాయంత్రం భారీ వర్షానికి వారంతా సమీపంలోని చెట్టు కిందికి వెళ్లారు. పిడుగుపడడంతో చౌదరి చంద్రయ్య(45), చిడం బాపు(65) అక్కడికక్కడే మరణించారు. చంద్రయ్య సోదరుడు చౌదరి శంకర్, ఎల్కరి శంకర్, గౌతూరి మదునయ్య పిడుగుపాటుకు కోమాలోకి వెళ్లారు. వీరిని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జాలకి చెందిన బీటెక్ విద్యార్థి దర్శనాల రాజు శనివారం స్నేహి తులు సెగ్గం కృష్ణ, వేముల రాజశేఖర్‌లతో కలసి గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. పిడుగు పడడంతో రాజు (25) అక్కడికక్కడే చనిపోయాడు. కృష్ణ, రాజశేఖర్‌లు తీవ్రంగా గాయపడడంతో మంచి ర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండ లంలోని దార్‌కుభీర్ గ్రామంలో మేకల కాపరి సిందే దిగంబర్(35), ముథోల్ మండల కేంద్రంలోని ధన్గర్గల్లికి చెందిన పెద్దకర్రోల్ల శీను ఉరఫ్ చింటు(18) పిడుగుపాటుకు మృతిచెందారు. -
లైవ్‌లో పిడుగు.. నడిరోడ్డుపై నిప్పుల వాన
-
లైవ్‌లో పిడుగు.. నడిరోడ్డుపై నిప్పుల వాన
బీజింగ్: లైవ్‌లో ఎప్పుడైనా పిడుగును చూశారా? దాని తీవ్రత ఎలా ఉంటుందో.. అది పడ్డాక ఎలాంటి వస్తువైనా ఎలా కాలిపోతుందో ఎప్పుడైనా గమనించారా? కానీ, చైనాలోని షెన్యాంగ్ ప్రాంత ప్రజలకు ఆ అవకాశం దక్కింది. అది కూడా రోడ్ల మీద రయ్‌మంటూ దూసుకెళ్లే వాహన చోదకులకు. అవును ఈ నెల(మే) 11న చైనాలోని లియానింగ్ ప్రావిన్స్‌లోగల షెన్యాంగ్లో పెద్ద మొత్తంలో గాలిదుమ్ము వచ్చింది. ఆ సమయంలో వర్షంపడటంతోపాటు పెద్ద పెద్ద ఉరుములు శబ్ధం కూడా వినిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో షెన్యాంగ్‌లోని రద్దీగా ఉండే ఓ కాలనీలో కారు వాహనదారులు తమ కార్ల వైఫర్లు ఆన్ చేసుకొని దూసుకెళుతుండగా నడి రోడ్డుపై భారీ పిడుగు పడింది. దీంతో రోడ్డుపక్కన ఉన్న చెట్లు మాడిపోయి వాటి ఆకులన్నీ కూడా నిప్పుల వర్షంలాగా కురిశాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వారంతా కూడా తమ వాహనాలు ఎక్కడికక్కడ ఆపేసి గజగజ వణికిపోయారు. తొలుత ఒక్కసారిగా చిమ్మచీకట్లు కమ్మినట్లు అని ఆ వెంటనే భారీ వెళుతురుతో నిప్పుల వర్షాన్ని కురిపించింది ఆ పిడుగు. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఓ కారులోని కెమెరాలో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
పిడుగుపాటుకు ఐదుగురు మృతి
రాయదుర్గం: పిడుగుపాటు అయిదుగురు బడుగుజీవులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలం కలుగోడులో ఆదివారం జరిగింది.గ్రామానికి చెందిన గొల్లపల్లి ఓబన్న (40), జయణ్ణ (55), కరీం(32) గొర్రెలు మేపడానికి పొలంలోకి వెళ్లారు. రైతు శివప్ప (25) పొలంలో పని చేసేందుకు వెళ్లాడు. ఇక గిరిరెడ్డి (32) రాళ్ల కోసం చెరువులోకి వెళ్లాడు. మరో నలుగురు పొలం పనుల్లో ఉన్నారు. సాయంత్రం వేళ వర్షం రావడంతో వారంతా అక్కడే వేపచెట్టు వద్దనున్న రేకుల షెడ్డులోకి వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడడంతో అయిదుగురు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. -
పిడుగుపాటుకు ఏడుగురు మృతి
-
పిడుగుపాటుకు ఏడుగురు మృతి
గుమ్మగట్ట(అనంతపురం): అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆదివారం పిడుగుపాటుకు ఏడుగురు మృతిచెందారు. అనంతపురం జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో ఆదివారం సాయంత్రం చిన్నపాటి వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడింది. చెరువు ప్రాంతంలో గొర్రెలు, మేకలు మేపుకోవడానికి, సిమెంటు పనిమీద వెళ్లిన అయిదుగురు వ్యక్తులు పిడుగుపడిన శబ్దానికి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. బోయ శివప్ప(25), బోయ ఊబన్న(40), జనమ జయన్న(50), కంతార్లపల్లి గిరిరెడ్డి(40), కరీంసాబ్(34)లు అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా వేరువేరు కుటుంబాలకు చెందిన వారు. వర్షం నుంచి తలదాచుకునేందుకు పొలంలో ఉన్న రేకుల షెడ్డు కిందకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. వీరిలో గిరిరెడ్డి, జయన్నలు మరో ముగ్గురితో కలిసి సమాధి పని చేసేందుకు కంకర కోసం చెరువు ప్రాంతానికి వెళ్లారు. కాగా, రాయదుర్గం మండలం కదరంపల్లిలో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతిచెందాయి. కర్నూలు జిల్లాలో మరో ఇద్దరు మృతి పెద్ద కడబూర్: కర్నూలు జిల్లా పెద్ద కడబూర్ మండలం చిన్నతుంబలం గ్రామ పొలంలో పిడుగు పడి వృద్ద మహిళ, చిన్నారి మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు అవ్వ, మనుమరాలుగా గుర్తించారు. -
పిడుగుపాటుకు స్పృహతప్పిన బాలుడు
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని జగన్నాధపురంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపడింది. మేకలు మేపుతుండగా పిడుగుపడటంతో బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మేకల మందలోని ఐదు మేకలు మృతి చెందాయి. -
చైతన్యనగర్, కొత్తగూడెంలో పిడుగుపాటు
గేదె మృతి, ధ్వంసం అయిన ఇంటిగోడ ఖమ్మం అర్బన్: నగరంలోని రెండు వేర్వురు ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఉరుములు మెరుపుతో కూడిన వర్షం ప్రభావంతో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. చైతన్యనగర్‌లో వెంకటేశ్వరరావు ఇంటిపై పిడుగుపడటంతో గోడకు రంధ్రం పడింది. ఇంట్లోని విద్యుత్ పరికాలు దగ్ధం అయినట్లు ఆయన తెలిపారు.తాము ఇంట్లోనే ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆ సమయంలో వచ్చిన మెరుపులతో భారీ శబ్ధం రావడంతో తమ ఇంటి సమీపంలోనే పిడుగు పడినట్లు భావించామన్నారు. గురువారం ఉదయం చూస్తే ఇంటి పైన గోడకు రంధ్రం పడి పగుళ్లు వచ్చాయన్నారు. ఆ ప్రాంతాన్ని కార్పొరేటర్ చావా నారాయణరావు పరిశీలించారు. 7వ డివిజన్లోని కొత్తగూడెంలో కె.హనుమంతురావుకు చెందిన ఇంట్లో పిడుగు పడింది.దాని ధాటికి రూ. 70 వేల విలువ చేసే పాడి గేదె అక్కడిక్కడే మృతి చెందినట్లు బాధిత రైతు తెలిపారు. -
ఇంతటి విషాదాన్ని ఎప్పుడూ చూడలేదు
స్టాక్‌హామ్: నార్వేలో పిడుగుపాటుకు 323 ధ్రువప్రాంతపు జింకలు మరణించాయి. నార్వే మధ్యప్రాంతంలోని హార్డన్గెర్విడ్డా పర్వత శ్రేణుల్లో ఈ దుర్ఘటన జరిగింది. ఇది అసాధారణ పెద్ద ప్రకృతి విపత్తు అని వన్యప్రాణుల సంరక్షణ అధికారులు అభివర్ణించారు. నార్వే పర్యావరణ సంస్థ ప్రమాద సంబంధిత ఫొటోలను విడుదల చేసింది. పర్వత ప్రాంతంలో జింకల కళేబరాలు కుప్పలు కుప్పలుగా పడిఉన్నాయి. ప్రతికూల వాతావరణంలో ధ్రువజింకలు గుంపుగా ఒకేచోట ఉంటాయని, భారీ ప్రాణనష్టం జరగడానికి ఇదే కారణమని పర్యావరణ సంస్థ అధికారులు చెప్పారు. ఇది అసాధారణ దుర్ఘటన అని, పిడుగుపాటు వల్ల ఇంత భారీ సంఖ్యలో జింకలు లేదా ఇతర వన్య ప్రాణులు మరణించినట్టు గతంలో ఎప్పుడూ వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి ధ్రువప్రాంతపు జింకలు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తాయని తెలిపారు. -
పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ మృతి
ఏటూరునాగారం : పిడుగుపాటుకు ఓ వ్యవసా య కూలీ మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలోని ఓడవాడలో శనివారం జరిగింది. మండలంలోని తాళ్లగడ్డ మేడారం చెరువు శివారు ప్రాంతంలోని కర్ల సమ్మయ్య పొలంలో వరి నాట్లు వేసేందుకు ఓడవాడకు చెందిన మహిళలు వెళ్లారు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వర్షం కురుస్తున్న సమయంలో పొలంలో పిడుగు పడింది. దీంతో అంబరికాని భద్రమ్మ(65) ఒంటిపై బొబ్బలు వచ్చి అక్కడికక్కడే మృతిచెందగా పక్కనే ఉన్న రెడ్డి సమ్మక్క, కర్ల సరోజన, రాందాస్ సమ్మక్క స్పృహ కోల్పోయారు. మిగతా కూలీలు భయంతో పరుగులు తీశారు. కొద్దిసేపటి తర్వాత తేరుకొని ఆమె మృతిచెందిందని నిర్ణయించుకొని పొలం నుంచి ఏటూరునాగారం ప్రధాన రోడ్డుకు ఎడ్లబండిలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి మృతదేహాన్ని టాటా ఏస్‌లో ఇంటికి తరలించారు. మిగతా ముగ్గురిని మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మృతురాలికి కుమారులు కృష్ణ, మహేష్ ఉన్నారు. -
పిడుగులు.. ఉరుములు
చెరువుకిందిపల్లె(వల్లూరు): చెరువుకిందిపల్లెలో శుక్రవారం ఉదయం పిడుగు పడింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు గ్రామంలో ఉదయం ప్రారంభమైన వర్షం కొద్దిసేపటికి ఉరుములు, మెరుపులతో ఉద్ధృతంగా మారింది. ఆ సమయంలో గ్రామంలో పై భాగాన గల వీధిలో ఉన్న పుత్తా నారాయణరెడ్డి అనే వ్యక్తి నివాస గృహంపై పిడుగు పడింది. భవనం పైన గల పిట్ట గోడపై పడడంతో గోడ దెబ్బతినింది. ఈ ప్రభావంతో మంటలు రేగాయి. ఆ వీధిలో వున్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో వున్న గృహాల్లోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు, మిక్సీలు పాడైపోయాయి. -
పిడుగుపాటుకు దంపతులకు గాయాలు
వేములపల్లి మండలం మంగాపురంలో శుక్రవారం పిడుగుపాటుకు ఇద్దరు దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. పొలంలో వరినాట్లు వేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన ఈద మల్లయ్య(35), ఈద నాగమణి(32)లను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పిడుగుపాటుకు వ్యక్తికి తీవ్రగాయాలు
టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ మోదుగులగూడెం సమీపంలోని ఓ పత్తిచేనులో శుక్రవారం పిడుగుపడింది.ఆ ప్రాంతంలో పాయం విజయ్ భాస్కర్ అనే వ్యక్తి ఉండటంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
భారీ సౌధంపై పిడుగు పడితే..
-
భారీ సౌధంపై పిడుగు పడితే..
మన్‌హట్టన్‌లోని 102 అంతస్తుల భారీ సౌధం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై తాజాగా ఓ పిడుగు విరుచుకుపడింది. నడి వేసవి నడిరాత్రిలో తుఫాన్ చుట్టుముట్టిన సమయంలో సంభవించిన ఈ ఆకాశ అద్భుతాన్ని ఓ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై పిడుగులు పడటం సాధారణ విషయమే. పిడుగులు పడినా తట్టుకొని ఉండేలా ఈ భవనానికి ఏర్పాట్లు చేశారు. తాజాగా కూడా రాత్రిసమయంలో ఓ పిడుగు భారీ మెరుపుతో భవనాన్ని ఢీకొంది. దీనిని ఫొటోగ్రాఫర్ హెన్రిక్ మోల్ట్కే తన కెమెరాతో పర్ఫెక్ట్గా క్లిక్ మనిపించారు. అంతేకాకుండా దీనిని వీడియో కూడా తీశారు. ఈ ఫొటో, వీడియోను యూట్యూబ్, ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ఇవి వెంటనే వైరల్‌గా మారిపోయింది. -
పిడుగుపాటుకు రైతు మృతి
పొలానికి వెళ్లిన రైతు పిడుగుపడి చనిపోయాడు. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పలుకూరు పంచాయతీ సోమ్లారాజుతండాకు చెందిన భూక్యా రాములు నాయక్(45) ఆదివారం మధ్యాహ్నం తన ఆవును తోలుకుని పెసరతోటకు కాపలాగా వెళ్లాడు. సాయంత్రం వాన మొదలు కావటంతో ఇంటి బాట పట్టాడు. అదేసమయంలో పిడుగుపడటంతో రైతుతోపాటు ఆవు కూడా చనిపోయింది. పిడుగు తీవ్రతకు సమీపంలోనే ఉన్న పీరయ్య కూడా స్వల్పంగా గాయపడ్డాడు. -
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం కోనాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిందం మల్లయ్య(38) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం గొర్రెలను మేపుతున్న సమయంలో భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. -
బిహార్‌లో ప్రకృతి విలయం
పిడుగులు, భారీ వర్షాలకు 57 మంది మృతి పట్నా/లక్నో: బిహార్‌లో మంగళ, బుధవారాల్లో పిడుగులు, భారీ వర్షాల ధాటికి 57 మంది మంది మృతిచెందారు. పిడుగుపాట్లకు మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పలువురు మహిళలు, పిల్లలు ఉన్నారు. దాదాపు 17 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. పట్నా జిల్లాలో ఆరుగురు, బక్సర్‌లో ఐదుగురు, నలంద, భోజ్‌పూర్, రోహ్తాస్, కైమూర్, ఔరంగాబాద్, పూర్ణియా జిల్లాలో నలుగురు చొప్పున మృతిచెందారు. కతియార్, సహస్ర, సరణ్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున చనిపోయారు. ముంగేర్, సమస్తిపూర్, భాగల్పూర్లలో ఇద్దరు, బంకా, మాధేపురా, ముజఫర్‌పూర్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లోనూ ఒకరు చొప్పున మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగ ముఖ్య కార్యదర్శి వ్యాసాజీ తెలిపారు. పూర్ణియా జిల్లాలో 97.2మిల్లీమీటర్లు, గయలో 62.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మరోపక్క.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్, బలియా జిల్లాల్లో మంగళవారం పిడుగులు పడి తొమ్మిది మంది బాలలు సహా 13 మంది మృతిచెందారు. జార్ఖండ్ చాత్రా జిల్లా హదియాతాంద్‌లో పిడుగుపాటుకు ఒకే కుటుంబంలోని నలుగురు మృతిచెందారు. ప్రధాని సంతాపం..బిహార్, యూపీ తదితర రాష్ట్రాల్లో వర్షాలు, పిడుగుపాట్లలో జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన వారికి ట్విటర్లో సంతాపం తెలిపారు. -
'అంతమంది మరణం నన్ను కలిచి వేసింది'
న్యూఢిల్లీ : బిహార్‌ను కుదిపేసిన పిడుగుపాటు దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అంతమంది మరణం తనను కలచి వేసిందని ఆయన బుధవారం ట్విటర్లో వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం ప్రకటించారు. బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పిడుగుపాటుకు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా బిహార్‌లో పిడుగుపాటుకు పదుల సంఖ్యలో మృతి చెందారు. ఒకే రోజు పిడుగుపాటుతో 57 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. డజన్ల మందికి పైగా గాయాలపాలయినట్లు వెల్లడించారు. అయితే, మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. మరోవైపు పిడుగుపాటు ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా పిడుగుపాటుకు బిహార్ లో 57మంది మృతి చెందగా, ఉత్తరప్రదేశ్ లో 42మంది ప్రాణాలు కోల్పోయారు. My thoughts & prayers are with those who lost their near & dear ones due to the lightning. May the injured recover quickly: PM @narendramodi — PMO India (@PMOIndia) 22 June 2016 Deeply anguished by loss of lives due to lightning in parts of UP, Bihar, Jharkhand & other parts of the nation over the last few days: PM — PMO India (@PMOIndia) 22 June 2016 -
గాలివాన భీభత్సం
♦ పిడుగుపాటుకు తనికెళ్లలో గొర్రెలకాపరి, అనంతారంలో రైతు, ♦ సిద్ధినేనిగూడెంలో కౌలురైతు మృతి ♦ ఆర్టీసీ బస్సుపై చెట్టు కూలి వైరా హైవేపై స్తంభించిన ట్రాఫిక్ ♦ గాలిదుమారంతో పలుచోట్ల లేచిన ఇంటి పైకప్పు రేకులు గాలిదుమారం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం జిల్లాలో పలుచోట్ల బీభత్సాన్నే సృష్టించింది. విపరీతమైన గాలులతో ఇళ్ల పైకప్పు రేకులు లేస్తుండడంతో జనం భయాందోళన చెందారు. పిడుగుపాటుకు కొణిజర్ల మండలం తనికెళ్లలో చేల్ల వద్ద మేకలు మేపుతున్న గొర్రెలకాపరి తుప్పతి నాగరాజు(29) చనిపోయాడు. అనంతారంలో పత్తి సాగు చేసేందుకు దుక్కి దున్నుతున్న రైతు ఆలస్యం లక్ష్మయ్య (50) , విత్తనాలు వేసేందుకు సిద్ధమైన సిద్ధినేనిగూడేనికి చెందిన కృష్ణారెడ్డి (40)బలయ్యారు. ఖమ్మం-వైరా ప్రధాన రహదారిపై వీవీపాలెం సమీపంలో ఆర్టీసీ బస్సుపై మర్రిచెట్టు కూలింది. ఈ ప్రమాదంలో బస్సులోని 74మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడినా, రెండు గంటల పాటు.. ఆ మార్గంలో రాకపోకలన్నీ నిలిచాయి. భారీ గాలుల ప్రభావంతో శుక్రవారం సాయంత్రం వి.వెంకటాయపాలెం-తనికెళ్ల మధ్య ప్రధాన రోడ్డుపై మధిర డిపో ఆర్టీసీ బస్సుపై మర్రిచెట్టు కూలి పడింది. బస్సు పాక్షికంగా దెబ్బతింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే..విరిగిపడిన మర్రిచెట్టు పూర్తిగా రోడ్డుపైనే ఉండడం, బస్సు మధ్యలో ఇరుక్కుపోవడంతో..రహదారి మొత్తం బ్లాక్ అయింది. దీంతో..ఇటు ఖమ్మం నుంచి వచ్చే వాహనాలు, అటు సత్తుపల్లి, భద్రాచలం, వైరా గుండా హైవే మీద వచ్చే వాహనాలన్నీ ఎక్కడివక్కడ నిలిచాయి. మొత్తం రెండు కిలోమీటరకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. బస్సులు, లారీలు, ఆటోలు లన్నీ ఆగిపోయాయి. విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్తున్న ఉద్యోగులు, వివిధ పనుల మీద వచ్చి వెనుతిరిగిన వారు, విద్యాసంస్థల నుంచి బయల్దేరిన విద్యార్థులు అంతా..ట్రాఫిక్ జాంలో చిక్కుకొని అవస్థలు పడ్డారు. ప్రయాణికులు వాహనాలు దిగి..రోడ్డుపై గంటల తరబడి నిరీక్షించారు. పిల్లలు, పెద్దలు, మహిళలు చాలా అసౌకర్యం చెందారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, స్థానికుల సాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
పిడుగుపాటుకు ఇద్దరి మృతి
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో శుక్రవారం పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మయ్య పత్తిచేనులో విత్తనాలు నాటుతుండగా.. పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని తనికెళ్ల గ్రామానికి చెందిన నాగరాజు(28) గొర్రెలు మేపుతుండగా.. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గొర్రెల మందను తోలుకొని చెట్టు కిందకు పరుగుతీశాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో.. నాగారాజు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో 10 గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి. -
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
శ్రీకాకుళం జిల్లా వంగర్ మండలం మద్దివలస గ్రామం సమీపంలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన రామానాయుడు (50) శుక్రవారం ఉదయం చెరువు దగ్గర కాలకృత్యాలు తీర్చుకుని ఇంటికి తిరిగి వెళుతున్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. రామానాయుడు సమీపంలోనే పిడుగుపడడంతో అతడు మృతి చెందాడు. -
నల్లగొండ జిల్లాల్లో గాలివాన.. నెలకొరిగిన చెట్లు
నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలో పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. మేళ్లచెర్వు మండలం ఎర్రగట్టు తండాలో పిడిగుపాటుకు రెండు ఆవులు మృతి చెందాయి. -
యూపీలో వర్షాలకు 12 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గాలివానలు, పిడుగుపాటుతో రాష్ట్రవ్యాప్తంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్ బిల్హార్ ప్రాంతంలో ఇద్దరు మృతి చెందారు. మావు జిల్లాలో ఒకరు మరణించారు. వారణాసిలోని శివపురి ప్రాంతంలో చెట్టు కూలి మీద పడడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రామగావ్ లో మట్టి ఇల్లు కూలిపోవడంతో మహిళ దుర్మరణం పాలయింది. అజాంఘడ్ లోని అసండీహ్ గ్రామంలో పాఠశాల గేటు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఫరుఖహాబాద్ లో పిడుగుపాటుకు నలుగురు చనిపోయారు. మాధురాలో ఒకరు కరెంట్ షాక్ కు గురై మృత్యువాత పడ్డారు. వచ్చ 48 గంటల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
పిడుగుపాటుకు వ్యక్తి మృతి..
-ఇద్దరికి తీవ్ర గాయాలు గట్టు కర్ణాటక రాష్ట్రంలో పిడుగుపాటుకు గురై మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలానికి చెందిన గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయాడు. చింతలకుంట గ్రామానికి చెందిన కొందరు గొర్రెల పెంపకం దారులు స్థానికంగా పశుగ్రాసానికి కొరత ఏర్పడడంతో రెండు నెలల క్రితం కర్ణాటకకు వలస వెళ్లారు. వర్షాలు ప్రారంభం అవుతుండడంతో శనివారం స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి రాయచూర్ సమీపంలోని గోనారం వద్ద ఆగారు. ఆ సమయంలో పిడుగు పడడంతో కుర్వ వీరన్న (30) మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బాసర ఆలయ గోపురంపై పిడుగు
- పాక్షికంగా ధ్వంసమైన గోపురం బాసర(ఆదిలాబాద్): బాసరలోని సరస్వతీ ఆలయ గోపురంపై పిడుగు పడింది. దీంతో గోపురం పాక్షికంగా ధ్వంసమైంది. సిమెంట్ పెచ్చులు ఊడి పడ్డాయి. బుధవారం సాయంత్రం వర్షం కురుస్తుండగా ఒక్కసారిగా తూర్పు భాగాన ఉన్న రాజగోపురంపై భారీ శబ్దంతో పిడుగు పడింది. సమీపంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, ఏఈవో అశోక్, ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ పిడుగు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణ మధ్య స్థానాచార్యుడు, ప్రధానాచార్యుడు ఆలయంలో శాంతిపూజ, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గోదావరి జలంతో తూర్పు రాజగోపురంపై నీళ్లు చల్లారు. ప్రకృతి వైపరీత్యం: సంజీవ్ బాసర ఆలయంలో పిడుగు పడడం ప్రకృతి వైపరీత్యం. ఇలాంటి ఘటనలు సాధారణమే. పిడుగు పడ్డ తర్వాత అమ్మవారి ఆలయంలో శాంతిపూజ నిర్వహించాం. ఆందోళన అక్కర్లేదు: ప్రవీణ్ పాఠక్ రాజగోపురంపై పడిన పిడుగుపాటుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సంఘటనలు సహజమే. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
పిడుగు పాటుకు ముగ్గురి మృతి
తెలంగాణలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం మరో ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని అక్కన్నపేటలో పిడుగుపాటు గురై ఓ రైతు మృతి చెందాడు. అక్కన్నపేట గ్రామానికి చెందిన రైతు సమ్మయ్య పొలంలో పనులు చేస్తుండా ఉరుములు..మెరుపులతో కూడిన వర్షం పడింది. పెద్ద శబ్ధంతో పిడుగు పొలంలో ఉన్న రైతుపై పడింది. ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాలో గంధగూడకు చెందిన తలారి చంద్రయ్య తన పొలంలో పని చేస్తుండగా పిడుగుపడి చనిపోయాడు.అలాగే రాజేంద్రనగర్ మండలంలోని భైరాగిగూడలో పాండు అని వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాలో పిడుగు పాటుకు గురై మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. -
తెలంగాణలో పిడుగుల బీభత్సం
కరీంనగర్లో ఒకరి మృతి ఆదిలాబాద్‌లో నలుగురికి తీవ్రగాయాలు కరీంనగర్/ఆదిలాబాద్ ఉరుములు-మెరుపులతో తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం కురిసిన వాన రాష్ట్ర ప్రజలను వణికించింది. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగు పాటుకు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి. కరీంనగర్ జిల్లా లోని కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన వానలో ప్రశాంత్(23) అనే యువకుడు మృతి చెందాడు. తన పొలంలో పనిచేస్తుండగా అతనిపై పిడుగుపడింది. వేములవాడ మండలం చెక్కపల్లిలో ఎద్దు మృతి చెందింది. ఈదుగాలులతో కూడిన వర్షాలకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. బెజ్జంకి, తిమ్మాపూర్ మండలాల్లో వడగండ్ల వానకు భారీగా పంట నష్టం జరిగింది. అలాగే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు నలుగురుగు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. -
పిడుగుపాటుకు బాలుడి మృతి
మంగళవారం కురిసిన అకాల వర్షం ఓ బాలుడిని పొట్టన పెట్టుకుంది. పిడుగుపాటుకు ఓ బాలుడు మృతిచెందిన సంఘటన షాబాద్ మండలంలోని నాగరగూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నాగరగూడకు చెందిన కేశపల్లి సాయిచరణ్‌రెడ్డి(13) మధ్యాహ్నాం వ్యవసాయం పొలం వద్ద ఉండగా ఉరుములు, మెరుపులతో కూడిన కొద్దిపాటి వర్షం పడింది. అంతలోనే పిడుగుపడి బాలుడు అక్కడిక్కడే మృతిచెందాడు. కోడుకు మృతితో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
పిడుగుపాటుకు మహిళ మృతి
- శంషాబాద్మండలం కవ్వగూడలో విషాదం శంషాబాద్(రంగారెడ్డి జిల్లా) పొలంలో పనిచేసుకుని వెళుతున్న ఇద్దరు మహిళలపై పిడుగుపడి ఒకరు మృతి చెందిన ఘటన శంషాబాద్ మండలం కవ్వగూడలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. కవ్వగూడకు చెందిన భార్గవి(28) సంధ్య (18) పొలంలో పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం ఈదురుగాలులు ఉరుములతో కూడిన వర్షం మొదలు కావడంతో.. ఇంటికి వెళ్లేక్రమంలో మేడిచెట్టు వద్ద నిల్చున్నారు. ఆ సమయంలో పిడుగు పడి భార్గవి అక్కడిక్కడే మృతి చెందింది. సంధ్యకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ఆమెను శంషాబాద్‌లోని స్థానిక ఆసుప్రతికి తరలించారు. -
వడగండ్ల వాన బీభత్సం
ఈదురుగాలు, వడగండ్లతో కూడిన వర్షాలు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణలో పలు చోట్ల బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్‌లో పాతబస్తీ, ఎల్బీనగర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌తో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. మెదక్ జిల్లా దుబ్బకలో వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. రంగారెడ్డిజిల్లా శంషాబాద్ మండలంలోని కవ్వగూడలో పిడుగు పడి ఒక మహిళ మృతి చెందింది. ఇదే ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పిడుగుపాటుకు జెర్సీ ఆవుల మృతి
చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం బూర్లపల్లి పంచాయతీ పరిధిలో పిడుగు పాటుకు రెండు జెర్సీ ఆవులు మృతి చెందాయి. శుక్రవారం రాత్రి రైతు నారాయణ ఇంటి సమీపంలో పిడుగు పడడంతో పాకలో ఉన్న ఆవులు మృత్యువాత పడ్డాయి. కాగా, రెండు ఆవుల విలువ రూ.1.30 లక్షలు ఉంటుందని రైతు నారాయణ తెలిపాడు. -
పిడుగు పడదు... పైకి లేస్తుంది!
సీజన్లు మారిపోయాయి. పోతే పోయాయి. కానీ తారుమారైపోయాయి! ఈ ఏడాదైతే మరీను. ఎండల్లో వడగండ్ల వానలు పడ్డాయి. వర్షాకాలంలో ఇప్పుడు ఎండలు అదరగొడుతున్నాయి. ఈ విపరీతానికి లేటెస్టుగా పిడుగులూ తోడయ్యాయి! గత ఆదివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుపాటుకు 20 మందికిపైగా చనిపోయారు. గుంటూరు జిల్లా పేరేచర్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో ఓ తాటిచె ట్టయితే పిడుగుపాటుకు భగ్గుమంది. జ్వాలలు పైకి ఎగశాయి. నరకంలోంచి నేరుగా ఎవరో విసిరితే పడినట్టుగా పడిన పిడుగు అది. అసలు పిడుగంటే ఏమిటి? అది పడడం ఏమిటి? ఎక్కడి నుండి పడుతుంది? ఎందుకు పడుతుంది? మేఘం మేఘం డీకొంటే కాంతి వస్తుంది. దాన్ని ‘మెరుపు’ అంటారు. మేఘం మేఘం డీకొంటే శబ్దం వస్తుంది. దాన్ని ‘ఉరుము’ అంటారు. మేఘం మేఘం డీకొంటే క రెంటు పుడుతుంది. దాన్ని ‘పిడుగు’ అంటారు. భూమి మీద ఉండి చూసే మనకు మెరుపు మొదట కనిపిస్తుంది. (ధ్వని కన్నా కాంతి వేగం ఎక్కువ కాబట్టి). తర్వాత ధ్వని వినిపిస్తుంది. మూడో స్టేజ్‌లో... మేఘాల ఒరిపిడి తీవ్రతను బట్టి పిడుగుపాటు ధ్వనిస్తుంది. ఈసారి గమనించండి. ఆకాశంలో మెరుపు మెరిసిందంటే... ఆ తర్వాత కొద్ది క్షణాలకు తప్పనిసరిగా ఉరుము వినిపిస్తుంది. పిడుగు పడింది అని అంటుంటారు కానీ, నిజానికి అది పడడం కాదు. వినపడడం. ధ్వనించడం! ధ్వనించడం అని అనడం దేనికంటే... పిడుగుకి రూపం లేదు. అదేమీ ఇనుప కడ్డీకాదు, ఇతర లోహమూ కదా. దాని కసలు రూపమే లేదు. దాని శబ్దం మాత్రం ఫేడేల్మని గగనం గాజు అయి పగిలినట్టుగా వినిపిస్తుంది. సైంటిఫిక్‌గా చెప్పాలంటే... మేఘంలో ఉన్న రుణ విద్యుదావేశం భూమిని తాకినప్పుడు వచ్చే మెరుపుధ్వనే పిడుగు. మేఘంలో రెండు భాగాలు ఉంటాయి. పైన ఉన్న భాగం పాజిటివ్ చార్జ్‌తో ఉంటే, కింద ఉన్నది నెగటివ్ చార్జితో ఉంటుంది. ప్రతి మేఘం ఇలాగే పాజిటివ్, నెగటివ్ ఎనర్జీలతో ఉంటాయి. మేఘంలోని నెగటివ ఎనర్జీ, పక్క మేఘంలోని పాజిటివ్ ఎనర్జీకి టచ్ అయితే ఆకాశంలో మెరుపు కనిపిస్తుంది. మేఘంలోని నెగటివ్ ఎనర్జీ భూమి మీద పాజిటివ్ ఎనర్జీకి టచ్ అయితే పిడుగుపాటు అవుతుంది. పిడుగంటే పైనుంచి కిందికి పడేది అనుకుంటాం కదా. నిజానికి కింది నుంచి పైకి వెళ్లేదే ‘పిడుగు’! ఎందుకంటే భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ తనే వెళ్లి, మేఘంలోని నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇంకా చెప్పాలంటే... పిడుగు పడేటప్పుడు మనకు కనిపించే మెరుపు, భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ నుండి మొదలై మేఘాన్ని చేరుతుంది కానీ, మెరుపు... మేఘం నుండి భూమికి చేరదు. సో... పడేది పిడుగు కాదు. పైకి లేచేది పిడుగు. ఇంతకీ మేఘాల్లోని ఈ నెటిటివ్, పాజిటివ్ ఏమిటి? మళ్లీ సైన్స్‌లోకి వెళ్లాలి. సృష్టిలోని ప్రతి పదార్థంలో ఉన్నట్లే మేఘాల్లోనూ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఉంటాయి. ప్రోటాన్లు పాజిటివ్ ఎనర్జీ. ఎలక్ట్రాన్లు నెగటివ్ ఎనర్జీ. మేఘాలు ఒక చోటి నుంచి ఒకచోటికి ప్రయాణిస్తున్నప్పుడు వాటిల్లో నీరు ఘనీభవించి, ఐస్ అవుతుంది. ఆ ఐస్ గడ్డలు ఒకదానికొకటి తగిలినప్పుడు రాపిడి జరిగి పాజిటివ్ ఎనర్జీ ఉండే ప్రోటాన్లు మేఘం పైభాగానికి చేరతాయి. అలాగే నెగటివ్ చార్జి ఉండే ఎలక్ట్రాన్లు మేఘం అడుగు భాగానికి చేరతాయి. వీటిని, భూమిపై ఉండే ప్రోటాన్లు పాజిటివ్ ఎనర్జీతో మీదికి ఆకర్షిస్తాయి. అప్పుడు పిడుగు పడినట్టవుతుంది. అందుకే భూమీ మీద ఎత్తయిన ప్రదేశంలో ఉండే కొండలు, చెట్లు, ఎత్తయిన మనుషుల ఈ పిడుగు ప్రభావానికి లోనవుతారు. కాబట్టే ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు చెట్లకు దగ్గరగా ఉండకూడదంటారు. -
మెరుపు తగ్గిన పసిడి
-
పిడుగులు ఎంతదూరం ప్రయాణిస్తాయో తెలుసా ?
ఈ విశ్వంలో సెకనుకు 100 పిడుగులు చొప్పున నేలను తాకుతున్నాయి. పిడుగుల తాకిడికి ఏటా కనీసం వెయ్యి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక చెట్లు, జంతువులకైతే లెక్కేలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పిడుగుల వల్ల అడవుల్లో ఏటా సుమారు పదివేలకు పైగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నట్లు అంచనా. ముందుగా ఏ ఎండుటాకులనో, ఎండుకొమ్మలనో, ఎండుగడ్డినో తాకిన పిడుగులు క్షణంలో వాటిని అంటించడం ద్వారా అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఒక్కోసారి ఈ పిడుగుపాట్ల వల్ల పెద్ద ఎత్తున అడవులకు, వన్యప్రాణులకు నష్టం కలుగుతోంది. పిడుగులు మబ్బులు ఉండే ప్రాంతంలో అడ్డంగానూ, మబ్బుల నుంచి భూమి వైపునకు నిలువుగానూ రెండు విధాలుగా ప్రయాణిస్తాయి. నిలువుగా ప్రయాణించే పిడుగులు 5-10 మైళ్ల దూరం ప్రయాణిస్తే, అడ్డంగా ప్రయాణించేవి మాత్రం 60 మైళ్లు ఇంకా అంతకన్నా ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలుగుతాయి. కొన్నేళ్ల కిందట అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో సంభవించిన పిడుగు 118 మైళ్ల దూరం ప్రయాణించింది. మానవ సమాజానికి తెలిసినంత వరకూ ఇప్పటి దాకా ఇదే అత్యంత దూరం ప్రయాణించిన పిడుగుగా నమోదయ్యింది. -
పిడుగుపాటుకు వరిగడ్డి వాములు దగ్ధం
గుంతకల్లు (అనంతపురం): అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నక్కలదొడ్డి గ్రామంలో శుక్రవారం రాత్రి పిడుగుపాటుకు రూ.లక్ష విలువైన వరి గడ్డి వాములు కాలిపోయాయి. గ్రామానికి చెందిన రైతు సోదరులు శ్రీనివాసులు, మస్తానప్పలకు చెందిన నాలుగు గడ్డి వాములు పక్కపక్కనే ఉన్నాయి. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన ప్రారంభమైంది. ఈ సందర్భంగా వరిగడ్డి వాముపై పిడుగుపడి, మంటలు అంటుకుని నాలుగు వాములు కాలిపోయాయి. రూ. లక్ష మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. -
వర్ష బీభత్సం
ఈదురు గాలులతో ధ్వంసమైన ఇళ్ల పైకప్పు రేకులు షాబాద్ మండలం రుద్రారంలో పిడుగుపాటుతో ఎద్దు మృతి షాబాద్ : ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం మండల పరిధిలోని హైతాబాద్, చందనవెల్లి, రుద్రారం తదితర గ్రామాల్లో జనాన్ని అతలాకుతలం చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో దాదాపు 30 ఇళ్ల రేకులు దెబ్బతిన్నాయి.. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ర్లు ధ్వంసమై చెట్లు విరిగిపోయాయి. రుద్రారం గ్రామంలో రైతు జెట్ట పాపయ్య కాడి ఎద్దు పిడుగుపాటుతో మృతిచెందింది. చేతికొచ్చిన వరి పంటలు నేలవారింది. మామిడి కాయలు నేలరాలాయి. రుద్రారం గ్రామంలో యాదగిరి, సిద్ధేశ్వర్, రాంచంద్రయ్య, లక్ష్మయ్య, వెంకటయ్య, హనుమంతుతో పాటు మరి కొందరి ఇళ్ల రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చందనవెల్లిలో వెంకటయ్య, ఎల్లయ్య, మహేందర్, రా ములు, జంగయ్య, అంజయ్యకు చెందిన ఇళ్లు, హైతాబాద్ గ్రామంలో లలిత, నారాయణ, శ్రీనివాస్‌రెడ్డిల ఇళ్లు వర్షానికి కూలిపోయాయి. శంషాబాద్ మండలంలో.. శంషాబాద్ రూరల్: మండల పరిధిలోని హమీదుల్లానగర్, బహదుర్గూడ గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఇదురుగాలులు, వడగళ్ల వర్షం కురవడంతో పంటలకు తీవ్రనష్టం జరిగింది. హ మీదుల్లానగర్లో రమేష్, సత్తయ్యకు చెందిన పొలాల్లోని డెయిరీఫాం పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. భారీ వర్షంతో వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. -
పిడుగుపడి నలుగురు రైతుల మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కె. కోటపాడు మండలం లక్కవారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం పిడుగుపడి నలుగురు రైతులు మరణించారు. ప్రాజెక్టుల బస్సు యాత్రలో ఉన్న స్థానిక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు ఈ వార్త తెలియగానే హుటాహుటిన సంఘటన స్థలానికి బయల్దేరి వెళ్లారు. -
పిడుగుపాటుకు ఎనిమిదిమంది బలి
ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటు వల్ల ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. మెరుపులు, ఉరుములతో గురువారం బల్రాంపూర్ బరేక్ జిల్లా, బస్తీ, గోరఖ్‌పూర్‌లో భారీ వర్షం నమోదైంది. ఈ సమయంలో పొలాల్లో తమ పనుల్లో నిమగ్నమై ఉన్న కొందరు రైతులు అనుకోకుండా పిడుగుపాటు ప్రమాదంలో మృతిచెందారు. వీరిలో ఎక్కువమంది యువ రైతులే ఉన్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాలు బురదమమై పరిస్థితి ఒక్కసారిగా అస్తవ్యస్తంగా తయారైంది. -
పిడుగులు పడటం వల్లే విమానం కూలింది?
జకర్తా: ఇండోనేసియా విమానం అదృశ్య ఘటనపై అన్వేషణ కొనసాగుతోంది. విమానం వెళ్లే మార్గంలో పిడుగులు పడటం వల్లే కూలిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విమానం సముద్రంలో కూలిపోయి ఉండొచ్చని, విమాన శకలాలు సముద్రం అడుగు భాగాన పడి ఉండొచ్చని భావిస్తున్నారు. విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వైమానిక, నౌకా దళాల సాయంతో గాలిస్తున్నారు. ఇండోనేసియాతో పాటు ఆస్ట్రేలియా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. ఇండోనేసియా నుంచి ఆదివారం ఉదయం సింగపూర్‌కు బయల్దేరిన ఎయిర్ఆసియా విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 162 మంది ఉండగా.. వారిలో 149 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది ఇండోనేసియా వారే. -
భూమి వే డెక్కితే పిడుగుల ముప్పు!
వాషింగ్టన్: గ్లోబల్ వార్మింగ్‌తో పిడుగులు పడే ప్రమాదమూ పెరుగుతోందట. అమెరికాలో ఈ శతాబ్దంలోనే గ్లోబల్ వార్మింగ్ వల్ల పిడుగులు 50 శాతం ఎక్కువయ్యాయట. పదకొండు రకాల వాతావరణ పరిస్థితుల్లో మేఘాల స్థితిపై అధ్యయనం చేసిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ పరిశోధకులు ఈ విషయం తేల్చారు. భూమి ఉష్ణోగ్రత పెరగడం వల్ల తుపానుల సందర్భంగా పిడుగులు పడే అవకాశాలూ ఎక్కువని వర్సిటీ శాస్త్రవేత్త డేవిడ్ రాంప్స్ వెల్లడించారు. వాతావరణంలోని ఉష్ణోగ్రత వల్ల మేఘాల్లో నీటి ఆవిరి కూడా పెరుగుతుందని, ఫలితంగా పిడుగులు పడే అవకాశమూ పెరుగుతుందని రాంప్స్ తెలిపారు. పిడుగుల వల్ల ఏటా మనుషులు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో పాటు గాయపడుతున్నారని, అడవుల్లో సగం కార్చిచ్చులకూ పిడుగులే కారణమన్నారు. -
పోలింగ్ కేంద్రంలో పిడుగుపడి.. ఒకరి మృతి
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, సావనీయ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో పిడుగు పడి ఒకరు మృతి చెందారు. తాడ్‌దేవ్ ప్రాంతంలోని గుజరాతీ పాఠశాలలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. విదర్భ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పోలింగ్‌కు అంతరాయం కలిగింది. -
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
ప్రకాశం జిల్లాలో తీవ్రంగా కురుస్తున్న వర్షాలకు తోడు పిడుగులు కూడా పడటంతో ముగ్గురు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెంలో పిడుగు పడి ఓ మహిళ మృతిచెందారు. అనంతలక్ష్మి అనే మహిళ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు మహిళలకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే, ఎర్రగొండపాలెం మండలం వై.కొత్తపల్లిలో పిడుగుపడి ఒకరు మరణించారు. జె.వంగలూరు మండలం కోడుమూరులో కూడా పిడుగు పాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. -
పిడుగుపాటుకు 12 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఒకేసారి పిడుగులు పడటంతో దాదాపు12 మంది మరణించారు. మరో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని నిగోహా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు అద్దె ఇంట్లో ఉండగా, వాళ్లున్న ఇంటిమీద పిడుగు పడింది. అనురాగ్ మిశ్రా, అనుజ్ పాండే, రాహుల్ త్రిపాఠీ.. ఇలా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండగా, మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా లక్నో నగరంలో కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. లక్నోలో కనిష్ఠ ఉష్ణోగ్రత 21.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
వెలి కొసలలో మెరుపులు... గోళ్ల రింగులు!
గోళ్లు అందంగా కనిపించడానికి వాటికి నెయిల్‌పాలిష్ వేస్తాం. ఇంకాస్త కొత్తగా కనిపించాలంటే పాలిష్‌పైన డిజైన్లు వేయడం చూస్తుంటాం. కానీ గోళ్లకు అందమైన రింగులు తొడిగితే అవి ఇంకెంత మెరిసిపోతాయో తెలపడానికే డిజైనర్లు పోటీపడుతున్నారు. వాటిని తమ మునివేళ్లకు తగిలించుకుని ముదితలు ముచ్చటపడుతున్నారు. ఇప్పటి వరకు వేళ్లకే ఉన్న ఉంగరాలు కాస్తా ఇంకాస్త ముందుకు జరిగి గోళ్లపై హొయలుపోతున్నాయి. ప్రాచీన చైనాలో గోళ్ల సంరక్షణలో భాగంగా ఈ రింగ్ ట్రెండ్ మొదలైంది. గోళ్ల మీద నక్షత్రాలు, కీ చెయిన్లను పోలి ఉండే డిజైన్లు మొదట వచ్చాయి. ఇటీవలి కాలంలో వీటిలో ఎన్నో విభిన్న డిజైన్లు వెలుగు చూస్తున్నాయి. బంగారం, వెండి, స్టీల్‌తో తయారయ్యే ఈ నెయిల్ రింగ్స్‌లో స్వరోస్కి క్రిస్టల్స్ పొదగడంతో మరింత మెరుపులీనుతున్నాయి. స్టైలిష్ యాక్ససరీస్‌లో ‘ఎండ్’ అనేది లేదని నిరూపిస్తున్న ఈ తరహా రింగ్స్ మగువలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లోనూ లభిస్తున్న వీటి ధరలు రూ. 200 నుంచి వేల రూపాయల్లో ఉన్నాయి. -
చెన్నై శిథిలాల తొలగింపు పూర్తి.
-
చెన్నై భవనం ఎందుకు కూలింది?
జానెడు పొట్ట నింపుకోడానికి రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి కూలి పనులు చేసుకుంటున్న 61 మంది అసువులు బాశారు. మరో 27 మంది గాయపడ్డారు. వారం రోజుల పాటు 'ఆపరేషన్ రక్ష' పేరిట శిథిలాల తొలగింపు చేపట్టి.. ఎట్టకేలకు మృతదేహాలను, బతికున్నవారిని బయటకు తీశారు. అయితే.. 11 అంతస్థులతో చేపట్టిన ఈ భారీ నిర్మాణంలో అడుగడుగునా లొసుగులే ఉన్నాయి. భవన నిర్మాణ నాణ్యతను పూర్తిగా గాలికి వదిలేయడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని నిపుణులు తేల్చారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్)తో పాటు.. ఐఐటీ మద్రాస్ నుంచి కూడా నిపుణులు ఈ భవన నిర్మాణంలో వాడిన సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించి.. నిజాన్ని నిగ్గుతేల్చారు. ఈ భవనం దుర్ఘటనలో మరణించిన 61 మందిలో 51 మంది తెలుగువాళ్లే. అందులోనూ ఎక్కువగా విజయనగరం జిల్లాకు చెందిన వలస కూలీలే ఉన్నారు. అత్యంత నాసిరకమైన సామగ్రిని ఉపయోగించి, ఏమాత్రం బరువు భరించలేని బీమ్‌లు, కాలమ్‌లతో ఈ భవనాన్ని కట్టారని, నిర్మాణ ప్రమాణాల పరంగా చూస్తే ఇది అత్యంత ఘోరమైనదని నిపుణులు చెప్పారు. శ్లాబులన్నీ ఒకదానిమీద ఒకటి పడిపోయాయని, కాలమ్‌లు కూడా పూర్తిగా పడిపోయాయని, పైన, కింద, అన్నివైపులా ఇందులోనిర్మాణ లోపాలు చాలా ఎక్కువగా ఉన్నాయని క్రెడాయ్ చైర్మన్ డాక్టర్ ఆర్.కుమార్ తెలిపారు. చెన్నై వెలుపల గల పోరూరు చెరువుకు ఈ భవనం కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. అయినా సాయిల్ టెస్టింగ్ లాంటివి ఏవీ సరిగా చేయకపోవడం వల్ల భవనం భూమిలోకి కూరుకుపోయింది. ఈ ప్రాంతమంతా చెరువుకు పరివాహక ప్రాంతంగా ఉండటంతో చిత్తడినేలగానే ఉంది. భవన ప్రమోటర్లు సహా ఆరుగురిని ఇప్పటికే ఈ కేసులో అరెస్టు చేశారు. అయితే బిల్డర్లు మాత్రం తమ లోపం ఏమీ లేదని.. పిడుగుపాటు వల్లే భవనం కూలిందని వాదిస్తున్నారు. -
గాలివాన బీభత్సం
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : మంచిర్యాలలో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో దాదాపు గంట పాటు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పడిన భారీ వర్షానికి పట్టణం అతలాకుతలమైంది. పట్టణంలో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి రహదారులకు అడ్డంగా పడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. స్తంభాలు విరిగాయి. రాత్రి వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. గౌతమీనగర్ బైపాస్‌రోడ్‌లోని శ్రీసాయి కారు మెకానిక్ షెడ్డు పక్కనే నూతనంగా నిర్మాణం అవుతున్న భవనం పరిధి గోడ కింద పడటంతో రేకులు పగిలి కింద పడంతో రేకుల షెడ్డు కింద ఉన్న కారు ముందు భాగం ధ్వంసమైంది. గౌతమీనగర్‌లో అల్లి శ్రీనివాస్‌కు చెందిన ఇల్లు భారీ వర్షానికి పూర్తి ధ్వంసమైంది. పక్కనే నిర్మాణం అవుతున్న నాలుగు అంతస్థుల భవనానికి సంబంధించిన గోడలు కూలి ఇంటిపై కప్పు రేకులపై పడటంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఇంట్లోనే ఉన్న అల్లి సత్యవతి, ఆమె కుమార్తె వినీత, కుమారుడు నిశాంత్‌లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. -
జిల్లాను వీడని వర్షం
జన్నారం, న్యూస్‌లైన్ : జిల్లాను అకాల వర్షం వీడడం లేదు. జన్నారం మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యా యి. గంటపాటు కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని సినిమా హాలుకు వెళ్లే రోడ్డు నీటి తో నిండింది. వరదలు పారాయి. మండలంలోని కామన్పల్లి, కవ్వాల్, కలమడుగు, ఇందన్పల్లి, రేండ్లగూడ, రాంపూర్, తిమ్మాపూర్, తపాలపూర్ తదితర గ్రామాల్లో మామిడి తోటల్లోని చెట్ల పూత రాలింది. తీవ్రంగా న ష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తాండూర్‌లో తాండూర్ : మండలంలో గురువారం మధ్యాహ్నం గంటపాటు ఉరుములు, మెరుపులతో కూ డిన భారీ వర్షం కురిసింది. కొ న్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మాదారం-3 ఇంక్లైన్ నర్సాపూ ర్ ప్రాంతాల్లో జొన్న చేను నేల వాలింది. నాలుగై దు రోజు లుగా వర్షం కురుస్తుండడంతో శెనగ వేర్లు కుళ్లిపోయి పంట నష్టపోయే ప్రమా దం ఉంది. ఇప్పటికే మామిడి రైతు లు పూత, పిందెలు రాలి తీవ్రం గా నష్టపోయారు. గురువారం కురిసిన వర్షం మరింత నష్టపర్చింది. వర్షానికి కూలిన ఇళ్లు భీమిని : మండలంలో గురువా రం ఈ దురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మెట్పల్లి గ్రామ పంచాయతీ పరిధి ఏసయ్యపల్లిలో దుర్గం తమ్మయ్య ఇం టిపై చెట్టు విరిగి పడింది. దీంతో ఇంటి పైకప్పు ధ్వంసమైంది. దు గుట చంద్రయ్య, కోట శాంత ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. వెంకటాపూర్‌లో ఇందూరి లచ్చన్న ఇల్లు నేల మట్టమైంది. కన్నెపల్లిలో శనిగారపు చం టయ్య, మోర్ల మల్లేశ్, బాబాజీ ఇంటి పైకప్పులు ధ్వంసమయ్యాయి. భీమి ని, మెట్పల్లి, కన్నెపల్లి గ్రామాల్లో ఉల్లితోపాటు వివిధ రకాల కూరగాయల పంటలు దె బ్బతిన్నాయి. తహశీల్దార్ శ్రీనివాస్‌రా వు వెంకటాపూర్ గ్రామాన్ని సందర్శించి ఇళ్లు కూలిపోయిన బాధితులను పరామర్శించారు. తక్షణ సాయం కింద 25 కిలోల బియ్యం అందజేశారు. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మొలకలు వచ్చిన పొద్దుతిరుగుడు కుంటాల : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మిర్చి, పత్తి, మొక్కజొన్న, గోధుమ పంటలు దెబ్బతిన్నాయి. మండలంలోని వెంకూర్ గ్రామంలో పొద్దుతిరుగుడు పంట నేలకొరిగి మొలకలు వచ్చాయి. దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కెరమెరిలో.. కెరమెరి : మండలంలో గురువారం ఉద యం 11గంటల ప్రాంతంలో భారీ వర్షం కురి సింది. ప్రధాన రహదారులు చిత్తడిగా మారా యి. గోయేగాం, ధనోరా, ఝరి, రింగన్ఘా ట్, కెరమెరి గ్రామాల్లో రోడ్లు బురదగా మారడంతో పాదచారులు, వాహన చోదకులు ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. గోయేగాం పాఠశాల ఆవరణ వర్షపు నీటితో నిండిపోయింది. రింగన్‌ఘాట్ వద్ద నిర్మిస్తున్న రో డ్డు కారణంగా కాంట్రాక్టర్లు పక్కనుంచి మట్టిదారి నిర్మించారు. వర్షం వచ్చినప్పుడల్లా బురదగా మారుతోంది. దీంతో ఇప్పటివరకు సు మారు 25మంది వాహనదారులు జారిపడ్డారు. వేమనపల్లిలో.. వేమనపల్లి : మండలంలోని లింగాల గ్రా మంలో గురువారం రాత్రి కురిసిన అకాల వ ర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు నాగెపెల్లి గ్రామంలో 20 గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. నాలుగు ఇళ్లు నేలమట్టం అ య్యాయి. వందల ఎకరాల్లో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంట నేలవాలింది. గంటన్నరపాటు కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వరి పొలాల్లో నీరు చేరి నష్టపోయినట్లు లింగాల గ్రామానికి చెందిన చౌదరి శంకర్ తెలిపాడు. 200 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, 400 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. మరో వారం రోజుల్లో చేతికందే పొద్దుతిరుగుడు పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలకొరిగిన పంటలు దహెగాం : మండలంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లగ్గాం, కుంచవెల్లి, మాడవెల్లి, ఐతపల్లి తదితర గ్రామాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. గాలివాన కు చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. కన్నెపల్లి నుంచి మాడవెల్లికి సరఫరా అవుతున్న 11కేవీ లైన్‌పై చెట్లు పడడంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కుంచవెల్లిలో వ్యవసాయానికి విద్యు త్ సరఫరా చేసే స్తంభాలు పడిపోయాయి. మాడవెల్లిలో రాదండి శంకర్, వరిమడ్ల పోచ య్య ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. -
వరుణ దేవా... కరుణ లేదా...
పాల్వంచ రూరల్, న్యూస్‌లైన్: ఉరుములు, మెరుపులు, హోరు గాలితో మంగళవారం సాయంత్రం పాల్వంచ మండలంలో వడగళ్ల వాన పడింది. ఇది పడింది కొద్దిసేపే అయినప్పటికీ.. నష్టం మాత్రం తీవ్రంగానే ఉంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు వాతావరణం మామూలుగానే ఉంది. అంతలోనే ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఆకస్మికంగా ఉరుములు.. మెరుపులు.. ఈదురు గాలులతో వడగళ్ల మొదలైంది. దాదాపు అరగంటపాటు పడిన ఈ వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి. కరకవాగులో రేకుల ఇల్లు, కిన్నెరసానిలో పూరిపా క కూలిపోయాయి. రాజాపురంలో మొక్కజొన్న ధ్వంసమైంది. మరికొన్ని గ్రామాల్లో మామిడి పూత రాలింది. పత్తి పంట పూర్తిగా తడిచింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బయ్యారం: మండలంలో మంగళవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. రామచంద్రాపురం, వెంకటాపురం, కంబాలపల్లి గ్రామా ల్లో మొక్కజొన్న, మామిడి తోటలకు తీవ్ర నష్టం జరిగింది. పత్యాతండా ఐదు పూరిళ్ల పైకప్పులు గాలిదుమారానికి లేచిపోయాయి. వెంకటాపురం: మండలంలో రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలతో 1425 హెక్టార్లలో మిర్చి, దాదాపు వెయ్యి ఎకరాలలో మొక్కజొన్న పంట దెబ్బతింది. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పూర్తిగా తడిసింది. వాజేడు: మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాల్లోని వేలాది క్వింటాళ్ల మిర్చి తడిచింది. పంట నష్టం విలువ మొత్తంగా సుమారు 40లక్షల రూపాయలు ఉంటుందని రైతులు అంచనా వేస్తున్నారు. గుండాల: మండలంలో మంగళవారం కురిసిన వడగళ్ల బీభత్సం సృష్టించింది. ఈదరుగాలులతో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. అనంతోగు పంచాయతీలోని జగ్గుతండా గ్రామంలో రెండు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో ఐదు పూరిళ్ల పైకప్పులు లేచిపోయాయి. ఈ ఇళ్లలోని దాదాపు 200 క్వింటాళ్ల పత్తి తడిచింది. ఇల్లెందు-గుండాల మార్గంలో మర్రిగూడెం వద్ద రెండు విద్యుత్ స్తంభాంలు కూలిపోయి, తీగలు తెగిపడ్డాయి. కల్లాలోని మిర్చిని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. భద్రాచలం రూరల్: మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో అరగంటపాటు వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించారు. పినపాక: మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో కల్లాలోని మిర్చి తడిసింది. మండలంలో సుమారు పదివేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. సింగిరెడ్డిపల్లి, వెంకట్రావ్పేట, పాతరెడ్డిపాలెం, చింతల బయ్యారం, ఏడూళ్ళ బయ్యారం, మల్లారం, టి.కొత్తగూడెం, భూపతిరావుపేట, జానంపేట, భట్టుపల్లి, కరకగూడెం ప్రాంతాల్లో మిర్చి పంట తడిచింది. ఇల్లెందు: మండలంలోని చల్లసముంద్రం, రొంపేడు, మాణిక్యారం, కొమరారం, పోలారం పంచాయతీల్లో మంగళవారం కురిసిన వడగళ్ల వానతో సుమారు 500 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. వడగళ్ల వానతో మిర్యాలపెంటలో పలువురి గాయాలయ్యాయి. టేకులపల్లి: మండలంలో మంగళవారం కురిసిన వడగళ్ల వానతో రైతులు భీతిల్లారు. గంగారం పంచాయతీలో సుమారు 300 ఎకరాల్లోని మామిడి తోటల్లో ఎక్కువగా పూత, పిందె రాలింది. చింతకాయలు విపరీతంగా నేలరాలాయి. బద్దుతండా, కొప్పురాయి, బోడు, గంగారం గ్రామాల్లో మిర్చి తోటలకు నష్టం వాటిల్లింది. బర్లగూడెం గ్రామంలో బాలయ్య అనే రైతుకు చెందిన ఎకరన్నర మొక్కజొన్న నీటిపాలైంది. గంగారం పంచాయతీ కార్యాలయం ప్రహరీ కూలింది. ఒక్క గంగారం పంచాయతీలోనే పదికి పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరికొన్ని చోట్ల కూడా స్తంభాలు పడిపోయాయి. కొప్పురాయి, బోడు, గంగారం పంచాయతీల్లో వందకు పైగా పూరి గుడిసెలు కూలిపోయాయి. కొన్ని రేకుల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.