ఉత్తరప్రదేశ్లో పిడుగుపాటువల్ల ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్లో పిడుగుపాటు వల్ల ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. మెరుపులు, ఉరుములతో గురువారం బల్రాంపూర్ బరేక్ జిల్లా, బస్తీ, గోరఖ్పూర్లో భారీ వర్షం నమోదైంది. ఈ సమయంలో పొలాల్లో తమ పనుల్లో నిమగ్నమై ఉన్న కొందరు రైతులు అనుకోకుండా పిడుగుపాటు ప్రమాదంలో మృతిచెందారు. వీరిలో ఎక్కువమంది యువ రైతులే ఉన్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాలు బురదమమై పరిస్థితి ఒక్కసారిగా అస్తవ్యస్తంగా తయారైంది.