3 డాలర్లతో వెళ్లాడు..రూ.74 కోట్లు ఇచ్చాడు
వాషింగ్టన్: కేవలం మూడు డాలర్లు చేతిలో పెట్టుకుని 1959లో అమెరికా వెళ్లారు. నేడు అదే దేశంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి రూ.74 కోట్లు దానమిచ్చే స్థాయికి ఎదిగారు. ఆయనే భారతీయ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త మణిలాల్ భౌమిక్. పశ్చిమ బెంగాల్లోని మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో 1931లో జన్మించిన ఆయన చిన్నతనంలో ఒక గుడిసెలో తల్లిదండ్రులు, ఆరుగురు తోబుట్టువులతో నివసించేవారు.
16 ఏళ్ల వయసు దాకా కాళ్లకు చెప్పులు కూడా లేకుండా రోజూ 8 మైళ్లు పాఠశాలకు వెళ్లిరావడానికి నడవాల్సి వచ్చేది. అనంతరం ఉపకారవేతనాలతో చదువు కొనసాగించిన మణి 1958లో భౌతికశాస్త్రంలో కలకత్తా వర్సిటీ నుంచి మాస్టర్స్ పట్టా పొందారు. ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి ఫిజిక్స్‌లో తొలి డాక్టరేట్ పొందిన వ్యక్తీ మణినే. స్లోన్ ఫౌండేషన్ అందించిన ఉపకారవేతనంతో 1959లో ఆయనకు కాలిఫోర్నియా వర్సిటలోఅడుగుపెట్టే అవకాశం వచ్చింది. విమాన ప్రయాణానికి డబ్బు లేకపోవడంతో ఊర్లోవారంతా చందాలేసి ప్రయాణానికి సాయం చేశారు.