భారీ సౌధంపై పిడుగు పడితే.. | Lightning strikes Empire State Building amid severe storms | Sakshi
Sakshi News home page

భారీ సౌధంపై పిడుగు పడితే..

Published Wed, Jul 27 2016 2:01 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

భారీ సౌధంపై పిడుగు పడితే..

భారీ సౌధంపై పిడుగు పడితే..

మన్‌హట్టన్‌లోని 102 అంతస్తుల భారీ సౌధం ఎంపైర్ స్టేట్‌ బిల్డింగ్‌పై తాజాగా ఓ పిడుగు విరుచుకుపడింది. నడి వేసవి నడిరాత్రిలో తుఫాన్‌ చుట్టుముట్టిన సమయంలో సంభవించిన ఈ ఆకాశ అద్భుతాన్ని ఓ ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధించాడు.

ఎంపైర్ స్టేట్‌ బిల్డింగ్‌పై పిడుగులు పడటం సాధారణ విషయమే. పిడుగులు పడినా తట్టుకొని ఉండేలా ఈ భవనానికి ఏర్పాట్లు చేశారు. తాజాగా కూడా రాత్రిసమయంలో ఓ పిడుగు భారీ మెరుపుతో భవనాన్ని ఢీకొంది. దీనిని ఫొటోగ్రాఫర్‌ హెన్రిక్ మోల్‌ట్కే తన కెమెరాతో పర్ఫెక్ట్‌గా క్లిక్ మనిపించారు. అంతేకాకుండా దీనిని వీడియో కూడా తీశారు. ఈ ఫొటో, వీడియోను యూట్యూబ్‌, ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. ఇవి వెంటనే వైరల్‌గా మారిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement