భూమి వే డెక్కితే పిడుగుల ముప్పు!
వాషింగ్టన్: గ్లోబల్ వార్మింగ్‌తో పిడుగులు పడే ప్రమాదమూ పెరుగుతోందట. అమెరికాలో ఈ శతాబ్దంలోనే గ్లోబల్ వార్మింగ్ వల్ల పిడుగులు 50 శాతం ఎక్కువయ్యాయట. పదకొండు రకాల వాతావరణ పరిస్థితుల్లో మేఘాల స్థితిపై అధ్యయనం చేసిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ పరిశోధకులు ఈ విషయం తేల్చారు.
భూమి ఉష్ణోగ్రత పెరగడం వల్ల తుపానుల సందర్భంగా పిడుగులు పడే అవకాశాలూ ఎక్కువని వర్సిటీ శాస్త్రవేత్త డేవిడ్ రాంప్స్ వెల్లడించారు. వాతావరణంలోని ఉష్ణోగ్రత వల్ల మేఘాల్లో నీటి ఆవిరి కూడా పెరుగుతుందని, ఫలితంగా పిడుగులు పడే అవకాశమూ పెరుగుతుందని రాంప్స్ తెలిపారు. పిడుగుల వల్ల ఏటా మనుషులు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో పాటు గాయపడుతున్నారని, అడవుల్లో సగం కార్చిచ్చులకూ పిడుగులే కారణమన్నారు.