
పిడుగులు పడటం వల్లే విమానం కూలింది?
జకర్తా: ఇండోనేసియా విమానం అదృశ్య ఘటనపై అన్వేషణ కొనసాగుతోంది. విమానం వెళ్లే మార్గంలో పిడుగులు పడటం వల్లే కూలిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విమానం సముద్రంలో కూలిపోయి ఉండొచ్చని, విమాన శకలాలు సముద్రం అడుగు భాగాన పడి ఉండొచ్చని భావిస్తున్నారు. విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వైమానిక, నౌకా దళాల సాయంతో గాలిస్తున్నారు. ఇండోనేసియాతో పాటు ఆస్ట్రేలియా సహాయక చర్యల్లో పాల్గొంటోంది.
ఇండోనేసియా నుంచి ఆదివారం ఉదయం సింగపూర్‌కు బయల్దేరిన ఎయిర్‌ఆసియా విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 162 మంది ఉండగా.. వారిలో 149 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది ఇండోనేసియా వారే.